బుధవారం, సెప్టెంబర్ 30, 2020

వింటున్నావా...

ఏ మాయ చేశావే చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఏ మాయ చేశావే (2010)
సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్  
సాహిత్యం : అనంత శ్రీరాం   
గానం : కార్తీక్, శ్రేయ ఘోషల్

పలుకులు నీ పేరే తలుచుకున్నా
పెదవుల అంచుల్లో అణుచుకున్నా 
మౌనముతో నీ మదిని బంధించా 
మన్నించు ప్రియా 

తరిమే వరమా తడిమే స్వరమా  
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా.. 
వింటున్నావా..

తరిమే వరమా తడిమే స్వరమా  
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా.. 
వింటున్నావా..
వింటున్నావా.. వింటున్నావా.. 

విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు 
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలి సారి నీ మాటల్లో 
పులకింతల పదనిసలు విన్నా  
చాలు చాలే చెలియా చెలియా  
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా  
ఓ.. బతికుండగా నీ పిలుపులు నేను విన్నా 

ఏమో ఏమో ఏ..మవుతుందో 
ఏదేమైనా నువ్వే చూసుకో 
విడువను నిన్నే ఇకపైన 
వింటున్నావా ప్రియా 
గాలిలో తెల్ల కాగితంలా 
నేనలా తేలి ఆడుతుంటే 
నన్నే ఆపి నువ్వే రాసిన 
ఆ పాటలనే వింటున్నా  

తరిమే వరమా..తడిమే స్వరమా 
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా.. వింటున్నావా.. 
వింటున్నావా.. వింటున్నావా..
వింటున్నావా.. 

ఆద్యంతం ఏదో ఏదో అనుభూతి 
ఆద్యంతం ఏదో అనుభూతి  
అనవరతం ఇలా అందించేది  
గగనం కన్నా మునుపటిది  
భూతలం కన్నా ఇది వెనుకటిది  
కాలంతోన పుట్టిందీ కాలం లా మారే 
మనసే లేనిది ప్రేమ  

రా ఇలా కౌగిళ్ళల్లో నిన్ను దాచుకుంటా 
నీ దానినై నిన్నే దారిచేసుకుంటా
ఎవరిని కలువని చోటులలోన
ఎవరిని తలువని వేళలలోన 

తరిమే వరమా తడిమే స్వరమా 
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా 
వింటున్నావా.. వింటున్నావా..
వింటున్నావా.. వింటున్నావా..
వింటున్నావా.. 

విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు 
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా 
తొలి సారి నీ మాటల్లో  
పులకింతల పదనిసలు విన్నా  

చాలు చాలే చెలియా చెలియా  
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా  
చాలు చాలే చెలియా చెలియా 
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా 
ఓ.. బతికుండగా నీ పిలుపులు నేను విన్నా 
 


మంగళవారం, సెప్టెంబర్ 29, 2020

జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్...

జల్సా సినిమాలోని ఒక మంచి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : జల్సా (2008)
సంగీతం : దేవీశ్రీప్రసాద్ 
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి   
గానం : బెన్నీదయాల్, ప్రియ 

జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా 
ఉందిరో ఈ సుందరి
బ్రిట్నీ స్పియర్స్ ని ప్రింట్ తీసినట్టుగా 
ఉందిరో ఈ కాడ్బరి
ఓ.. నడుమే చూస్తే షకీరా.. 
దాన్ని అంటుకున్న చెయ్యే లక్కీరా
నడకే చూస్తే బియాన్సే.. 
బేబి నవ్విందంటే ఖల్లాసే..
ఓ.. జీన్స్ పాంట్ వేసుకున్న జేమ్స్ బాండ్ లాగా 
గన్ను లాంటి కన్ను కొట్టి చంపమాకురో
బ్లాక్ బెల్ట్ పెట్టుకోని జాకీ చాన్ లాగా 
నాన్ చాక్ తిప్పమాకురో

హే.. లేడికళ్ళ లేజరే నువ్వా పారడైజ్ ఫ్లేవరే నువ్వా 
ఆక్సీజన్ నింపుకున్న ఆడబాంబువా 
సాక్సోఫోన్ వంపువే నువ్వా
ఓ.. వాల్కెనో కి బెస్ట్ ఫ్రెండ్ వా 
వెయ్యి వోల్ట్స్ హై కరెంట్ వా
వయసు మీద వాలుతున్న టోర్నడో నువ్వా 
ఎర్త్ క్వేక్ థండరే నువ్వా
నీ రెండు కళ్ళు రేడియం డయల్సా 
నీ పెదవులు ప్లాటినం ఫ్లవర్సా
నువ్వు హెల్లో అంటే రొమాన్సా
నీ సైలెన్స్ ఐనా వయెలెన్సా..  
హే... టైటానిక్ హీరోయిన్ పార్ట్ టూ నువ్వని 
నవ్వుతున్న మోనలిస మొత్తుకోదా
ప్లే బాయ్ చూపులున్న సమురాయ్ నువ్వని 
సుమోలంతా సలాం కొట్టరా 

జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా 
ఉందిరో ఈ సుందరి
బ్రిట్నీ స్పియర్స్ ని ప్రింట్ తీసినట్టుగా 
ఉందిరో ఈ కాడ్బరి

డీటీఎస్ రింగుటోన్ వా.. 
హార్ట్ షేపు మూనువే నువ్వా.. 
అందమన్న సాఫ్ట్ వేరు CD-ROMవా 
కమ్మనైన క్లోరోఫాం వా
రోమియోకి క్లోనువే నువ్వా 
రెయిన్ బో కి ట్విన్నువే నువ్వా.. 
డ్రీం యూనివర్సిటీకి డీనువే నువ్వా.. 
నా జోడియాక్ సైనువే నువ్వా
హే 24 కారెట్ వెన్నీలా.. 
నువ్వు హాట్ హాట్ మెక్సికన్ టక్కీలా
ఫుల్లీ లోడెడ్ రైఫుల్లా.. 
నన్ను రైడ్ చేసావే రాంబోలా..
మడొన్నాను బంతి చేసి బౌన్సరేసినట్టుగా 
పల్స్ రేటు పెంచినావే ఫ్రెంచ్ మోడలా
మారడోన లాగిపెట్టి గోల్ కొట్టినట్టుగా 
ఫ్లైయింగ్ కిస్ పెట్టమాకలా.. 

జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా 
ఉందిరో ఈ సుందరి
బ్రిట్నీ స్పియర్స్ ని ప్రింట్ తీసినట్టుగా 
ఉందిరో ఈ కాడ్బరి
 


సోమవారం, సెప్టెంబర్ 28, 2020

మేఘమా నీలిమేఘమా...

జర్నీ సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : జర్నీ (2011)
సంగీతం : సత్య
సాహిత్యం : సాహితి 
గానం : కార్తీక్

మేఘమా నీలిమేఘమా
ఎదురుచూశా నీ పూలజల్లుకి
వర్షమా వలపుల వర్షమా
కాచుకున్నా నీ మొదటిముద్దుకి
కన్ను మూయలా చెవి మోగలా
ముద్ద మింగలా నోట నవ్వలా
చెయ్యి ఊపలా కాలు కదపలా
ఆ విసుగులో ఏ మెరుగలా
ఓ మేఘమా మేఘమా ఎదురుచూశానే

మేఘమా నీలిమేఘమా
ఎదురుచూశా నీ పూలజల్లుకి

రోడ్‌లోన చూడాలా పార్క్‌లో చూడాలా
బస్‌లో చూడాలా ఆటోలో చూడాలా
థియేటర్‌లో చూడాలా స్ట్రీట్‌లో చూడాలా
చూశాను అల్లంత దూరంలో
గాలిలో నిలవాలా భూమిలో నిలవాలా
అక్కడ నిలవాలా ఇక్కడ నిలవాలా
నిలవాలా నిలవాలా ఎక్కడ నిలవాలా
నిలిచాను ఆ పిల్ల గుండెలో
నిలిచిందో పిలిచిందో వీధిలో
నే గమనించుకోలేదు మొదటిలో
నే ఎదురుచూశాలే ఈ పూలకొమ్మకి

మేఘమా నీలిమేఘమా
కాచుకున్నా నీ మొదటి ముద్దుకీ

నంబరు అడగాలా ఫోను చెయ్యాలా
అడ్రసు అడగాలా లవ్ లెటర్ ఇవ్వాలా
ఫాలో చెయ్యాలా కబురు పంపాలా
ఎలా వచ్చిందో ఎదురులో
టీజింగ్ చెయ్యాలా జగడాలాడాలా
మిర్రిమిర్రి చూడాలా నవ్వుతూ మాట్లాడాలా
వీధిలో ఆపాలా చెయ్యే పట్టాలా
ఎట్లా పడ్డాది ప్రేమలో
నే క్యాచ్ చెయ్యి పోయేటి నవ్వుతో
నాకు మ్యాచయ్యి పోయింది లైఫులో
నే ఎదురుచూశాలే నా పూలకొమ్మకి

మేఘమా నీలిమేఘమా
నాకు నీ ప్రేమే కావాలిలే నువ్వే కావాలిలే
కన్ను మూయలా చెవి మోగలా
ముద్ద మింగలా నోట నవ్వలా
నాకు నీ ప్రేమే కావాలిలే.. 
  

ఆదివారం, సెప్టెంబర్ 27, 2020

ఏ చిలిపి కళ్ళలోన...

ఘర్షణ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఘర్షణ (2004)
సంగీతం : హారిస్ జయరాజ్ 
సాహిత్యం : కులశేఖర్ 
గానం : శ్రీనివాస్

ఏ చిలిపి కళ్ళలోన కలవో 
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్ళలోన కలవో 
ఏ చిగురు గుండెలోన లయవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. 
జడకుచ్చుల్లోనా మల్లెవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. 
జడకుచ్చుల్లోనా మల్లెవో
కరిమబ్బుల్లోనా విల్లువో 
మధుమాసం లోనా 
మంచు పూల జల్లువో
మధుమాసం లోనా 
మంచు పూల జల్లువో

ఏ చిలిపి కళ్ళలోన కలవో 
ఏ చిగురు గుండెలోన లయవో

ఈ పరిమళము నీదేనా 
నాలో పరవశము నిజమేనా
బొండు మల్లిపువ్వు కన్నా 
తేలికగు నీ సోకు
రెండు కళ్ళు మూసుకున్నా 
లాగు మరి నీ వైపు
సొగసుని చూసి పాడగా ఎలా 
కనులకు మాట రాదుగా అలా
వింతల్లొను కొత్త వింత నువ్వేన 
ఆ అందం అంటే అచ్చం గాను నువ్వే

ఏ చిలిపి కళ్ళలోన కలవో 
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్ళలోన కలవో 
ఏ చిగురు గుండెలోన లయవో

ఆ పరుగులలో పరవళ్ళు 
తూలే కులుకులలో కొడవళ్ళు
నిన్ను చూసి వంగుతుంది 
ఆశ పడి ఆకాశం
ఆ మబ్బు చీర పంపుతోంది 
మోజు పడి నీకోసం
స్వరముల గీతి కోయిలా ఇలా 
పరుగులు తీయకే అలా అలా
నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం
నీ బుగ్గ సొట్టలో నే పాడే సంగీతం

ఏ చిలిపి కళ్ళలోన కలవో 
ఏ చిగురు గుండెలోన లయవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో 
జడకుచ్చుల్లోనా మల్లెవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో 
జడకుచ్చుల్లోనా మల్లెవో
కరిమబ్బుల్లోనా విల్లువో 
మధుమాసం లోనా 
మంచు పూల జల్లువో
మధుమాసం లోనా 
మంచు పూల జల్లువో
మధుమాసం లోనా 
మంచు పూల జల్లువో 
 


శనివారం, సెప్టెంబర్ 26, 2020

దొరకునా ఇటువంటి సేవ...

పాట నాకు ప్రాణమై నా జీవితంలో ప్రముఖ భాగమవడానికి కారణమైన మహానుభావుడు నిన్న (సెప్టెంబర్ 25-2020) నిష్క్రమించారు. బహుశా ఇలలో చేసిన స్వరార్చన చాలని నేరుగా తన అమృత గాత్రంతో భగవంతుడిని అర్చించుకోడానికే వెళ్ళారేమో. ఈ జగతిలో పాట ఉన్నంతకాలం మీరూ ఉంటారు బాలు గారూ. 

శంకరాభరణం చిత్రంకోసం వేటూరి గారు వ్రాసిన ఈ పాట బాలుగారికి సరిగ్గా సరిపోతుందనిపిస్తుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శంకరాభరణం (1980)
సంగీతం : కె.వి.మహదేవన్   
సాహిత్యం : వేటూరి  
గానం : బాలు, వాణీజయరాం

దొరకునా.. దొరకునా.. 
దొరకునా.. ఆఆ.ఆఅ...
దొరకునా ఇటువంటి సేవ
దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు 
నిర్వాణ సోపాన మధిరోహణము 
సేయు త్రోవ

దొరకునా ఇటువంటి సేవ 
నీ పద రాజీవముల చేరు 
నిర్వాణ సోపాన మధిరోహణము 
సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ 

రాగాలనంతాలు నీ వేయి రూపాలు
భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు
రాగాలనంతాలు నీ వేయి రూపాలు
భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు

నాదాత్మకుడవై నాలోన చెలగి
నా ప్రాణదీపమై నాలోన వెలిగే
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
నాదాత్మకుడవై నాలోన చెలగి
నా ప్రాణదీపమై నాలోన వెలిగే
నిన్ను కొల్చు వేళ దేవాదిదేవా
దేవాదిదేవా.. ఆ.. 

దొరకునా ఇటువంటి సేవ 
నీ పద రాజీవముల చేరు 
నిర్వాణ సోపాన మధిరోహణము 
సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ 

ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలూ ఎదలోని సడులే మృదంగాలు

ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలూ ఎదలోని సడులే మృదంగాలు

నాలోని జీవమై నాకున్న దైవమై
వెలుగొందువేళ మహానుభావా
మహానుభావా... 

దొరకునా... సేవ...
నీ పద రాజీవముల చేరు 
నిర్వాణ సోపాన మధిరోహణము 
సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ 
దొరకునా ఇటువంటి సేవ 
 

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

బొమ్మను గీస్తే...

బొమ్మరిల్లు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : బొమ్మరిల్లు (2006)
సంగీతం : దేవీశ్రీప్రసాద్   
సాహిత్యం : భాస్కరభట్ల  
గానం : జీన్స్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ

బొమ్మను గీస్తే నీలా ఉ౦ది
దగ్గరకొచ్చీ ఓ ముద్దిమ్మ౦ది
సర్లే పాప౦ అని దగ్గరకెళితే
దాని మనసే నీలో ఉ౦ద౦ది
ఆ ముద్దేదో నీకే ఇమ్మ౦ది
 
సరసాలాడే వయసొచ్చి౦ది
సరదా పడితే తప్పేము౦ది
ఇవ్వాలనే నాకూ ఉ౦ది
కానీ సిగ్గే నన్ను ఆపి౦ది
దానికి సమయ౦ వేరే ఉ౦ద౦ది

చలి గాలి ఉ౦ది చెలికి వణుకే పుడుతు౦ది
వెచ్చని కౌగిలిగా నిను అల్లుకుపొమ్మంది
చలినే తరిమేసే ఆ కిటుకే తెలుస౦డి
శ్రమపడిపోక౦డి తమ సాయ౦ వద్ద౦డి
పొమ్మ౦టావె బాలికా ఉ౦టాన౦టే తోడుగా
అబ్బో ఎ౦త జాలిరా తమరికి నామీద
ఏ౦చేయాలమ్మ నీలో ఏదో దాగు౦ది
నీ వైపే నన్నే లాగి౦ది

అ౦ద౦గా ఉ౦ది తన వె౦టే పది మ౦ది
పడకు౦డా చూడు అని నా మనస౦టు౦ది
తమకే తెలియ౦ది నా తోడై ఒకటు౦ది
మరెవరో కాద౦డి అది నా నీడేన౦డి
నీతో నడిచి దానికి అలుపొస్తు౦దే జానకి
హయ్యో అలక దేనికి నా నీడవు నువ్వేగా
ఈ మాట కోస౦ ఎన్నాళ్ళుగా వేచు౦ది
నా మనసు ఎన్నో కలలే క౦టు౦ది

బొమ్మను గీస్తే నీలా ఉ౦ది
దగ్గరకొచ్చీ ఓ ముద్దిమ్మ౦ది
సర్లే పాప౦ అని దగ్గరకెళితే
దాని మనసే నీలో ఉ౦ద౦ది
ఆ ముద్దేదో నీకే ఇమ్మ౦ది 
దాని మనసే నీలో ఉ౦ద౦ది
ఆ ముద్దేదో నీకే ఇమ్మ౦ది 
 

 

గురువారం, సెప్టెంబర్ 24, 2020

చిలిపిగ చూస్తావలా...

ఆరెంజ్ సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  


చిత్రం : ఆరెంజ్ (2010)
సంగీతం : హరీస్ జైరాజ్  
సాహిత్యం : వనమాలి 
గానం : కార్తీక్

చిలిపిగ చూస్తావలా 
పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా..
చివరికి నువ్వే అలా 
వేస్తావే వలా నీతో వేగేదెలా..
ఓ ప్రేమా.. 
కన్నుల్లో వాలే రోజు 
ఎంతో బాగున్న నీ కలా
కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది 
ఆ పై చేదెక్కుతోందిలా 
కడదాకా ప్రేమించే 
దారేదో పోల్చేదెలా 

చిలిపిగ చూస్తావలా 
పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా 
వేస్తావే వలా నీతో వేగేదెలా 

నిన్నేఇలా చేరగా 
మాటే మార్చి 
మాయే చెయ్యాలా
నన్నే ఇక నన్నుగా 
ప్రేమించని ప్రేమేలా
ఊపిరే ఆగేదాకా 
ఏదో ఒక తోడుండాలా
నన్నింతగా ఊరించేస్తూ 
అల్లేస్తోందే నీ సంకెలా

కొంచెం మధురము 
కొంచెం విరహము 
ఇంతలో నువ్వు నరకం
కొంచెం స్వర్గము 
కొంచెం శాంతము 
గొంతులో జారు గరళము
కొంచెం పరువము 
కొంచెం ప్రళయము 
గుండెనే కోయు గాయము
కొంచెం మౌనము 
కొంచెం గానము 
ఎందుకీ ఇంద్రజాలము

ఇన్నాళ్ళుగా సాగినా 
ప్రేమ నుంచి వేరైపోతున్నా
మళ్ళీ మరో గుండెతో 
స్నేహం కోరి వెళుతున్నా
ప్రేమనే దాహం తీర్చే 
సాయం కోసం వేచానిలా
ఒకో క్షణం ఆ సంతోషం 
నాతోపాటు సాగేదెలా ఎలా

చిలిపిగ చూస్తావలా 
పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా 
వేస్తావే వలా నీతో వేగేదెలా
ఓ ప్రేమా 
కన్నుల్లో వాలే రోజు 
ఎంతో బాగున్న నీ కలా
కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది 
ఆ పై చేదెక్కుతోందిలా
కడదాకా ప్రేమించే 
దారేదో పోల్చేదెలా

కొంచెం మధురము 
కొంచెం విరహము 
ఇంతలో నువ్వు నరకం
కొంచెం పరువము 
కొంచెం ప్రళయము 
గుండెనే కోయు గాయము
కొంచెం మధురము 
కొంచెం విరహము 
కొంచెం పరువము 
కొంచెం ప్రళయము 
 


బుధవారం, సెప్టెంబర్ 23, 2020

అరెరె అరెరె మనసే జారే..

హ్యాపీడేస్ సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : హ్యాపీడేస్ (2007)
సంగీతం : మిక్కీ జె. మేయర్ 
సాహిత్యం : వనమాలి 
గానం : కార్తీక్  

నీకోసం మిగిలానా 
నేనెవరో మరిచానా
నీడల్లే.. కదిలానా..
నీవల్లే కరిగానా 
నాకోసం నేనే లేనా 
మనసంతా నువ్వేనా.. 
ప్రేమంటే ఇంతేనా 
కాదన్న వింటేనా..

అరెరె.. అరెరె... మనసే జారే..
అరెరె.. అరెరె.. వరసే మారే..
ఇదివరకెపుడూ.. లేదే..
ఇది నా మనసే.. కాదే..
ఎవరేమన్నా.. వినదే..
తనదారేదో.. తనదే..

అంతా నీ మాయలోనే.. 
రోజూ నీ నామ స్మరణే.. 
ప్రేమా.. ఈ వింతలన్నీ.. నీవల్లనే..
అంతా నీ మాయలోనే.. 
రోజూ నీ నామ స్మరణే.. 
ప్రేమా.. ఈ వింతలన్నీ.. నీవల్లనే..

స్నేహమేరా... జీవితం అనుకున్నా..
ఆజ్ మేరా.. ఆశలే కనుగొన్నా..
మలుపులు ఎన్నయినా.. 
ముడిపడిపోతున్నా..
ఇక సెకనుకెన్ని నిమిషాలో.. 
అనుకుంటు రోజు గడపాలా..
మది కోరుకున్న మధుబాల.. 
చాల్లే.. నీ గోలా..

అంతా నీ మాయలోనే.. 
రోజూ నీ నామ స్మరణే.. 
ప్రేమా.. ఈ వింతలన్నీ.. నీవల్లనే..
అంతా నీ మాయలోనే.. 
రోజూ నీ నామ స్మరణే.. 
ప్రేమా.. ఈ వింతలన్నీ.. నీవల్లనే..

చిన్నినవ్వే.. చైత్రమై పూస్తుంటే..
చెంత చేరీ.. చిత్రమే చూస్తున్నా..
చిటపట చినుకుల్లో.. 
తడిసిన మెరుపమ్మా..
తెలుగింటిలోని తోరణమా.. 
కనుగొంటి గుండె కలవరమా..
అలవాటు లేని పరవశమా.. 
వరమా.. హాయ్ రామా..

అరెరె.. అరెరె... మనసే జారే..
అరెరె.. అరెరె.. వరసే మారే..
ఇదివరకెపుడూ.. లేదే..
ఇది నా మనసే.. కాదే..
ఎవరేమన్నా.. వినదే..
తనదారేదో.. తనదే..

అంతా నీ మాయలోనే.. 
రోజూ నీ నామ స్మరణే.. 
ప్రేమా.. ఈ వింతలన్నీ.. నీవల్లనే..
అంతా నీ మాయలోనే.. 
రోజూ నీ నామ స్మరణే.. 
ప్రేమా.. ఈ వింతలన్నీ.. నీవల్లనే.. 
 

మంగళవారం, సెప్టెంబర్ 22, 2020

ఝుమ్మని ఝుమ్మని...

రావోయి చందమామ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : రావోయి చందమామ (1999)
సంగీతం : మణిశర్మ 
సాహిత్యం : వేటూరి  
గానం : బాలు 

ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి,
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
జుం ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి,
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
వెన్నెల నీడల్లొ అరవిచ్చిన అందాలు
మధుమాసం మనసుకు వచ్చే వేళలో
కన్నుల కలువల్లో సరిగమల పరాగాలు
శుభ మంగళ వాద్యాలొచ్చే వేళలో

ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి,
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి

ఆకాశానికి తారలు పొదిగిన నా ఆనందంలో
పల్లవించె నా గీతం పలకరించె సంగీతం 
ఆ స్వర్గానికి నిచ్చెన వేసిన నా ఆవేశంలొ
తరుముకొచ్చె ఉల్లాసం,తలను వంచె కైలాసం
ఒక్కసారి వస్తయ్ తియ్యని క్షణాలెన్నో
ఒక్కటవ్వమంటయ్ తీరని రుణాలే 
శుభలేఖనుకో నా గీతం.

నీ పాదాలకు పారాణద్దిన ఈ పేరంటంలో
దేవతాయే నీ రూపం, దీవెనాయే నా ప్రాణం
వయ్యారాలను ఉయ్యాలూపిన ఈ వైభోగంలో
మౌనమాయే నా భావం, రాగమాయే నీ కోసం
మూడు ముళ్ళ బందం ఏడు జన్మలనుబంధం
వేణువైన నాలో ఆలాపనైన గానం
ఆశీస్సనుకో అనురాగం..

ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి,
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
వెన్నెల నీడల్లొ అరవిచ్చిన అందాలు
మధుమాసం మనసుకు వచ్చే వేళలో
కన్నుల కలువల్లో సరిగమల పరాగాలు
శుభ మంగళ వాద్యాలొచ్చే వేళలో

ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
ఝుం ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలున్నాయి
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి 
 

సోమవారం, సెప్టెంబర్ 21, 2020

జిలిబిలి జాబిలిలోనా...

మనసిచ్చి చూడు సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : మనసిచ్చి చూడు (1999)
సంగీతం : మణిశర్మ 
సాహిత్యం : చంద్రబోస్  
గానం : హరిహరన్, చిత్ర 

జిలిబిలి జాబిలిలోనా
చెలి తళుకులు తిలకిస్తున్నా 
హితులు స్నేహితులు ఎందరు వున్నా
యమున కోసమే చూస్తున్నా 
తెలుగు పదములెన్నెన్నో వున్నా
యమున పదమే తీపంటున్నా 
యమున... యమున... యమునా...

జిలిబిలి జాబిలిలోనా 
చెలి తళుకులు తిలకిస్తున్నా 

నా మదీ ..మహానది..వరదౌ...తున్నదీ 
ఈ ఇదీ ఇలాం..టిదీ ఎపుడూ లేనిదీ
తను అలా ఎదురౌ క్షణాన..
నిలువునా కదిలిపోనా 
నిలవనా మరీ మరో జగానా 

జిలిబిలి జాబిలిలోనా 
చెలి తళుకులు తిలకిస్తున్నా 

నా బలం ..ధనం..జనం 
యమునా స్నేహమే
నా స్థలం... నిరంతరం 
యమునా... తీరమే 
మనసే కోరి వలచే 
మమతే తనది కాదా 
మునగనా.. తనా
మనస్సులోనా

జిలిబిలి జాబిలిలోనా 
చెలి తళుకులు తిలకిస్తున్నా 
హితులు స్నేహితులు ఎందరు వున్నా
యమున కోసమే చూస్తున్నా
తెలుగు పదములెన్నెన్నో వున్నా
యమున పదమే తీపంటున్నా 
యమున... యమున... యమునా
 

ఆదివారం, సెప్టెంబర్ 20, 2020

నీ ఎదలో నాకు చోటే వద్దు...

ఆవారా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆవారా (2010)
సంగీతం : యువన్ శంకర్ రాజా
సాహిత్యం : వెన్నెలకంటి 
గానం : సాగర్ దేశాయ్
 
నీ ఎదలో నాకు చోటే వద్దు 
నా ఎదలో చేటే కోరవద్దు 
మన ఎదలో ప్రేమను మాటే రద్దు 
ఇవి పైపైన మాటలులే...హే 
నీ నీడై నడిచే ఆశ లేదే 
నీ తోడై వచ్చే ద్యాస లేదే 
నీ తోటే ప్రేమ పోతేపోనీ 
అని అబద్దాలు చెప్పలేనులే 
 
నీ జతలోన నీ జతలోన 
ఈ ఎండకాలం నాకు వానాకాలం 
నీ కలలోన నీ కలలోన 
మది అలలాగ చేరు ప్రేమ తీరం 

నీ ఎదలో నాకు చోటే వద్దు 
నా ఎదలో చోటే కోరవద్దు 
మన ఎదలో ప్రేమను మాటే రద్దు 
ఇవి పైపైన మాటలులే...హే 

చిరుగాలి తరగంటి నీమాటకే 
ఎద పొంగేను ఒక వెల్లువై 
చిగురాకు రాగాల నీ పాటకే 
తనువూగేను తొలిపల్లవై 
ప్రేమ పుట్టాక నాకళ్ళలో 
దొంగచూపేదో పురివిప్పెనే 
కొంచెం నటనున్నది 
కొంచెం నిజమున్నది 
ఈ సయ్యాట బాగున్నది 
 
నువ్ వల వేస్తే నువ్ వల వేస్తే 
నా ఎద మారే నా కథ మారే 
అరె ఇది ఏదో ఒక కొత్త దాహం 
అది పెరుగుతుంటే వీచే చెలి స్నేహం 

ఒకసారి మౌనంగా నను చూడవే 
ఈ నిమిషమే యుగమౌనులే 
నీ కళ్ళలో నన్ను బందించవే 
ఆ చెర నాకు సుఖమౌనులే 
నిన్ను చూసేటి నా చూపులో 
కరిగే ఎన్నెన్ని మునిమాపులో 
పసిపాపై ఇలా నా కనుపాపలే 
నీ జాడల్లో దోగాడెనే 
 
తొలి సందెలలో తొలి సందెలలో 
ఎరుపే కాదా నీకు సింధూరం 
మలి సందెలలో మలి సందెలలో 
నీ పాపిటిలో ఎర్రమందారం 

నీ ఎదలో నాకు చోటే వద్దు 
నా ఎదలో చోటే కోరవద్దు 
మన ఎదలో ప్రేమను మాటే రద్దు 
ఇవి పైపైన మాటలులే...హే 
నీ నీడై నడిచే ఆశ లేదే 
నీ తోడై వచ్చే ద్యాస లేదే 
నీ తోటే ప్రేమ పోతేపోనీ 
అని అబద్దాలు చెప్పలేనులే 
 

శనివారం, సెప్టెంబర్ 19, 2020

ఎగిరే మబ్బులలోన...

హ్యాపీ సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : హ్యాపీ (2006)
సంగీతం : యువన్ శంకర్ రాజా 
సాహిత్యం : కులశేఖర్  
గానం : ఎస్.పి.చరణ్ 

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో
ఈ ఉదయం ఏ హృదయం
హే...చేరుతుందో ఈ ప్రేమ
ఏ నిమిషం ఏది నిజం
హో... తెలియకుందే ఆ మాయ
ఆశపడితే అందనందే ఉరుకుంటే చేరుకుందే
తగువులోనే చిగురు వేసిందే హే...

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో
ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో

నిదరోయే నీకనులు ఎదలోన ఆ కలలు
ఎదురైనా ఎపుడైనా కళ్ళారా చూసేనా
నీతో కలిసి నీతో పెరిగి నీతొ తిరిగి ఆశగా
నిన్నే తలచి నిన్నే పిలిచి ఈన్నాళ్ళుగా
నువ్వంటే ఇష్టం ఉన్నా నువ్వే నా సర్వం అన్నా
నా గుండెల్లో దాచేసిందే మౌనంగా ప్రేమ

ఎటువైపే నీ పరుగు వినలేదా నా పిలుపు
ఇపుడైన ఇకనైన నీ పంతం ఆగేనా
అన్ని మరిచి కోపం విడిచి
నాతో చెలిమి చేసినా
పోయే వరకు నా ఈ బతుకు నీదే కాదా
నీతోడే కావాలంటు నీ నీడై ఉండాలంటు
నవరాగాలు ఆలాపించే నాలో ఈ ప్రేమ
 
ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో
ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో
ఈ ఉదయం ఏ హృదయం
హే...చేరుతుందో ఈ ప్రేమ
ఏ నిమిషం ఏది నిజం
హో... తెలియకుందే ఆ మాయ
ఆశపడితే అందనందే ఉరుకుంటే చేరుకుందే
తగువులోనే చిగురు వేసిందే హే...

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో
ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో 
 

 

శుక్రవారం, సెప్టెంబర్ 18, 2020

ఏమంటారో...

గుడుంబా శంకర్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : గుడుంబా శంకర్ (2004)
సంగీతం : మణిశర్మ 
సాహిత్యం : చంద్రబోస్   
గానం : ఎస్.పి.చరణ్, హరిణి 

ఏమంటారో నాకు నీకున్న ఇదినీ
ఏమంటారో నువు నేనైన అదినీ
ఏమంటారో.. మారిపోతున్న కథనీ
ఏమంటారో.. జారిపోతున్న మదినీ
చూసె పెదవినీ మాటాడే కనులనీ
నవ్వే నడకనీ కనిపించే శ్వాసనీ
ఇచ్చి పుచ్చుకున్న మనసుని
ఇద అద యద విధ మరి
ఏమంటారో నాకు నీకున్న ఇదినీ
ఏమంటారో నువు నేనైన అదినీ
ఏమంటారో మారిపోతున్న కథనీ
ఏమంటారో జారిపోతున్న మదినీ

ఎదురుగ వెలుగుతున్న నీడనీ
బెదురుగ కలుగుతున్న హాయినీ
తనువున తునుకుతున్న చురుకునీ
మనసున ముసురుకున్న చెమటనీ
ఇష్ట కష్టాలని ఏమంటారొ ఇపుడేమంటారో 
ఈ మోహమాటాలని ఏమంటారొ మరి ఎమంటారో 
స్వల్ప భారాలని ఏమంటారో ఇపుడేమంటారో 
సమీప దూరాలని ఏమంటారో అసలేమంటారొ 
జారె నింగిని దొరలాంటీ దొంగనీ 
పాడె కొంగునీ పరిమళించే రంగునీ 
పొంగుతున్న సుధా గంగని 
ఇద అద అదె ఇద మరి 
ఏమంటారో మారిపొతున్న కథనీ 
ఏమంటారో జారిపోతున్న మదినీ 

జాబిలై తలుకుమన్న చుక్కనీ 
బాధ్యతై దొరుకుతున్న హక్కునీ 
హెయ్ హెయ్ 
దేవుడై ఎదుగుతున్న భక్తునీ 
సూత్రమై బిగయనున్న సాక్షినీ 
పాతలొ కొత్తనీ ఇపుడేమంటారో 
పోట్లాటలొ శాంతిని మరి ఏమంటారో 
తప్పులొ ఒప్పునీ ఏమంటారొ ఇపుడేమంటారో 
గత జన్మలొ అప్పుని ఏమంటారొ అసలేమంటారొ 
నాలొ నువ్వుని ఇక నీలొ నేనునీ 
మాకెమేమనీ మన దారె మనదనీ 
రాసుకున్న ఆత్మ చరితనీ
అద ఇద ఇదె అద మరి 

ఏమంటారో నాకు నీకున్న ఇదినీ 
ఏమంటారో నువు నేనైన అదినీ 
ఏమంటారో మారిపొతున్న కథనీ 
ఏమంటారో జారిపొతున్న మదినీ 
 

గురువారం, సెప్టెంబర్ 17, 2020

గున్నమావి కొమ్మ మీద...

నువ్వు నేను చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : నువ్వు నేను (2001)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం : కులశేఖర్  
గానం : మల్లిఖార్జున్, ఉష 

గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక
సన్నజాజి తీగ మీద అందాల రాచిలక
ఎవరూ లేని ఏకాకంట చక్కని గోరింక
అంతా ఉన్నా ఒంటరి పాపం వన్నెల రాచిలక
మమతలు తెలియని ఆ గోరింకకు చిలకే తోడంట
మనసులు కలిసిన ఆ ప్రేమికులు ఒకరికి ఒకరంట

గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక
సన్నజాజి తీగ మీద అందాల రాచిలక

గోరువంక తన గుండె గూటిలో చిలకని దాచింది
రామచిలక ఆ గోరువంకనే కనుపాపనుకుంది
కాటుకెంత అడ్డు వచ్చినా కంటి చాటు స్వప్నమాగునా
చేతులెంత అడ్డు పెట్టినా గుండె మాటు సవ్వడాగునా
కటిక హృదయాలు ఏమనుకున్నా ప్రేమొక వరమేగా

గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక
సన్నజాజి తీగ మీద అందాల రాచిలక

పాడులోకం ఆ జంటను చూసి కత్తులు దూసింది
కక్ష గట్టి ఆ మనసులనిట్టే దూరం చేసింది
పంజరాలలోన పెట్టినా రామచిలక మూగబోవునా
హోరుగాలి ఎంత వీచినా ప్రేమ దీపమారిపోవునా
బ్రహ్మ రాతల్ని మార్చాలంటే మనుషుల వశమేనా

గున్నమావి కొమ్మ మీద గారాల గోరింక
సన్నజాజి తీగ మీద అందాల రాచిలక
ఎవరూ లేని ఏకాకంట చక్కని గోరింక
అంతా ఉన్నా ఒంటరి పాపం వన్నెల రాచిలక
మమతలు తెలియని ఆ గోరింకకు చిలకే తోడంట
మనసులు కలిసిన ఆ ప్రేమికులు ఒకరికి ఒకరంట
నువ్వు నేనంటా
 

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.