సోమవారం, అక్టోబర్ 21, 2019

కాటమ రాయుడా...

అత్తారింటికి దారేది చిత్రంలో బాగా ఫేమస్ అయిన కాటమరాయుడా కదిరి నరసింహుడా పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట లిరిక్స్ పేరడీ కాకపోయినా చిత్రీకరణ పేరడీగానే అనుకోవచ్చు. ఒరిజినల్ భజన పాటను బాలమురళి కృష్ణ గారి గాత్రంలో ఇక్కడ వినవచ్చు. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అత్తారింటికి దారేది (2013)
గానం : పవన్ కళ్యాణ్ 

హేయ్.. కాటమ రాయుడా కదిరీ నరసింహుడా..అ
కాటమ రాయుడా కదిరీ నరసింహుడా..ఆ
కాటమ రాయుడా కదిరీ నరసింహుడా..
మేటైన ఏటగాడ నిన్నేనమ్మీతిరా..
మేటైన ఏటగాడ నిన్నేనమ్మీతిరా..
బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడ..
బేట్రాయి సామిదేవుడా


సేపకడుపు చేరిబుట్టితీ..
రాకాసి దాన్ని కోపాన తీసికొట్టితీ.. హెహె హోయ్..

బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడ..
బేట్రాయి సామిదేవుడా


ఓటిమన్ను నీల్లలోన ఎలసి ఏగమే తిరిగి..
ఓటిమన్ను నీల్లలోన.. హ్ హొహొయ్
బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ
బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ

బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడ..
బేట్రాయి సామిదేవుడా

సేపకడుపు చేరిబుట్టితీ..
రాకాసి దాన్ని కోపాన తీసికొట్టితీ.. హొయ్ హొయ్..
బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడ..
బేట్రాయి సామిదేవుడా ఆఆహోయ్యా... 


5 comments:

"బేట్రాయి" అనే పదానికి అర్ధం ఏమిటండీ?

జయ్ గారు వేటరాజు అన్నపదం వాడుకలో జానపదంలో బేట్రాయి గా రూపాంతరం చెందిందండీ. వేటకు రాజు సింహం కదా సింహపు తల గల కదిరి నరసింహ స్వామిని స్తుతించే చెక్కభజన ఈ పాట. బాలమురళి గారి గళంలో ఇక్కడ వినండి : https://www.youtube.com/watch?v=mTtGJH-IyUs

@వేణూశ్రీకాంత్: thank you.

పేరడీ (రీ క్రియేటెడ్) సాంగ్స్ లో ఎవ్వర్ గ్రీన్..

అవునండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.