పాతాళభైరవి సినిమా గురించి ఈ పాట గురించి తెలియని తెలుగు వాళ్ళుండరేమో కదా... ఈ మధురమైన పాటను మరోసారి చూసీ వినీ ఆనందించండి మరి... ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం: పాతాళభైరవి(1951)
సంగీతం: ఘంటసాల
రచన: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల, పి లీల
కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన కలలే ఆయే
మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన గారడి ఆయే
మనసే పూల మంటపమాయే
కలవర మాయే మదిలో నా మదిలో
నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది
నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది
అనురాగాలే ఆలాపనగా మనసున కోయిల కూసే
కలవరమాయే మదిలో నా మదిలో
నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి వూదింది
నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి వూదింది
మోహాలేవో మోజులు రేపి ఊహాగానము చేసే
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన కలలే ఆయే
మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
2 comments:
ఆ రోజుల్లో లవర్స్ హాట్ ఫేవరేట్ సాంగ్..
ఆరోజుల్లోనే ఏమిటి లెండి ఈరోజుల్లో కూడా అయి ఉంటుంది :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.