శుక్రవారం, సెప్టెంబర్ 14, 2018

అన్ని మంచి శకునములే...

శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : పింగళి
గానం :  ఘంటసాల, సుశీల 

అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
మనసున మంగళవాద్యమాహా మోగెలే....

నావలెనే నా బావ కుడా...
నాకై తపములు చేయునులే..
తపము ఫలించి నను వరియించి..
తరుణములోనె బిరాన నన్ను చేరునులే ...

అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే
మనసున మంగళవాద్యమాహా మ్రోగెలే...

అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
మనసున మంగళవాద్యమాహా మోగెనులే

కుడికన్ను అదిరే... కుడిభుజమదిరే
కోరిన చెలి నను తలచెనులే ....
చిరకాలముగా కాంచిన కలలు
నిజమౌ తరుణము వచ్చెనులే ...

అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే
మనసున మంగళవాద్యమాహా మోగెలే

మల్లెతోరణల మంటపమందె
కనులు మనసులు కలియునులే...
కలసిన మనసుల కలరవములతో..
జీవితమంతా వసంతగానమౌనులే...

అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలే...
మనసున మంగళవాద్యమాహా మోగెలే..


2 comments:

యెందుకో ఈ పాట విన్నప్పుడల్లా చాలా శుభప్రదం గా అనిపిస్తుంటుంది.

హహహహ మరి పాట అలాంటిది కదండీ :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతిగారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.