శుక్రవారం, అక్టోబర్ 25, 2019

ముష్టి కళ వచ్చేసిందే బాలా...

ప్రేమించుకుందాంరా సినిమాలోని పెళ్ళికళ వచ్చేసిందే బాల పాట తెలియని వాళ్ళుండరేమో కదా. ఒకప్పుడు పెళ్ళిళ్ళ ఆర్కెస్ట్రాలో ఊపేసిన పాట. దానికి పేరడీనే ఉల్టాపల్టా చిత్రంలోని ఈ సరదా పాట. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఉల్టా పల్టా (1998)
సంగీతం : ఎమ్.ఎమ్.శ్రీలేఖ  
సాహిత్యం : పొలిశెట్టి  
గానం : ప్రణయ్, శైలజ 

ముష్టి కళ వచ్చేసిందే బాలా
చేత చిప్పట్టుకు వచ్చా ఇలా
ప్రేమ భిక్షా పెట్టమంటూ జోలె పట్టా
నీకోసం ముష్టవతారం ఎత్తానమ్మా
నీ ప్రేమకు గులాము నేనై వచ్చానమ్మా
గేటు ముందు కుక్కల్లే పడి ఉంటానమ్మా
కాదంటే మూసీలో పడి చస్తానమ్మా

ముష్టి కళ వచ్చేసిందే బాలా
చేత చిప్పట్టుకు వచ్చా ఇలా

చెవికోసిన మేకల ఏంటీ గోలా
షాకిస్తే ఔటే నీ యమలీల
అక్కుపక్షి తోకముడిచి చల్ రె చల్ జా
జర ఫేస్ అద్దంలోనా దేఖో దేఖో
జూలోనే లేదిటువంటీ మంకీ ఫేసు
జిడ్డులా పట్టాడమ్మా మెంటల్ కేసూ
లైఫ్ లో లవ్వనకుండా ఇస్తాడోసూ

ముష్టి కళ వచ్చేసిందే బాలా
షాకిస్తే ఔటే నీ యమలీల

దేవదాసునైపోతానే పారూ
మూతి బెండవుతది ముయ్యర నోరూ
హల్లో మిస్సు ఒక్క ఛాన్సు ఇచ్చి చూడూ ప్లీజ్
చెప్పు ఇక తియ్యక ముందే జాగో జాగో
నడ్డి హడ్డి ఇరగక ముందే భాగో భాగో
నీ చెప్పు దెబ్బే నాకు మైసూర్ పాకు
నీ తిట్లే తిరపతి లడ్లే భామా నాకు

చెవికోసిన మేకలా ఏంటీ గోలా
ముష్టి కళ వచ్చేసిందే బాలా
ప్రేమ భిక్షా పెట్టమంటూ జోలె పట్టా

2 comments:

హిలీరియస్ సాంగ్..

అవునండీ హిట్ సాంగ్ కి టూమచ్ పారడీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.