మంచుపల్లకి సినిమా కోసం జానకి గారు పాడిన ఒక అందమైన పాట ఈరోజు మీకోసం... రాజన్-నాగేంద్ర గార్ల సంగీతం జానకి గారి గళం ఈ పాటని మర్చిపోలేకుండా చేస్తాయి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : మంచుపల్లకి (1982)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : జానకి
మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
మెరిసినా.. కురిసినా .. కరుగు నీ జీవనం
మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
మెరిసినా కురిసినా .. కరుగునీ ..
మెరిసినా కురిసినా కరుగు నీ జీవనం
మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
మెరిసినా కురిసినా .. కరుగునీ ..
మెరిసినా కురిసినా కరుగు నీ జీవనం
మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
మెరుపులతో పాటు ఉరుములుగా..
దని రిస రిమ దని స దని ప గ
మూగబోయే జీవస్వరములుగా
వేకువ ఝామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిట ముగ్గులుగా..
ఆ.. ఆ.. ఆ.. ఆ..
స్మృతిలో మిగిలే నవ్వులుగా..
వేసవిలో మంచు పల్లకిగా..
మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
మెరిసినా.. కురిసినా .. కరుగు నీ జీవనం
మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
పెనుగాలికి పెళ్ళి చూపు..
పువ్వు రాలిన వేళా కల్యాణం..
అందాకా ఆరాటం .. ఆశలతో పేరంటం
నాకొక పూమాల తేవాలి నువ్వు
నాకొక పూమాల తేవాలి నువ్వు
అది ఎందుకో ... ఓ.. ఓ.. ఓ.. ఓ..
మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
మెరిసినా.. కురిసినా .. కరుగు నీ జీవనం
మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
6 comments:
ఇందులోని 'జీవనం 'అనేపదానికిరెండు అర్థాలు ఉన్నాయి.'బతుకు ' అనే అర్థం దేహానికి, ' నీళ్ళు 'అనే అర్థం మేఘానికి వర్తిస్తాయి.
థాంక్స్ కమనీయం గారు.. మంచి విషయం చెప్పారు.
శ్రీరామ్ గారు ఈ పాటలో కనిపించే కొండ గురించి మీరు ఒక కామెంట్ రాసినట్లుగా గుర్తు కానీ ఇపుడు ఆ కామెంట్ డిలీట్ చేసినట్లు చూపిస్తుంది.. ఎందుకనండీ?
యెప్పుడు ముగిసి పోతుందో తెలియని అమ్మాయి జీవితాన్ని మెరిసి మాయమయ్యే మేఘం తో పోల్చడం వేటూరిగారికే చెల్లింది..
అవును శాంతి గారు.. వేటూరి గారు మహానుభావులు. థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.