సోమవారం, సెప్టెంబర్ 01, 2014

ఒకే మనసు రెండు రూపాలుగా...

ప్రాణమిత్రులు అన్న పదం తలచుకున్న వెంటనే గుర్తొచ్చే పేర్లు బాపు-రమణ గార్లవి. వారు కడదాకా కలసి ఉండే ఇలాంటి ఒక అపురూప స్నేహం కూడా ఒకటి ఉంటుంది అని తెలుగు జాతికే కాక ప్రపంచానికంతటికి చాటి చెప్పి ఒక రోల్ మోడల్ గా నిలిచిన మిత్రులు. తన ప్రాణమిత్రుడు రమణ గారిని కలుసుకోవడానికి నిన్న(31-8-2014) దివికేగిన బాపు గారికి అశ్రునివాళి అర్పిస్తూ ఒకే మనసు రెండు రూపాలుగా మసలిన బాపు-రమణ గార్ల కోసం ఈ పాట. క్రింది ప్లగిన్ లోడ్ అవ్వకపోతే ఈ పాట ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : సూర్య చంద్రులు (1978) 
సంగీతం : రమేష్ నాయుడు 
సాహిత్యం : సినారె
గానం : బాలు, చిత్తరంజన్

అహా..ఓహో.. ఎహే..ఆహఅహ్హాహా.. 
ఒకే మనసు రెండు రూపాలుగా 
ఒకే ఊపిరి రెండు హృదయాలుగా 
అల్లుకున్న అనుబంధం అదే అదే మన బంధం.
అల్లుకున్న అనుబంధం అదే అదే మన బంధం.

ఒకే మనసు రెండు రూపాలుగా 
ఒకే ఊపిరి రెండు హృదయాలుగా 
 
అహా ఉహూ ఏహే.. 
ఉన్నమనసు ఒకటైతే 
పెళ్ళైతే ఎవరికిస్తావు 
సగమే నా శ్రీమతికీ..
మరో సగం నీకిస్తాను.. 
ఆహాహహ..ఓహొహ్హోహో..
మరణమే నన్ను రమ్మంటే 
మరి నీవేమంటావవు 
మరణమైనా జీవనమైనా 
చెరిసగమంటాను.. 

ఒకే మనసు రెండు రూపాలుగా 
ఒకే ఊపిరి రెండు హృదయాలుగా

మరో జన్మ మనకుంటే 
ఏ వరం కోరుకుంటావు 
ఒకే తల్లి కడుపు పంటగా 
ఉదయించాలంటాను 
ఆహాహ్హహా.. ఓహహోహో..
అన్న దమ్ములుగ జన్మిస్తే 
అది చాలదు చాలదు అంటాను 
కవలలుగా జన్మించే జన్మ 
కావాలి కావాలి అంటాను 
  
ఒకే మనసు రెండు రూపాలుగా 
ఒకే ఊపిరి రెండు హృదయాలుగా

2 comments:

స్నేహానికి మధురమైన నిర్వచనం బాపూ రమణగార్లే..ఇది అందరికీ తెలిసినదే..ఎట్లీస్ట్ కొంతమందైనా వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే..స్నేహమంటే అవసరార్ధం చేసేది అనే ఆలోచనకి అర్ధం మారుతుందేమో..

అవును శాంతి గారు.. బాగా చెప్పారు. థాంక్స్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.