మంగళవారం, సెప్టెంబర్ 09, 2014

నా హృదయం తెల్లకాగితం...

చక్రవర్తి గారి సంగీత సారధ్యంలో ఒక చక్కని పాట ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ప్రేమతరంగాలు (1980)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, సుశీల

నా హృదయం తెల్లకాగితం
అది ఏనాడో నీకు అంకితం.
నా హృదయం తెల్లకాగితం
అది ఏనాడో నీకు అంకితం.
బేషరతుగా ఇచ్చేశా ప్రేమ పత్రమూ..
ఏమైనా రాసుకో నీ ఇష్టమూ..
నా హృదయం తెల్లకాగితం
అది ఏనాడో నీకు అంకితం.

మెరుపై మెరిశావు చినుకై కురిశావు
చిగురులు వేశావు నాలో..
చల్లగా వచ్చావు వెచ్చగా మారావు
పచ్చగా మిగిలావు నాలో..
అల చిన్నారివి ఇక వయ్యారివి
ఆ నెయ్యానివి ఇక వియ్యానివి
ఆ కలుసుకున్నాము నేడు
మన కథ రాసుకున్నాము రేపు

నా హృదయం తెల్లకాగితం
అది ఏనాడో నీకు అంకితం.
బేషరతుగా ఇచ్చేశా ప్రేమ పత్రమూ..
ఏమైనా రాసుకో నీ ఇష్టమూ..
నా హృదయం తెల్లకాగితం
అది ఏనాడో నీకు అంకితం.
 
పూచిన జాబిల్లి పున్నమి సిరిమల్లి 
నాకిక నెచ్చెలివి నీవే.. 
పొంగే గోదారి పూవుల రాదారి 
నాకిక సహచారివి నీవే..
నా కలవాణివి ఇక కళ్యాణివి 
అల నెలరాజువి ఇక నా రాజువీ 
ఆఆ కలసి పోయాము మనమూ 
ఇక కలబోసుకుందాము సుఖమూ..

నా హృదయం తెల్లకాగితం
అది ఏనాడో నీకు అంకితం.
బేషరతుగా ఇచ్చేశా ప్రేమ పత్రమూ..
ఏమైనా రాసుకో నీ ఇష్టమూ..
నా హృదయం తెల్లకాగితం
అది ఏనాడో నీకు అంకితం.

2 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.