ఆదివారం, సెప్టెంబర్ 30, 2018

తెలుగు వారి పెళ్ళి...

శ్రావణమాసం చిత్రంలోని ఒక చక్కని పెళ్ళిపాటతో ఈ సిరీస్ ను ముగిద్దాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ చూడవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రావణమాసం (1991)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం : వెనిగళ్ళ రాంబాబు
గానం : బాలు, మాళవిక 

తెలుగు వారి పెళ్లి
ఇల వైకుంఠమె మళ్లీ
సాంప్రదాయమే
సౌందర్యంగా సాగుతున్న పెళ్లి
ఇది తెలుగు వారి పెళ్లి

తెలుగు వారి పెళ్లి
ఇల వైకుంఠమె మళ్లీ
సాంప్రదాయమే
సౌందర్యంగా సాగుతున్న పెళ్లి
ఇది తెలుగు వారి పెళ్లి

ఒకరికి ఒకరని అనుకుంటే
అదే నిశ్చితార్థం
ఆ నిర్ణయానికీ తలవంచడమే
పెళ్ళి అంతరార్థం
శతమానం భవతి అంటూంది
శ్రావణమాసం శ్రావణమాసం శ్రావణమాసం


తెలుగు వారి పెళ్లి
ఇల వైకుంఠమె మళ్లీ
సాంప్రదాయమే
సౌందర్యంగా సాగుతున్న పెళ్లి
ఇది తెలుగు వారి పెళ్లి


మంగళకరమే బంగారం
నిత్యము శక్తిమయం
అది మాంగళ్యంగా ముడి పడితే
తరించును స్త్రీ హృదయం
తాళిబొట్టులో రెండు పుస్తెలు
లక్ష్మీ పార్వతులూ..
అవి పుట్టినింటికీ మెట్టెనింటికీ
పట్టిన హారతులూ..

ఆ సంగతులన్నీ చెబుతుంది
శ్రావణమాసం శ్రావణమాసం శ్రావణమాసం

తెలుగు వారి పెళ్లి
ఇల వైకుంఠమె మళ్లీ
సాంప్రదాయమే
సౌందర్యంగా సాగుతున్న పెళ్లి
ఇది తెలుగు వారి పెళ్లి


నవగ్రహాలకు ప్రతిరూపాలే
ఈ నవధాన్యాలూ
ఆ చంద్రుని ధాన్యం బియ్యమే
కదా పెళ్ళి తలంబ్రాలు
మనువుకు మూలం మనసైతే
ఆ మనసుకు చంద్రుడు అధిపతి
మీ అనుభంధంతో బియ్యం పొందెను
అక్షింతలుగా ఆకృతి

ఆ వేడుకలన్నీ చూడాలందీ
శ్రావణమాసం శ్రావణమాసం శ్రావణమాసం

తెలుగు వారి పెళ్లి
ఇల వైకుంఠమె మళ్లీ
సాంప్రదాయమే
సౌందర్యంగా సాగుతున్న పెళ్లి
ఇది తెలుగు వారి పెళ్లి 

ఒకే కలపతో ఒకే పలకగా
పెళ్ళి పీట ఉందీ
అదీ ఒకే ప్రాణమై దంపతులిద్దరు
ఉండాలంటుందీ

చాలీ చాలని ఆ పీటా సన్నగ ఉంటుంది
అది సర్దుకు పోయే మనసుండాలని
జంటకు చెబుతుంది

ఆ సందేశాలను అందిస్తుంది
శ్రావణమాసం శ్రావణమాసం శ్రావణమాసం

తెలుగు వారి పెళ్లి
ఇల వైకుంఠమె మళ్లీ
సాంప్రదాయమే
సౌందర్యంగా సాగుతున్న పెళ్లి
ఇది తెలుగు వారి పెళ్లి
 

శనివారం, సెప్టెంబర్ 29, 2018

ఆకాశ పందిరిలో...

శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ (1976)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం : దాశరధి
గానం : సుశీల

ఆకాశ పందిరిలో నీకు
నాకు పెళ్ళంట
అప్సరలే పేరంటాళ్ళు
దేవతలే పురోహితులంట
దీవెనలు ఇస్తారంటా...
ఆకాశ పందిరిలో నీకు
నాకు పెళ్ళంట
అప్సరలే పేరంటాళ్ళు
దేవతలే పురోహితులంట


తళుకుబెళుకు
నక్షత్రాలు తలంబ్రాలు
తెస్తారంట
తళుకుబెళుకు
నక్షత్రాలు తలంబ్రాలు
తెస్తారంట
మెరుపు తీగ తోరణాలు
మెరిసి మురిసి పోయేనంట
మరుపురాని వేడుకలంట...

ఆకాశ పందిరిలో నీకు
నాకు పెళ్ళంట


పిల్లగాలి మేళగాళ్ళు
పెళ్ళిపాట పాడేరంట
పిల్లగాలి మేళగాళ్ళు
పెళ్ళిపాట పాడేరంట
రాజహంస జంట చేరి
రత్నహార తెచ్చేనంట

రాసకేళి జరిపేరంట...

ఆకాశ పందిరిలో నీకు
నాకు పెళ్ళంట
అప్సరలే పేరంటాళ్ళు
దేవతలే పురోహితులంట


వన్నెచిన్నెల
ఇంధ్రదనుసుపై వెన్నెల
పానుపు వేసేనంట
వన్నెచిన్నెల
ఇంధ్రదనుసుపై వెన్నెల
పానుపు వేసేనంట
మబ్బులు తలుపులు
మూసేనంటా. ఆ.ఆ.ఆ
మబ్బులు తలుపులు
మూసేనంట మగువలు తొంగి
చూసేరంట
మనలను గేలి చేసేరంట..
 

శుక్రవారం, సెప్టెంబర్ 28, 2018

హాయిగా ఆలూమగలై....

మాంగల్యబలం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మాంగల్య బలం (1958)
సంగీతం : మాస్టర్ వేణు
సాహిత్యం : శ్రీశ్రీ
గానం : సుశీల, సరోజిని

హాయిగా ఆలూమగలై కాలం గడపాలి
హాయిగా ఆలూమగలై కాలం గడపాలి
వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలీ
హాయిగా.. చేయి చేయిగా
ఆలుమగలై కాలం గడపాలి


సతిధర్మం పతి సేవేయని పతి భక్తిని చూపాలి
అనుదినము అత్తమామల పరిచర్యలనే చేయాలి
పతి ఇంట్లో బంధు జనాల అభిమానం పొందాలి
పతి ఇంట్లో బంధు జనాల అభిమానం పొందాలి
పదిమంది నీ సుగుణాలే పలుమార్లు పొగడాలి

హాయిగా ఆలూమగలై కాలం గడపాలి


ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడు తెలియాలి
సంసారపు బండికి మీరే చక్రాలై తిరగాలి
శరీరాలు వేరే కానీ మనసొకటై మసలాలి
శరీరాలు వేరే కానీ మనసొకటై మసలాలి
సుఖమైనా కష్టమైనా సగపాలుగా మెలగాలి

హాయిగా చేయి చేయిగా అలుమగలై కాలం గడపాలి
వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలీ
హాయిగా ఆలూమగలై కాలం గడపాలి


ఇరుగమ్మలు పొరుగమ్మలతో ఇంటి సంగతులు అనవద్దు
చీరలు నగలిమ్మని భర్తను చీటికి మాటికి అడగద్దు
అత్తింటను అదిరిపాటుతో పుట్టింటిని పొగడద్దు
అత్తింటను అదిరిపాటుతో పుట్టింటిని పొగడద్దు
తరుణం దొరికిందే చాలని తలగడ మంత్రం చదవద్దు.

హాయిగా చేయి చేయిగా అలుమగలై కాలం గడపాలి
వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలీ
హాయిగా ఆలూమగలై కాలం గడపాలి
వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలీ
హాయిగా ఆలూమగలై కాలం గడపాలి  

 

గురువారం, సెప్టెంబర్ 27, 2018

మనసిచ్చిన మారాజే...

సంక్రాంతి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సంక్రాంతి (2005)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం : ఈ.ఎస్.మూర్తి
గానం : పార్థసారధి, మురళి

సూర్యకాంతి పడి మెరిసే అరవిందమీ వదనం
వేల మెరుపులొకసారి మెరిసేటి ద్విగుణ తేజం
కోటి చందురుల చల్లదనాలు చిందే కనులు
సర్వ లోకముల పూజలు పొందే సీతారామా
పుణ్య చరిత శుభ నామా సీతామనోభిరామా

మనసిచ్చిన మారాజే మనువాడిన శుభవేళా
మరుమల్లె బుగ్గలో సిగ్గు సింధూరమాయెనే
కలలిచ్చే పల్లకిలో కదిలొచ్చే దేవతలా
మా ఇంటి దీపమై మా వదినమ్మ వచ్చెనే


అన్నయ్య మనసు తోటలో పారిజాతమై
అనురాగ పరిమళాలె పంచింది సొంతమై
పొంగే ఆనందం తెచ్చే సంతోషం
మా లోగిలి నిండెనే
వధువే బంగారం వరుడే తనసర్వం
ఇది నూరేళ్ళ బంధమే

చక్కని మా అన్నయ్యకు చిక్కిన ఈ చిలకమ్మ
వచ్చింది ఇంటికి తన జంట గూటికి
చిరునవ్వే సిరులంటూ సుగుణాలే నగలంటూ
నిలుచుంది వాకిట ఈ మందార మాలిక


సిరివెన్నెలంటి చెలిమిని మాకుపంచగా
నెలవంక ఇలకు చేరెనా చిన్న వదినగా
పొంగే ఆనందం తెచ్చే సంతోషం
మా లోగిలి నిండెనే
వధువే బంగారం వరుడే తనసర్వం
ఇది నూరేళ్ళ బంధమే
  

బుధవారం, సెప్టెంబర్ 26, 2018

చిట్టి పొట్టి బొమ్మలు...

శ్రీమంతుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీమంతుడు (1971)
సంగీతం : టి.చలపతిరావు
సాహిత్యం : దాశరథి
గానం : సుశీల, జిక్కీ, కోరస్

చిట్టి పొట్టి బొమ్మలు
చిన్నారీ బొమ్మలు 

 చిట్టి పొట్టి బొమ్మలు
చిన్నారీ బొమ్మలు
 

బుల్లి బుల్లి రాధకు
ముద్దు ముద్దు రాజుకు 

 బుల్లి బుల్లి రాధకు
ముద్దు ముద్దు రాజుకు 

 పెళ్ళండీ... పెళ్ళి
ముచ్చటైన పెళ్ళి బహు
ముచ్చటైన పెళ్ళి 

  
 చిట్టి పొట్టి బొమ్మలు
చిన్నారీ బొమ్మలు
చిట్టి పొట్టి బొమ్మలు
చిన్నారీ బొమ్మలు 

 
 కొంగులు ముడివేసీ
కోర్కెలు పెనవేసీ
బుగ్గలపై సిగ్గుతో
కన్నులలో వలపుతో
అడుగులలో వలపుతో
అడుగులలో అడుగులతో
నడిచిపోవు బొమ్మలు..

చిట్టి పొట్టి బొమ్మలు
చిన్నారీ బొమ్మలు
చిట్టి పొట్టి బొమ్మలు
చిన్నారీ బొమ్మలు 
 
 మెరిసిపోవు తాళితో
మెడలో పూమాలతో
మేళాలూ తాళాలూ
సన్నాయీ బాజాలూ
రాజు వెంట రాణి
కాళ్ళకు పారాణి
చేయి చేయి కలుపుకొనీ
చిందులేయు బొమ్మలు..

చిట్టి పొట్టి బొమ్మలు
చిన్నారీ బొమ్మలు 

 చిట్టి పొట్టి బొమ్మలు
చిన్నారీ బొమ్మలు 

 
పూల పల్లకీలో
ఊరేగే వేళలో
కోయిలమ్మ పాటతో
చిలకమ్మల ఆటతో
అంతులేని ఆశలతో
గంతులేయు బొమ్మలు..

చిట్టి పొట్టి బొమ్మలు
చిన్నారీ బొమ్మలు

 చిట్టి పొట్టి బొమ్మలు
చిన్నారీ బొమ్మలు
బుల్లి బుల్లి రాధకు
ముద్దు ముద్దు రాజుకు
పెళ్ళండీ... పెళ్ళి
ముచ్చటైన పెళ్ళి బహు
ముచ్చటైన పెళ్ళి  


మంగళవారం, సెప్టెంబర్ 25, 2018

కోటలోని రాణి...

ఈశ్వర్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఈశ్వర్ (2003)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కౌసల్య, లెనిన, నిహాల్, రాజేష్, ఉష

కోటలోని రాణి పేట పోరగాణ్ణి పెళ్లి చేసుకుంటానంటావా
మేడలలో దొరసాని మా వాడ చూశావా
గాలి కూడా రాని గల్లీ లోనే కాపురముంటానంటావా
పేదల బస్తీలోనే నీ గూడు కడతావా

ఎప్పుడూ తోటరాముణ్ణే కోరుకుంటుంది యువరాణీ
ఎందుకో ఏమో ప్రేమనే అడిగి తెలుసుకోవచ్చుగా


కోటలోని రాణి పేట పోరగాణ్ణి పెళ్లి చేసుకుంటానంటావా
మేడలలో దొరసాని మా వాడ చూశావా


ఎపుడూ నీ పైన పడదే చినుకైనా
గొడుగై ఉంటాగా నేనే నీతో
ఇక పై ఎవరైనా వెతకాలనుకున్నా
కొలువై ఉంటాలే నేనే నీలో

నూరేళ్ల పాటు నేనే నీ చుట్టూ కంచై కాపాడనా

డాకటేరు కాడు ఇంజినీరు కాడు ఊరు పేరు లేనోడు
ఎందుకు నచ్చాడమ్మా ఇటువంటి కుర్రాడు


మొండి సచ్చినోడు కొండముచ్చుగాడు
నిన్నెట్టా సుఖపెడతాడు
భూమ్మీదెవడూ లేడా ఇంతోటి మగవాడు


ఇష్టమైనోడె ఈశ్వరుడు
మనసు పడినాడే మాధవుడు
ప్రేమ పుట్టాక పిచ్చి పట్టాక ఆశ ఆగదు కదా


నగలే కావాలా వగలే వెలిగేలా
ఒక్కో ముద్దు తాకే వేళ

సిరులే ఈ వేళ మెడలో వరమాల
మహరాజంటేనే నే కాదా
ఏదో సంతోషం ఏదో ఉత్సాహం
వేరే జన్మే ఇదా


సత్తు గిన్నెలోని సద్ది బువ్వతోనే సర్దుకుపోగలనంటావా
అపుడపుడు పస్తుంటూ అలవాటు పడగలవా

ఉప్పుఎక్కువైనా గొడ్డు కారమైనా ఆహా ఓహో అనగలవా
ఉక్కిరి బిక్కిరి అవుతూ ఈ కూడు తినగలవా


పంచదారంటి మమకారం పంచిపెడుతుంటే సంసారం
పచ్చిమిరపైన పాయసం కన్నా తీయగా ఉండదా 


సోమవారం, సెప్టెంబర్ 24, 2018

పెళ్ళి చేసుకుని...

పెళ్ళి చేసి చూడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పెళ్ళిచేసి చూడు (1952)
సంగీతం : ఘంటసాల  
సాహిత్యం : పింగళి   
గానం : ఘంటసాల 

ఓ భావి భారత భాగ్య విధాతలార
యువతీ యువకులారా
స్వానుభవమున చాటు
నా సందేశమిదే.. 
వరేవ్వా తాధిన్న తకధిన్న తాంగిట తరికిట తరికిట తోం

పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని
చల్లగ కాలం గడపాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్
మీరెల్లరు హాయిగ ఉండాలోయ్

కట్నాల మోజులో మన జీవితాలనె బలి చేసి
కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా
పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు
చెప్పుకొని ప్రజలు సుఖ పడగా

తాధిన్న తకధిన్న తాంగిట తరికిట తరికిట తోం

ఇంట బయట జంట కవుల వలె
అంటుకు తిరగాలోయ్ తరంపం
ఇంట బయట జంట కవుల వలె
అంటుకు తిరగాలోయ్
కంటి పాపలై దంపతులెపుడు
చంటి పాపలను సాకాలోయ్
కంటి పాపలై దంపతులెపుడు
చంటి పాపలను సాకాలోయ్ 
 
పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని
చల్లగ కాలం గడపాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్
మీరెల్లరు హాయిగ ఉండాలోయ్

నవ భావములా నవ రాగములా
నవ జీవనమే నడపాలోయ్
నవ భావములా నవ రాగములా
నవ జీవనమె నడపాలోయ్
భావ కవుల వలె ఎవరికి తెలియని
ఏవో పాటలు పాడాలోయ్
భావ కవుల వలె ఎవరికి తెలియని
ఏవో పాటలు పాడాలోయ్

పెళ్ళి చేసుకొని...
పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని
చల్లగ కాలం గడపాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్
మీరెల్లరు హాయిగ ఉండాలోయ్
హాయిగా ఉండాలోయ్..


ఆదివారం, సెప్టెంబర్ 23, 2018

కోదండరామయ్యకు...

కోదండరాముడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కోదండరాముడు (2000)
సంగీతం : ఎస్వీ.కృష్ణారెడ్డి
సాహిత్యం : వేటూరి 
గానం : చిత్ర, శ్రీకుమార్

సైయ్యకు సకజిమి సూజ సక సూజ సక సూజ
సైయ్యకు సకజిమి సూజ సక సూజ సక సూజ
సైయ్యకు సకజిమి సూజ సక సూజ సక సూజ

 
కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ
మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక
కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ
మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక
సిరిమువ్వ నడకల్లో తిల్లానలు పలుక
సిరిమల్లె సీతమ్మ చిరునవ్వులు చిలక


సైయ్యకు సకజిమి సుజ సక సూజ సక సూజ
సైయ్యకు సకజిమి సుజ సక సూజ సక సూజ


కట్టిన చీరకు కౌగిలి ముడిపడగా
సరిగంచుల్లో సరిగమలెన్నెన్నో
పెట్టిన చీరకు ప్రేమలు జతపడగ
పైటంచుల్లో పదనిసలింకెన్నో

మల్లెల పన్నీరులతో
మంగళ స్నానాలెపుడో !
పువ్వుల జలపాతంలో
యవ్వన తీర్థాలెపుడో!

కట్టు బొట్టు కట్టిన చీర కరిగేదింకెపుడో ...!

కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ
మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక

సైయ్యకు సకజిమి సూజ సక సూజ సక సూజ
సైయ్యకు సకజిమి సూజ సక సూజ సక సూజ


ఊపిరి కాగని ఉలిపిరి చీరలలో
సొంపులు దాచకు సొగసరి కోకమ్మా ! 
కంచి జరీ జలతారుల చీరలలో
కంచికి వెళ్లని కధలే నీవమ్మా!

కంటికి కాటుక రేఖ
ఒంటికి నేసిన కోక !
సీతకు లక్ష్మణ రేఖ !
రాధాకు వేణువు కేక

కోక రైక కలవని చోట సొగసుల కోలాట !

కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ
మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక

సిరిమువ్వ నడకల్లో తిల్లానలు పలుక
సిరిమల్లె సీతమ్మ చిరునవ్వులు చిలక

సైయ్యకు సకజిమి సూజ సక సూజ సక సూజ
సైయ్యకు సకజిమి సూజ సక సూజ సక సూజ 



శనివారం, సెప్టెంబర్ 22, 2018

పందిట్లో పెళ్ళవుతున్నది...

ప్రేమలేఖలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ప్రేమలేఖలు (1953)
సంగీతం : శంకర్ - జైకిషన్ 
సాహిత్యం : ఆరుద్ర
గానం : జిక్కి

పందిట్లో పెళ్ళవుతున్నది
పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందౌతున్నది
నటనమే ఆడెదను ఓ నటనమే ఆడెదను 
 
పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందౌతున్నది
నటనమే ఆడెదను ఓ నటనమే ఆడెదను
పందిట్లో పెళ్ళవుతున్నది

పెళ్ళికుమార్తెకు పూజాఫలమూ
చేతికందేనూ చేతికందేనూ
గోరింటాకు కోయగ పోతే
గోళ్ళు కందేనూ నా గోళ్ళు కందేనూ
కోరికలు తీరుచున్నవి అవి పేరుచున్నవి

నటనమే ఆడెదనూ ఓ నటనమే ఆడెదనూ
పందిట్లో పెళ్ళవుతున్నదీ

వధువు వరుడు పల్లకిలోన పరదేశమేగెదరు
ఆఆఅ.. వధువు వరుడు పల్లకిలోన పరదేశమేగెదరు
వారిని తలచి బంధువులంతా సతతము వగచెదరూ
సతతము వగచెదరు..
కన్నీరే కురియుచున్నది మది తరుగుచున్నది 
ఒంటరిగా ఆడెదనూ ఓ ఒంటరిగా ఆడెదనూ

పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందౌతున్నది
ఒంటరిగా ఆడెదను ఓ ఒంటరిగా ఆడెదను
పందిట్లో పెళ్ళవుతున్నది


శుక్రవారం, సెప్టెంబర్ 21, 2018

పదహారణాల పడుచు...

లైలా మజ్ను చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : లైలా మజ్ను (2007)
సంగీతం : ఎమ్.ఎమ్.శ్రీలేఖా
సాహిత్యం : వేటూరి
గానం : వేణు, గంగ, రమణ, స్రుజన

మల్లెల్ని మాలకట్టి వేశారు అచ్చచ్చో
మందార బుగ్గ గిచ్చచ్చో
అందాల బొమ్మ మనువాడే
సీతమ్మను రామయ్య నచ్చచ్చో
కళ్యాణ తిలకం దిద్దేచ్చో..


పదహారణాల పడుచు వన్నెలు
పదిలంగానే దాచుకున్న
ఈ పెళ్ళికూతురు సిగ్గు చిలకరయ్యో
నవనవలాడే నవమన్మధుడే
మిల మిల మెరిసే మగమహరాజు
చుక్కపెట్టినా చందమామరయ్యో

మహ ముద్దు ముద్దుగుందీ
కనువిందు చేసెనెండీ
ఇది పెళ్ళి పందిరండీ
అనురాగం పలికిన వేడుకలండీ

పదహారణాల పడుచు వన్నెలు
పదిలంగానే దాచుకున్న
ఈ పెళ్ళికూతురు సిగ్గు చిలకరయ్యో

యవ్వనాల ఏరువాకలో
వెన్నపూస రాసలీలలు
కన్నెమనసు కాజేస్తావా కొంటె కృష్ణుడా

చందనాల చూపు రువ్వుతూ
బంధనాల మాలలల్లుతూ
చల్ల ముంత దాచేస్తావా తీపి గోపికా
నల్లనయ్య నీ వేషాలూ
చెల్లవయ్య నీ మోసాలు
మంత్రమేసె నీ మాయ చాలు మురారి

తెచ్చుకున్న ఈ రోషాలు
తెలుసుకున్నవే పాఠాలు
తెల్లవారితే చీకటల్లె పరారీ
తలుపే తెరిచా నిను కోరి

ముత్యమంటి వన్నె చిన్నెలూ
ముద్దబంతి మూతి ముడుపులు
మూగమనసు సైగలు ఊగే రాగడోలికా
మేలుకోని మౌన వీణని
మీటలేవు కుర్ర ఊహలూ
ఆశపడిన ఆరాటాలా తీగలాగకా

అల్లరెందుకే అమ్మాయి
పుల్ల విరుపులే మానేయి
పిల్లగాలి మోగించనీ సన్నాయి
మెల్ల మెల్లగా అబ్బాయి
ముద్దు ముద్దుకీ కొత్తోయి
ముగ్గులోకి నను దించలేవు పోవోయి
చిలకే చెబితే వినవోయి..


పదహారణాల పడుచు వన్నెలు
పదిలంగానే దాచుకున్న
ఈ పెళ్ళికూతురు సిగ్గు చిలకరయ్యో
నవనవలాడే నవమన్మధుడే
మిల మిల మెరిసే మగమహరాజు
చుక్కపెట్టినా చందమామరయ్యో

మహ ముద్దు ముద్దుగుందీ
కనువిందు చేసెనెండీ
ఇది పెళ్ళి పందిరండీ
అనురాగం పలికిన వేడుకలండీ 


గురువారం, సెప్టెంబర్ 20, 2018

ముచ్చట గొలిపే...

తిక్కశంకరయ్య చిత్రంలోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : తిక్కశంకరయ్య (1968)
సంగీతం : టీ.వి.రాజు
సాహిత్యం : సినారె
గానం : సుశీల

ముచ్చట గొలిపే పెళ్ళిచూపులకు వచ్చావా ఓ దొరబాబూ
వచ్చావా... మెచ్చావా.. వలపుల పల్లకి తెచ్చావా..

ముచ్చట గొలిపే పెళ్ళిచూపులకు వచ్చావా ఓ దొరబాబూ
వచ్చావా... మెచ్చావా.. వలపుల పల్లకి తెచ్చావా..

నా ముందట నీ వున్నావు నీ చెంగట నేనున్నాను
నా ముందట నీ వున్నావు నీ చెంగట నేనున్నాను
అద్దంలో చూసుకుంటే ఇద్దరమొకలాగున్నాము
చలో జోడు కుదిరింది భలే ఛాన్సు దొరికింది
ఓ డార్లింగ్.. మై డార్లింగ్.. వై డోంట్ యూ డాన్స్ అండ్ సింగ్..

ముచ్చట గొలిపే పెళ్ళిచూపులకు వచ్చావా ఓ దొరబాబూ
వచ్చావా... మెచ్చావా.. వలపుల పల్లకి తెచ్చావా..

నీ వైపే నేనొస్తుంటే ఆ వైపే నువు చూస్తుంటే
నీ వైపే నేనొస్తుంటే ఆ వైపే నువు చూస్తుంటే
చక్కని నీ రూపం నాలో చక్కిలిగిలి చేస్తూ ఉంటే
ఠలాయించి పోతావా అలా తేలిపోలేవా
ఓ బల్ మా.. ఓ సజనా.. మై తేరా నజరానా.. 

 

బుధవారం, సెప్టెంబర్ 19, 2018

బంగారు బొమ్మకి...

పెళ్ళి కానుక చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పెళ్ళి కానుక (1998)
సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి,
సాహిత్యం : సిరివెన్నెల
గానం :  బాలు, భానుమతి

బంగారు బొమ్మకి పెళ్ళి కళొచ్చిందోయ్
రంగేళి వేడుక ముంగిట నిలిచిందోయ్
పచ్చని పందిరిలో కలిసొచ్చిన సందడిలో
మంగళవాద్యంతో ఓ మంచి ముహూర్తంలో
అల్లిబిల్లి మేనాలో నిను ఢిల్లీకెత్తుకుపోతానంటూ
కానున్న కళ్యాణమంటున్నదోయ్

బంగారు బొమ్మకి పెళ్ళి కళొచ్చిందోయ్
రంగేళి వేడుక ముంగిట నిలిచిందోయ్
బంగారు బొమ్మకి పెళ్ళి కళొచ్చిందోయ్
రంగేళి వేడుక ముంగిట నిలిచిందోయ్

బంగారు బొమ్మకి పెళ్ళి కళొచ్చిందోయ్
రంగేళి వేడుక ముంగిట నిలిచిందోయ్

ఆకు పచ్చని చిలకరెక్క పంచవమ్మా శుభలేఖలు
చూడ చక్కని జంట కలిపిన నను మెచ్చుకోగా నలుదిక్కులు
దగ్గరలోనే వినిపిస్తోందా లగ్గం సన్నాయి
ఆ సంగతి తెలియంగానే సిగ్గులు బుగ్గలు నొక్కాయి
నీ చక్కని చెక్కిలి నొక్కులుపడితే బాగుందమ్మాయి

బల్లే బల్లే బల్లే! షాదికే బారాత్ ఆయేగి కల్
ముబారక్ బాత్ కరేగీ హల్ చల్

పారాణి పాదాల మాగాణి మారాణి
నీ రాక ఎపుడంది మా రాజధాని
 
బంగారు బొమ్మకి పెళ్ళి కళొచ్చిందోయ్
రంగేళి వేడుక ముంగిట నిలిచిందోయ్

బంగారు బొమ్మకి పెళ్ళి కళొచ్చిందోయ్
రంగేళి వేడుక ముంగిట నిలిచిందోయ్
 
తేనె తేటల తెలుగుపాట తరలి రావే మా ఇంటికి
కోటి శాంతులు తులసికోట కళలు తేవే మా పెరటికి
ఆ జనక రాజుకు దీటైన తండ్రి మన్నించు మా ఇంటి తాంబూలం
ఈ పసుపు కాంతికి మా గడప పండేలా అందించు సీతమ్మ కన్యదానం
అత్తిల్లునే నీకు పొత్తిళ్ళు చేసి పసిపాపలా చూసుకుంటామని
పదిమందిలో బాస నే చేయనీ

బంగారు బొమ్మకి పెళ్ళి కళొచ్చిందోయ్
రంగేళి వేడుక ముంగిట నిలిచిందోయ్
బంగారు బొమ్మకి పెళ్ళి కళొచ్చిందోయ్
రంగేళి వేడుక ముంగిట నిలిచిందోయ్ 

 
 

మంగళవారం, సెప్టెంబర్ 18, 2018

శ్రీలక్ష్మి పెళ్లికి...

జస్టిస్ చౌదరి చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జస్టిస్ చౌదరి (1982)
రచన : వేటూరి,
సంగీతం : చక్రవర్తి
గానం : బాలు, సుశీల, శైలజ

శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం
చిగురులేసే సిగ్గు చీనాంబరాలు
తడిసి కురిసే కళ్లు నీ తలంబ్రాలు

శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం
 
కనుబొమ్మల నడుమ విరిగింది శివధనుసు
కన్నుల్లో మెరిసింది కన్నె సీత మనసు
కనుబొమ్మల నడుమ విరిగింది శివధనుసు
కన్నుల్లో మెరిసింది కన్నె సీత మనసు
ఆ రామచంద్రుడు నెలవంకలిస్తాడని
ఆ రామచంద్రుడు నెలవంకలిస్తాడని
పొడిచింది ఓ చుక్క బుగ్గలో ఇప్పుడు
అందాలకెందుకు గంధాల పూతలు
అందాలకెందుకు గంధాల పూతలు
కళ్లకే వెలుతురు మా పెళ్లికూతురు
ఈ పెళ్లికూతురు...

శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం
 
అడగలేదు అమ్మనైనా ఏనాడు ఆకలని
అలుసు చేయవద్దు మీరు తానేమి అడగదని
ఆడగబోదు సిరిసంపదలు ఏనాడూ పెనిమిటిని
అడిగేదొక ప్రేమ అనే పెన్నిధిని
చెప్పలేని మూగబాధ చెప్పకనే తెలుసుకో
మాటలకే అందని మనసు.. 
చూపులతో తెలుసుకో..
రెప్పవలే కాచుకో..

శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం
చిగురులేసే సిగ్గు చీనాంబరాలు
తడిసి కురిసే కళ్లు నీ తలంబ్రాలు

శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం
మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం 



సోమవారం, సెప్టెంబర్ 17, 2018

దేవతలారా రండి...

ఆహ్వానం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడీయో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆహ్వానం (1997)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర

దేవతలారా రండి మీ దీవెనలందించండి
నోచిన నోములు పండించే నా తోడుని పంపించండి
కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి

కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి

శివపార్వతులేమో ఈ దంపతులనిపించాలి
ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి
ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి
శ్రీకాంతుల కొలువంటే మా కాపురమనిపించాలి
మా ముంగిలిలోన పున్నమిపూల వెన్నెల విరియాలి
మా చక్కని జంట చుక్కలతోట పరిపాలించాలి

కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి

తన ఎదపై రతనంలా నిను నిలిపే మొగుడొస్తాడు
నీ వగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు
తన ఇంటికి కళతెచ్చే మహలక్ష్మిగ పూజిస్తాడు
తన కంటికి వెలుగిచ్చే మణిదీపం నీవంటాడు
ఈ పుత్తడిబొమ్మ మెత్తని పాదం మోపిన ప్రతిచోటా
నిధినిక్షేపాలే నిద్దురలేచి ఎదురొచ్చేనంటా

కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతి రాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి 
దేవతలారా రండి మీ దీవెనలందించండి
నోచిన నోములు పండించే నా తోడుని పంపించండి

కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి 

 

ఆదివారం, సెప్టెంబర్ 16, 2018

జాలీ బొంబైలే మామా...

పెళ్ళిసందడి చిత్రంలోని ఒక సరదా ఐన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పెళ్ళి సందడి (1959)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సముద్రాల
గానం : ఘంటసాల, లీల/జిక్కి

ఓఓఓఓఓఓఓ... ఓయ్.. మామా
జాలీ బొంబైలే మామా ఓ మామా
జాలీ బొంబైలే మామా ఓ మామా
మన పెళ్ళి ఊసంటే సయ్యంది మా యమ్మ
మురిసే మా అయ్యా

జాలీ బొంబైలే మామా ఓ మామా

ఓఓఓఓఓఓఓఓఓ..ఓఓఓహోహోయ్...
జాలీ బొంబైలే మామా ఓ మామా
జాలీ బొంబైలే మామా ఓ మామా
మన పెళ్ళి ఊసంటే సయ్యంది మా యమ్మ
మురిసే మా అయ్యా

జాలీ బొంబైలే మామా ఓ మామా

ఈదంట ఎళుతుంటే ఈలేసే మామ
ఈదంట ఎళుతుంటే ఈలేసే మామ
సెరువూ కెళుతుంటేను సెంగూలాగే మామ
సెరువూ కెళుతుంటేను సెంగూలాగే మామ
ఎక్కడున్నా ఎన్నడైన నేనూ నీదాన
ఎదలోన నీసోకె ఎలిగేను మామ
ఒకటి రెండు మూడు నాలుగైదు
ఆరు ఏడు ఎనిమిది
లెక్కపెట్టే తలికి నీ పక్కనే వుంటాను మామా

జాలీ బొంబైలే... 
జాలీ బొంబైలే మామా ఓ మామా

పంటా సేలాదారి పలుకాడుకుందాం
పంటా సేలాదారి పలుకాడుకుందాం
పైరూ గాలిలోనా పయనాలుసేద్దాం
పైరూ గాలిలోనా పయనాలుసేద్దాం
సల్లాని ఎన్నెల్లో సరసాలు సేసి
సన్నజాజి పొదలమజిలీలుయేసి
సుళ్ళు తిరిగి గళ్ళు కదలి వూళ్ళు దాటి ఏళ్ళుదాటి
ఏకధాటి ఎగురుకుంటూ ఎల్లిపోదాం మామా

జాలీ బొంబైలే...
జాలీ బొంబైలే మామా ఓ మామా
మన పెళ్ళి ఊసంటే సయ్యంది మా యమ్మ
మురిసే మా అయ్యా
జాలీ బొంబైలే మామా ఓ మామా 

 

శనివారం, సెప్టెంబర్ 15, 2018

ఐదురోజుల పెళ్లి...

వరుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడీయో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : వరుడు (2010)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : వేటూరి
గానం : రంజిత్, సునంద, మాళవిక, 
హేమచంద్ర, జమునా రాణి

ఐదురోజుల పెళ్లి అమ్మంటి పెళ్లీ
తొలిచూపులే లేని తెలుగింటి పెళ్లీ
వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లీ
వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లీ
ఆకాశ పందిళ్లు భూలోక సందళ్ళు
శ్రీరస్తు పెళ్లిళ్లు శుభమస్తు నూరేళ్లు


తుమ్మెదలాడె గుమ్మల జడలు
హంసలు ఊడే అమ్మల నడలు
నగలకు కందే మగువల మెడలు
పడుచు కళ్లకె గుండెల దడలు
పారాణమ్మ కోవెల ముందు
పసుపులాటతొ ధ్వజారోహణం
కళ్యణానికి అంకురార్పణం
పడతులు కట్టె పచ్చతోరణం


ఇందరింతుల చేయి సుందరుడీ హాయి
తలకు పోసె చేయి తలపులొక్క వేయి
నలుగు పెట్టిన కొద్దీ అలిగింది వయసు
వయసు అలిగిన కొద్దీ వెలిగింది మనసు

మగపెళ్లి వారట నేమాని వారట
పెళ్లికి తరలి వస్తున్నారట
కాఫీలు అడగరట ఉప్మాలు ఎరగరట
వీరికి సద్దన్నమే ఘనమౌ
వీరి గోప్పలు చెప్ప తరమా
బాండ్ మేళాం అడగరట
డోలు సన్నాయి ఎరగరట
వీరికి భోగ మేళాం ఘనమౌ
వీరి గోప్పలు చెప్ప తరమా
మగపెళ్లి వారట నేమాని వారట
పెళ్లి కి తరలి వస్తున్నారట


ఇమ్మని కట్నం కోరి మేం అడగేలేదు
ఇప్పటికైన ఎఫ్ ఎ బి ఎ చెప్పించండి
చెన్నపట్నం స్టాండ్ అద్దం కావాల్మాకు
దానికి తగిన పందిరి మంచం ఇప్పించండి
కానుపూరు కండ్ల జోడు కావాల్మాకు
దానికి తగిన రిస్టు వాచ్ ఇప్పించండి
ఇమ్మని కట్నం కోరి మేం అడగేలేదు
ఇప్పటికైన ఎఫ్ ఎ బి ఎ చెప్పించండి


నచ్చె నచ్చె అచ్చ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ
యె ఎక్కడ

అది లబొ దిబొ గబ్బొ జబ్బొ మారేజి లవ్వు మారేజి
అది హనీ మూన్ అవ్వoగానె డామేజీ
ఎవరికి వారె యమునా తీరె పాకేజి తోక పీకేజి
అది అటొ ఇటొ అయ్యిందంటె దారెదీ కృష్ణా బారేజ్

ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు
శ్రీరస్తు పెళ్లిళ్లు శుభమస్తు నూరేళ్లు

ఐదురోజుల పెళ్లి అమ్మంటి పెళ్లీ
తొలిచూపులే లేని తెలుగింటి పెళ్లీ
వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లీ
వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లీ

చేదు కాదోయి తమలాకు ముక్క
అందులొ వెయ్యి సిరిపోక సెక్క
సున్నమేసావొ నీ నోరు పొక్క
ఫక్కు మంటాది మా ఇంటి సుక్క
పచ్చ కర్పూర తాంబూలమిచ్చాక
ఎక్క వచ్చోయి పూమల్లె పక్క

పంచుకొవచ్చు మా పాల సుక్క
పండుకోవచ్చు సై అంటె సుక్క
తెల్లవారాక నీ బుగ్గ సుక్క
గుమ్మ తిలకాల గురుతైన లక్క
కడిగినా పోదు ఈ బంధమల్లూడొ
నిండు నూరేళ్ళదీ జంట అక్క

నిన్ను దీవించిన ఆడ బిడ్డ
ఊరు దివిసీమలో నందిగెడ్డ
ఆడ పంతుళ్ల అక్షింతలడ్డ
మంచి శకునాల మీ ఇంట సెడ్డ
మమ్ము కనిపెట్టు మా రాస బిడ్డ


తట్టలొ కూర్చుండ బెట్టిన వధువునా
గుమ్మడి పువ్వులొ కులికెనొకటీ..
అది మంచు ముత్యమా
మన వధువు రత్నమా 


శుక్రవారం, సెప్టెంబర్ 14, 2018

అన్ని మంచి శకునములే...

శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : పింగళి
గానం :  ఘంటసాల, సుశీల 

అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
మనసున మంగళవాద్యమాహా మోగెలే....

నావలెనే నా బావ కుడా...
నాకై తపములు చేయునులే..
తపము ఫలించి నను వరియించి..
తరుణములోనె బిరాన నన్ను చేరునులే ...

అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
మనసున మంగళవాద్యమాహా మ్రోగెలే...

అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
మనసున మంగళవాద్యమాహా మోగెనులే

కుడికన్ను అదిరే... కుడిభుజమదిరే
కోరిన చెలి నను తలచెనులే ....
చిరకాలముగా కాంచిన కలలు
నిజమౌ తరుణము వచ్చెనులే ...

అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
మనసున మంగళవాద్యమాహా మోగెలే

మల్లెతోరణల మంటపమందె
కనులు మనసులు కలియునులే...
కలసిన మనసుల కలరవములతో..
జీవితమంతా వసంతగానమౌనులే...

అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే...
మనసున మంగళవాద్యమాహా మోగెలే..


గురువారం, సెప్టెంబర్ 13, 2018

హృదయమనే కోవెల...

మిత్రులందరకూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ముందుగా ఆ స్వామిని స్థుతించుకుందాం. ఎంబెడ్ చేసిన వీడియో ఇక్కడ చూడవచ్చు.


తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయా ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్ ..!!
 

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 

ఇక పెళ్ళి పాటలలో ఈ రోజు పెళ్ళిసందడి చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పెళ్ళిసందడి (1997)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర

ఆఆఅ హృదయమనే కోవెల
తలుపులు తెరిచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ఆ ఆ ఆ త్యాగమనే దేవత
సన్నిధి వెలిగే దీపం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
అణువణువును చెలిమికి
అంకితమిచ్చును ప్రేమ
తను నిలువున కరుగుతు
కాంతి పంచునది ప్రేమ
గగనానికి నేలకు వంతెన
వేసిన వానవిల్లు ఈ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
 
ఆఆఆ హృదయమనే కోవెలు
తలుపులు తెరిచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

ఇవ్వటమే నేర్పగల ఈ ప్రేమ
తనకొరకు ఏ సిరిని అడగదు కదా
నవ్వటమే చూపగల ఈ ప్రేమ
మంటలనె వెన్నెలగ మార్చును కదా
గాలికి గంధము పూయటమే
పూలకు తెలిసిన ప్రేమసుధ
రాలిన పువ్వుల జ్ఞాపకమే
కాలం చదివే ప్రేమకథ
ప్రియమైన తనవారి సుఖశాంతులే కోరి
మురిసేటి గుణమే ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

ఆ ఆ ఆ హృదయమనే కోవెల
తలుపులు తెరిచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

ఏ జతనో ఎందుకో విడదీసి
వెంటాడి వేటాడు ఆటే ప్రేమ
మౌనముతో మనసునే శృతి చేసి
రాగాలు పలికించు పాటే ప్రేమ
శాశ్వత చరితల ఈ ప్రేమ
మృత్యువు ఎరుగని చిరునామా
శ్వాసను మంగళహారతిగా
వెలిగించేదే ఈ ప్రేమ
మరణాన్ని ఎదిరించి
మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి
మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి
కరుణించు వరమే ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

ఆ ఆ ఆ హృదయమనే కోవెల
తలుపులు తెరిచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ఆ ఆ ఆ త్యాగమనే దేవత
సన్నిధి వెలిగే దీపం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

ప్రియమైన తనవారి సుఖశాంతులే కోరి
మురిసేటి గుణమే ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

ఆ ఆ ఆ హృదయమనే కోవెల
తలుపులు తెరిచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ఆ ఆ ఆ త్యాగమనే దేవత
సన్నిధి వెలిగే దీపం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ


బుధవారం, సెప్టెంబర్ 12, 2018

ఖుషీ ఖుషీగా నవ్వుతు...

ఎస్.రాజేశ్వరరావు గారి స్వరకల్పనలోని ఒక చక్కని గీతాన్ని నేడు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఇద్దరు మిత్రులు (1961)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : దాశరథి
గానం : ఘంటసాల, సుశీల

ఖుషీ ఖుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగొలిపేవెందుకే నిషా కనులదానా?
ఖుషీ ఖుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగొలిపేవెందుకే నిషా కనులదానా?
 
ఓ..ఓ..
మేనాలోన ప్రియునిజేర వెళ్ళింది నా చెలి మీనా
మేనాలోన ప్రియునిజేర వెళ్ళింది నా చెలి మీనా
నింగిదాటి ఆనంద సాగరం పొంగిపొరలె నాలోన

ఖుషీ ఖుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగొలిపేదిందుకే నిషా కనుల వాడ
 

ఓఓఓ...ఒహో చెలియా నీవుకుడా ఓ పెళ్ళి పల్లకీ చూసుకో
ఒహో చెలియా నీవుకుడా ఓ పెళ్ళి పల్లకీ చూసుకో
హాయిగొలుపు సన్నాయి పాటలో వలపుబాటలే వేసుకో
నే వెళితే మరి నీవు, మజ్నూవవుతావూ
నే వెళితే మరి నీవు, మజ్నూవవుతావూ
మజ్ను నేనైతే ఓ లైలా లోకమే చీకటై పోవునే
మజ్ను నేనైతే ఓ లైలా లోకమే చీకటై పోవునే

ఖుషీ ఖుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగా వుందాములే నిషా కనుల వాడ
 

ఓఓఓఓ...ఆకాశంలో ఇంద్రధనస్సుపై ఆడుకుందమా నేడే
నీలి నీలి మేఘాల రధముపై తేలిపోదామీనాడే 
చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలసిపోదమా హాయిగా
నేను వీణనై నీవు నాదమై ఏకమౌదమా తీయగా

ఖుషీ ఖుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగా వుందాములే హమేషా మజాగా

 

మంగళవారం, సెప్టెంబర్ 11, 2018

ఒక దేవత వెలిసింది నీ కోసమే...

నిన్నే ప్రేమిస్తా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నిన్నేప్రేమిస్తా (2000)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్ 
సాహిత్యం : వెనిగెళ్ళ రాంబాబు
గానం : చిత్ర

ఒక దేవత వెలిసింది నీ కోసమే
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
ఒక దేవత వెలిసింది నీ కోసమే
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
సంధ్యా కాంతుల్లోన శ్రావణిలా
సౌందర్యాలే చిందే ఆమినిలా
ఎన్నో జన్మల్లోన పున్నమిలా
శ్రీరస్తంటూ నీతో అంది ఇలా
నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలిసింది నీ కోసమే
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే

విరిసే వెన్నెల్లోన మెరిసే కన్నుల్లోనా
నీ నీడే చూసాడమ్మ
ఎనిమిది దిక్కుల్లోనా నింగిని చుక్కల్లోనా
నీ జాడే వెదికాడమ్మ
నీ నవ్వే తన మదిలో అమృతవర్షం
నీలోనే వుందమ్మ అందని స్వర్గం
రవళించే హృదయంతో రాగం తీసి
నీ కుంకుమ తిలకంతో కవితే రాసి
అంటుందమ్మా తన మనసే నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలిసింది నీ కోసమే
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే

కళ్ళకు కలలే రెండు కాటుక సిగ్గులు చిందు
కాబోయే కళ్యాణంలో
తనలో సగమే వీది నీలో సర్వం తనది
అనురాగం మీ ఇద్దరిది
ఆ తారా తోరణమే మల్లెల హారం
చేరాలి మురిపాల సాగర తీరం
అలరించే మీ జంట వలపుల పంట
శుభమంటూ దీవించే గుడిలోగంట
చెప్పాలి తనతో నీవే నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలిసింది నీ కోసమే
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే

సంధ్యా కాంతుల్లోన శ్రావణిలా
సౌందర్యాలే చిందే ఆమినిలా
ఎన్నో జన్మల్లోన పున్నమిలా
శ్రీరస్తంటూ నీతో అంది ఇలా
నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలిసింది నీ కోసమే
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే 

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.