గురువారం, సెప్టెంబర్ 27, 2018

మనసిచ్చిన మారాజే...

సంక్రాంతి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సంక్రాంతి (2005)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం : ఈ.ఎస్.మూర్తి
గానం : పార్థసారధి, మురళి

సూర్యకాంతి పడి మెరిసే అరవిందమీ వదనం
వేల మెరుపులొకసారి మెరిసేటి ద్విగుణ తేజం
కోటి చందురుల చల్లదనాలు చిందే కనులు
సర్వ లోకముల పూజలు పొందే సీతారామా
పుణ్య చరిత శుభ నామా సీతామనోభిరామా

మనసిచ్చిన మారాజే మనువాడిన శుభవేళా
మరుమల్లె బుగ్గలో సిగ్గు సింధూరమాయెనే
కలలిచ్చే పల్లకిలో కదిలొచ్చే దేవతలా
మా ఇంటి దీపమై మా వదినమ్మ వచ్చెనే


అన్నయ్య మనసు తోటలో పారిజాతమై
అనురాగ పరిమళాలె పంచింది సొంతమై
పొంగే ఆనందం తెచ్చే సంతోషం
మా లోగిలి నిండెనే
వధువే బంగారం వరుడే తనసర్వం
ఇది నూరేళ్ళ బంధమే

చక్కని మా అన్నయ్యకు చిక్కిన ఈ చిలకమ్మ
వచ్చింది ఇంటికి తన జంట గూటికి
చిరునవ్వే సిరులంటూ సుగుణాలే నగలంటూ
నిలుచుంది వాకిట ఈ మందార మాలిక


సిరివెన్నెలంటి చెలిమిని మాకుపంచగా
నెలవంక ఇలకు చేరెనా చిన్న వదినగా
పొంగే ఆనందం తెచ్చే సంతోషం
మా లోగిలి నిండెనే
వధువే బంగారం వరుడే తనసర్వం
ఇది నూరేళ్ళ బంధమే
  

2 comments:

ప్యూర్ సెంటిమెంట్ సాంగ్..

:-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.