సోమవారం, అక్టోబర్ 28, 2019

అమ్మలారా అయ్యలారా...

కోతిమూక చిత్రంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ పేరడీ సాంగ్స్ తో ఎలా చేశారో మీరూ వినీ చూసి నవ్వుకోండి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కోతిమూక (2010)
సంగీతం : మణిశర్మ 
సాహిత్యం : రామజోగయ్య/భాస్కరభట్ల ??
గానం : దీపు, శ్రీకృష్ణ, రేవంత్

(రింగ రింగ రింగ రింగ)
అమ్మలారా అయ్యలారా
అంజిగాడికి ఓటు వెయ్యండి
అందరికి తెలిసినోడు
ఈడు చాలా మంచివాడండీ
మందిసొమ్మే ఎనకేసుకోడూ
మేడమిద్దే కట్టేస్కోడూ
అమ్మలారా అయ్యలారా
అంజిగాడికి ఓటు వెయ్యండి
అందరికి తెలిసినోడు
ఈడు చాలా మంచివాడండీ
మాటమీద నిలబడతాడీడు
మాయ చేసే టైపే కాదు
అమ్మలారా అయ్యలారా
అంజిగాడికి ఓటు వెయ్యండి
అందరికి తెలిసినోడు
ఈడు చాలా మంచివాడండీ

(రాను రానంటూనే పిల్లదో)
మావోడికోటెయ్యి తమ్ముడూ తమ్ముడూ
నీకోసమేమైనా చేస్తడూ చేస్తడూ
మావోడికోటెయ్యి తమ్ముడూ తమ్ముడూ
నీకోసమేమైనా చేస్తడూ చేస్తడూ
మా వోడ్ని గెలిపించు అమ్మడూ అమ్మడూ
మీతోడు నీడల్లే ఎప్పుడూ ఉంటడూ
ఏసీ లో తొంగోడు ఎప్పుడూ ఎప్పుడూ
పేరెట్టి పిలిచారా ఎంటనే వస్తడూ
మావోడికోటెయ్యి తమ్ముడూ తమ్ముడూ
నీకోసమేమైనా చేస్తడూ చేస్తడూ

(అమ్మా లేదు నాన్నా లేడు ఏక్ నిరంజన్)
అమ్మా అయ్యా అక్కా తంబి
ఓటే వేసి గెలిపించండి అంజిగాడ్ని
ఎంతో సేవ చేస్తాడండీ
అంతా కలిసి దీవించండీ అంజిగాడ్ని
ఎమ్మెల్యేగా ఎపుడూ ఒకడేనెంటీ
ఈసారైనా ఈడిని గెలిపింఛండీ
మనతోనే కలిసుంటాడు
మన గోడే వింటాడు
మనుషుల్లో వీడిలాంటోడూ
ఎకడో ఒకడుంటాడు
ఏసి కారులో వీడు తిరగడే
గంజి నీళ్ళు తాగుతాడే
తెల్లారితే కళ్ళెదురుగా
ఎహె ఎప్పుడూ కనబడతాడే

(ఆకలేస్తే అన్నం పెడతా)
ఆకలేస్తే అన్నం పెడతడు
మనకోసం కష్ట పడతడు
ప్రేమిస్తే ప్రాణం పెడతడు మావోడూ
పెద్దోళ్ళకి దండం పెడతడు
పేదోళ్ళకి గుడిసెలు కడతడు
అవినీతికి అడ్డం పడతడు మావోడూ

(కాలేజి పాపల బస్సు - విక్రమార్కుడు)
వెయ్యండి బాబు ఓటూ
రానివ్వడు ఏ లోటూ
వెయ్యండి బాబు ఓటూ
రానివ్వడు ఏ లోటూ
ఆ కేటుగాడి సీటు
ఈడి దెబ్బకింక ఔటూ
జింతాక్ తాత్ జితా జితా
జింతాక్ తాత్ తా
జింతాక్ తాత్ జితా జితా
జింతాక్ తాత్ తా

(పంచదారా బొమ్మా బొమ్మా)
పంచకట్టీ వచ్చాడమ్మా
మంచి మనసున్నోడమ్మా
పంచమంటే ప్రాణాన్నైనా
పంచి పెట్టేస్తాడమ్మా
పిలిస్తే పలికేవాడు
జనంకై బతికె వాడూ
వీడేనోయమ్మా
ఈడు గెలిచాడంటే
మనకే మేలమ్మా
మరి గెలిపించాల్సిన
భాధ్యత మనదమ్మా 
ఈడు గెలిచాడంటే
మనకే మేలమ్మా
మరి గెలిపించాల్సిన
భాధ్యత మనదమ్మాఆఆఆ

(ఎందుకే రవణమ్మా)
వెయ్యవే రవణమ్మా
ఓటెయ్యవే రవణమ్మా
ఇనుకోవే జానకమ్మా
ఈడు మనవోడే తులసమ్మా
మంచి పన్లు చేస్తాడీడూ
మంచి పన్లు చేస్తాడీడూ
మంచి పన్లు చేస్తాడీడూ
మంచోడూ వీడే నరసమ్మా
ఆలోచించుకో సూరమ్మా 
నువ్వెయ్యవే రవణమ్మా
ఓటెయ్యవే రవణమ్మా

(నువ్వక్కడుంటే నేనిక్కడుంటే)
ఈడొక్కడుంటే చాలండి మనకీ
ఊరే కళ కళ
పక్కోడు కానీ నెగ్గాడు అంటే
జనమే విల విల
స్కాములే చెయ్యడు వీడూ
రాములోరి లాంటి వాడు
ఆకలే తెలిసిన వాడూ
అన్నలా ఆదరిస్తాడు
కోతి గుర్తుకే మీ ఓటు వేసేయ్యండి
అంజిగాడినే మీరంతా గెలిపించండీ
ఈడొక్కడుంటే చాలండి మనకీ
ఊరే కళ కళ
పక్కోడు కానీ నెగ్గాడు అంటే
జనమే విల విల 


2 comments:

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.