జంబలకిడిపంబ సినిమాలో ఈవీవీ గారు చేసిన గందరగోళం గురించి తెలియని తెలుగు వారెవరు. మరి ఆ సినిమా కాన్సెప్ట్ కి తగినట్లుగా ఫేమస్ డ్యుయెట్స్ కి కట్టిన పేరడీలు వినీ చూసి నవ్వుకోండి ఈ రోజు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : జంబలకిడి పంబ (1992)
సంగీతం : రాజ్ కోటి
సాహిత్యం : భువన చంద్ర
గానం : మనో, రాధిక
నిలువరా వాలు కనుల వాడా
వయ్యారి హంస నడక వాడా
నీ నడకలో హొయలున్నవి చూడా
నువు కులుకుతు గల గల నడుస్తు ఉంటే
నిలువదు నా మనసు
ఓ గురుడా అది నీకే తెలుసు
నిలువరా వాలు కనుల వాడా
వయ్యారి హంస నడక వాడా
ఆఆ...ఆఅ....ఆఆఆ...
పిలువకుమా... అలుగకు మా..
నలుగురిలో నను ఓ రాణీ
పిలిచిన పలుకనులే
పిలువకుమా... అలుగకు మా..
నలుగురిలో నను ఓ రాణీ
పిలిచిన పలుకనులే
గుడిలోన నా దేవి కొలువై ఉన్నాదీ
సేవకు వేళాయెరా చెలికాడా
సేవకు వేళాయెరా
గుడి ఎనక నా రాణి
గుడి ఎనక నా రాణి
గుర్రమెక్కి కూకున్నాది
దాని సోకు చూసి
గుండెల్లో గుబులాయెరా
అబ్బాబ్బా ఒళ్ళంత ఏడెక్కెరా
అయ్యయ్యో ఒళ్ళంత ఏడెక్కెరా
అయ్యయ్యో ఒళ్ళంత ఏడెక్కెరా
చెట్టులెక్క గలవా ఓ చెంచిత పుట్టలెక్కగలవా
చెట్టులెక్క గలవా ఓ చెంచిత పుట్టలెక్కగలవా
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా
ఓ చెంచిత చిగురు కోయ గలవా
చెట్టులెక్కగలనోయ్ ఓ నరహరి పుట్టలెక్కగలనోయ్
చెట్టులెక్కగలనోయ్ ఓ నరహరి పుట్టలెక్కగలనోయ్
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనోయ్
ఓ నరహరి చిగురు కోయగలనోయ్
ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం ఇంతేనయా
ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం ఇంతేనయా
ఆడది లేడూ మగాడు లేదూ మాడ్ మాడ్ లోకమయా
ఓహోహో..హో... ఓహో.హో..హో..ఓఓఓఓఓఓ
వగల రాజువి నీవే సొగసు గత్తెను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను బండి దిగి రారా
వగల రాజువి నీవే సొగసు గత్తెను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను బండి దిగి రారా
భామా భామా భామా.. ఏరా ఏరా మావా
పట్టుకుంటె కందిపోవు పిల్లగాడు పక్కనుంటె
చుట్టు చుట్టు తురుగుతారు మరియాద
తాళి కట్టకుండ ఒప్పుకుంటె తప్పుగాదా
భామా భామా భామా.. ఏరా ఏరా మావా
వాలు వాలు చూపులతో గాలమేసి లాగి లాగి
ప్రేమ లోకి దింపు వాళ్లు మీరు కాదా
చెయ్యి వెయ్యబోతే బెదురుతారు వింతగాదా
ఏరా ఏరా మావా భామ భామా భామా..
ముత్యాల చెమ్మచెక్క
రత్నాల చెమ్మచెక్క
ఓరోరి మురిపెముగా ఆడుదమా
కలకల కిల కిల నవ్వులతో
పంచెలు రెపరెపలాడా
ముత్యాల చెమ్మచెక్క
రత్నాల చెమ్మచెక్క
ఓరోరి మురిపెముగా ఆడుదమా
కలకల కిల కిల నవ్వులతో
పంచెలు రెపరెపలాడా
2 comments:
అసలీ మూవీయే జంధ్యాలగారి మొగుడూ-పెళ్ళాలు మూవీ బిగినింగ్ సీన్స్ ఇన్స్పిరేషన్ తో తీశారనిపిస్తుంది..
ఓహ్ ఆ సినిమా గురించి నాకు తెలీదండీ.. ఇంట్రెస్టింగ్.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.