గురువారం, సెప్టెంబర్ 25, 2014

అంబికా నర్తనం...

ఈ రోజు నుండి నవరాత్రులు మొదలవుతున్నాయి కదా ఈ తొమ్మిది రోజులు దేవీ అవతారాలను తలచుకుంటూ అందుకు సంబంధించిన పాటలను గుర్తు చేసుకుందామా... మిత్రులందరకూ శరన్నవరాత్రి శుభాభినందనలు. నేడు మొదటి రోజు స్వర్ణకవచాలంకృతా దేవి అవతారం. ఆ దేవికి కనకకవచాన్ని అలంకరించి కట్టు పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పించి పూజించే రోజు. ఈరోజు పరాశక్తి మహిమలు సినిమాలోని అంబికా నర్తనం అనే ఈ పాటను గుర్తు చేసుకుందాం. శ్రావ్యమైన సంగీతంతో చక్కని చిత్రీకరణతో కూడిన ఈ పాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : పరాశక్తి మహిమలు (1972) 
సంగీతం : టి.కె.రామమూర్తి, చక్రవర్తి
సాహిత్యం : ఏ.ఎస్.రావు
గానం : పి.సుశీల 

అంబికా నర్తనం.. అంబికా నర్తనం 
శాంతం ప్రళయం నటించూ తల్లి 
భవ్య మూర్తి కాదా... 

అంబికా నర్తనం శాంతం ప్రళయం
నటించు తల్లి భవ్య మూర్తి కాదా
అంబికా నర్తనం...

మేఘాల మాలికలు కురులాడును 
పూ తీగ వలె కౌను చలియించును 
మేఘాల మాలికలు కురులాడును 
పూ తీగ వలె కౌను చలియించును
వింతగ మెరుపల్లె నూలాడును 
వింతగ మెరుపల్లె నూలాడును
నర్తించు అంబతో.. నర్తించు అంబతో
లోకాలు పాడుచు ఆడుచు నటించు

అంబికా నర్తనం శాంతం ప్రళయం
నర్తించు తల్లి భవ్య మూర్తి కాదా
అంబికా నర్తనం 

చందన కుంభాల్రెండు చెండ్లాడును 
చంద్రులు కన్నులు రెండు వెలుగొందును 
చందన కుంభాల్రెండు చెండ్లాడును 
చంద్రులు కన్నులు రెండు వెలుగొందును
సుందర ముఖం ఎదల మురిపించును
సుందర ముఖం ఎదల మురిపించును 
ఎవ్వరు బాధలో కుమిలినా 
దేవియే సుఖములు కురియులే
ఎవ్వరు పదముల వ్రాలినా 
దేవియే బ్రోచులే కాచులే
మాతను పూజించి తరియించు జగములు 
అంబయే ఇచ్చును కోరిన వరములు 
మరులకు సురలకు దర్శనం 
నిత్యము జీవనం నాకు 

అంబికా నర్తనం శాంతం ప్రళయం
నటించు తల్లి భవ్య మూర్తి కాదా
అంబికా నర్తనం 

2 comments:

ఆహా..అమ్మవారి పాటలు తొమ్మిది రోజులూ వేశారా..ఇదీ ఒకరకం అర్చనేనండీ..లేట్ గానే అయినా అందుకోండి అభినందనలు..

చాలా సంతోషం శాంతి గారు లేట్ గా అయినా లేటెస్ట్ గా చెప్పారనమాట థాంక్స్ ఎ లాట్ :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.