మావిచిగురు సినిమాలో అల్లురామలింగయ్య గారు జీన్స్ పాంట్ వేస్కుని అమ్మాయిల వెంటపడుతూ ఆటపట్టించే ఈ పాటను రంజుభలే రాంచిలుక అన్న రాజబాబు గారి పాటలోని పదాలను వాడి అల్లు గారిదే ముత్యాలూ వస్తావా అన్న పాట బాణీలో స్వర పరిచిన పేరడీ పాట. ఈ పాట వీడియో దొరకలేదు. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఆడియో సాంగ్ ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మావిచిగురు (1996)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, అనుపమ
హే లవ్లీ గర్ల్స్ .. ఇట్సె బ్యూటిఫుల్ డే..
యూ ఆర్ సో యంగ్..
రంజుభలే రాంచిలక
రమ్మంది ఎనకెనక
చూస్కో పిల్లో నీలో ఓపిక
రంజుభలే రాంచిలక
రమ్మంది ఎనకెనక
చూస్కో పిల్లో నీలో ఓపిక
నీ ఫ్రాకు చూసి నీ సోకు చూసి
బ్రేక్ డాన్సు చేసే మూడొస్తు ఉందే
నీ ఫ్రాకు చూసి నీ సోకు చూసి
బ్రేక్ డాన్సు చేసే మూడొస్తు ఉందే
సిద్ధం అంటే సరదా పడదామే..ఏ..ఏ..
రంజుభలే రాంచిలక
రమ్మంది ఎనకెనక
చూస్కో పిల్లో నీలో ఓపిక
ముత్తాతనంటూ మోమాట పడకే
సత్తాను చూస్తే మత్తెక్కుతావే
ముత్తాతనంటూ మోమాట పడకే
సత్తాను చూస్తే మత్తెక్కుతావే
ముస్తాబంతా చిత్తైపోతుందే..ఏ..ఏ..
రంజుభలే రాంచిలక
రమ్మంది ఎనకెనక
చూస్కో పిల్లో నీలో ఓపిక
రంజుభలే రాంచిలక
రమ్మంది ఎనకెనక
చూస్కో పిల్లో నీలో ఓపిక
2 comments:
నవ్వుల రాజు రామలింగయ్యగారు..
అవునండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.