శనివారం, సెప్టెంబర్ 06, 2014

అదిగో నవలోకం...

ఈరోజు మీకు వినిపించబోయే పాట వీరాభిమన్యు చిత్రం కోసం ఆరుద్ర గారు రాయగా కె.వి.మహదేవన్ గారు స్వరపరచిన ఒక మధురగీతం. నాకు ఇష్టమైన ఈ పాట మీరూ విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : వీరాభిమన్యు (1965)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల, సుశీల

అదిగో నవలోకం  వెలసే మనకోసం
ఆహాహ్హహహ..ఆఅ..ఓహో.హోఓ.హో..
అదిగో నవలోకం  వెలసే మనకోసం
అదిగో నవలోకం  వెలసే మనకోసం

నీలి నీలి మేఘాల లీనమై
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
నీలి నీలి మేఘాల లీనమై ..
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోర వలపు సీమలో ఆగుదాం
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోర వలపు సీమలో ఆగుదాం
ఎచట సుఖముందో ఎచట సుధ కలదో
అచటె మనముందామా
 
అదిగో నవలోకం వెలసే మనకోసం

పారిజాత సుమదళాల పానుపు
మనకు పరిచినాడు చెఱకు వింటి వేలుపు
పారిజాత సుమదళాల పానుపు
మనకు పరిచినాడు చెఱకు వింటి వేలుపు
ఫలించె కోటి మురిపాలు ముద్దులు
మన ప్రణయానికి లేవుసుమా హద్దులు
ఫలించె కోటి మురిపాలు ముద్దులు
మన ప్రణయానికి లేవుసుమా హద్దులు
ఎచట హృదయాలు ఎపుడూ విడిపోవో
అచటె మనముందామా
 
అదిగో నవలోకం వెలసే మనకోసం
అదిగో నవలోకం వెలసే మనకోసం
 

2 comments:


చిన్నప్పుడు ఇది నాకూ, మా అక్కకీ చాలా ఫేవరెట్ సాంగ్ వేణూజీ..లిరిక్స్ బుక్ లో రాసుకుని హై ఫీలింగ్ తో పాడేసుకునేవాళ్లం..మళ్ళా ఆ రోజులు గురుతు చేసినందుకు ధాంక్యూ..

మీ జ్ఞాపకాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు శాంతి గారు :)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.