సోమవారం, సెప్టెంబర్ 22, 2014

ఏమిటిది ఏమిటిది...

బాలు గారు స్వరపరచిన అతికొద్ది సినిమాలలో ఒకటైన "తూర్పు వెళ్ళే రైలు" లో ఒక అందమైన మెలోడీ ఈ రోజు మీకోసం. ఈ సినిమాలో పాటలన్నీ బాగుంటాయి. వాటిలో ప్రత్యేకించి ఈ పాటను సుశీల గారు పాడిన విధానం అద్భుతం. టీనేజ్ లో ఈ పాట వినడం ఒక మధురమైన అనుభూతి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : తూర్పు వెళ్ళే రైలు (1979) 
సంగీతం : బాలు 
సాహిత్యం : ఆరుద్ర 
గానం : సుశీల 
 
ఏమిటిది ఏమిటిదీ ? 
ఏదో తెలియనిదీ.. 
ఎప్పుడూ కలగనిది ఏమిటిది ?
ఏమిటిదీ ? 
ఏమిటిది ఏమిటిదీ ? 
ఏదో తెలియనిది..
ఎప్పుడూ కలగనిది ఏమిటిది ?
ఏమిటిదీ ?

హత్తు కున్న మెత్తదనం 
కొత్త కొత్తగా ఉంది..
మనసంతా మత్తు కమ్మి 
మంతరించినట్లుంది..
నరనరాన మెరుపు తీగె 
నాట్యం చేసేస్తోంది..
నాలో ఒక పూల తేనె నదిలా 
పొంగుతోంది పొంగుతోంది...

ఏమిటిదీ.. ? 
ఏమిటిది ఏమిటిదీ ?

ఈడు జోడు కుదిరింది..
తోడు నీడ దొరికింది..
అందానికి ఈనాడే 
అర్ధం తెలిసొచ్చింది..
పెదవి వెనక చిరునవ్వు 
దోబూచులాడింది..
చిలిపి చిలిపి తలపు 
తలచి సిగ్గు ముంచుకొస్తోంది..

ఏమిటిదీ.. ? 
ఏమిటిది ఏమిటిదీ ?
ఏదో తెలియనిది.. 
ఎప్పుడూ కలగనిది
కలకానిదీ..
ఏమిటిదీ ? 

2 comments:

ఈ పాటలో యేదో మాజిక్ వుందండీ..యెప్పుడు విన్నా మరిచిపోయాననుకున్న యెన్నో సంగతులు మేమున్నామంటూ స్మృతి పధంలో మెదులుతుంటాయి..

ఓహ్ ఇంట్రస్టింగ్ టు నో దట్ శాంతి గారు... థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.