గురువారం, అక్టోబర్ 30, 2014

నెలవంక తొంగి చూసింది...

చందమామ, చల్లగాలీ సరాగాలాడుకునే వేళ వలపుజంట ఆలాపనే ఈ పాట... రాజకోట రహస్యం సినిమాలోని ఈ అందమైన యుగళగీతం ఈరోజు మీకోసం... చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : రాజకోట రహస్యం (1971)
సంగీతం : విజయా కృష్ణమూర్తి
సాహిత్యం :  సినారె
గానం :  ఘంటసాల, సుశీల

నెలవంక తొంగి చూసింది..
చలిగాలి మేను సోకింది
మనసైన చెలువ కనులందు నిలువ..
తనువెల్ల పొంగి పూచింది

నెలవంక తొంగి చూసింది..
చలిగాలి మేను సోకింది
చిరునవ్వులొలుక చెలికాడు పలుక..
నిలువెల్ల వెల్లి విరిసింది
నెలవంక తొంగి చూసింది...

 
ఏ జన్మలోని వరమో .. ఈ జన్మలోన దొరికె
ఏ జన్మలోని వరమో .. ఈ జన్మలోన దొరికె
ఏ పూలనోము ఫలమో .. నీ రూపమందు నిలిచె
 
సుడిగాలులైన ..జడివానలైన.. 
విడిపోని బంధమే వెలసె

నెలవంక తొంగి చూసింది ..
చలిగాలి మేను సోకింది

 
ఆనాటి వలపు పాట .. ఈనాటి బ్రతుకు బాట
ఆనాటి వలపు పాట .. ఈనాటి బ్రతుకు బాట
ఆనాటి కలవరింత .. ఈనాటి కౌగిలింత
ఏనాటికైన .. ఏ చోటనైన.. 
విడిపోనిదోయి మన జంట
 
నెలవంక తొంగి చూసింది..
చలిగాలి మేను సోకింది
చిరునవ్వులొలుక చెలికాడు పలుక..
నిలువెల్ల వెల్లి విరిసింది
నెలవంక తొంగి చూసింది...
చలిగాలి మేను సోకింది



2 comments:

కోట్లు ఖర్చు పెట్టి విదేశాల్లో ఓ పాతిక, ముప్పై మంది డాన్సర్లని పెట్టి తీస్తే గానీ పాట ఎఫెక్టివ్ గా వుండదనే సంస్కృతి నించి మళ్ళీ ఇటువంటి మెలొడీస్ మన ప్రేక్షకులకి కనువిందు చేసే రోజు వస్తుందంటారా..

ఫాషన్/ట్రెండ్స్ ఎప్పుడూ ఒక ఫుల్ సర్కిల్ లో తిరుగుతూనే ఉంటాయి శాంతి గారు చెప్పలేం మళ్ళీ అలాంటి రోజులు రావచ్చు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.