భక్తి గీతాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భక్తి గీతాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, జులై 24, 2020

లక్ష్మీం క్షీర సముద్ర...

ఈ రోజు మొదటి శ్రావణ శుక్రవారం సంధర్బంగా ఆ మహాలక్ష్మీ దేవి కరుణా కటాక్ష వీక్షణాలతో మన అందరి గృహాలూ సిరిసంపదలకు సుఖ శాంతులకు నెలవవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ శ్లోకం తలచుకుందాం. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం 

ధిమి ధిమి ధింధిమి 
ధిం ధిమి ధిం ధిమి 
దుందుభి నాద సుపూర్ణమయే, 
ఘుం ఘుం ఘుమ ఘుమ 
ఘుం ఘుమ ఘుం ఘుమ 
శంఖనినాద సువాద్యనుతే  

మహాలక్ష్మైచ విద్మహే 
విష్ణుపత్న్యైచ ధీమహి 
తన్నోలక్ష్మీ ప్రచోదయాత్. 

అన్యధా శరణం నాస్తి 
త్వమేవ శరణం మమ 
తస్మాత్కారుణ్య భావేన 
రక్ష రక్ష సురేశ్వరీ


సోమవారం, నవంబర్ 25, 2019

హరి హర పుత్రా అయ్యప్పా...

అయ్యప్ప చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అయ్యప్ప (2011)
సంగీతం : ఎస్.ఎమ్.ప్రవీణ్
సాహిత్యం :
గానం :

ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
అరుణోదయ సంకాసం
నీలకుండల ధారణం
నీలాంబర ధరం దేవం
వందేహం బ్రహ్మ నందనం
ఓ శ్రీ స్వామియె శరణమయ్యప్పా
శరణం శరాణం శరణం అయ్యప్ప

హరిహర పుత్రా అయ్యప్పా
ఆపద్భాంధవ అయ్యప్పా
నీ పద సన్నిధి చేరుటకై
ఇరుముడి కడితిమి అయ్యప్పా
మహిషి వినాశక అయ్యప్పా
మహిమలు చూపుము అయ్యప్పా
మనసున కొలువై అయ్యప్పా
మము నడిపించుము అయ్యప్పా
శబరిగిరీశా అయ్యప్పా
శుభములనొసగుము అయ్యప్ప
అడుగుల నడిపే అయ్యప్పా
అభయము నీవే అయ్యప్పా
వ్యాఘ్రాధిపతీ అయ్యప్పా
వెతలే తీర్చుము అయ్యప్పా
వెలుగును చూపే అయ్యప్పా
వేకువ కాంతివి నీవప్ప

సర్వము నీవని తలచాము
సతతము నిన్నే కొలిచేము
పూజలు నీకే చేసేము
పాపములన్నీ కడిగేమూ
ఈశ్వర తనయా అయ్యప్పా
మాహిత బంధువు నువ్వప్పా
రక్కసి నీడలు ఛేధించే
రక్షవు నువ్వయ అయ్యప్ప
భక్తిగ నిన్నే పిలిచాము
హృదయములోనే నిలిపాము
మాలలు మేమే వేశాము
మహిమలు ఎన్నో చూశాము
మణికంఠుడవే అయ్యప్పా
మమ్ముల గాచే అయ్యప్పా
మదిలో బాధలు తొలగించే
మందార ప్రియుడవు అయ్యప్పా

గమ్యము నువ్వని బ్రతుకుల్లో
మా ప్రతి గతిని నిలిపాము
దర్శన భాగ్యం పొందుటకై
నిష్టగ నినే చేరేము
శ్రీహరి సుతుడా అయ్యప్పా
సుందర రూపా అయ్యప్పా
సకలము నీవే అయ్యప్పా
శరణము నీవే అయ్యప్పా
నీ కనుచూపుల కరుణల్లో
మా హృదయాలను తడిపావు
మా మది దీపం వెలిగించి
జన్మము ధన్యము చేశావు
గణపతి సోదర అయ్యప్పా
ఘనుడవు నీవే అయ్యప్పా
జగతిని కాచే అయ్యప్పా
ప్రణతులు నీకే అయ్యప్పా

స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం 

 

శనివారం, నవంబర్ 23, 2019

కరిమలలో వెలసిన...

అయ్యప్ప చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అయ్యప్ప (2011)
సంగీతం : ఎస్.ఎమ్.ప్రవీణ్
సాహిత్యం :
గానం :

కరిమలలో వెలసిన పెన్నిధివే మా అయ్యప్పా
నియమాలకు దొరికిన సన్నిధివే మా అయ్యప్పా
కరిమలలో వెలసిన పెన్నిధివే మా అయ్యప్పా
నియమాలకు దొరికిన సన్నిధివే మా అయ్యప్పా
దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు వేదభూమిలో అవతరించితివి
నీ మాలనే ధరియింఛగా కరుణించితివా అయ్యప్పా

కరిమలలో వెలసిన పెన్నిధివే మా అయ్యప్ప
నియమాలకు దొరికిన సన్నిధివే మా అయ్యప్పా

విష్ణుతేజమూ వీరశైవమూ
ఒక్క రూపమై ఉద్భవించితివి
పందళరజుకు దత్తపుత్రుడై
ప్రజల మన్ననా పొందినావులే
తండ్రి రాజ్యమును వారసత్వముగ
తాను ఏలుటకు తల్లి ఓర్వదట
పులినే పాలను అడిగి తెమ్మనె
పులినే తెచ్చిన ఘనుడవు నీవట
సురముని వందిత హరిహరి నందన
సుమములు కూర్చుదు స్వామీ

కంఠమాలతో మణిదీపులతో
మణికంఠునిగా పేరుగాంచితివి
అరణ్యమందున బంధిపోటును
హతమార్చుటకై వెళ్ళినావట
నిన్ను చూసినా నిముషమందునే
బందిపోటులో మార్పువచ్చెనట
శరణే వేడుతు చరణం పట్టగా
కనులా గంగతో పాదం కడగగ
అడవుల వచ్చే భక్తుల రక్షణ
వరముగ ఇచ్చిన స్వామి

మహిషి మూలమున మూడు లోకములు
భాధనొందెనని బ్రహ్మ చెప్పగా
కలియుగమ్మున కలత తీర్పగా
మహిషి చంపిన మహితాత్ముడవు
మహిషి శాపము తొలగి పోవగా
లీలా వతిగా నిన్ను వలచెనట
స్వామీ ఏలుకో అనుచూ కోరగా
నీతో పెళ్ళికి ఒకటే నియమము
కన్నెస్వాములిక ఎన్నడు రారో
అదే ముహూర్తము అనెను

భక్తి భావమే మాలధారణము
బంధ విముక్తమె ముక్తి దాయకము
భూమి శయనము ఏక భుక్తము
సాధు సజ్జన నిత్య సంగమము
పాప భారమే నెత్తికెత్తెనట
కళ్ళు ముళ్ళు ఇక కాలిమెత్తలట
నెయ్యి కొబ్బరి చేరి శబరి గిరి
అభిషేకించును హరిహరానందును
జ్యోతి స్వరూపా కాంతి ప్రదీపా
వరములు కురియుము స్వామి.

కరిమలలో వెలసిన పెన్నిధివే మా అయ్యప్పా
నియమాలకు దొరికిన సన్నిధివే మా అయ్యప్పా
దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు వేదభూమిలో అవతరించితివి
నీ మాలనే ధరియింఛగా కరుణించితివా అయ్యప్పా

కరిమలలో వెలసిన పెన్నిధివే మా అయ్యప్ప
నియమాలకు దొరికిన సన్నిధివే మా అయ్యప్పా 


మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రియతమా హృదయమా...

అయ్యప్ప చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అయ్యప్ప (2011)
సంగీతం : ఎస్.ఎమ్.ప్రవీణ్
సాహిత్యం :
గానం : 

ప్రియతమా హృదయమా అయ్యప్పా
జ్యోతికీ నిలయమా అయ్యప్పా
ప్రియతమా హృదయమా అయ్యప్పా
జ్యోతికీ నిలయమా అయ్యప్పా

నీరూపే నిలువెల్ల అణువణువు నిండి
నీ వాడినైనాను చెలిమి కలిమి పొంది
కోరి కొలిచెదను చేరి నిలిచెదను
నిన్నె పిలిచెదను అయ్యప్పా..

ప్రియతమా హృదయమా అయ్యప్పా
జ్యోతికీ నిలయమా అయ్యప్పా

మనవిని వినమని కలవని
ఎదుట నిలచి నిను పిలిచా
హరుడని హరియని కలిసిన
దొరవని తలచి నినుకొలిచా
ఆదుకొనిన స్వామి
నన్నాదుకొనవు ఏమీ
చేదుకొనవ స్వామీ
ఈ భక్తుని సేద తీర్చవేమి
మది హరించుటకు
విధి వరించుటకు
నే తరించుటకు
హరిహర నందుడు
అనుగ్రహించునని
అనునయించునని
శిరసా మనసా వచసా

ప్రియతమా హృదయమా అయ్యప్పా
జ్యోతికీ నిలయమా అయ్యప్పా

చిరు చిరు నగవుల
తొలకరి కనిన ఐతి కన్నెస్వామి
మరి మరి వనముల పదములు
అలిసె తెలిసి రావేమీ
పర్వాలు వంటి పడులు
పదునెనిమిదైన వస్తా
నా గుండె గుడిని చేసి
ఇరుముడిని నేను మోసుకొస్తా
కలవరించు నను కనికరించుమని
కలత తీర్చమని కరిమల సొగసుల
కల్ప తరువుగా కరువు తీరగా
జపమా తపమా వరమా

ప్రియతమా హృదయమా అయ్యప్పా
జ్యోతికీ నిలయమా అయ్యప్పా

నీరూపే నిలువెల్ల అణువణువు నిండి
నీ వాడినైనాను చెలిమి కలిమి పొంది
కోరి కొలిచెదను చేరి నిలిచెదను
నిన్నె పిలిచెదను అయ్యప్పా..

ప్రియతమా హృదయమా అయ్యప్పా
జ్యోతికీ నిలయమా అయ్యప్పా 

 

శుక్రవారం, నవంబర్ 15, 2019

నీ రూపం కంటుంటే...

అయ్యప్ప చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.

చిత్రం : అయ్యప్ప (2011)
సంగీతం : ఎస్.ఎమ్.ప్రవీణ్
సాహిత్యం :
గానం :

నీ రూపం కంటుంటే
మౌనం గానం అయ్యే
నా ప్రాణం నీ వెంటే
నీపై ధ్యానం లోనే
వింటున్నా నీ నామం శ్వాసల్లోనే
అయ్యప్పా నీ రూపం గుండెల్లోనే
నా వెంటే ఉన్నా నీ ధ్యానంలోనే
ఈ సంతోషాలే
ఏనాడూ మనసే ఆలాపించే
ఏ గీతం నువ్వే

నీ రూపం కంటుంటే
మౌనం గానం అయ్యే
నా ప్రాణం నీ వెంటే
నీపై ధ్యానం లోనే

కాలానికే దిశనే చూపే
ఝూమువెలుగు
కన్నీళ్ళకే ఎపుడూ
తుడిచే కాంతి నగవు
నీవే కదా అయ్యప్పా
నీ అండ ఉంటే చాలయ్యా
నా సర్వమూ నీవే కదా

నడిరేయి ఆ నిశిలో
వెన్నెలలు చల్లు వరమై
జరిపించు ఈ సుడిలో
తీరాన్ని చేర్చు అలవై
నా నీడగా నడిపించు
దైవం నీవయ్యా
నా దారిలో వెలుగై రావా..

మంగళవారం, నవంబర్ 12, 2019

స్వర్ణ ప్రతిమ వలె...

స్వామి అయ్యప్ప చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : స్వామి అయ్యప్ప (1975)
సంగీతం : దేవరాజన్
సాహిత్యం : జె.జె.మాణిక్యం, విశ్వనాథం
గానం : పి.మాధురి 

స్వర్ణ ప్రతిమ వలె నటియించనా
స్వర్ణ ప్రతిమ వలె నటియించనా
నేను జగతి సమ్మోహనమ్ము గావించనా
స్వర్ణ ప్రతిమ వలె నటియించనా
నేను జగతి సమ్మోహనమ్ము గావించనా
స్వర్ణ ప్రతిమ వలె నటియించనా


మోహిని యను పేర భాసింతునూ
నవ్య మోహం డెందాల యందు రగిలింతునూ
మనసుల ప్రేమ వీణ మ్రోగింతునూ
దివ్యమైనా విలాస డోలా తేలింతునూ

స్వర్ణ ప్రతిమ వలె నటియించనా

సౌందర్యములు విరియ చరియింతునూ
అమృతానంద రాగాలా వలపింతునూ
నరుల మనస్సులను మురిపింతునూ
నాదు అవతారం ప్రాణులకు నవ సౌఖ్యమూ

ఒక స్వర్ణ ప్రతిమ వలె నటియించనా

పున్నమి వెన్నెల కన్నుల యందున పులకింపూ
మధుర సుఖమ్ములు హృదయము లందున పుష్పించూ
పున్నమి వెన్నెల కన్నుల యందున పులకింపూ
మధుర సుఖమ్ములు హృదయము లందున పుష్పించూ
హావ భావములు పుష్ప బాణములు సారించూ
దేవ కాంత యే నవ్య నాట్యములు
దివ్య లోకములె భువి ని వెలయించు

స్వర్ణ ప్రతిమ వలె నటియించనా
నా గజ్జెల రవళియె భువనాల్‌ మార్మోగే
నేనాడే నాటక మనంతమే..
నా గజ్జెల రవళియె భువనాల్‌ మార్మోగే
నేనాడే నాటక మనంతమే..
వర్షించును రాగమ్ములు మధువులు
హర్షించును ఈ ఇలలో మనసులు
నవ్వులా వలపులే విరియగ
చూపులా స్వర్గమే వెలయగ

స్వర్ణ ప్రతిమ వలె నటియించనా

దానవ ముష్కరులు తల వంచగా
కోరి దివిని మహర్షులంత దీవించగా
దానవ ముష్కరులు తల వంచగా
కోరి దివిని మహర్షులంత దీవించగా
జీవులంతా సుఖ శాంతుల తేలగా
ఈ దేవా దూత యే మహినే విలసిల్లా

స్వర్ణ ప్రతిమ వలె నటియించనా
నేను జగతి సమ్మోహనమ్ము గావించనా
స్వర్ణ ప్రతిమ వలె నటియించనా 


ఆదివారం, నవంబర్ 10, 2019

అదిగదిగో శబరి మల...

అయ్యప్ప దీక్ష చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
 

చిత్రం : అయ్యప్పదీక్ష (2006)
సంగీతం : ప్రేమ్
సాహిత్యం : సత్యారెడ్డి
గానం : నిహాల్

అదిగదిగో శబరి మల
అయ్యప్ప స్వామి ఉన్నమల
ఇదిగిదోగో పళని మల
అయ్యప్ప సోదరుడున్న మల

అదిగదిగో శబరి మల
అయ్యప్ప స్వామి ఉన్నమల
ఇదిగిదోగో పళని మల
అయ్యప్ప సోదరుడున్న మల

అదిగదిగో శబరి మల
అయ్యప్ప స్వామి ఉన్నమల
ఇదిగిదోగో పళని మల
అయ్యప్ప సోదరుడున్న మల

స్వామియే శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామియే
స్వామియే శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామియే

అదిగదిగో కైలాసము
ఇదిగిదిగో వైకుంఠము
ఆ రెండు కలసిన శబరిమల
అదియే మనకు పుణ్య మల
ఆ రెండు కలసిన శబరిమల
అదియే మనకు పుణ్య మల

స్వామియే శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామియే
స్వామియే శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామియే

అదిగదిగో పంబానది
దక్షిణ భారత గంగానదీ
అదిగదిగో పంబానది
దక్షిణ భారత గంగానదీ
ఇదిగిదిగో అళుదానది
కన్నెస్వాములకు ముఖ్యనది
ఇదిగిదిగో అళుదానది
కన్నెస్వాములకు ముఖ్యనది

స్వామియే శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామియే
స్వామియే శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామియే

అదిగదిగో సన్నిధానం
కలియుగ వరదుని పుంగావనం
అదిగదిగో సన్నిధానం
కలియుగ వరదుని పుంగావనం
ఇదిగిదిగో పదునెట్టాంబడి
భక్తిని కొలిచే కొలమానం
ఇదిగిదిగో పదునెట్టాంబడి
భక్తిని కొలిచే కొలమానం

స్వామియే శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామియే
స్వామియే శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామియే

అదిగదిగో కాంతామల
కలియుగ జ్యోతి వెలయుమల
అదిగదిగో కాంతామల
కలియుగ జ్యోతి వెలయుమల
మకర జ్యోతీ వెలయు మల
ఆ అయ్యప్ప దేవునికిష్ట మల
మకర జ్యోతీ వెలయు మల
ఆ అయ్యప్ప దేవునికిష్ట మల

స్వామి శరణం శరణం శరణం
అయ్యప్ప స్వామి శరణం
స్వామి శరణం శరణం శరణం
అయ్యప్ప స్వామి శరణం

స్వామియే శరణమయ్యప్ప



శనివారం, నవంబర్ 09, 2019

నీ మాల ధరియిస్తే...

అయ్యప్ప చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అయ్యప్ప (2011)
సంగీతం : ఎస్.ఎమ్.ప్రవీణ్
సాహిత్యం :
గానం :

నీ మాల ధరియిస్తే జయమే కదా
నిను దర్శించగా జన్మ తరియించదా
నీ శబరి కొండెక్కి వస్తానుగా
ఇక నీ సేవలో పరవశిస్తానుగా

నియమాలతో ఇక బహునిష్టతో
ఓ అయ్యప్ప నిన్నూ పూజించగా
కలలన్నియూ నెరవేరెగా
నా దీక్షలో మది పులకించగా
మాల మహిమేమిటో
మాల బలమేమిటో
భక్తి ఉప్పొంగె అల లాగా..ఆఆ..
తోడు నువ్వుండగా
కష్టమే రాదుగా
ఇక నానీడ నీవేగా ఆఆఅ..

నీలోనె దాగుంది సర్వస్వము
నీ వెనువెంట నడిచేను ఈ విశ్వము
వెతలెన్నొ చూపింది గత కాలము
మాల వేశాక కలిగింది సంతోషము
మారిందిగా ఇక నా జీవితం
ఓ అయ్యపా నువ్వు ఓ అద్భుతం
ఈ నలుబది దినములు నిష్టతో
చేస్తానుగా ఇక నీ అర్చనం.

మాల మహిమేమిటో
మాల బలమేమిటో
నన్ను మార్చింది మాలేగాఆఆ
ముళ్ళ బాటైనను పూలబాటైనది
దారి చూపింది నీవేగాఆ...

స్వామీ శరణము అయ్యప్పా శరణమూ
శబరిగిరి వాస అయ్యప్ప.. ఆఆఆ...
స్వామీ శరణము అయ్యప్పా శరణమూ
శబరిగిరి వాస అయ్యప్ప.. ఆఆఆ...
స్వామీ శరణము అయ్యప్పా శరణమూ
శబరిగిరి వాస అయ్యప్ప.. ఆఆఆ...
 

సోమవారం, అక్టోబర్ 01, 2018

అయిగిరి నందిని...

మరో పదిరోజులలో శరన్నవరాత్రులు మొదలవబోతున్నాయి కనుక విజయదశమి అయిపోయేవరకు అమ్మవారి పాటలు తలచుకుందాం. ఈ సిరీస్ ను లక్కీ చిత్రంలోని ఈ శ్లోకంతో మొదలు పెడదాం. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఓం శక్తి శక్తి పరాశక్తి ఓం శక్తి శక్తి
ఓం శక్తి ఆది పరాశక్తి ఓం శక్తి శక్తి
ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి

అయిగిరి నందిని నందిత మేదిని
విశ్వ వినోదిని నందనుతే |
గిరివర వింధ్య శిరోధిని వాసిని
విష్ణు విలాసిని జిష్ణునుతే ||

ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి  

గురువారం, సెప్టెంబర్ 17, 2015

వినాయక చవితి శుభాకాంక్షలు..

మిత్రులందరకూ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సందర్బంగా రాగం చిత్రంకోసం మణిశర్మ సంగీతంలో  బోంబే జయశ్రీ గారు గానం చేసిన ఈ అద్భుతమైన శ్లోకాన్ని తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : రాగం (2006)
సంగీతం : మణిశర్మ, అమిత్ హెరి
సాహిత్యం : ముత్తుస్వామీ దిక్షితార్
గానం : బోంబే జయశ్రీ

ఆఆఆఅ..ఆఆఆఆ....
మహా గణపతిం మనసా స్మరామి
మహా గణపతిం మనసా స్మరామి
మహా గణపతిం మనసా స్మరామి
మహా గణపతిం మనసా స్మరామి
ఆఆఆఆఅ...మహా గణపతిం మనసా స్మరామి
వశిష్ట వామ దేవాది వందిత
మహా గణపతిం...


మహా దేవ సుతం గురుగుహ నుతం
మహా దేవ సుతం గురుగుహ నుతం
మార కోటి ప్రకాశం శాంతం
మహా కావ్య నాటకాది ప్రియం
మూషిక వాహన మోదక ప్రియం

ఆఆఆఆఅ...మహా గణపతిం మనసా స్మరామి
వశిష్ట వామ దేవాది వందిత
మహా....

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

మణిశర్మ అమిత్ ల ఫ్యూజన్ విన్నారు కదా ఇపుడు 1957 లొ విడుదలైన వినాయక చవితి చిత్రం కోసం ఘంటసాల గారు గానం చేసిన ఈ చక్కని శ్లోకాలు పాట వినండి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు...



చిత్రం : వినాయక చవితి (1957)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : శ్రీ ముత్తుస్వామి దీక్షితార్
గానం : ఘంటసాల

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే
ఏకదంత ముపాస్మహే

వాతాపి గణపతిం భజే హం
వాతాపి గణపతిం భజే హం
వాతాపి గణపతిం భజే హం
వారణాస్యం వరప్రదం శ్రీ
వారణాస్యం వరప్రదం శ్రీ

వాతాపి గణపతిం భజే..ఏఏ..

భూతాది సంసేవిత చరణం
భూతభౌతికా ప్రపంచభరణం
వీత రాగిణం వినుత యోగినం
వీత రాగిణం వినుత యోగినం
విశ్వకారణం విఘ్నవారణం

వాతాపి గణపతిం భజే..ఏఏ..

పురా కుంభసంభవ మునివరా   
ప్రపూజితం త్రిభువన మధ్యగతం   
మురారీ ప్రముఖాద్యుపాస్థితం   
మూలాధారా క్షేత్రార్జితం   
పరాది చత్వారి వాగాత్మజం   
ప్రణవ స్వరూప వక్రతుండం   
నిరంతరం నిఖిల చంద్రఖండమ్   
నిజ వామకర విదృతేక్షు దండం   

కరాంబుజపాశ బీజాపూరం
కలుషవిదూరం భూతాకారం
కరాంబుజపాశ బీజాపూరం
కలుషవిదూరం భూతాకారం
హరాది గురుగుహ తోషిత బింబం   
హంసధ్వని భూషిత హేరంబం   

వాతాపి గణపతిం భజే హం
వారణాస్యం వరప్రదం శ్రీ
వాతాపి గణపతిం భజే..ఏఏ..

తొండము నేకదంతమును
తోరపుబొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలు
మెల్లనిచూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపము
కోరిన విద్యల కెల్ల నొజ్జవై
ఉండెడి పార్వతీ తనయ
ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్
గణాధిపా నీకు మ్రొక్కెదన్ ఆఆఆఅ...

మంగళవారం, మే 26, 2015

దత్తాత్రేయ త్రిమూర్తిరూప...

ఈ రోజు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి పుట్టినరోజు సందర్బంగా వారికి శుభాకాంక్షలు తెలియ జేసుకుంటూ స్వామీజీ స్వయంగా కథ, పాటలు అందించిన శ్రీ దత్త దర్శనం చిత్రంలోని పాటను ఈ రోజు తలచుకుందాం. ఎంబెడ్ చేసినది స్వామీజీ స్వయంగా గానం చేసిన భజన వీడియో. సినిమాలో ఈ పాటను ఇక్కడ చూడచ్చు టైటిల్స్ బ్యాక్ గ్రౌండ్ లో ఉపయోగించారు. 


రాగం : భైరవి
తాళం : ఆది

పల్లవి:
దత్తాత్రేయ త్రిమూర్తిరూప
త్రిభువన లోక రక్షక

చరణం:
కామధేను కల్పవృక్ష
కామిత ఫలద దాయక .....1

దండకమండలు శూలడమరుక
శంఖచక్ర శోభిత .....2

ఉత్తమ ఉత్తమ పురుషోత్తమ
పూర్ణచంద్ర ప్రకటిత ....3

భావబంధన భవభయ దూర
భక్త కరుణాసాగర ....4

కృత్తికాతారా సిద్ధానుసార
సిద్ధదూత మనోహర ...5

సహ్యాద్రివాస సచ్చిదానంద
శ్రీ గురుదత్త స్వరూప ....6


గురువారం, ఏప్రిల్ 23, 2015

భజగోవిందం భజగోవిందం...

ఈ రోజు శంకర జయంతి సంధర్బంగా జగద్గురు ఆదిశంకరన్ అనే మళయాళ చిత్రం నుండి ఏసుదాసు గారు గానం చేసిన భజగోవిందం గీతాన్ని తలచుకుందాం. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. 


చిత్రం : జగద్గురు ఆదిశంకరన్ (1977)
సంగీతం :  వి.దక్షిణామూర్తి 
సాహిత్యం : ఆదిశంకరాచార్య
గానం : ఏసుదాస్ 
 
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృఙ్కరణే

భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే

 
నారీస్తనభర నాభీదేశం
దృష్ట్వా మా గా మోహావేశమ్
నారీస్తనభర నాభీదేశం
దృష్ట్వా మా గా మోహావేశమ్
ఏతన్మాంసావసాది వికారం
ఏతన్మాంసావసాది వికారం
మనసి విచింతయ వారం వారమ్

భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే

 
నలినీదలగత జలమతితరలం
తద్వజ్జీవితమతిశయచపలమ్ .
నలినీదలగత జలమతితరలం
తద్వజ్జీవితమతిశయచపలమ్ .
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం
లోకం శోకహతం చ సమస్తమ్

భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే

 
బాలస్తావత్క్రీడాసక్తః
తరుణస్తావత్తరుణీసక్తః .
బాలస్తావత్క్రీడాసక్తః
తరుణస్తావత్తరుణీసక్తః .
వృద్ధస్తావచ్చిన్తాసక్తః
వృద్ధస్తావచ్చిన్తాసక్తః
పరే బ్రహ్మణి కోపిన సక్తః

భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే

 
జటిలో ముణ్డీ లుఞ్ఛితకేశః
కాషాయామ్బరబహుకృతవేషః .
జటిలో ముణ్డీ లుఞ్ఛితకేశః
కాషాయామ్బరబహుకృతవేషః .
పశ్యన్నపి చన పశ్యతి మూఢః
ఉదరనిమిత్తం బహుకృతవేషః

భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే

 
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనమ్ .
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనమ్ .
ఇహ సంసారే బహుదుస్తారే
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయాపారే పాహి మురారే

భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
 

సోమవారం, అక్టోబర్ 27, 2014

ఓం నమో నమో నటరాజ...

ఈరోజు పరమ పవిత్రమైన కార్తీక సోమవారం కనుక ఆ సర్వేశ్వరుడిని తలచుకొంటూ నాగుల చవితి సినిమాలోని ఈ పాట గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.


చిత్రం : నాగుల చవితి (1956)
సంగీతం : గోవర్థనం, సుదర్శనం
సాహిత్యం : పరశురాం
గానం : టి.ఎస్.భగవతి

ఓం నమఃశ్శివాయః ఓం నమఃశ్శివాయః
ఓం నమఃశ్శివాయః ఓం నమఃశ్శివాయః

ఓం నమో నమో నటరాజ నమో
హర జటాజూటధర శంభో
ఓం నమో నమో నటరాజ
నమో నమో నటరాజ

ఓం నమో నమో నటరాజ నమో
హర జటాజూటధర శంభో
ఓం నమో నమో నటరాజ
నమో నమో నటరాజ

గంగా గౌరి హృదయ విహారి
గంగా గౌరి హృదయ విహారి
లీలా కల్పిత సంసారి
లీలా కల్పిత సంసారి
గంగా గౌరి హృదయ విహారి
లీలా కల్పిత సంసారి
భళిరే భాసుర బ్రహ్మచారి
భళిరే భాసుర బ్రహ్మచారి
భావజ మద సంహారి
భావజ మద సంహారి

ఓం నమో నమో నటరాజ నమో
హర జటాజూటధర శంభో
ఓం నమో నమో నటరాజ
నమో నమో నటరాజ

ఫణిభూషా బిక్షుకవేషా
ఫణిభూషా బిక్షుకవేషా
ఈశాత్రిభువన సంచారి
ఈశాత్రిభువన సంచారి
అఖిలచరాచర అమృతకారీ
అఖిలచరాచర అమృతకారీ
హాలాహల గళధారి
హాలాహల గళధారి

ఓం నమో నమో నటరాజ నమో
హర జటాజూటధర శంభో
ఓం నమో నమో నటరాజ
నమో నమో నటరాజ

మహాదేవ జయ జయ శివశంకర
జయ శివశంకర
జయ త్రిశూలధర జయ డమరుక ధర
జయ డమరుక ధర
హే దేవాది దేవ మహేశ జయజయ శ్రీ గౌరీశా
హే దేవాది దేవ మహేశ జయజయ శ్రీ గౌరీశా
జయజయ శ్రీ గౌరీశా

ఓం నమో నమో నటరాజ
నమో హర జటాజూటధర శంభో
ఓం నమో నమో నటరాజ
నమో నమో నటరాజ
ఓం నమో నమో నటరాజ
నమో నమో నటరాజ

ఓం నమఃశ్శివాయః ఓం నమఃశ్శివాయః
ఓం నమఃశ్శివాయః ఓం నమఃశ్శివాయః


~*~*~*~*~*~*~*~*~*~*

అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమి తోపాటు నాగుల చవితి కూడా కనుక ఇదే సినిమాలోని ఈ పాట గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు


చిత్రం : నాగుల చవితి (1956)
సంగీతం : గోవర్థనం, సుదర్శనం
సాహిత్యం : పరశురాం
గానం : ఎమ్.ఎల్.వసంత కుమారి

నటరాజు తలదాల్చు నాగ దేవా
నల్లనయ్య శయ్య నీవే నాగదేవా
నటరాజు తలదాల్చు నాగ దేవా
నల్లనయ్య శయ్య నీవే నాగదేవా
నిన్ను గొల్చు వారి ప్రాపు నీవేగావా
నిన్ను గొల్చు వారి ప్రాపు నీవేగావా
నాగస్వరం ఆలపింతూ ఆడరావా
ఆడరావా నాగదేవా ఆడరావా నాగదేవా
నాగస్వరం ఆలపింతూ ఆడరావా
ఆడరావా నాగదేవా

భువనైక నాధు శివుని భూషణమీవే..ఏ..

భువనైక నాధు శివుని భూషణమీవే..ఏ..
కరుణామయి గౌరి కర కంకణము నీవే
పాలకడలి చిల్కు వేల్పు రజ్జువు నీవే
పాలకడలి చిల్కు వేల్పు రజ్జువు నీవే
రవి చంద్రుల పట్టి మ్రింగు రాహుకేతువీవే

ఆడరావా నాగదేవా ఆడరావా నాగదేవా
నాగస్వరం ఆలపింతూ ఆడరావా
ఆడరావా నాగదేవా


మంగళవారం, సెప్టెంబర్ 30, 2014

నమస్తేస్తు మహా మాయే...

ఈ రోజు అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమిచ్చే రోజు. నైవేద్యంగా రవ్వకేసరీ లేదా పెసర పునుగులు సమర్పించాలని అంటారు. నేడు 'శ్రీదేవీ మూకాంబిక' చిత్రంలోని ఈ మహాలక్ష్మి అష్టకాన్ని గుర్తు చేసుకుందామా. కన్నడలోని కొల్లుర శ్రీ మూకాంబిక అనే చిత్రానికి అనువాదమే ఈ సినిమా. ఇందులో ఈపాట చిత్రీకరణ బాగుంటుంది ముఖ్యంగా అమ్మవారిని స్థుతించే బాలవటువు అభినయంం అద్భుతం.
 

చిత్రం : శ్రీదేవీ మూకాంబిక (1993)
సంగీతం : పుహళేంది.మహదేవన్
సాహిత్యం : ఆదిశంకరాచార్య - మహాలక్ష్మి అష్టకం
గానం : హేమాంబిక/విజయలక్ష్మి 
 
నమస్తేస్తు మహామాయే
శ్రీ పీఠే సుర పూజితే
శంఖ చక్ర గదా హస్తె
మహాలక్ష్మీ నమోస్తుతే

మహాలక్ష్మీ నమోస్తుతే

నమస్తే గరుఢారుఢే
ఢోలాసుర భయంకరీ
సర్వ పాప హరే దేవి
మహాలక్ష్మీ నమోస్తుతే

మహాలక్ష్మీ నమోస్తుతే

సర్వగ్నే సర్వ వరదే
సర్వ దుష్ట భయంకరీ
సర్వగ్నే సర్వ వరదే
సర్వదుష్ట భయంకరీ
సర్వదుఖః హరే దేవి
మహాలక్ష్మీ నమోస్తుతే

సిద్ధి బుద్ధి ప్రదే దేవి
భుక్తి ముక్తి ప్రదాయిని
మంత్ర మూర్తే సదా దేవి
మహాలక్ష్మీ నమోస్తుతే

మహాలక్ష్మీ నమోస్తుతే

ఆద్యంత రహితే దేవి
ఆది శక్తీ మహేశ్వరీ
ఆద్యంత రహితే దేవి
ఆది శక్తీ మహేశ్వరీ
యోగగ్నే యోగ సంభుతే
మహాలక్ష్మీ నమోస్తుతే

స్థూలసూక్ష్మే మహారౌద్రే
మహాశక్తీ మహొదరే
మహాపాపా హరే దేవి
మహాలక్ష్మీ నమోస్తుతే

మహాలక్ష్మీ నమోస్తుతే

పద్మాసన స్థితే దేవీ
పర బ్రహ్మ స్వరూపిణీ
పద్మాసన స్థితే దేవీ
పర బ్రహ్మ స్వరూపిణీ
పరమేశ్వరి జగన్మాత 
మహాలక్ష్మీ నమోస్తుతే

మహాలక్ష్మీ నమోస్తుతే

శ్వేతాం భరధరే దేవీ
నానా లంకార భుషితే
శ్వేతాం భరధరే దేవీ
నానాలంకార భుషితే
జగత స్థితే జగన్మాత
మహా లక్ష్మీ నమోస్తుతే

మహా లక్ష్మీ నమోస్తుతే
మహా లక్ష్మీ నమోస్తుతే

శనివారం, సెప్టెంబర్ 27, 2014

శివ మనోరంజని...

శరన్నవరాత్రులలో ఈ రోజు అమ్మవారు సకల వేదస్వరూపిణి అయిన గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిస్తారు. కొబ్బరి పాయసం లేదా కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించాలని అంటారు. ఈ సందర్బంగా గాయత్రీ మాత శ్లోకాన్ని విందామా. 'రహస్యం' సినిమాలో ఎస్వీరంగారావు గారి అభినయంలో ఘంటసాల గారి గాత్రంలో ఉన్న ఈ శ్లోకం వినడానికి చూడడానికి కూడా అద్భుతంగా ఉంటుంది.


ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్చాయైర్ముఖై స్త్రీక్షణైః
యుక్తామిందునిభద్దరత్నముకుటాం తత్వార్ధవర్ణాత్మికాం
గాయత్రీం వరదా భయాంకుశ కశా శ్శుభ్రం కపాలం గదాం
శంఖంచక్రమథారవింద యుగళం హస్తైర్వహంతీం భజే
గాయత్రీం భజే...
 
~*~*~*~*~*~*~*~

అలాగే బాలమురళీకృష్ణ గారి గాత్రంలో 'శివ మనోరంజని' అనే ఈ చక్కని పాటను కూడా తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : పేదరాశి పెద్దమ్మ కథ (1968)
సంగీతం : ఎస్పీ కోదండపాణి
సాహిత్యం : చిల్లర భావనారాయణరావు 
గానం : బాలమురళీ కృష్ణ గారు 
 
శివ మనోరంజని 
వరపాణీ సర్వరాణీ 
కనవే జననీ కృప బూనీ
 ఆఆఆఆఆ....
శివ మనోరంజని 
వరపాణీ సర్వరాణీ 
కనవే జననీ కృప బూనీ

కవికే కనరాని కాంతివి నీవై 
కవికే కనరాని కాంతివి నీవై 

శ్రుతిలో లయగా సాగే సతివై 
శ్రుతిలో లయగా సాగే సతివై 
అభినయ శిల్పాల అలరే కళవై 
 అభినయ శిల్పాల అలరే కళవై 
సరస రసిక జన హృదయ కమలముల 
వెలుగు కిరణముగ తళుకులొలికితివి 

శివ మనోరంజని  

మెరసే జలదాల మేదుర నాదం
మెరసే జలదాల మేదుర నాదం 
రథమయ్యెను రారమ్మా అమ్మా అమ్మా
మెరసే జలదాల మేదుర నాదం 
రథమయ్యెను రారమ్మా అమ్మా అమ్మా

సలలిత గాంధర్వ వరగానమునా 
సలలిత గాంధర్వ వరగానమునా 

రజితగిరి శిఖరి చలన
చరణ ఝణ ఝణిత ప్రణవ 
నటనముల సలుపుమిట 

శివ మనోరంజని 
శివ మనోరంజని
 శివ మనోరంజని 
 

గురువారం, సెప్టెంబర్ 25, 2014

అంబికా నర్తనం...

ఈ రోజు నుండి నవరాత్రులు మొదలవుతున్నాయి కదా ఈ తొమ్మిది రోజులు దేవీ అవతారాలను తలచుకుంటూ అందుకు సంబంధించిన పాటలను గుర్తు చేసుకుందామా... మిత్రులందరకూ శరన్నవరాత్రి శుభాభినందనలు. నేడు మొదటి రోజు స్వర్ణకవచాలంకృతా దేవి అవతారం. ఆ దేవికి కనకకవచాన్ని అలంకరించి కట్టు పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పించి పూజించే రోజు. ఈరోజు పరాశక్తి మహిమలు సినిమాలోని అంబికా నర్తనం అనే ఈ పాటను గుర్తు చేసుకుందాం. శ్రావ్యమైన సంగీతంతో చక్కని చిత్రీకరణతో కూడిన ఈ పాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. 



చిత్రం : పరాశక్తి మహిమలు (1972) 
సంగీతం : టి.కె.రామమూర్తి, చక్రవర్తి
సాహిత్యం : ఏ.ఎస్.రావు
గానం : పి.సుశీల 

అంబికా నర్తనం.. అంబికా నర్తనం 
శాంతం ప్రళయం నటించూ తల్లి 
భవ్య మూర్తి కాదా... 

అంబికా నర్తనం శాంతం ప్రళయం
నటించు తల్లి భవ్య మూర్తి కాదా
అంబికా నర్తనం...

మేఘాల మాలికలు కురులాడును 
పూ తీగ వలె కౌను చలియించును 
మేఘాల మాలికలు కురులాడును 
పూ తీగ వలె కౌను చలియించును
వింతగ మెరుపల్లె నూలాడును 
వింతగ మెరుపల్లె నూలాడును
నర్తించు అంబతో.. నర్తించు అంబతో
లోకాలు పాడుచు ఆడుచు నటించు

అంబికా నర్తనం శాంతం ప్రళయం
నర్తించు తల్లి భవ్య మూర్తి కాదా
అంబికా నర్తనం 

చందన కుంభాల్రెండు చెండ్లాడును 
చంద్రులు కన్నులు రెండు వెలుగొందును 
చందన కుంభాల్రెండు చెండ్లాడును 
చంద్రులు కన్నులు రెండు వెలుగొందును
సుందర ముఖం ఎదల మురిపించును
సుందర ముఖం ఎదల మురిపించును 
ఎవ్వరు బాధలో కుమిలినా 
దేవియే సుఖములు కురియులే
ఎవ్వరు పదముల వ్రాలినా 
దేవియే బ్రోచులే కాచులే
మాతను పూజించి తరియించు జగములు 
అంబయే ఇచ్చును కోరిన వరములు 
మరులకు సురలకు దర్శనం 
నిత్యము జీవనం నాకు 

అంబికా నర్తనం శాంతం ప్రళయం
నటించు తల్లి భవ్య మూర్తి కాదా
అంబికా నర్తనం 

మంగళవారం, సెప్టెంబర్ 16, 2014

గోపాల కృష్ణుడు నల్లనా...

ఈ రోజు వైష్ణవ సంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ సందర్బంగా మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కన్నయ్య పాటను తలచుకుందామా. రావుబాలసరస్వతి గారు పాడిన ఈపాట చాలా చాలా బాగుంటుంది. ఈ క్రింది ప్లగిన్ లోడ్ అవకపోతే ఈపాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : రాధిక (1947) 
సంగీతం : సాలూరి హనుమంతరావు
సాహిత్యం : సదాశివబ్రహ్మం గారు
గానం : రావు బాలసరస్వతి 

గోపాల కృష్ణుడు నల్లనా
గోకులములో పాలు తెల్లనా
కాళిందిలో నీళ్ళు చల్లన 
పాట పాడవేమే గుండె ఝల్లనా

గోపాల కృష్ణుడు నల్లనా
గోకులములో పాలు తెల్లనా
కాళిందిలో నీళ్ళు చల్లన 
పాట పాడవేమే గుండె ఝల్లనా

గోపాల కృష్ణుడు నల్లనా 

మా చిన్ని కృష్ణయ్య లీలలూ 
ఆఆఅ..ఆఆఅ..ఆఆఆఆఆఅ...
మా చిన్ని కృష్ణయ్య లీలలూ
మంజులమగు మురళి యీలలూ 
మా కీర శారికల గోలలూ 
మాకు ఆనంద వారాశి ఓలలూ 
మాకు ఆనంద వారాశి ఓలలూ 

గోపాల కృష్ణుడు నల్లనా 

మాముద్దు కృష్ణుని మాటలు 
మరువరాని తేనె తేటలు 
మాముద్దు కృష్ణుని మాటలు 
మరువరాని తేనె తేటలు
మా పూర్వ పుణ్యాల మూటలూ 
మమ్ము దరిజేర్చు తిన్నని బాటలూ
మమ్ము దరిజేర్చు తిన్నని బాటలూ
 
గోపాల కృష్ణుడు నల్లనా
గోకులములో పాలు తెల్లనా
కాళిందిలో నీళ్ళు చల్లన 
పాట పాడవేమే గుండె ఝల్లనా

గోపాల కృష్ణుడు నల్లనా 

~*~*~*~*~*~*~*~*~*~

అలాగే ఈ చక్కని యానిమేషన్ ని కూడా చూసి ఆ కన్నయ్యలీలలను మనసారా మరోసారి తలచుకుందాం.


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.