జొన్నవిత్తుల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జొన్నవిత్తుల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఆదివారం, సెప్టెంబర్ 06, 2020

ఓ ప్రేమ హృదయ వీణ...

దేవీపుత్రుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దేవీపుత్రుడు (2001)
సంగీతం : మణిశర్మ     
సాహిత్యం : జొన్నవిత్తుల  
గానం : బాలు, ప్రసన్న 

ఓ ప్రేమ హృదయ వీణ 
నీవమ్మా.. ప్రాణమా
ఓ ప్రేమ నుదుటి మీద 
కావమ్మా.. కుంకుమ 
పుసుపు పూల వెన్నెల
పసిడి హంస కన్నెలా
చేరుమా చైత్రమా స్నేహమా

ఓ ప్రేమ హృదయ వీణ 
నీవమ్మా.. ప్రాణమా

అసలెందుకే ఆ అమృతమే
అనురాగముతో నువు నవ్వితే
రతిసుందరిలా దరిచేరితే
చెలరేగిపోయే యవ్వనమే
మన కోరికతో మాటాడితే
కొసచూపులతో తాకితే
మేను మేను ఆని తేలి సోలిపోనీ
ఏది ఏమి కానీ ఏకమవ్వనీ
రా మరి నా చెలి... 

ఓ ప్రేమ హృదయ వీణ 
నీవమ్మా.. ప్రాణమా..

శహనాయి మోగే కోవెలలో
శశికాంతులతో నను చేరుకో
గృహదేవతవై ఒడిచేర్చుకో
రతనాలు పండే నీ జతలో
సుఖశాంతులతో శ్రుతి చేసుకో
ప్రియలాహిరిలో ఏలుకో
లోకమందు లేని హాయి అందుకోని
కోటి జన్మలన్నీ తోడు ఉండనీ
రా మరి నా చెలి...

ఓ ప్రేమ హృదయ వీణ 
నీవమ్మా.. ప్రాణమా
ఓ ప్రేమ నుదుటి మీద 
కావమ్మా.. కుంకుమ 
పుసుపు పూల వెన్నెల
పసిడి హంస కన్నెలా
చేరుమా చైత్రమా స్నేహమా 
 

 

మంగళవారం, జులై 21, 2020

చినుకు చినుకు...

ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన మాయలోడు శుభలగ్నం సినిమాలు రెండింటిలోనూ సౌందర్యతో బాబూమోహన్ అండ్ ఆలీ తో చిత్రీకరించిన ఈ పాట రీమిక్స్ అనలేకపోవచ్చు కానీ సేమ్ పాటను రెండు సార్లు వాడారు. శుభలగ్నం చిత్రంలోని ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శుభలగ్నం(1994)
సంగీతం : ఎస్. వి. కృష్ణారెడ్డి 
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : బాలు, చిత్ర

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా
 
 
చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా


నింగి నేల ఈవేళ చలికి వణికిపోతుంటే
బిగి కౌగిలి పొదరింటికి పద పదమంది
ఈ కౌగిలింతలోన ఏలో
గుండెల్లో ఎండ కాసే ఏలో

 
అరె.. పైన మబ్బు ఉరిమింది
పడుచు జింక బెదిరింది
వలవేయక సెలయేరై పెనవేసింది
అరె..చినుకమ్మ మెరుపమ్మ ఏలో
చిటికేస్తే బుగ్గ మీద ఏలో 

 
తలపు తొలివలపు ఇక తక ఝుం తక ఝుం
వయసు తడి సొగసు అర విరిసె సమయం 

ఆహా…ఊహూ… ఓహోహొహో

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి

 వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా

మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది
ఎద లోపల చలిగాలుల సుడి రేగింది
 

వానొచ్చే వరదొచ్చే ఏలో
వయసంటే తెలిసొచ్చే ఏలో 


మేను చూపు పో అంది వాలు చుపు సై అంది
చెలి కోరిక అలవోకగ తల ఊపింది
 

అరె.. సరసాల సిందులోన ఏలో
సరి గంగ తానాలు ఏలో


ఒడిలో ఇక ఒకటై తక తకతై అంటే 

 సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే
ఆహా…ఊహూ… ఓహోహొహో

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా  

 
 చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా 


ముందుగా చిత్రీకరించిన ఒరిజినల్ వర్షన్ మాయలోడు చిత్రంలోని పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : మాయలోడు (1993)
సంగీతం : ఎస్. వి. కృష్ణారెడ్డి 
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : బాలు, చిత్ర
 

శుక్రవారం, నవంబర్ 01, 2019

అయ్యప్ప దేవాయ నమః...

కార్తీక మాసం అనగానే శివయ్య ఎలా గుర్తొస్తారో అలాగే అయ్యప్ప దీక్ష తీస్కునే స్వాములూ గుర్తొస్తారు. అందుకే ఈ నెలంతా ఆ శబరిగిరీశుని స్మరించుకుంటూ ప్రతిరోజూ ఆ స్వామి పాటలు తలచుకుందాం. ముందుగా దేవుళ్ళు చిత్రంలోని ఒక చక్కని పాట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ ఛేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దేవుళ్ళు (2000)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం : జొన్నవిత్తుల  
గానం : బాలు

అయ్యప్ప దేవాయ నమః
అభయ స్వరూపాయ నమః
అయ్యప్ప దేవాయ నమః
అభయ స్వరూపాయ నమః
హరి హర సుపుత్రాయ నమః
కరుణా సముద్రాయ నమః
నిజ భీర గంభీర శభరీ గిరి శిఖర
ఘన యోగ ముద్రాయ నమః
పరమాణు హృదయాంతరాళ
స్థితానంత బ్రహ్మాండరూపాయ నమః

అయ్యప్ప దేవాయ నమః
అభయ స్వరూపాయ నమః

పద్దెనిమిది పడిమెట్ల పైకెక్కీ గుడికేగు
భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి
ఇరుముడులు స్పృశియించి
శుభమనుచు దీవించి
జన బృందముల చేరే జగమేలు స్వామి
తన భక్తులొనరించు తప్పులకు తడబడి
ఒక ప్రక్క ఒరిగెనా ఓంకార మూర్తి
స్వామియే శరణం అయ్యప్ప
స్వాములందరు తనకు సాయమ్ము కాగా
ధీమంతుడై లేచె ఆ కన్నె స్వామి
పట్టబందము వీడి భక్తతటికై
పరుగు పరుగున వచ్చె భువిపైకి నరుడై

అయ్యప్ప దేవాయ నమః
అభయ స్వరూపాయ నమః

ఘోర కీకారణ్య సంసార యాత్రికుల
శరణు ఘోషలు విని బ్రోచు శబరిషా
పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు
పంపానది తీర ఎరుమేలి వాసా
నియమాల మాలతో సుగుణాల మెట్లపై
నడిపించు కనిపించు అయ్యప్ప స్వామి
మకర సంక్రాంతి సజ్యోతిపై అరుదెంచి
మహిమలను చూపించు మణికంఠ స్వామి
కర్మ బందము బాపు ధర్మ శాస్త్ర
కలి భీతి తొలగించు భూతాధినేత

అయ్యప్ప దేవాయ నమః
అభయ స్వరూపాయ నమః

ఆద్యంత రహితమౌ నీ విశ్వరూపము
అజ్ఞాన తిమిరమ్ము నణుచు శుభదీపం
ఈ నాల్గు దిక్కులు పదునాల్గు భువనాలు
పడిమెట్లుగా మారె ఇదో అపురూపం
అమరులెల్లరు చేయ అమృతాభిషేకం
నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం
ఓం...

పదములకు మ్రొక్కగా ఒక్కోక్క లోకం
అందుకో నక్షత్ర పుష్పాభిషేకం 

విల్లు కాని విల్లు హరివిల్లు గైకొని 
హరిహరుల సుతుడే తన విల్లు చేసే 
నారి కానీ నారి ఆ ఆదిశేషునీ 
మణికంఠ స్వామి తన వింటినారిని చేసే
 
శరము కానీ శరము శరణమయ్యప్పా 
స్వామియే శరణమయ్యప్పా.. 
శరము కానీ శరము శరణమయ్యప్ప
అను శరణు ఘోషను దివ్య శరము గావించే

మహా దివ్య క్షాత్ర ప్రదీప్తితో
క్రోధానల జ్వాలలెగయు నేత్రాలతో 
ఆ భీర కల్లోల ఘోర కలిపై నారి సారించే 
శరము సంధించే 
దుష్కలిని అయ్యప్ప అంతమొందించే 
విజయానికే విశ్వరూపమై నిలిచే 
ఓం శాంతి శాంతి శాంతిః
ఓం శాంతి శాంతి శాంతిః

పంపానది తీర శంపాల పాతాళ
పాపాత్మ పరిమార్చు స్వామి
భక్తులను రక్షించు స్వామి
శరణమయ్యప్ప శరణమయ్యప్ప
శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప
శరణమయ్యప్ప శరణమయ్యప్ప
శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప

స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
ఓం శాంతి శాంతి శాంతిః
ఓం శాంతి శాంతి శాంతిః 

 

బుధవారం, అక్టోబర్ 30, 2019

ఇది శృంగార గంగావతరణం...

అహనా పెళ్ళంట చిత్రంలోని ఒక సరదా పేరడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో రెండు పాటలతో విడుదల చేసినా వీడియో మాత్రం యారుకాగ అనే తమిళ్ పాట, మేరే అంగనేమే అన్న ఫేమస్ హిందీ పాట ఉపయోగించారు. ఇక మధ్యలో వచ్చే నిర్మా తమిళ్ యాడ్, లైఫ్ బాయ్ హిందీ యాడ్ క్రేన్ వక్కపొడి తెలుగు యాడ్ మరింత నవ్విస్తాయ్. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అహనా పెళ్ళంట (1987)
సంగీతం : రమేష్ నాయుడు 
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : బాలు, వాణీజయరాం

ఇది శృంగార గంగావతరణం
తొలివలపు క్షీరాబ్ది మధనం
ఇది శృంగార గంగావతరణం
ఈ సింగారి కళ్యాణ తరుణం

తమకాల గమకాల రాగోదయం
కమనీయ కార్తీక చంద్రోదయం
తమకాల గమకాల రాగోదయం
కమనీయ కార్తీక చంద్రోదయం

సరసాల చైత్రాల మధనోత్సవం
సరసాల చైత్రాల మధనోత్సవం
సుమ బ్రమర బృందాల సమ్మేళనం

ఇది శృంగార గంగావతరణం
తొలివలపు క్షీరాబ్ది మధనం
ఇది శృంగార గంగావతరణం
ఈ సింగారి కళ్యాణ తరుణం

నా నాడాద మేడ ఇల్లే ఉల హత్తిలే ఉల హత్తిలే
నా నాడాద మేడ ఇల్లే ఉల హత్తిలే ఉల హత్తిలే
నా నాటి తెచ్చా ఆడాద మనిదనమిల్లే
ఆడాద మనిదనమిల్లే
నా నాటి తెచ్చా ఆడాద మనిదనమిల్లే
ఆడాద మనిదనమిల్లే
పోడూ...
నా నాడాద మేడ ఇల్లే ఉల హత్తిలే ఉల హత్తిలే
నా నాడాద మేడ ఇల్లే ఉల హత్తిలే ఉల హత్తిలే

లాయి హై డోలి సజన్
చన నన జూమ్ జూమ్ చలి దుల్హన్
హే చన నన జూమ్ జూమ్ చలి దుల్హన్
లాయి హై డోలి సజన్
చన నన జూమ్ జూమ్ చలి దుల్హన్
చన నన జూమ్ జూమ్ చలి దుల్హన్

ఏక్ తరఫ్ హె ప్యార్ సజన్ కా
ఏక్ తరఫ్ నా తా బచ్పన్  కా
ఏక్ తరఫ్ హె ప్యార్ సజన్ కా
ఏక్ తరఫ్ నా తా బచ్పన్  కా

లాయి హై డోలి సజన్
చన నన జూమ్ జూమ్ చలి దుల్హన్
రేయ్ చన నన జూమ్ జూమ్ చలి దుల్హన్

అందరు మెచ్చే వక్కపొడి
క్రేన్ వక్కపొడి
విందు వినోదం పెళ్ళి పేరంటం
అన్నింటా మీ నేస్తం
క్రేన్ వక్కపొడి
శుచికీ తియ్యటి రుచికీ
తాజా క్రేన్ వక్కపొడి
ఆనందానికి రసమయ రూపం
క్రేన్ వక్కపొడి

అహా నా పెళ్లంట ఒహొ నీ పెళ్లంట
అహా నా పెళ్లంటా ఒహొ నీ పెళ్లంటా
అహా నా పెళ్లంటా ఒహొ నీ పెళ్లంటా
ఇద్దరి జంటా కన్నుల పంట
మన ఇద్దరి జంటా కన్నుల పంట
పెద్దోళ్ళకెందుకంట కడుపు మంట
అహ పెద్దోళ్ళకెందుకంట కడుపు మంట

అహా నా పెళ్లంట ఒహొ నీ పెళ్లంట
అహా నా పెళ్లంట ఒహొ నీ పెళ్లంట
ప్రేమంటే పెద్దోళ్ళకి పడి సావదంట
ప్రేమంటే పెద్దోళ్ళకి పడి సావదంట
ఈ కంటి మంట అందుకంట
ఈ కంటి మంట అందుకంట

అహా నా పెళ్లంట ఒహొ నీ పెళ్లంట
అహా నా పెళ్లంటా ఒహొ నీ పెళ్లంటా 
 

మంగళవారం, అక్టోబర్ 29, 2019

కాఫీ దండకం...

ఈ మధ్య ఆరోగ్య రీత్యా రకరకాల టీలని ఆదరిస్తున్నారు కానీ ఒకప్పుడు సౌతిండియా అంతటా కాఫీకే పెద్ద పీట వేసేవారు. మరి అలాంటి కాఫీని సేవించిన జొన్నవిత్తుల గారు ఆ కాఫీని ఏవిధంగా దండకంతో పొగుడుతున్నారో మీరే చూడండి. సాధారణంగా దేవతలకోసం భక్తులు రాసి గానం చేసే ఈ దండకానికి పేరడీగా జొన్నవిత్తుల గారి దండకం కాఫీ ప్రియులందరిని అలరిస్తుందనటంలో ఏ సందేహం లేదు. మిధునం చిత్రంలోని ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మిథునం (2012)
సంగీతం : స్వరవీణాపాణి 
సాహిత్యం : జొన్నవిత్తుల 
గానం : జొన్నవిత్తుల 

అనుదినమ్మును కాఫీయే అసలుకిక్కు..
కొద్దిగానైన పడకున్న పెద్దచిక్కు
కప్పు కాఫీ లభించుటే గొప్పలక్కు
అమృతమన్నది హంబక్కు
అయ్యలారా..ఆఆఆ...

జై కాఫీ... విశ్వాంతరాళంబులోనున్న
బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన
పానీయమే లేదు ముమ్మాటికీ..
అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికీ..
నాల్కతో నీకు జేజేలు పల్కేము నానాటికీ..

ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగనే
పాచి పళ్ళైనయున్ తోమకన్ త్రాగు బెడ్ కాఫీ
కోసంబు పెండ్లాముపై రంకెలేయించకే బెస్టు టేస్టీశ్వరీ..

ఫ్రెష్షు కాఫీశ్వరీ నెస్సు కేఫీశ్వరీ జిహ్వకున్
సిద్ధి చేకూర్చవే బ్రూకు బాండేశ్వరీ...
లోక ప్రాణేశ్వరి ప్రాణ దానేశ్వరి గంటగంటా
ప్రతీ ఇంట ఉప్పొంగవే ఉష్ణ పానేశ్వరీ..

స్టీలు ఫిల్టర్ల పళ్ళెంబులోనున్న రంధ్రాలలో నుండి
నీ సారమంతా సుతారంగా జారంగ నోరూర
చూడంగ నా సామిరంగా నిజంగానె చచ్చేవిధంగా..
కాస్త తాగన్ పునర్జన్మ వచ్చే విధంగా..

ప్రొద్దు ప్రొద్దున్నే నీ పొందు లేకున్న
మూడంతా పాడయ్యి టైమంత వేస్టయ్యి
కచ్చెక్కి పిచ్చెక్కి అశ్లీల సంభాషణల్ చేసి
కాంటాక్ట్సు సర్వంబు నాశమ్ము కావించుకొంటారుగా...
అందుకే నిన్ను అర్జంటుగా తెచ్చుకొంటారుగా..
దాచుకొంటారుగా కాచుకొంటారుగా చచ్చినట్టింక
ఇచ్చేంత సేపందరున్ వేచి ఉంటారుగా...

కాఫీనంతెత్తు పైనుంచి ఓకప్పులోవంచి
ఆ కప్పులోనుంచి ఈ కప్పులో పోసి
అట్నుంచి ఇంట్నుంచి ఇట్నుంచి అట్నుంచి
బాగా గిలక్కొట్టుచున్ నుర్గు ఉప్పొంగగా
తెచ్చి ఇస్తారుగా..

గొప్ప నిష్టాగరిష్టుల్ బరిస్తాలలోనన్
గరిష్టంబుగా కాఫీ తాగేందుకిష్టంబుగా పోవుగా..
షాపు మూసేయ వాపోవుగా..
సర్వ కాఫీ రసాంగీ సుదాంగీ శుభాంగీ
ప్రభాంగీ నమస్తే నమస్తే నమస్తే నమః

*~*~*~*~*~*~*~*~*~*~*

ఐతే సినిమాలో స్థలాభావం వల్లన అయుండచ్చు ఎడిట్ చేసి కొంత భాగాన్ని మాత్రమే ఉపయోగించారు.  ఈ కాఫీ దండకం పూర్తి పాఠం జొన్నవిత్తుల గారి హావభావాలతో ఈ పాడుతా తీయగా వీడియోలో ఇక్కడ చూడండి. ఎరుపు రంగులో ఉన్నవి సినిమాలో లేని పంక్తులు.


అనుదినమ్మును కాఫీయే అసలుకిక్కు..
కొద్దిగానైన పడకున్న పెద్దచిక్కు
కప్పు కాఫీ లభించుటే గొప్పలక్కు
అమృతమన్నది హంబక్కు
అయ్యలారా..ఆఆఆ...

జై కాఫీ... విశ్వాంతరాళంబులోనున్న
బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన
పానీయమే లేదు ముమ్మాటికీ..
అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికీ..
నాల్కతో నీకు జేజేలు పల్కేము నానాటికీ..

ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగనే
పాచి పళ్ళైనయున్ తోమకన్ త్రాగు బెడ్ కాఫీ
కోసంబు పెండ్లాముపై రంకెలేయించకే బెస్టు టేస్టీశ్వరీ..

ఫ్రెష్షు కాఫీశ్వరీ నెస్సు కేఫీశ్వరీ జిహ్వకున్
సిద్ధి చేకూర్చవే బ్రూకు బాండేశ్వరీ...
లోక ప్రాణేశ్వరి ప్రాణ దానేశ్వరి గంటగంటా
ప్రతీ ఇంట ఉప్పొంగవే ఉష్ణ పానేశ్వరీ..

స్టీలు ఫిల్టర్ల పళ్ళెంబులోనున్న రంధ్రాలలో నుండి
నీ సారమంతా సుతారంగా జారంగ నోరూర
చూడంగ నా సామిరంగా నిజంగానే చచ్చేవిధంగా..
కాస్త తాగన్ పునర్జన్మ వచ్చే విధంగా..

ప్రొద్దు ప్రొద్దున్నే నీ పొందు లేకున్న
మూడంతా పాడయ్యి టైమంత వేస్టయ్యి
కచ్చెక్కి పిచ్చెక్కి అశ్లీల సంభాషణల్ చేసి
కాంటాక్ట్సు సర్వంబు నాశంబు కావించుకొంటారుగా...
అందుకే నిన్ను అర్జంటుగా తెచ్చుకొంటారుగా..
దాచుకొంటారుగా కాచుకొంటారుగా చచ్చినట్టింక
ఇచ్చేంత సేపందరున్ వేచి ఉంటారుగా...

మాతృగర్భంబులోనుండు పిండస్త జీవుండు
ఆ తల్లి త్రాగేటి కాఫీని సేవింపగా వేచి యుండంచు
శాస్త్రజ్ఞులెన్నో ప్రమాణంబులన్ చూపెగా

ఈ కాఫీ పానీయంబున్ గూర్చి
వేవేల సంవత్సరాల్ క్రిందటే
రుషుల్ వేదాలలో గొప్పగా చెప్పి యున్నారుగా..

ఎంత అప్రాచ్యమైనట్టి పానీయమైనన్
మునుల్ సమ్మతించారుగా
కాఫీత్రాగంగనే వాణి ఉల్లాసమున్ చెంది
ఆ కచ్చేరీ వీణపై కాఫీ రాగంబు పల్కించుగా

ఇంత కాఫీని పోయంగనే
ఎంత ముక్కోపి ఐనన్
ప్రశాంతుండుగా మారుగా
కర్మలన్ జేయు సత్ బ్రాహ్మలైనా
నినున్ కొంత సేవింపకున్
తద్దినం మంత్రముల్ పెద్దగా చెప్పగాలేరుగా

పిత్రుదేవాళికిన్ పెట్టు పిండాలపై
నినున్ కొంత సంప్రోక్షణన్ చేసినన్
వారికిన్ దివ్య కైలాస వాసంబు కల్పించు
వీసాలు శీఘ్రంబె వచ్చేనుగా

దేశ దేశాలలోనుండి నీ గింజలన్ దెచ్చి
రంజిల్ల వేయించి బాగా పొడిన్ చేసి జల్లించి
దట్టించి డబ్బాలు సీసాలలో నింపుకుంటాముగా

శోభనం వేళ ఓ వెండి గ్లాసందు
క్షీరంబులో ఇంత ఇన్స్టంటు బ్రూ వేసి
పందారలా నవ్వు నవ్వేసి కుర్రాడికిచ్చేస్తే
తెల్లారెదాకింక ధిల్లాన ధిల్లానగా

కాఫీనంతెత్తు పైనుంచి ఓకప్పులోవంచి
ఆ కప్పులోనుంచి ఈ కప్పులో పోసి
అట్నుంచి ఇంట్నుంచి ఇట్నుంచి అట్నుంచి
బాగా గిలక్కొట్టుచున్ నుర్గు ఉప్పొంగగా
తెచ్చి ఇస్తారుగా..

గొప్ప నిష్టాగరిష్టుల్ బరిస్తాలలోనన్
గరిష్టంబుగా కాఫీ తాగేందుకిష్టంబుగా పోవుగా..
షాపు మూసేయ వాపోవుగా..

అబ్బ నీలోని ఆవిర్లు వేవేల వేవిళ్ళు
గుమ్మెత్తు నీ స్మెల్లు గమ్మత్తుగా గిల్లు
మా ఇల్లు నీ వల్ల శోభిల్లుగా
దిల్లు మొత్తంబు రంజిల్లుగా

రోజు మొత్తంబులో వందసార్లైన
ఇంగ్లీషు ముద్దిచ్చి రక్షించవే కాఫి కామేశ్వరీ
యూతు జేకొట్టి లాగించు ఓ కోల్డు కాఫీశ్వరీ
నిన్ను వర్ణించి లాగించ నేనె సరైనట్టి వాడన్
చికోరీ సఖీ..

నీవు ముద్దాడుచున్ నాలింగనము జేసుకోగానే
మా పంచ ప్రాణాలు చైతన్యమౌనే జగన్నాయకీ
నవ్య పానీయ నారీ వయ్యారీ నమస్తే
రుచిన్ మస్తుగా గల్గు ప్యారీ మిఠారీ సలామే
నుర్గు నవ్వుల్ల బ్యూటీ వణక్కమ్
డికాషన్ ప్రెట్టీ నీకు ముక్కోటి శాల్యూట్సివే

స్ట్రాంగు కాఫీ సఖీ పొంగి లంఘించవే
లైటు కాఫీ ప్రియా లవ్వు పొంగించవే
కోల్డు కాఫీ చెలీ గోల్డు బ్యాండెయ్యవే
బ్లాకు కాఫీ డియర్ ఒక్క బైటీయ్యవే

సర్వ కాఫీ రసాంగీ సుధాంగీ శుభాంగీ
ప్రభాంగీ నమస్తే నమస్తే నమస్తే నమః
కాఫీ జనా సుఖినోభవంతూ బాసూ
శీఘ్రమేవ కాఫీ ప్రాప్తిరస్తూ..

 

శనివారం, అక్టోబర్ 26, 2019

గాంధీని చంపిన (లంచం మంచం)...

పేరడీ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ లాంటి జొన్నవిత్తుల గారు రాసిన ఓ చక్కని పేరడిని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట పలు పాటల మెడ్లీ కనుక ఆయా పాటలను బ్రాకెట్స్ లో ఇస్తున్నాను తప్ప లింక్ ఇవ్వడం లేదు. దేశ దుస్థితిని సరదా పేరడీ పాటల్లో నవ్వుకునేలా చెప్పడం జొన్నవిత్తుల గారికే చెల్లింది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గ్యాంగ్ వార్ (1998)
సంగీతం : రాజ్-కోటి 
సాహిత్యం : జొన్నవిత్తుల  
గానం : బాలు

(గాంధి పుట్టిన దేశమా ఇది)
గాంధీని చంపిన నేలరా ఇది
గాడ్సే గ్యాంగుల కోటరా ఇది
గాంధీని చంపిన నేలరా ఇది
గాడ్సే గ్యాంగుల కోటరా ఇది
ఇందిర గాంధీ రాజీవ్ గాంధీ
బలైపోయిన భూమిరా
గాంధీని చంపిన నేలరా ఇది
గాడ్సే గ్యాంగుల కోటరా ఇది

(రాగం తానం పల్లవి)
లంచం మంచం తంత్రము
పాయే.. అయ్యయ్యో..
లంచం మంచం తంత్రము
నా దేశాన్ని పీడించి
దిగజార్చుచున్నవి
లంచం మంచం తంత్రమోయ్

(ఎవరి కోసం - ప్రేమనగర్)
ఎవరికోసం ఎందుకోసం
ఈ బోడి బియే ఈ పాడు ఎమ్మే
ఈ గోల్డు మెడలు ఈ సర్టి ఫికెటూ
ఎవరి కోసం ఎవరికోసం
ఎందుకోసమండీ నీ ఎంకమ్మా

(బలపం పట్టి భామ బళ్ళో)
ఇంజనీరు సీటు రేటు
ఐదే లక్షలు ఔతాయంట
డాక్టరయ్యే సీటు రేటు
ఆరేడు లక్షలు పలికేనంట
ఎమ్మెల్యే మంత్రవ్వాలంటే
కోటిన్నరవుతుందట
దోపిడికి పదవే లైసెన్సట
వామ్మో రేట్లు పెట్టారు
తొంభై కోట్లున్న ప్రజలకి
స్వాతంత్ర దేశానికీ
ఇంజనీరు సీటు రేటు
ఐదే లక్షలు ఔతాయంట
డాక్టరయ్యే సీటు రేటు
ఆరేడు లక్షలు పలికేనంట

(అబ్బనీ తియ్యనీ దెబ్బ)
వద్దన్నా చచ్చినా జాబు
అది వచ్చినా బాధేరా బాబు
దొబ్బులు పెట్టే బాసులూ
పబ్బం గడిపే క్లర్కులు
సబ్బులు రుద్దె ఫ్యూనులు
మనలాంటోళ్ళు బ్రతకరూ
వద్దన్నా చచ్చినా జాబు
అది వచ్చినా బాధేరా బాబు
అమ్మో నాయనోయ్ వామ్మో

(నల్లవాడే అమ్మమ్మో)
ఎంతరేటే కమిటైతే
లైఫంతా గుండెపోటే
తెస్తాడే చేటే
కోర్టులకే సిగ్గుచేటే

(దొరకునా ఇటువంటి సేవ)
దొరకదు దొరకదు
దొరకదు ఎటువంటి కూర
ఆ ధర ఆకాశమును చేరి
భ్రహ్మఆండ గోళాలు దాటిందిలే
పిచ్చితల్లీ అమ్మా...
దొరకదు ఎటువంటి కూర 
 
కొనలేము వంకాయ
కొట్టలేము టెంకాయ
పెట్టలేము ఆవకాయ
తినలేము మాగాయ
ఈ పాడు ధరలూ..
ఆఆఆఆఆఆ....
ఆఆఆఆఆఆఆ..
ఆఆఆఅ...
ఈ పాడు ధరలు తగ్గేది లేదు
ఏ గవర్నమెంటూ పట్టించుకోదు
కొత్తిమీర కూడా కొనలేము తల్లీ
కొనలేము తల్లీ..ఆఆ...ఆఆ...
దొరకదు ఎటువంటి కూర

(బోటనీ పాఠముంది)
చేతిలో పైస లేదు
పూటకే ఫుడ్డు లేదు
బ్రహ్మమూ ఏమి కర్మము
చదువుకే విలువ లేదు
చవటకే లోటు లేదు
తెలుపరా దీని మర్మము
తొక్కలో సందేహం మానుకోబే
ఒక్కటే మార్గంరా దోచుకోబే
స్పాటు స్పాటు అదే రూటూ
ఛల్ సాలా స్పాటు బెట్టు
అదే బెస్టు మారో
స్పాటు స్పాటు అదే రూటూ
స్పాటు బెట్టు అదే బెస్టు

సమాజం మాకు స్పాటు పెట్టింది
మేం దానికి స్పాటు పెడుతున్నాం


మంగళవారం, అక్టోబర్ 08, 2019

మహా కనకదుర్గా...

మిత్రులందరకూ దసరా శుభాకాంక్షలు అందజేస్తూ ఈ రోజు రాజరాజేశ్వరిగా దర్శనమీయనున్న దుర్గమ్మకి నమస్కరించుకుంటూ దేవుళ్ళు చిత్రంలోని ఓ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దేవుళ్ళు (2001)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం : ఎస్.జానకి

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి
అష్టాదశ పీఠాలను అధిష్టించు ఆదిశక్తి

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత

ఓంకార రావాల అలల కృష్ణాతీరంలో
ఇంద్రకీల గిరిపైన వెలసెను కృత యుగములోన
ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను
పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను
విజయుడైన అర్జునుని పేరిట
విజయవాడ అయినది ఈ నగరము
జగములన్నియు జేజేలు పలుకగా
కనకదుర్గకైనది స్థిరనివాసము
మేలిమి బంగరు ముద్దపసుపు కలగలిపిన వెన్నెలమోము
కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ
అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక
ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గరూపం
ముక్కోటి దేవతలందరికీ ఇదియే ముక్తి దీపం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత

దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో
స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి
భవబందాలను బాపే బాలా త్రిపురసుందరి
నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి
లోకశాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి
అక్షయ సంపదలెన్నో అవని జనుల కందించే దివ్య రూపిణి మహాలక్ష్మి
విద్యా కవన గాన మొసగు వేదమయి సరస్వతి
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గ
శత్రు వినాసిని శక్తి స్వరూపిణి మహిషాసురమర్ధిని
విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజరాజేశ్వరి
భక్తులందరికి కన్నుల పండుగ
అమ్మా నీ దర్శనం దుర్గమ్మా నీ దర్శనం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
 

మంగళవారం, ఆగస్టు 27, 2019

శ్రీకర శుభకర...

త్రినేత్రం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : త్రినేత్రం (2002)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : బాలు

నరసింహా... ఆఆ.. లక్ష్మీ నరసింహా..

శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా..

శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మొక్కే
జ్వాలా నరసింహా..

నీవే శరణమయా
ఓ యాదగిరీ నరసింహా

శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా..

పురాణ యుగమున ఈ గిరి పైనే
తపమొనరించెను యాద రిషి 
ధరాతలమ్మున అతని పేరుతొ
అయ్యింది ఈ గిరి యాదగిరి
ఈ గుహలో వెలెసెను
ప్రళయ మహోజ్వల
జ్వాలా నరసింహుడు
భక్త అభీష్టములు అన్నియు తీర్చే
లక్ష్మీ నరసింహుడు

సుఖ శాంతులను చేకూర్చు
శుభయోగ నరసింహుడు
ఆఆఆ...ఆఆఆ...ఆఆఆ.
సుఖ శాంతులను చేకూర్చు
శుభయోగ నరసింహుడు

నమో నమః నమో నమః

నమస్కరించెను నాలుగు
దిక్కులు నఖముల వెలుగుకు
మ్రొక్కెను చుక్కలు
గోకుల రూపము దాల్చినదీ
ఆ దివ్య సుదర్శన చక్రము
మంగళ హారతులిచ్చినది
మహా కాల చక్రము

శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా..

ఈ స్వామి పదములు బ్రహ్మ కడుగగ
విష్ణు గుండమే ప్రవహించే
ఇట స్నానము చేసిన జన్మ ధన్యమే
కర్మ విమోచనమే
ఇక విశ్వ వైద్యుడై స్వామియే
చేయును రోగ నివారణమే
చిత్తము దేహము
సత్వముగా నవు
బెత్తము తాకగనె

భోగ భాగ్యాలు దీర్గాయువు
వొసగెను గిరి ప్రదక్షిణం
ఆఆఆఆ...ఆఆఆఅ...ఆఆఅ...
భోగ భాగ్యాలు దీర్గాయువు
వొసగెను గిరి ప్రదక్షిణం

నమో నమః నమో నమః

క్షేత్ర పాలకుడు ఆంజనేయుడే
సాక్షి ఔను ఈ మహిమలకు
కలియుగ దైవము యాదగిరి
శ్రీ నరసింహుని దర్శనము
కోరిన కోర్కెలు తీర్చేటి
మహా కల్ప వృక్షము

శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే
జ్వాలా నరసింహా..

భూత ప్రేత పిశాచ రాక్షసుల
ప్రారద్రోలు నీ నామమే
క్షుద్ర శక్తులను బాణామతులను
దగ్దమొనర్చు నీ స్మరణమే

ప్రపంచ బాల ప్రహ్లాదునియే
హిరణ్యకశిపుడు హింసింపగనె
సర్వ కాలముల సర్వ అవస్తల
సర్వ దిక్కులకు వ్యాపించి
సంరక్షింపుము నరసింహా
అనుగ్రహింపుము నరసింహా
యాదగిరీశా నరసింహ
ఓం..ఓం..ఓం..ఓం..

శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా
లక్ష్మీ నరసింహా..
పదునాలుగు లోకములన్నీ మొక్కే
జ్వాలా నరసింహా.. 

 

సోమవారం, ఆగస్టు 19, 2019

గోవింద గోవింద...

దేవుళ్ళు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దేవుళ్ళు (2001)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ 
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : బాలు

గోవింద గోవింద ఘోషతో తన గుడికి
కొనివచ్చె భక్తులను గోవిందుడే

ముడుపులను గైకొని మొక్కులను చెల్లించ
పక్కనే నిలిచె ఆ పరమాత్ముడే

అలమేలు మంగమ్మ అమ్మ ఐ వచ్చి
తలనీలాలనిప్పించె తన స్వామికీ

వైకుంఠ వాసుడే వరద హస్తముతో
దీవించి పూసెనే చలువ చందనమే

ఋషులకే కలుగదూ ఈ భాగ్యమూ
ఈ పసివారి బ్రతుకులే ధన్యమూ

అమ్మనీ నాన్ననీ కలపాలనీ
మదినమ్మి పూనినా వ్రత దీక్షకీ

నిలువెల్ల కరిగాడు ఏడుకొండలవాడూ
చిన్నారి భక్తులకె ఐనాడు భక్తుడు 

 

గురువారం, ఆగస్టు 08, 2019

దేవుళ్లే మెచ్చింది...

శ్రీరామ రాజ్యం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీరామ రాజ్యం (2012)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : జొన్నవిత్తుల 
గానం : చిత్ర, శ్రేయ ఘోషల్

దేవుళ్లే మెచ్చింది మీ ముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామకథ వినుడీ
ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ

మీ కోసం రాసింది మీ మంచి కోరింది
మీ ముందుకొచ్చింది సీతారామకథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ

ఇంటింట సుఖశాంతి ఒసగే నిధి
మనసంత వెలిగించి నిలిపే నిధి
సరిదారిని జనులందరి నడిపే కథ ఇదియే

దేవుళ్లే మెచ్చింది మీ ముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామకథ వినుడీ
ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ

అయోధ్యనేలే దశరథరాజు
అతని కులసతులు గుణవతులు మువ్వురు
పుత్రకామ యాగం చేసెను రాజే
రాణులు కౌసల్య సుమిత్రా కైకలతో
కలిగిరి వారికి శ్రీవరపుత్రులు
రామ లక్ష్మణ భరత
శత్రుఘ్నులు నలుగురు
రఘువంశమే వెలిగే ఇల
ముదమందిరి జనులే

దేవుళ్లే మెచ్చింది మీ ముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామకథ వినుడీ
ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ

దశరథ భూపతి పసిరాముని ప్రేమలో
కాలమే మరిచెను కౌశికుడేతెంచెను
తన యాగము కాపాడగ రాముని పంపాలని
మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసే
రాముడే ధీరుడై తాటకినే చంపే
యాగమే సఫలమై కౌశికముని పొంగే
జయరాముని గొని ఆముని మిథిలాపురికేగే

శివధనువదిగో నవవధువిదిగో
రఘురాముని తేజం అభయం అదిగదిగో
సుందర వదనం చూసిన మధురం
నగుమోమున వెలిగే విజయం అదిగదిగో
ధనువును లేపే మోహన రూపం
ఫెళఫెళ ధ్వనిలో ప్రేమకి రూపం
పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే

నీ నీడగ సాగునింక జానకీయనీ
సీతనొసగే జనకుడు శ్రీరామమూర్తికే
ఆ స్పర్శకి ఆలపించే అమృతరాగమే
రామాంకితమై హృదయం కరిగె సీతకే
శ్రీకరం మనోహరం
ఇది వీడని ప్రియబంధమని
ఆజానుబాహుని జతకూడే అవనిజాత
ఆనందరాగమే తానాయే గృహిణి సీత

దేవుళ్లే మెచ్చింది మీ ముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామకథ వినుడీ
ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ


ఆదివారం, ఆగస్టు 04, 2019

శ్రీ రామా లేరా ఓ రామా...

శ్రీరామరాజ్యం చిత్రం లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. పూర్తి పాట ఆడియో యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీరామ రాజ్యం (2011)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : రాము, శ్రేయా ఘోషల్  

శ్రీ రామా లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి బాపగ రా
సీతారామ చూపేయ్ నీ మహిమ
మదిలో అసురాలిని బాపగ రా

మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి
సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి
మా జన్మము ధన్యము చేయుము రా..రా..

శ్రీ రామా లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి బాపగ రా


ఆఆ..దరిశనమును కోర దరికే చేరే
దయగల మా రాజు దాశరధీ
తొలుతనే ఎదురేగి కుశలములడిగీ
హితమును గావించే ప్రియ వాదీ

ధీరమతియై న్యాయపతి
యై ఏలు రఘుపతియే
ప్రేమ స్వరమై స్నేహకరమై మేలు వొసగునులే
అందరు ఒకటేలే రామునికి ఆదరమొకటేలే
సకల గుణ ధాముని రీతిని
రాముని నీతిని ఏమని పొగడుదులే

మా శ్రీ రామా లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి బాపగ రా

సీతారామ చూపేయ్ నీ మహిమా 
  
తాంబూల రాగాల ప్రేమామృతం
తమకించి సేవించు తరుణం
శృంగార శ్రీరామ చంద్రోదయం
ప్రతిరేయి వైదేహి హృదయం
మౌనం కూడా మధురం..
సమయం అంతా సఫలం..
ఇది రామ ప్రేమలోకం..
ఇలా సాగిపోవు స్నేహం
ఇందులోనె మోక్షం 
రవి చంద్రులింక సాక్ష్యం
ఏనాడు వీడిపోని బంధం ..ఆఅ

శ్రీ రామ రామ రఘురామా
పిలిచే సమ్మోహన సుస్వరామా
సీతాభామా ప్రేమారాధనమా
హరికే హరి చందన బంధనమా
శ్రీరాముని అనురాగం సీతా సతి వైభోగం
శ్రీరాముడు రసవేదం శ్రీ జానకి అనువాదం
ఏనాడు వీడిపోని బంధమూ... 


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.