చక్రవర్తి గారు స్వరపరచిన కొన్ని పాటలను గాయనీ గాయకులు కష్టపడి పాడుతున్నట్లుగా కాక ఇష్టపడి అలవోకగా అల్లరిగా పాడేసి ఒక అందమైన అనుభూతిని శ్రోతల పరం చేస్తారు. అలాంటి పాటలలో 'గోపాల్రావుగారి అమ్మాయి' సినిమాలోని ఈ చక్కని ప్రేమగీతం ఒకటి. నాకు నచ్చిన ఈ పాటను మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : గోపాలరావు గారి అమ్మాయి (1980)
సంగీతం: చక్రవర్తి
రచన : మైలవరపు గోపి
గానం: ఎం.రమేష్, పి.సుశీల
వస్తావు కలలోకీ..రానంటావు కౌగిలికీ
వస్తావు కలలోకీ..రానంటావు కౌగిలికీ
నే కన్న కలలన్నీ పండేది ఎప్పటికీ
ఆ ముద్దు మురిపాలూ తీరేది ఎన్నటికీ
వస్తాను కలలోకీ.. రానంటాను కౌగిలికీ
వస్తాను కలలోకీ.. రానంటాను కౌగిలికీ
నువు కన్న కలలన్నీ చాలించు ఇప్పటికీ
ఆ ముద్దు మురిపాలూ సగపాలు ఇద్దరికీ
పెదవి పైనా పెదవికి గుబులు..
పడుచుదనమే తీయటి దిగులు
కుర్రవాడికి తీరదు మోజు..
చిన్నదానికి బిడియం పోదు
హ .. చూపూ చూపూ కలిసిన చాలు
కొంగూ కొంగు కలిపిన మేలు
నన్ను దరిచేరనీ.. ముందు వాటాడనీ..
ముద్దు నెరవేరనీ.. ముందు జతకూడనీ..
వస్తావు కలలోకీ.. రానంటాను కౌగిలికీ
ఆ ముద్దు మురిపాలూ.. సగపాలు ఇద్దరికీ
చిన్నదాన్ని నిన్నటి వరకూ..
కన్నెనైనది ఎవ్వరి కొరకూ
నాకు తెలుసూ నాకోసమనీ..
నీకె తెలియదు ఇది విరహమనీ
నేనూ నువ్వు మనమైపోయే వేళ
ఇంకా ఇంకా ఇంతటి దూరం ఏల
వలచి వలపించనా.. కరిగి కరిగించనా
నవ్వి నవ్వించనా.. గెలిచి గెలిపించనా
వస్తాను కలలోకీ.. రానంటాను కౌగిలికీ
నువు కన్న కలలన్నీ చాలించు ఇప్పటికీ
ఆ ముద్దు మురిపాలూ సగపాలు ఇద్దరికీ
హేహహహ..వస్తావు కలలోకీ..
లాలలాలాలల రానంటావు కౌగిలికీ
లాలలాలాలల రానంటావు కౌగిలికీ
నే కన్న కలలన్నీ పండేది ఎప్పటికీ లాలాలలలల
ఆ ముద్దు మురిపాలూ లాలలలా తీరేది ఎన్నటికీ లలాలాలా
2 comments:
పాటలో అమ్మాయేమో గానీ మీ పిక్ లో అమ్మాయి మాత్రం ఖచ్చితంగా కలలోకి వచ్చేలానే వుందండీ..
హహహ థాంక్స్ శాంతి గారు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.