శనివారం, సెప్టెంబర్ 12, 2020

తొలి పిలుపె నీ తొలి పిలుపె...

ఆది చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఆది (2002)
సంగీతం : మణిశర్మ  
సాహిత్యం : చంద్రబోస్ 
గానం : బాలు, చిత్ర 

తొలి పిలుపె నీ తొలి పిలుపె 
మనసుకు తెలిపెను పసి వలపే
తొలి పిలుపె నీ తొలి పిలుపె 
వయసుకు తెరిచెను చలి తలుపే
తొలి పిలుపే నిన్ను నన్ను కలగలిపే
తొలి పిలుపే నీలో నాలో కలలను కదిపె

తొలి పిలుపె నీ తొలి పిలుపె 
మనసుకు తెలిపెను పసి వలపే
తొలి పిలుపె నీ తొలి పిలుపె 
వయసుకు తెరిచెను చలి తలుపే

ఒక చూపుతోటి ఒక చూపు కలిపి 
వెనుచూపు లేని జత పయనమిది
ఒక చెయ్యిలోన ఒక చేయి వేసి 
ఒకటయ్యే చెలిమిది
ఒక మాటతోటి ఒక మాట కలిపి 
మొగమాటమైన మగువాట ఇది
ఒక గుండెతోటి ఒక గుండె చేరి 
ఒదిగుండే కధ ఇది
ప్రతిపదము ప్రియా అని మలచినది
ప్రతిఫలము ఆశించని మమతల వ్రతమిది

తొలి పిలుపె నీ తొలి పిలుపె 
మనసుకు తెలిపెను పసి వలపే
తొలి పిలుపె నీ తొలి పిలుపె 
వయసుకు తెరిచెను చలి తలుపే

మనసైన వేళ కనుసైగ చాలు 
పలు దేశ భాషలిక దేనికిలె
అధరాల పాల చిరుధార చాలు 
ఆహారం దేనికే
ఎదురైన వేళ కౌగిళ్ళు చాలు 
ఏ ఇల్లు వాకిలిక ఎందుకులె
మన చుంబనాల సవ్వళ్ళు 
చాలు సంగీతం ఎందుకే
ఇరువురికీ ఏడో రుచి తెలిసినది
మనుగడకీ మరో ముడై 
ముడిపడు ముడుపిది

తొలి పిలుపె నీ తొలి పిలుపె 
మనసుకు తెలిపెను పసి వలపే
తొలి పిలుపె నీ తొలి పిలుపె 
వయసుకు తెరిచెను చలి తలుపే
తొలి పిలుపే నిన్ను నన్ను కలగలిపే
తొలి పిలుపే నీలొ నాలొ నిధులను చిదిపె
తొలి పిలుపె నీ తొలి పిలుపె 
మనసుకు తెలిపెను పసి వలపే
తొలి పిలుపె నీ తొలి పిలుపె 
వయసుకు తెరిచెను చలి తలుపే 
 

 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.