గురువారం, అక్టోబర్ 31, 2019

ఓం నమో వెంకటప్పాయా...

సీమటపాకాయ్ సినిమాలోని ఈ పేరడీని మొదటి సారి చూసినపుడు పగలబడి నవ్వుకున్నాను. పాటల సెలక్షన్ పారడీ భలే కుదిరాయి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సీమటపాకాయ్ (2011)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం : ???
గానం :

(సదాశివా సన్యాసి తాపసి)
ఓం నమో వెంకటప్పాయా
ఓం నమో నాటుబాంబాయా
ఓం నమో ఫ్యాక్షనిష్టూ
రూపాయా ప్రతాపాయా
గబ గబ బాంబులు
విసిరే పురుషాయా

సదాశివా సన్యాసీ
రాకసి కర్నూలు వాసీ
నీలోని కక్ష్యలు మోసీ
దీక్షపట్టినావు పల్లెవాసీ
హే ముక్కోటి దేవతలు మాకేలరా
మా ఊరి దేవుడూ నీవురా
ఏడుకొండల సామి జిరాక్సురా
ఏసేయ్ నా ఊరూవాడా దండోరా

జై వెంకటప్ప జైజైజై
జాతర చేస్తాం ఎంజాయ్ చేయ్
మేకలు కోస్తాం ముక్కలకై బొక్కలకై
నీ పేరు మీద పలావు
తింటాం హాయ్ హాయ్

(ఎయ్ రాజా - బృందావనం)
సూరీడే సూరీడే నల్లాని సూరీడే
సెల్ఫోన్లు ఫ్రీగా ఇచ్చాడే
మా కొంప కూల్చీ ఈ మేడలిచ్చీ
దిష్టిబొమ్మ అయ్యాడే...
ఓఓ... నరికావు మా కాళ్ళు చేతుల్నీ
ఇచ్చావూ జైపూరు లెగ్గుల్నీ
లాక్కున్నావ్ మా ఆస్థి పాస్థుల్నీ
ఇచ్చేయ్ రాజా

(సింహ టైటిల్ సాంగ్)
సింహమంటీ చిన్నోడే ఇరగదీశాడే
సింహా సింహా సింహా
రోడ్లేయించాడే సింహా
కృష్ణ దేవరాయల్నీ మించి పోయాడే
సింహా సింహా సింహా
ఫ్రీ కరెంటిచ్చే సింహా
ఆ ఆసుపత్రులు కట్టీ
ఈ ఇస్కూలులు పెట్టీ
ఊ ఊరంతా మెచ్చే నాయకుడైనాడే
దానా వీరా శూరా కర్ణా
నువ్వే మాయన్నా
తనా మనా తేడా లేదు
చిందేయ్ అప్పన్నా

(ఇనుములో హృదయం - రోబో)
ఇనుములో హృదయం మొలిచెనే
మన్నించంటూ మనిషై పోయెనే
నాడేమో ఫ్యాక్షనిస్టు నేడేమో బుద్దిష్టూ
నరకాసురుడంటోడు కరుణామయుడైనాడు
పది తలల రావణుడు శ్రీరాముడైనాడు
నరికేసె కత్తిని వదిలి
నారాయణుడైనాడూ
ఓరోరీ వెంకటప్పా నువ్వే మా దేవుడప్పా
నాకేదో డౌటప్పా నీ చెవిలో పువ్వప్పా

(మనసున ఉన్నదీ చెప్పాలని)
మనసున ఉన్నదీ మారిన సంగతీ
ముడుచుకు పోతే ఎలా
హద్దులు చెరుపుతూ చేతులు కలుపుతూ
ఒకటై పోతే భళా
పొత్తులు కోరీ కత్తులు పారేసీ
మిత్రులు అయ్యారిలా
రణమైనా రగడైనా
రాయలసీమలో
తుడుచుకుపోయాయిలా
ఖేల్ ఖతమ్ అయ్యిందిలా

(అదుర్స్ టైటిల్ సాంగ్)
అదుర్స్ అదుర్స్ అదుర్స్
అస్సలాం వాలేకుం అస్సలాం వాలేకుం
ఫాక్షనిస్టులిద్దరూ ఒక్కటైతే
అదుర్స్ అ అ అదుర్స్ అదుర్స్
అస్సలాం వాలేకుం అస్సలాం వాలేకుం
కత్తులూ కక్షలూ పాతిపెడితే
మీరే మాకండదండ ఉండగ
రోజూ మా ఊరిలోన పండగ
చూసేయ్ హే రచ్చ రచ్చ రచ్చగ
హా హాహా హా.. 


2 comments:

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.