నారీ నారీ నడుమ మురారి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : నారి నారి నడుమ మురారి (1990)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, సుశీల
పెళ్ళంటూనే వేడెక్కిందే గా...లీ
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ
పెళ్ళంటూనే వేడెక్కిందే గా...లీ
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ
ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా..
కంచె దాటింది ఆత్రాల గోలా...
పెళ్ళంటూనే వేడెక్కిందే గాలీ
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
మ్మ్... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
తరిమే తరుణంతో పరువం తడబడుతోంది
కులికే చెలితాపం కుదురుగ నిలబడనంది
తరిమే తరుణంతో పరువం తడబడుతోంది
కులికే చెలితాపం కుదురుగ నిలబడనంది
మనసే నీకోసం... ఏటికి ఎదురీదింది
మురిపెం తీరందే... నిదురను వెలివేస్తుంది
చెలరేగే చెలి వేగం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది
ఆ... ముడులేసే మనువైతే
మక్కువ మత్తుగ దిగుతుంది
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా..
కంచె దాటింది ఆత్రాల గోలా...
పెళ్ళంటూనే వేడెక్కిందే గాలీ
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
సాయం రమ్మంటూ ప్రాయం కబురంపింది
బిగిసే బంధంలో బందీ కమ్మంటోంది
సాయం రమ్మంటూ ప్రాయం కబురంపింది
బిగిసే బంధంలో బందీ కమ్మంటోంది
వీచే ప్రతిగాలీ... వయసును వేధిస్తోంది
జతగా నువ్వుంటే... పైటకు పరువుంటుంది
మితిమీరె మొగమాటం అల్లరి అల్లిక అడిగింది
ఆ... మదిలోని మమకారం
మల్లెల పల్లకి తెమ్మంది
ఆ.....
ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా..
కంచె దాటింది ఆత్రాల గోలా...
పెళ్ళంటూనే వేడెక్కిందే గా...లీ
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
2 comments:
బాలయ్య బాబు మెలోడి..
అవునండీ ఆయనపాటల్లో అరుదుగా వినిపించే మెలోడీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.