గురువారం, సెప్టెంబర్ 18, 2014

సరిగమలు గలగలలు...

ఈ బ్లాగ్ పేరుకి ప్రేరణగా నిలచిన పాటని నేనింతవరకూ పోస్ట్ చేయలేదని చూసుకుని ఆశ్చర్యపోయాను. బాలచందర్ గారి సినిమాల్లో ఎమ్మెస్ విశ్వనాథన్ గారు స్వరపరచే అన్నిపాటలు బాగుంటాయి. నాకు చాలా ఇష్టమైన ఈ పాటను మీరూ మరోసారి తలచుకోండి. ఈ పాట వీడియో చూడాలంటే ఇక్కడ చూడవచ్చు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఇది కథ కాదు (1979)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల

సరిగమలూ గలగలలు.. 
సరిగమలూ గలగలలు
ప్రియుడే సంగీతము.. 
ప్రియురాలె నాట్యము
చెలికాలి మువ్వల గల గలలూ 
చెలి కాలి మువ్వల గల గలలూ
చెలికాని మురళిలో...
సరిగమలూ గలగలలు.. 
సరిగమలూ గలగలలు 
 
ఆవేశమున్నది ప్రతి కళలో
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో
ఆవేశమున్నది ప్రతి కళలో
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో

కదిలీ కదలక కదిలించు కదలికలు
కదిలీ కదలక కదిలించు కదలికలు
గంగా తరంగాల శృంగార డోలికలు

సరిగమలూ గలగలలు.. 
సరిగమలు గలగలలు
ప్రియుడే సంగీతము.. 
ప్రియురాలె నాట్యము

హృదయాలు కలవాలి ఒక శృతిలో
బ్రతుకులు నడవాలి ఒక లయలో
 
శృతిలయలొకటైన అనురాగ రాగాలు
జతులై జతలైన నవరస భావాలు

సరిగమలూ గలగలలు...  
సరిగమలూ గలగలలు

నయనాలు కలిశాయి ఒక చూపులో  
నాట్యాలు చేశాయి నీ రూపులో
నయనాలు కలిశాయి ఒక చూపులో  
నాట్యాలు చేశాయి నీ రూపులో
రాధనై పలకనీ నీ మురళి రవళిలో  
పాదమై కదలనీ నీ నాట్య సరళిలో

సరిగమలు గలగలలు...
ప్రియుడే సంగీతము.. 
ప్రియురాలె నాట్యము

ఆహా.. అహహా.. ఆహా.. అహహా 
ఆహా.. అహహా.. ఆహా.. అహహా 
ఆహా.. అహహా.. ఆహా.. అహహా 
ఆహా.. అహహా.. ఆహా.. అహహా


4 comments:

మీ బ్లాగ్ పేరున్న పాట ఈ పాటవ్వడం..అదీ మా అభిమాన డైరెక్టర్ బాలచందర్ గారి మూవీ లోది అవ్వడం..చాలా సంతోషం గా వుందండి..

నమస్తే "వేణూ శ్రీకాంత్" గారూ..
మీ బ్లాగ్ "సరిగమల గలగలలు" నా బ్లాగ్ "సరిగమలు ... గలగలలు" .. మీరు నమ్మినా నమ్మకపోయినా నా బ్లాగు పేరుకి ప్రేరణ కూడా ఈ పాటే.. ఈ పాట నాకు ఇష్టం కంటే కూడా ఎక్కువే..


నా బ్లాగు మొదలు పెట్టినప్పుడు మీ బ్లాగ్ గురించి కూడా నాకు తెలియదు .. "నెమలికన్ను" బ్లాగ్ మురళి గారు చెప్పే దాకా ... ఎప్పుడైనా అనిపిస్తుంది మీ బ్లాగ్ పేరు నేను కావాలని కాపీ చేశానని అనుకుంటారేమో అని, కానీ నాకు నిజంగా తెలియదు ..

ఇప్పుడు ఈ పాట చూసి మీకు ఈ విషయం చెప్పాలనిపించింది .. అన్యధా భావించరనుకుంటాను .. అన్నట్లు మేము కూడా గుంటూరు జిల్లా వాళ్ళమేనండి :)

నమస్తే రాజ్యలక్ష్మి గారు...
అయ్యో అందులో నమ్మకపోవడానికి ఏముందండీ ఈ పాట ప్రేరణతో ఇంకా బ్లాగులు ఉండే ఉంటాయి. నేనలా మీరు కాపీ కొట్టి ఉంటారు అని అస్సలు అనుకోలేదండీ... ఇది కూడా పాట ఇచ్చిన ఐడియానే తప్ప నా సొంతం కాదుకదండీ... టేకిటీజీ :-) మీ బ్లాగ్ నేను కూడా తరచూ చూస్తుంటానండీ మంచి పాటలు పోస్ట్ చేస్తుంటారు. కీపిటప్.. మీరూ గుంటూరు జిల్లా వాస్తవ్యులని తెలుసుకోవడం సంతోషం :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.