శనివారం, సెప్టెంబర్ 19, 2020

ఎగిరే మబ్బులలోన...

హ్యాపీ సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : హ్యాపీ (2006)
సంగీతం : యువన్ శంకర్ రాజా 
సాహిత్యం : కులశేఖర్  
గానం : ఎస్.పి.చరణ్ 

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో
ఈ ఉదయం ఏ హృదయం
హే...చేరుతుందో ఈ ప్రేమ
ఏ నిమిషం ఏది నిజం
హో... తెలియకుందే ఆ మాయ
ఆశపడితే అందనందే ఉరుకుంటే చేరుకుందే
తగువులోనే చిగురు వేసిందే హే...

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో
ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో

నిదరోయే నీకనులు ఎదలోన ఆ కలలు
ఎదురైనా ఎపుడైనా కళ్ళారా చూసేనా
నీతో కలిసి నీతో పెరిగి నీతొ తిరిగి ఆశగా
నిన్నే తలచి నిన్నే పిలిచి ఈన్నాళ్ళుగా
నువ్వంటే ఇష్టం ఉన్నా నువ్వే నా సర్వం అన్నా
నా గుండెల్లో దాచేసిందే మౌనంగా ప్రేమ

ఎటువైపే నీ పరుగు వినలేదా నా పిలుపు
ఇపుడైన ఇకనైన నీ పంతం ఆగేనా
అన్ని మరిచి కోపం విడిచి
నాతో చెలిమి చేసినా
పోయే వరకు నా ఈ బతుకు నీదే కాదా
నీతోడే కావాలంటు నీ నీడై ఉండాలంటు
నవరాగాలు ఆలాపించే నాలో ఈ ప్రేమ
 
ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో
ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో
ఈ ఉదయం ఏ హృదయం
హే...చేరుతుందో ఈ ప్రేమ
ఏ నిమిషం ఏది నిజం
హో... తెలియకుందే ఆ మాయ
ఆశపడితే అందనందే ఉరుకుంటే చేరుకుందే
తగువులోనే చిగురు వేసిందే హే...

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో
ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో 
 

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.