శనివారం, సెప్టెంబర్ 13, 2014

మల్లెకన్న తెల్లన...

విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన 'ఓ సీత కథ' సినిమాలోని ఈ చక్కని యుగళ గీతం పెళ్ళి గురించి కమ్మని కలలు కంటున్న ఇద్దరు ప్రేమికుల ఊహలను అందంగా చూపెడుతుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఓ సీత కథ (1974) 
సంగీతం : కె.వి.మహదేవన్ 
సాహిత్యం : సినారె 
గానం : బాలు, సుశీల 

మల్లెకన్న తెల్లన మా సీత సొగసు
వెన్నెలంత చల్లన మా సీత సొగసు
ఏది ఏది ఏది
తేనె కన్న తీయన మా బావ మనసు
తెలుగంత కమ్మన మా బావ మనసు

నన్ను పిలిచి అత్తమ్మ అడగాలి..
నన్ను పిలిచి అత్తమ్మ అడగాలి..
ఏమని
కన్నె సీత కలలన్నీ పండేది ఎపుడని
కన్నె సీత కలలన్నీ పండేది ఎపుడని
నీతోనే ఒక మాట..
నీతోనే ఒక మాట చెప్పాలి..
ఏమని
నీ తోడే లేకుంటే ఈ సీతే లేదని

మల్లెకన్న తెల్లన మా సీత సొగసు
తేనె కన్న తీయన మా బావ మనసు
 
మనసుంది ఎందుకని 
మమతకు గుడిగా మారాలని
వలపుంది ఎందుకని 
ఆ గుడిలో దివ్వెగా నిలవాలని
ఆఆఅ.. మనసుంది ఎందుకని 
మమతకు గుడిగా మారాలని
వలపుంది ఎందుకని 
ఆ గుడిలో దివ్వెగా నిలవాలని

ఆఆఅ మనువుంది ఎందుకని 
ఆ దివ్వెకు వెలుగై పోవాలని
బ్రతుకుంది ఎందుకని 
ఆ వెలుగే నీవుగా చూడాలని
ఆ వెలుగే నీవుగా చూడాలని

మల్లెకన్న తెల్లన.. మ్.మ్.హుహు
తేనె కన్న తీయన... మ్మ్..మ్.హుహు

2 comments:

స్వచ్చమైన పాలనురుగులాంటి మనసున్న మల్లి పాట..మంచి పాట..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.