శనివారం, అక్టోబర్ 26, 2019

గాంధీని చంపిన (లంచం మంచం)...

పేరడీ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ లాంటి జొన్నవిత్తుల గారు రాసిన ఓ చక్కని పేరడిని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట పలు పాటల మెడ్లీ కనుక ఆయా పాటలను బ్రాకెట్స్ లో ఇస్తున్నాను తప్ప లింక్ ఇవ్వడం లేదు. దేశ దుస్థితిని సరదా పేరడీ పాటల్లో నవ్వుకునేలా చెప్పడం జొన్నవిత్తుల గారికే చెల్లింది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గ్యాంగ్ వార్ (1998)
సంగీతం : రాజ్-కోటి 
సాహిత్యం : జొన్నవిత్తుల  
గానం : బాలు

(గాంధి పుట్టిన దేశమా ఇది)
గాంధీని చంపిన నేలరా ఇది
గాడ్సే గ్యాంగుల కోటరా ఇది
గాంధీని చంపిన నేలరా ఇది
గాడ్సే గ్యాంగుల కోటరా ఇది
ఇందిర గాంధీ రాజీవ్ గాంధీ
బలైపోయిన భూమిరా
గాంధీని చంపిన నేలరా ఇది
గాడ్సే గ్యాంగుల కోటరా ఇది

(రాగం తానం పల్లవి)
లంచం మంచం తంత్రము
పాయే.. అయ్యయ్యో..
లంచం మంచం తంత్రము
నా దేశాన్ని పీడించి
దిగజార్చుచున్నవి
లంచం మంచం తంత్రమోయ్

(ఎవరి కోసం - ప్రేమనగర్)
ఎవరికోసం ఎందుకోసం
ఈ బోడి బియే ఈ పాడు ఎమ్మే
ఈ గోల్డు మెడలు ఈ సర్టి ఫికెటూ
ఎవరి కోసం ఎవరికోసం
ఎందుకోసమండీ నీ ఎంకమ్మా

(బలపం పట్టి భామ బళ్ళో)
ఇంజనీరు సీటు రేటు
ఐదే లక్షలు ఔతాయంట
డాక్టరయ్యే సీటు రేటు
ఆరేడు లక్షలు పలికేనంట
ఎమ్మెల్యే మంత్రవ్వాలంటే
కోటిన్నరవుతుందట
దోపిడికి పదవే లైసెన్సట
వామ్మో రేట్లు పెట్టారు
తొంభై కోట్లున్న ప్రజలకి
స్వాతంత్ర దేశానికీ
ఇంజనీరు సీటు రేటు
ఐదే లక్షలు ఔతాయంట
డాక్టరయ్యే సీటు రేటు
ఆరేడు లక్షలు పలికేనంట

(అబ్బనీ తియ్యనీ దెబ్బ)
వద్దన్నా చచ్చినా జాబు
అది వచ్చినా బాధేరా బాబు
దొబ్బులు పెట్టే బాసులూ
పబ్బం గడిపే క్లర్కులు
సబ్బులు రుద్దె ఫ్యూనులు
మనలాంటోళ్ళు బ్రతకరూ
వద్దన్నా చచ్చినా జాబు
అది వచ్చినా బాధేరా బాబు
అమ్మో నాయనోయ్ వామ్మో

(నల్లవాడే అమ్మమ్మో)
ఎంతరేటే కమిటైతే
లైఫంతా గుండెపోటే
తెస్తాడే చేటే
కోర్టులకే సిగ్గుచేటే

(దొరకునా ఇటువంటి సేవ)
దొరకదు దొరకదు
దొరకదు ఎటువంటి కూర
ఆ ధర ఆకాశమును చేరి
భ్రహ్మఆండ గోళాలు దాటిందిలే
పిచ్చితల్లీ అమ్మా...
దొరకదు ఎటువంటి కూర 
 
కొనలేము వంకాయ
కొట్టలేము టెంకాయ
పెట్టలేము ఆవకాయ
తినలేము మాగాయ
ఈ పాడు ధరలూ..
ఆఆఆఆఆఆ....
ఆఆఆఆఆఆఆ..
ఆఆఆఅ...
ఈ పాడు ధరలు తగ్గేది లేదు
ఏ గవర్నమెంటూ పట్టించుకోదు
కొత్తిమీర కూడా కొనలేము తల్లీ
కొనలేము తల్లీ..ఆఆ...ఆఆ...
దొరకదు ఎటువంటి కూర

(బోటనీ పాఠముంది)
చేతిలో పైస లేదు
పూటకే ఫుడ్డు లేదు
బ్రహ్మమూ ఏమి కర్మము
చదువుకే విలువ లేదు
చవటకే లోటు లేదు
తెలుపరా దీని మర్మము
తొక్కలో సందేహం మానుకోబే
ఒక్కటే మార్గంరా దోచుకోబే
స్పాటు స్పాటు అదే రూటూ
ఛల్ సాలా స్పాటు బెట్టు
అదే బెస్టు మారో
స్పాటు స్పాటు అదే రూటూ
స్పాటు బెట్టు అదే బెస్టు

సమాజం మాకు స్పాటు పెట్టింది
మేం దానికి స్పాటు పెడుతున్నాం


2 comments:

మీకు, మీ కుటుంబానికీ..ధన త్రయోదశి శుభాకాంక్షలు..

థాంక్స్ శాంతి గారూ.. మీకు కూడా ధన త్రయోదశి శుభాకాంక్షలు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.