గురువారం, అక్టోబర్ 03, 2019

డుం డుమారే...

అర్జున్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అర్జున్ (2004)
సంగీతం : మణిశర్మ  
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర 

డుం డుమారే డుం డుమారే
పిల్ల పెళ్ళి ఛాంగు భళారే భళారే
జం జమారే జం జమారే
శివుడి పెళ్ళి ఛాంగు భళారే భళారే
అళగరు పెరుమాళు అందాల చెల్లెలా
మిలమిలలాడే మీనాక్షీ
నీ కంటి పాపనే కాచుకో చల్లగా
తెలతెలవారనీ ఈ రాత్రీ

చిందెయ్యరా ఓ సుందరా శ్రీగౌరికే బొట్టు పెట్టేయరా
చిందెయ్యరా ఓ సుందరా శ్రీగౌరికే బొట్టు పెట్టేయరా
తందాననా తాళాలతో గండాలు మాకు తప్పించరా
నీ పెళ్ళికి పేరంటమే ఊరేగవే ఊరంతా
కళ్యాణమే వైభోగమే కన్నార్పకే కాసంత

డుం డుమారే డుం డుమారే
పిల్ల పెళ్ళి ఛాంగు భళారే భళారే
జం జమారే జం జమారే
శివుడి పెళ్ళి ఛాంగు భళారే భళారే

మధురాపురికే రాచిలక రాలేనులే
పెళ్ళి పందిళ్ళలో ముగ్గేసిన కన్నీటి ముత్యాలెన్నో
కను చేపలకు నిదరంటు రారాదని
గరగెత్తానులే ఆడానులే గంగమ్మ నాట్యాలెన్నో
గుడిలో కోలాటం గుండెలో ఆరాటం
ఎదలో మొదలాయే పోరాటమే

అళగరు పెరుమాళు అందాల చెల్లెలా
మిలమిలలాడే మీనాక్షీ
నీ కంటి పాపనే కాచుకో చల్లగా
తెలతెలవారనీ ఈ రాత్రీ

అతిసుందరుడే సొదరుడే తోడు ఉండగా
తల్లి నీ కాపురం శ్రీ గోపురం తాకాలి నీలాకాశం
నా పేగు ముడి ప్రేమ గుడి నా తల్లిలే
నువ్వు నా అండగా నాకుండగా
కంపించిపోదా కైలాసం
ఇపుడే శుభలగ్నం ఇది నా సంకల్పం
విధినే ఎదిరిస్తా నీ సాక్షిగా

అళగరు పెరుమాళు అందాల చెల్లెలా
మిలమిలలాడే మీనాక్షీ
నీ కంటి పాపనే కాచుకో చల్లగా
తెలతెలవారనీ ఈ రాత్రీ

చిందెయ్యరా ఓ సుందరా శ్రీగౌరికే బొట్టు పెట్టేయరా
చిందెయ్యరా ఓ సుందరా శ్రీగౌరికే బొట్టు పెట్టేయరా
తందాననా తాళాలతో గండాలు మాకు తప్పించరా
నీ పెళ్ళికి పేరంటమే ఊరేగవే ఊరంతా
కళ్యాణమే వైభోగమే కన్నార్పకే కాసంత


4 comments:

థాంక్స్ ఫర్ ద కామెంట్ సర్..

శ్రీ లలితా..దేవీ నమోస్తుతే..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.