ఇటీవల విడుదలైన ఊహలు గుసగుసలాడే సినిమాలోని ఈ పాట నాకు చాలా నచ్చింది అందమైన సాహిత్యం దానికి తగిన సంగీతం వీటికి పోటీ పడుతూ తీసిన చిత్రీకరణ అన్నీ కలిసి ఒక మంచి అనుభూతినిచ్చిన పాట. ఈకాలంలో అరుదుగా వినిపించే ఇలాంటి మెలోడీనీ మీరూ వినీ చూసీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ఊహలు గుసగుసలాడే (2014)
సంగీతం : కళ్యాణి కోడురి
సాహిత్యం : అనంత్ శ్రీరాం
గానం : కళ్యాణి కోడూరి, సునీత
ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే
ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లు ఇచ్చింది
ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే
ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే
ఆనందాలు పెంచింది
నిమిషము నేల మీద నిలువని గాలి లాగ
నిమిషము నేల మీద నిలువని గాలి లాగ
మది నిను చేరుతోందె చిలకా
తనకొక తోడు లాగ వెనకనె సాగుతోంది
తనకొక తోడు లాగ వెనకనె సాగుతోంది
హృదయము రాసుకున్న లేఖా.ఆఅ..
ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే
ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లు ఇచ్చింది
వెన్నెల్లో ఉన్నా.. వెచ్చంగా ఉంది..
నిన్నే ఊహిస్తుంటే
నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా.. ఏదోలా ఉంది..
నువ్వే గుర్తొస్తుంటే
నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాపి జల్లి
ఓ ముగ్గేసి వెళ్లావే
నిదురిక రాదు అన్న నిజముని మోసుకుంటు
నువ్వే గుర్తొస్తుంటే
నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాపి జల్లి
ఓ ముగ్గేసి వెళ్లావే
నిదురిక రాదు అన్న నిజముని మోసుకుంటు
మది నిను చేరుతుందె చిలకా
తనకొక తోడు లాగ వెనకనె సాగుతుంది
తనకొక తోడు లాగ వెనకనె సాగుతుంది
హృదయము రాసుకున్న లేఖా..ఆఅ..
వెన్నెల్లో ఉన్నా.. వెచ్చంగా ఉంది..
నిన్నే ఊహిస్తుంటే
నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా.. ఏదోలా ఉంది..
నువ్వే గుర్తొస్తుంటే
నువ్వే గుర్తొస్తుంటే
నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్ళి
కూ అంటూంది విన్నావా
నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు
నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు
పూయిస్తే చాలన్నావా
ఏమౌతున్నా గానీ ఏమైనా ఐపోనీ
ఏమౌతున్నా గానీ ఏమైనా ఐపోనీ
ఏం ఫరవాలేదన్నావా
అడుగులు వెయ్యలేక అటు ఇటు తేల్చుకోక
సతమతమైన గుండె గనుక
అడిగిన దానికింక బదులిక పంపుతుంది
అడిగిన దానికింక బదులిక పంపుతుంది
పదములు లేని మౌన లేఖా..ఆఆ...
మ్.. మ్.. మ్.. మ్.. మ్.. మ్..
మ్.. మ్.. మ్.. మ్.. మ్.. మ్..
2 comments:
ఈ మధ్య టీవి లో వస్తే మీ రికమండేషన్ కూడా స్ట్రాంగ్ గా ఉండబట్టి ఈ మూవీ చూశానండీ..నిజంగా చాలా నచ్చింది..థాంక్యూ..
సినిమా నచ్చిందని చెప్పినందుకు సంతోషం శాంతి గారు. థాంక్స్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.