బుధవారం, ఫిబ్రవరి 28, 2018

తిల్లానా తిల్లానా...

ముత్తు చిత్రంలోని ఒక హుషారైన పాటతో ఈ మాస్ పాటల సిరీస్ ని ఈ రోజుతో ముగిద్దాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ముత్తు (1995)
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : భువనచంద్ర
గానం : మనో, సుజాత

తిల్లానా తిల్లానా నా కసి కళ్ళ కూనా
చిక్ చిక్ చిందెయ్ అన్నానా
తిల్లానా తిల్లానా నా కసి కళ్ళ కూనా
చిక్ చిక్ చిందెయ్ అన్నానా
హా...ముద్దు చాలే మీనా
అది ఎంత చిన్నదైనా
చక్ చక్ ఇచ్చెయ్ అన్నానా

కన్నుగీటితే సుల్తానా
కసిగట్టు దాటెరా దీవానా
కొంటె ముద్దుల కప్పం కట్టి
కాటే వేసేనా

తిల్లానా తిల్లానా నా కసి కళ్ళ కూనా
చిక్ చిక్ చిందెయ్ అన్నానా 
ముద్దు చాలే మీనా అది ఎంత చిన్నదైనా
చక్ చక్ ఇచ్చెయ్ అన్నానా

పైట చెంగు పాడిందయ్యో పరువాల పాట
తట్టి తట్టి ముద్దోటిస్తే అదిరేను ఆట
కల్లాకపటమేది లేని జవరాలి పాట
పట్టె మంచమేస్తే ఇంక చెలరేగిపోదా
వసంతాల వాకిట్లో వయ్యారాల విందమ్మ
కులాసాల సందిట్లో విలాసాల వేటమ్మా
పదారేళ్ళ ఒంపుల్లో మజా చేసుకుందామా
పదాలింక చాలించి పెదాలందుకుందామా
సడే లేని ముంగిట్లో సడే చేసుకుందామా

తిల్లానా తిల్లానా నా కసి కళ్ళ కూనా
చిక్ చిక్ చిందెయ్ అన్నానా 
ముద్దు చాలే మీనా అది ఎంత చిన్నదైనా
చక్ చక్ ఇచ్చెయ్ అన్నానా

కన్నుగీటితే సుల్తానా
కసిగట్టు దాటెరా దీవానా
కొంటె ముద్దుల కప్పం కట్టి
కాటే వేసేనా

ఎర్రపాటి కుర్రోళ్ళంతా ఎనకాల వుంటే
నల్ల పిల్లగాణ్ణే కోరి మనసివ్వనేల
నల్లనల్ల మేఘంలోనే నీరుంటదంట
నల్లవాడి గుండెల్లోన తల దాచుకుంటా
మారాల చేమంతి నీ ఒళ్ళె ఉయ్యాల
మందార పువ్వల్లె ఎర్రబారే సందేళా
చక్కనమ్మ కౌగిట్లో చిక్కుకుంటి ఈ వేళ
వెన్ను పట్టి ఏకంగా వెన్న దోచుకోవాలా
గట్టుదాటి గోదారాల్లె నిన్ను ముంచి వెయ్యాలా

తిల్లాన తిల్లాన నీ పెదవుల్లో తేనా
టక్ టక్ ఇచ్చెయ్ అన్నానా
తిల్లాన తిల్లాన నీ పెదవుల్లో తేనా
టక్ టక్ ఇచ్చెయ్ అన్నానా
ముద్దు చాలే మీనా అది ఎంత చిన్నదైనా
చక్ చక్ పెట్టెయ్ అన్నానా

కన్నుగీటితే సుల్తానా
కసిగట్టు దాటెరా దీవానా
కొంటె ముద్దుల కప్పం కట్టి
కాటే వేసేనా

తిల్లానా తిల్లానా నా కసి కళ్ళ కూనా
చిక్ చిక్ చిందెయ్ అన్నానా 
ముద్దు చాలే మీనా అది ఎంత చిన్నదైనా
చక్ చక్ ఇచ్చెయ్ అన్నానా
 చిక్ చిక్ చిందెయ్ అన్నానా
 చిక్ చిక్ చిందెయ్ అన్నానా
 చిక్ చిక్ చిందెయ్ అన్నానా


మంగళవారం, ఫిబ్రవరి 27, 2018

ర్యాలీ రావులపాడు...

నేనున్నాను చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నేనున్నాను (2004)
సంగీతం : యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం : చంద్రబోస్
గానం : టిప్పు, సునీత

బంతి కావాలా? బాలు కావాలా?
మెంతికూర లాంటి పిల్ల చెంతకొచ్చి చేరుకుంటే
బంతెందుకు బాలెందుకు?
ఏదేదో అడగరాదూ ఇవ్వనన్నానా

ర్యాలీ రావులపాడు రేలంగి సంతలోన
ర్యాలీ రావులపాడు రేలంగి సంతలోన
నిప్పుకోడి తెచ్చినానె నిప్పుకోడి తెచ్చినానె
పెట్టియ్యవే పిల్లా పెట్టియ్యవే
పెట్టియ్యవే ఇగురు పెట్టియ్యవే
ఓరోరి బుల్లోడ వయ్యారి బుల్లోడ
వగలమారి బుల్లోడ వాల్తేరు బుల్లోడ
అంతగాను అడుగుతుంటే పెట్టీయ్యనా
అటక మీద పాత ట్రంకు పెట్టియ్యనా
ట్రంకు పెట్టీయనా...

ఉస్కులకడి గుమ్మ గుమా ఐసలకడి టంకు టమ

కర్నూలు టౌనులోన కంసాలి కొట్టులోన
కర్నూలు టౌనులోన కంసాలి కొట్టులోన
పట్టగొలుసు తెచ్చినానె పట్టగొలుసు తెచ్చినానె
కాలియ్యవే పిల్లా కాలియ్యవే
కాలియ్యవే నీ కుడి కాలియ్యవే
ఓరోరి బుల్లోడా ఒయ్యారి బుల్లోడా
వగలమారి బుల్లోడా వాల్తేరు బుల్లోడా
యింటి కెళ్ళినాక ఫోను కాలివ్వనా
యింటి కెళ్ళినాక ఫోను కాలివ్వనా
ఫోను కాలివ్వనా...

మంత్రిగారి కోటాలోన మన ఇద్దరి పేరుమీన
మంత్రిగారి కోటాలోన మన ఇద్దరి పేరుమీన
రైలు టిక్కెటు తెచ్చినానె  రైలు టిక్కెటు తెచ్చినానె
చుట్తియ్యవే పిల్లా చుట్తియ్యవే
చుట్తియ్యవే బిస్తరు చుట్తియ్యవే
ఓరోరి బుల్లోడ వయ్యారి బుల్లోడ
వగలమారి బుల్లోడ వాల్తేరు బుల్లోడ
పట్టుపట్టి అడుగుతుంటే చుట్టివ్వనా
అంటు పెట్టు కుంటే గంట చుట్టివ్వనా
గంట చుట్టివ్వనా...

ఉస్కులకడి గుమ్మ గుమా ఐసలకడి టంకు టమ

అడిగింది అందుకోక అందేది అడగలేక
అడిగింది అందుకోక అందేది అడగలేక
నీరుగారి పోయినావు నీరుగారి పోయినావు
చారెయ్యనా పిలగా చారెయ్యనా
చారెయ్యనా ఉలవచారెయ్యనా
ఓసోసి బుల్లెమ్మ వయ్యారి బుల్లెమ్మా
నంగనాచి బుల్లెమ్మా నాంచారి బుల్లెమ్మా
చిలిపి చిందులాటలోన చారెయ్యవే
ఏక్, దో, తీన్, చారెయ్యవే చారు పాంచెయ్యవే

షామిరు పేటలోన షావుకారు షాపులోన
షామిరు పేటలోన షావుకారు షాపులోన
నోటు బుక్కు తెచ్చినానె  నోటు బుక్కు తెచ్చినానె
రాసియ్యవే పిల్లా రాసియ్యవే
రాసియ్యవే అందం రాసియ్యవే
ఓరోరి బుల్లోడ వయ్యారి బుల్లోడ
వగలమారి బుల్లోడ వైజాగు బుల్లోడ
పొత్తుకోరి చేరుకుంటే రాసియ్యనా
నెత్తిమీద మంచినూనె రాసియ్యనా
నునె రాసియ్యనా

ఉస్కులకడి గుమ్మ గుమా ఐసలకడి టంకు టమ

మాటల పోటీలోన మీది మీది ఆటలోన
మాటల పోటీలోన మీది మీది ఆటలోన
పిల్లతోటి ఓడినావు  పిల్లతోటి ఓడినావు
తీసెయ్యరో పిలగా తీసెయ్యరో
తీసెయ్యరో మీసం తీసెయ్యరో హెయ్
ఓసోసి బుల్లెమ్మ వయ్యారి బుల్లెమ్మ
రవ్వలాంటి బుల్లెమ్మ రాంగురూటు బుల్లెమ్మ
మీసకట్టు ముద్దులాటకడ్డం అంటూ
చెప్పలేక చెప్పినావే తీసెయ్ మంటూ
మీసం తీసెయ్ మంటూ...


సోమవారం, ఫిబ్రవరి 26, 2018

ఇంతన్నాడంతన్నాడే గంగరాజు...

తప్పుచేసి పప్పుకూడు చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : తప్పుచేసి పప్పుకూడు (2002)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : కులశేఖర్
గానం : మోహన్ బాబు, నిత్యసంతోషిణి
 
ఓలమ్మో... ఓలప్పో...
ఇంతన్నాడంతన్నాడే గంగరాజు
ముంతమామిడి పండన్నాడే గంగరాజు
హస్కన్నడు బుస్కన్నాడే గంగరాజు
నన్నొగ్గేసెల్పోనాడే గంగరాజు
ఓలమ్మో... ఓలప్పో
ఇంతన్నాడంతన్నాడే గంగరాజు
ముంతమామిడి పండన్నాడే గంగరాజు
హస్కన్నడు బుస్కన్నాడే గంగరాజు
నన్నొగ్గేసెల్పోనాడే గంగరాజు
ఓలమ్మో ఒంటరిగా వదిలేసి ఎల్పోనాడేటి
మరి నీకేటి దిక్కూ..
ఇంకేదిక్కూ.. తూరుపు దిక్కు..

తప్పుచేసి పప్పుకూడురో
తళాంగుచుక్క ఉప్పుచేప ఊరగాయరో
తప్పుచేసి పప్పుకూడురో
తళాంగుచుక్క ఉప్పుచేప ఊరగాయరో

నీకమ్మానాన్నా అప్పా సెల్లీ ఎవరూ లేరా ఓపిల్లా
నాకమ్మానాన్నా అప్పా సెల్లీ ఎవలూ లేరూ పిల్లాడా
ఎందుకేటి..
నీకెండా వానా తోడుంటాను నాతో వచ్చేయ్ ఓపిల్లా
నాకండాదండా ఉంటానంటే నమ్మేదెట్టా కుర్రోడా
భూమ్మీద ఒట్టూ, స్కై మీద ఒట్టూ
పానీ మీదొట్టూ, హవామీదోట్టూ
నాగుబాము లాంటి జడమీద ఒట్టూ
నైసుగున్న నీ మెడమీద ఒట్టూ
ఆఊరు ఈఊరు ఆడోళ్ళు మగోళ్ళు అందరిమీదొట్టూ
హయ్ బాబోయ్.. ఒట్టేసి చెప్తున్నాగదేటి పిల్లా..

నీలాగే ఒట్టేశాడోయ్ గంగరాజు
నట్టేట్లో ముంచేశాడోయ్ గంగరాజు
అందంలో రంభన్నాడోయ్ గంగరాజు
ఐనాకా ఒగ్గేశాడోయ్ గంగరాజు

నీలాగే ఒట్టేశాడోయ్ గంగరాజు
నట్టేట్లో ముంచేశాడోయ్ గంగరాజు
అందంలో రంభన్నాడోయ్ గంగరాజు
ఐనాకా ఒగ్గేశాడోయ్ గంగరాజు
ఐపోనాదేటి..
ఏటైనాదీ దెబ్బలాట... తగువాడేస్కున్నాం
ఆడొగ్గేసినాకా నా బతుకు పార్వతీపురం బస్టాండైనాది
ఏటైనాదీ... పార్వతీపురం బస్టాండు..

ఆడొగ్గేశాక ఎక్కడ తేలావ్ అయ్యోపాపం ఓ పిల్లా
ఆడొగ్గేశాకా లింగరాజు తగిలాడయ్యో పిల్లోడా
ఆ లింగోలిటుకో ఏమిచ్చాడో చెప్పవే తింగరి బుచ్చమ్మా
నా పెట్టేబేడా ఎత్తుకుపోవాలనుకున్నాడోయ్ బుల్లోడా
నాకాడకొస్తే కాపలా కాస్తా నీ పెట్టెకింకా తాళాలు వేస్తా
కోటగుమ్మం మీద జెండా జూపిస్తా 
కోడిపుంజు చేత దండమెట్టిస్తా
కాయేటి పండేటి పువ్వేటి పత్రేటి అన్నీ నీకే ఇస్తా...
ఓలమ్మో ఇన్నోటే.. మరిడౌటేందుకు మా కోటకొచ్చేయ్
తింగిరి బింగిరి జింగిరీ..
ఇట్టాగే రమ్మన్నాడోయ్ లింగరాజు
ఎల్లాక పొమ్మానోడోయ్ లింగరాజు
మేడన్నాడు మిద్దెన్నాడోయ్ లింగరాజు
మేడమీద నుయ్యన్నాడోయ్ లింగరాజు
మేడమీద నుయ్యనగానే రయ్యని లంకెలిపోనావేటీ
ఎల్లాక తెలిసిందది నుయ్యి కాదు పెద్ద గొయ్యని
ఈ మొగోళ్ళూ మా చెడ్డ మాయగాళ్ళూ

ఇంతంటారంటారే మాయగాళ్ళు
ముంతమామిడి పండంటారే మాయగాళ్ళు
అందంలో రంభంటారే కోడెగాళ్ళు
ఐనాకా ఒగ్గేస్తారే మోసగాళ్ళు 


ఆదివారం, ఫిబ్రవరి 25, 2018

చినుకు చినుకు అందెలతో...

శుభలగ్నం చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మాయలోడు (1993) / శుభలగ్నం(1994)
సంగీతం : ఎస్. వి. కృష్ణారెడ్డి 
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : బాలు, చిత్ర

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా
 
 
చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా


నింగి నేల ఈవేళ చలికి వణికిపోతుంటే
బిగి కౌగిలి పొదరింటికి పద పదమంది
ఈ కౌగిలింతలోన ఏలో
గుండెల్లో ఎండ కాసే ఏలో

 
అరె.. పైన మబ్బు ఉరిమింది
పడుచు జింక బెదిరింది
వలవేయక సెలయేరై పెనవేసింది
అరె..చినుకమ్మ మెరుపమ్మ ఏలో
చిటికేస్తే బుగ్గ మీద ఏలో 

 
తలపు తొలివలపు ఇక తక ఝుం తక ఝుం
వయసు తడి సొగసు అర విరిసె సమయం 

ఆహా…ఊహూ… ఓహోహొహో

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి

 వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా

మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది
ఎద లోపల చలిగాలుల సుడి రేగింది
 

వానొచ్చే వరదొచ్చే ఏలో
వయసంటే తెలిసొచ్చే ఏలో 


మేను చూపు పో అంది వాలు చుపు సై అంది
చెలి కోరిక అలవోకగ తల ఊపింది
 

అరె.. సరసాల సిందులోన ఏలో
సరి గంగ తానాలు ఏలో


ఒడిలో ఇక ఒకటై తక తకతై అంటే 

 సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే
ఆహా…ఊహూ… ఓహోహొహో

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా  

 
 చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా 


 

శనివారం, ఫిబ్రవరి 24, 2018

కందిచేనుకొచ్చినావు...

సీమటపాకాయ్ చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సీమటపాకాయ్ (2011)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం : చిలకరెక్క గణేష్
గానం : హేమచంద్ర, ఉష

కందిచేనుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు
ముందు ముందు కొచ్చినావు ముద్దుపెట్ట చూసినావు
ఎట్టా ఉంది మామ ఒళ్ళు నీకేట్టా ఉంది మామ ఒళ్ళు
ఎట్టా ఉంది మామ ఒళ్ళు ఎట్టెట్ట ఉంది నీ ఒళ్ళూ..


అరె అందమంత ఆరబోసి గడ్డిమోపు ఎత్తుకోని
గట్టుమీద పోతు ఉంటె వయసు వేడి మీద ఒళ్ళు
ఇట్టిట్టా ఉంది పిల్ల ఒళ్ళూ
ఇట్టా ఉంది పిల్ల ఒళ్ళూ ఎట్టేట్టో ఉంది పిల్లా ఒళ్ళూ

దారికాచి దొంగలాగ కాపుకాస్తివి
నంగనాచి పిల్ల తొందరేంది ఆగమంటివి
వంగి వంగి గడ్డివాము చాటుకొస్తివి
నన్ను గుంజి గుంజి ముద్దులాట ఆడమంటివి
వెంటవెంట పడితీవీ వేధించి చంపుతుంటీవి
వెంటవెంట పడితీవీ వేధించి చంపుతుంటీవి


బావ నువ్వు అంటే భలే మోజు అంటివి
రోజు కొంటె లుక్కులిచ్చి నవ్వు రువ్వుతుంటివి
నిమ్మతోట కాడ నన్ను చేరమంటివి
తీర చేరినాక నువ్వు తుర్రుమంటివీ
నమ్మానమ్మ నీ మాట 
ఆశ హుష్ కాకాయె ఈ పూట
నమ్మానమ్మ నీ మాట 
ఆశ హుష్ కాకాయె ఈ పూట

మాచర్ల సంతకెళ్ళి పూలుతెస్తివి
కొప్పులోన గుచ్చమంటె నడుము నొక్కబోతివి
మంచెకాడ కొంగు పట్టి లాగబోతివి
నన్ను అటూ ఇటూ కదలకుండ చేయి పట్టుకుంటివి
పైటలాగుతుంటీవి నువ్ పరేషాను పెడుతుంటివి
పైటలాగుతుంటీవి నువ్ పరేషాను పెడుతుంటివి


ఊరిలోన పేరువున్న పోరగాడిని
నీ ఒంపుసొంపు చూసి వదిలిపెట్టలేకపోతిని
ఊరగాయలాంటి నీ ఊపు చూస్తిని
అబ్బ నోరు ఊరి ఒక్కసారి ముందుకొస్తినీ
పట్టేయ్ పిల్ల ఇంక నా చేయి
శివరాత్రే ఇంక ప్రతి రేయి
పట్టేయ్ పిల్ల ఇంక నా చేయి
శివరాత్రే ఇంక ప్రతి రేయి

కందిచేనుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు
ముందు ముందు కొచ్చినావు ముద్దుపెట్ట చూసినావు
ఎట్టా ఉంది మామ ఒళ్ళు నీకేట్టా ఉంది మామ ఒళ్ళు
ఎట్టా ఉంది మామ ఒళ్ళు ఎట్టెట్ట ఉంది నీ ఒళ్ళూ..


అరె అందమంత ఆరబోసి గడ్డిమోపు ఎత్తుకోని
గట్టుమీద పోతు ఉంటె వయసు వేడి మీద ఒళ్ళు
ఇట్టిట్టా ఉంది పిల్ల ఒళ్ళూ
ఇట్టా ఉంది పిల్ల ఒళ్ళూ ఎట్టేట్టో ఉంది పిల్లా ఒళ్ళూ
  శుక్రవారం, ఫిబ్రవరి 23, 2018

తమలాపాకు నెమలి సోకు...

దిల్ చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దిల్ (2003)
సంగీతం : R.P.పట్నాయక్
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : R.P.పట్నాయక్, ఉష

తమలాపాకు నెమలి సోకు
తమలాపాకు నెమలి సోకు
అటువైపు ఇటువైపు సొగసే నీకు
ఇకచాలు అతిగా మరి పొగడమాకు
పలుకే చిలకా పలుకు
ఇదిగో పిల్లగో వద్దకు రాకు
తమలాపాకు నెమలి సోకు

నిన్న మొన్న రెండు జళ్ళ బుల్లి బొమ్మవు కాదా
నాతో పాటు నువ్వు కూడా అమ్మ కూచివేగా
పైట వేసి వెయ్యంగానే వయ్యారమెందుకే భామ
అహ కొంటె చూపులు ఎక్కువాయె మీసమొచ్చినందుకా
నడుము చిక్కెనే నడక మారెనే ఇంతలోపల ఏమి జరిగినే
మొదటిసారిగా ఆడపిల్లను చూసినట్టుగా మైకం మీకు

తమలాపాకు నెమలి సోకు

బాపు గీసే కుంచెకు నువ్వు ఇష్టమంటనే పిల్ల
నువ్వే చక్కని చుక్కావంటూ సూటిగా చెప్పచ్చుగా
చిన్ని నవ్వు నవ్వమంటే కోపమెందుకే మీకు
పాపం పోనీ అంటూ నవ్వితే ప్రేమిస్తామంటారుగా
ఓరి దేవుడో గుండెలోపలి అసలు సంగతి ఎలా తెలిసెరో
మాట ముసుగులో మనసు ఏమిటో
మాకు తెలియదా పోవోయ్ బోకు

తమలాపాకు నెమలి సోకు
అటువైపు ఇటువైపు సొగసే నీకు
ఇకచాలు అతిగా మరి పొగడమాకు
పలుకే చిలకా పలుకు
ఇదిగో పిల్లగో వద్దకు రాకు
తమలాపాకు నెమలి సోకు

 

గురువారం, ఫిబ్రవరి 22, 2018

పాతికేళ్ళ చిన్నది...

బలుపు చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బలుపు (2013)
సంగీతం : ఎస్.ఎస్. థమన్
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : మిక సింగ్, రనైనా రెడ్డి

చిన్నదీ... ఎస్సన్నదీ...
హే చిన్నదే.. ఎస్సన్నదే..

హే పాతికేళ్ళ చిన్నది చేపకళ్ళ సుందరి
చూపుతోనె గుచ్చి గుచ్చి చంపుతున్నదే

హెయ్ ధూమ్ ధామ్ గున్నది దుమ్మురేపుతున్నది
బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే హే
చిన్నదే.. ఎస్సన్నదే..

హోయ్ అస్సలేమి ఎరగనట్టుగ
ఓ పిల్లడ అంతలాగ ఫొజు కొట్టకా
ఓ తస్సదీయ ఉన్నపాటుగ
రొమాన్సులొ రెచ్చిపోతె తప్పులేదుగా


గండుచీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు
మందు పాతరెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు
రా రా రా రా రే...

హే పాతికేళ్ళ చిన్నది చేపకళ్ళ సుందరి
చూపుతోనె గుచ్చి గుచ్చి చంపుతున్నదే

హెయ్ ధూమ్ ధామ్ గున్నది దుమ్మురేపుతున్నది
బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే హే
చిన్నదే.. ఎస్సన్నదే..

హెయ్ పాడుకళ్ళు నిన్ను నన్ను చూడకుండ
వచ్చి కొంగు చాటు దూరిపోర సుబ్బరంగా

హెయ్ గాలి కూడ మధ్యలోకి చేరకుండ
నిన్ను దిండు లాగ హత్తుకుంటానే
నిన్ను కన్న అమ్మ బాబు సల్లగుండ
నీకు అత్త మామ ఎంత ప్రేమ బుజ్జికొండ
మూడు ముళ్ళ ముచ్చటవ్వగానె
ఆరోజు నువ్వు ఏడు వంకీలిస్తానంటవా
బిందేలొన ఉంగరాలనీ తమాషాగా
వంగి వంగి తీస్తనంటవా


లేగధూడ గెంతినట్టు జామకాయ తెంపినట్టు
వానవిల్లు వంగినట్టు పిల్లవాగు పొంగినట్టు
రా రా రా రా రే...

పాతికేళ్ళ చిన్నది చేపకళ్ళ సుందరి
చూపుతోనె గుచ్చి గుచ్చి చంపుతున్నదే
చిన్నదీ.. ఎస్సన్నదీ

హే ధూమ్ ధామ్ గున్నది దుమ్మురేపుతున్నది
బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే...
చిన్నదే.. ఎస్సన్నదే..

హే గళ్ళ చీర కట్టినావె సామిరంగా
నువ్వు సన్న రైక చూడలేదు అమ్మ దొంగ
హే సన్నజాజులెట్టుకోవే రంగ రంగ
జాము రాతిరంత జాతరైతదే
హెయ్ ఎడుమల్లెలెత్తు ఉంది కచ్చితంగా
నువు అందమంత ఎత్తుకెళ్ళు అప్పనంగా
హెయ్ వెన్నపూస లాగ ఉంటవె
నడుములో నల్లపూస నంజుకుంటవే
ఆవురావురావురంటవె 
హయబ్బో ఆగమన్న ఆగనంటవే
హెయ్ పూలకొమ్మ ఊగినట్టు తేనె పట్టు రేగినట్టు
పంచదార ఒలికినట్టు పచ్చబొట్టు పొడిచినట్టు
రా రా రా రా రే...

హే పాతికేళ్ళ చిన్నది చేపకళ్ళ సుందరి
చూపుతోనె గుచ్చి గుచ్చి చంపుతున్నదే
చిన్నదే.. ఎస్సన్నదే..

ధూమ్ ధామ్ గున్నది ధుమ్మురెపుతున్నది
బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదె హే
చిన్నదే.. ఎస్సన్నదే.. 

 

బుధవారం, ఫిబ్రవరి 21, 2018

ఏ కాశీలోనో సిగ్గు ఎగ్గు...

కొండపల్లి రాజా చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కొండపల్లి రాజా (1993)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర 

ఏ కాశీలోనో సిగ్గు ఎగ్గు ఒగ్గేసాకే ఒళ్ళోకొచ్చా
ఏం చేస్తావో చేసేసెయ్యి మావ
యమ్మహో యమ్మహో యమ్మహా
విందులే అందుకో కమ్మహా

ఏ గంగల్లోనో గుట్టు మట్టు కలిపాసాకే కౌగిళ్ళిచ్చా
ఏమిస్తావో ఇచ్చేసెయ్యే భామ
యమ్మహో యమ్మహో యమ్మహ
కమ్మహ కొట్టనా చుమ్మహ
యమ్మహో యమ్మహో యమ్మహ
కమ్మహ కొట్టనా చుమ్మహ

కన్ను కొట్టుడు రోజుల్లో కాగే కౌగిళ్ళల్లో
నీ ప్రేమకే సెగనై తగిలా

పైట లాగుడు పూటల్లో సాగే సంద్యాటల్లో
నీ సిగ్గులే నిరుడే అడిగా
తొణికే పాలే.. తొలి కోపాలై
తడి రూపాలే.. ఒడి దీపాలై
గిల్లి గిల్లికజ్జాలెట్టి బుల్లి బుల్లి బుజ్జాయంటి
ఈడును లేపి వెచ్చని తోడై దౌడే తీస్తుంటే
యమ్మహో యమ్మహో యమ్మహా
ఎక్కడో నొప్పిగా ఉందహా


ఏ గంగల్లోనో గుట్టు మట్టు కలిపాసాకే కౌగిళ్ళిచ్చా
ఏమిస్తావో ఇచ్చేసెయ్యే భామ
యమ్మహో యమ్మహో యమ్మహ
కమ్మహ కొట్టనా చుమ్మహ

ఏకపక్కల రాత్రుల్లో మల్లె మాగాణుల్లో
నీ వన్నెలో వెన్నలే చిలికా
తెల్లవారని పొద్దుల్లో తెరిచే వాకిళ్ళల్లో
నా నవ్వులే ముగ్గులో కలిపా

మనసే నీవై.. తనువే నేనై
శృతిలో ఉంటే.. పతిగా ఓకె
చెట్టాపట్టా చమంతుల్లో కట్టు బొట్టు గల్లంతుల్లో
హద్దులు దాటి అల్లరి చేసి ముద్దే దోస్తుంటే

యమ్మహో యమ్మహో యమ్మహ
ఎప్పుడో ఎక్కడో అం అహ

ఏ కాశీలోనో సిగ్గు ఎగ్గు ఒగ్గేసాకే ఓళ్ళోకొచ్చా
ఏం చేస్తావో చేసేసెయ్యి మావ

యమ్మహో యమ్మహో యమ్మహ
కమ్మహా కొట్టనా ఊఊమ్మహా..

ఏ గంగల్లోనో గుట్టు మట్టు కలిపాసాకే కౌగిళ్ళిచ్చా
ఏమిస్తావో ఇచ్చేసెయ్యే భామ
యమ్మహో యమ్మహో యమ్మహ
విందులే అందుకో కమ్మహా

యమ్మహో యమ్మహో యమ్మహ
యమ్మహో యమ్మహో యమ్మహ 

 

మంగళవారం, ఫిబ్రవరి 20, 2018

మామ ఎక్ పెగ్ లా...

పైసా వసూల్ చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పైసా వసూల్ (2017)
సంగీతం : అనూప్ రూబెన్స్
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : బాలకృష్ణ, దివ్యాదివాకర్

మామ ఎక్ పెగ్ లా
అరె మామ ఎక్ పెగ్ లా
హే... మెడిసిన్ తీసుకోకుండా
నాగిని డాన్స్ ఏంటి బే
ఇటు రా... చూడు
ఇదిగో ఇదిగో బాసు మిల మిల మెరిసే గ్లాసు
అందులో 60ఎంఎల్ రెండే ఐస్ క్యూబు
ఎస్తే సోడా ఎస్కో లేదంటే నీళ్లే పోస్కో
అరె తిప్పు తిప్పు తిప్పు నౌ సిప్పు సిప్పు సిప్పు
అరె మామ ఎక్ పెగ్ లా
అరె మామ ఎక్ పెగ్ లా
నాగిని డాన్స్...
నాగిని డాన్స్...

నచ్చిన గర్ల్ ఫ్రెండ్ హ్యాండిస్తే నమ్మిన ఫ్రెండ్ బ్యాండేస్తే
వచ్చే టెండర్ మిస్సైతే బిజినెస్ మొత్తం డల్ అయితే
అయ్యో... అయ్యయ్యో
ఎంతెంత చేస్తున్నా ఇంట బయట షంటేస్తే.
ఎన్నెన్ని ఇస్తున్నా హా ఇంకా తెమ్మని గెంటేస్తే...
అరె మామ ఏక్ పెగ్ లా
అరె మామ ఏక్ పెగ్ లా
తిప్పు తిప్పు తిప్పు నౌ సిప్పు సిప్పు సిప్పు
అరె మామ ఏక్ పెగ్ లా
అరె మామ ఏక్ పెగ్ లా
హే సామిరంగా బాగుందే పిచ్చ పిచ్చగ నచ్చిందె
గిరగిర తిరిగిందె భూమి కిందకి జారిందె
నల్లనివన్నీ నీళ్లనుకున్నా తెల్లనివన్ని పాలనుకున్నా
మధ్యలో ఇంకొంటుందని తెలిసిందే...

హే పామోస్తుంది తప్పుకోండి తప్పుకోండి

పక్కోడాస్తి కలిసొస్తే పట్టిందల్లా గోల్డైతే
డోనాల్డ్ ట్రంపే ఫోన్ చేసి అమెరికా రమ్మని పిలిచేస్తే.
వామ్మో... వామ్మో...
కాస్ట్లీగా కలకంటే మార్నింగ్ కల్లా నిజమైతే
నిన్నొద్దన్న గర్ల్ ఫ్రెండ్‌కి సన్నాసోడే మొగుడైతే.
అరె మామ ఏక్ పెగ్ లా
అరె మామ ఏక్ పెగ్ లా
నాగిని డాన్స్ ఇట్స్ నాగిని డాన్స్
హే తస్సదియ్య అదిరిందే దారుణంగా ఎక్కిందే
ప్రాణం ఎగిరిందె స్వర్గం చేతికి తగిలిందె
ఊగేటోళ్ళని బ్యాడ్ అనుకున్నా
తూగేటోళ్ళని మ్యాడ్ అనుకున్నా.
ఊరికే తాగట్లేదని తెలిసిందే...

శభాష్. నా నాగిని ట్రాక్‌లోకి వచ్చేసింది. దా...
అరె మామ ఏక్ పెగ్ లా
అరె మామ ఏక్ పెగ్ లా
అరె మామ ఏక్ పెగ్ లా
అరె అరె అరె అరె అరె మామ మామ మామ
మామ మామ మామ మామ మామ మామా...
ఏక్ పెగ్ లా 

హెచ్చరిక : మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సోమవారం, ఫిబ్రవరి 19, 2018

కెవ్వ్ కేక...

గబ్బర్ సింగ్ చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గబ్బర్ సింగ్ (2012)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : సాహితి
గానం : మమతా శర్మ, ఖుషి మురళి 

ఏ.. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఏలెట్టుకుని
ఈదెంట నేనెళ్తుంటే కెవ్వ్ కేక నా ఈదంతా కెవ్వ్ కేక
పాపిటి బిళ్ళెట్టుకుని మామిడి పళ్ళట్టుకుని
ఊరెంట నేనెళ్తుంటే కెవ్వ్ కేక నా ఊరంతా కెవ్వ్ కేక
ఎసరు లాగ మరుగుతుంది ఒంట్లో కారం
స్పెషల్ మీల్సు లెక్కుంటది నాతో బేరం
నా ఈడు కొత్తిమీర నా సోకు కోడికూర
నువు రాక రాక విందుకొస్తే కోక చాటు పెట్టిస్తా

కెవ్వ్ కేక నా సామిరంగా కెవ్వ్ కేకా
కెవ్వ్ కేక దీని తస్సదియ్యా కెవ్వ్ కేకా
కెవ్వ్ కేక నా సామిరంగా కెవ్వ్ కేకా
కెవ్వ్ కేక దీని తస్సదియ్యా కెవ్వ్ కేకా

ఆ.. నా అందం ఓ బ్యాంకు
నువ్వు దూరి నా సోకు దొంగలాగ దోచావంటే
ఆ దోచేస్తే.. కెవ్వ్ కేక నీ సోకుమాడ కెవ్వ్ కేకా
నా బుగ్గలోని మెరుపుల్తో అగ్గిపుల్ల రాజేసి నీ బీడీ నే ఎలిగిస్తే
ఆ వెలిగిస్తే.. కెవ్వ్ కేక నీ దుంప తెగ కెవ్వ్ కేకా
నా టూరింగ్ టాకీసు రిబ్బను కట్టు కెవ్వ్ కేక
నువ్వొచ్చి షో మీద షోలే పెట్టు కెవ్వ్ కేక
చూశారు ట్రయిలరు ఇక చూస్తే ఫుల్ పిక్చరు
మీ ఒంటి నిండ చిచ్చు రేగి పిచ్చెక్కి పెడతారు

కెవ్వ్ కేక నా సామిరంగా కెవ్వ్ కేకా
కెవ్వ్ కేక దీని తస్సదియ్యా కెవ్వ్ కేకా

హే కొత్త సిల్కు గుడ్డల్లె గల్ఫు సెంటు బుడ్డల్లె
ఝలక్ లిచ్చు నీ జిలుగులే
అబ్బో కెవ్వ్ కేక ఓ రత్తాలు కెవ్వ్ కేకా
హే వేడి వేడి లడ్డల్లే డబుల్ కాట్ బెడ్డల్లే
వాటమైన వడ్డింపులే
కెవ్వ్ కేక ఓ రత్తాలు కెవ్వ్ కేకా
హే జోరు మీద గుర్రాలు నీ ఊపులే కెవ్వ్ కేక
ఊరు వాడ పందేలు నీ సొంపులే కెవ్వ్ కెవ్వ్ కేక
నే పట్టుకుంటే లాఠీ పడలేరు ఎవరు పోటీ
ఓ గోలి సోడా తాగి నీతో ఘొల్లుమంటు పెట్టిస్తా

కెవ్వ్ కేక నా సామిరంగా
కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కేకా
కెవ్వ్ కేక దీని తస్సదియ్యా
కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కే..క
కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్
కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్
కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్
కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్
కెవ్వ్ కేకా...


ఆదివారం, ఫిబ్రవరి 18, 2018

ఆటకావాలా పాటకావాలా...

అన్నయ్య చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అన్నయ్య (1999)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : భువనచంద్ర
గానం : సుఖ్వీందర్ సింగ్, రాధిక

ఆటకావాలా పాటకావాలా
స్వచ్చమైన అచ్చతెలుగు బీటు కావాలా
ఆటకావాలి పాటకావాలి
గాజువాక సెంటర్లో ఫ్లాటు కావాలి

ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ
మానేదెట్టా గురువా అది నా హాబీ
ఊపేయ్ ఒళ్ళే చేసేయ్ డ్రిల్లే
భూగోళం అదిరేలా కదం తొక్కాలి
స్వీటుకావాలా హాటుకావాలా
నాణ్యమైన నాటుచికెన్‌ లెగ్స్ కావాలా
స్వీటు కావాలి హాటు కావాలి
రాసిస్తే వైజాగ్ స్టీలు ఫ్లాంటు కావాలి


ఝులుకు ఝులుకు కులుకులతో నడిచే ఓ పోరీ
నీ తళుకు బెళుకు అందాలతో మత్తెక్కించేపోరీ
చూపులతో నా మనసును గుచ్చేసావే నారీ
నిను చూస్తే మనసాగనందే ఆయాం వెరీ సారీ

చల్లకొచ్చి ముంత దాస్తే లాభం లేదే
పిల్లగాలి గిల్లుతుందీ దిల్‌ దే దేదే
మండపేట కుర్రదాన్ని ఓ బాబయ్యో
మనీ పర్సు చూస్తే తస్సదియ్యా మహా ఇదయ్యో

ఓకే రాణీ చేస్తా బోణీ ఆపైన చెప్పొద్దే మరో కహానీ

చిప్స్ కావాలా లిప్స్ కావాలా
గరం గరం సింగపూరు పప్సు కావాలా
చిప్స్ కావాలీ లిప్స్ కావాలీ
అప్పనంగా ఇస్తే షిప్సు యార్డ్ కావాలీ


కింగులాంటి నిన్ను చూస్తే మనసౌతాంది
నీ డ్ర్రెస్సుతోటి రావాలంటే సిగ్గేత్తాందీ

పట్టుచీర కొనిపెడితే ముంబాయి బుల్లి
గట్టిపట్టు పట్టనిస్తావా జూకామల్లీ
అయితే రడీ పట్టేయ్యి గిల్లీ
కమ్మంగా ఆడేద్దాం కిస్సు కబాడీ


దిండు కావాలా దుప్పటి కావాలా
లైటు లైట్ లండన్‌ ఫోం బెడ్డుకావాలా
దిండు కావాలీ దుప్పటి కావాలీ
రెచ్చిపోతే మినపసున్ని ఉండ కావాలీ

ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ
మీనేదెట్టా గురువా అదినా హాబీ
ఊపేయ్ ఒళ్ళే చేసేయ్ డ్రిళ్ళే
భూగోళం అదిరేలా కదం తొక్కాలే

స్వీటు కావాలా హాటు కావాలా
నాణ్యమైన నాటు చికెన్‌ లెగ్స్ కావాలా
స్వీటు కావాలి హాటు కావాలి
మస్తుమస్తు మెగాస్టార్ ముద్దు కావాలిశనివారం, ఫిబ్రవరి 17, 2018

బూచాడే బూచాడే...

రేసుగుర్రం చిత్రం లోనుండి ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రేసుగుర్రం (2014)
సంగీతం : తమన్
సాహిత్యం : చంద్రబోస్
గానం : రాహుల్ నంబియార్, నవీన్ మాధవ్, శ్రేయ ఘోషల్

బూ… బూ… బూ… బూ… బూ… బూ… బూచాడే
చాడే… చాడే … చాడే … చాడే…. చాడే … చాడే…
డిఫెక్ట్ గాడే.. భలే డిఫెక్ట్ గాడే..
క కనెక్ట్ గాని ఐపోతే డిస్కనెక్ట్ కాడే..
బూ… బూ… బూ… బూ… బూ… బూ…
డిఫెక్ట్ గాడే.. భలే డిఫెక్ట్ గాడే..
క కనెక్ట్ గాని ఐపొతే దిస్కనెక్ట్ కాడే..
రేసు గుర్రం లాంటోడే రివర్స్ గేరే లేనోడే
ఫొకస్ పెట్టేస్తాడే ఫిక్స్ అవుతాడే గోలే కొడతాడే
బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
బలేటోడే గిల్లేటోడే బ్లూటూతై వుంటాడే
బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
బిగిస్తాడే తెగిస్తాడే భీబత్సం అవుతాడే

బూ… బూ… బూ… బూ… బూచాడే
చాడే… చాడే … చాడే … చాడే…. చాడే … చాడే.
డిఫెక్ట్ గాడే.. భలే డిఫెక్ట్ గాడే..
క కనెక్ట్ గాని ఐపోతే దిస్కనెక్ట్ కాడే..

బూ… బూ… బూ… బూచాడే
చాడే… చాడే… చాడే… చాడే… చాడే… చాడే…
ఓ సాల సాల సాలా నీ చూపె మస్సాలా
ఓ సాల సాల సాలా నీ ఊపె మిస్సైలా
ఓ నిక్కిన జింకల నక్కిన దిక్కుల
లెక్కలు బొక్కలు తేల్చేయరా
చిక్కిన చక్కని చెక్కర ముక్కను
వక్కలు చెక్కలు చేసెయరా
తూ ఆజా రే తూ ఆజా రే
ముఝే లేజారే సాలా…

బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
బలేటోడే గిల్లేటోడే బ్లూటూతై వుంటాడే
బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
బిగిస్తాడే తెగిస్తాడే భీబత్సం అవుతాడే

బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
కిరాకోడే గిరాకోడే బీ కేర్ ఫుల్ అంటాడే బూచాడే
బూచాడే బూచాడే భూం భూం భూం చేస్తాడే
సునామీకే బినామోడే బోటే తెత్తాడే…
బూచాడే బూచాడే చ చ చ చ చ బూచాడే… బూచాడే.. 

 

శుక్రవారం, ఫిబ్రవరి 16, 2018

జోర్సే జోర్సే జోరు...

మగధీర చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మగధీర (2009)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : చంద్రబోస్
గానం : దలేర్ మెహందీ, గీతా మాధురి

పైట నలిగితే మాయమ్మ ఒప్పుకుంటదేటి
బొట్టు కరిగితే మా బామ్మ ఊరుకుంటదేటి
అదే జరిగితే.. ఓలమ్మో...
అదే జరిగితే...అత్తమ్మ తట్టుకుంటదేటి

ఏటి సెప్పనూ... నానేటి సెప్పనూ... నానేటి సెప్ప

చెప్పానే చెప్పద్దు చెప్పానే చెప్పద్దు వంకా
తిప్పానే తిప్పుతూ డొంకా
చేతుల్లో చిక్కకుండా జారిపొకే జింకా
పారిపోతే ఇంకా మొగుతాదే ఢంకా
చెప్పానే చెప్పద్దు వంకా ఇవ్వానే ఇవ్వద్దు ధంకా
ఏనాడో పడ్డదంట నీకు నాకు లింకా
నువ్వు నేను సింకా ఓసి కుర్ర కుంకా
ఎక్కడ నువ్వెళితే అక్కడ నేనుంటా
ఎప్పుడు నీ వెనకే యేయి యేయి
యేయి యేయి యేయి యేయి

జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే
బార్సే బార్సే బారు బారు బార్సే
జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే
బార్సే బార్సే బారు బారు బార్సే
జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే
బార్సే బార్సే బారు బారు బార్సే
జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే
బార్సే బార్సే బారు బారు బార్సే
 
ఇయ్యాల మంగళవారం మంచిది కాదు
మానేసేయ్..సేయ్ ...సేయ్... సేయ్

నీ వెంట పడతా బొంగరమై
నీ చుట్టుముడతా పంజరమై
నీ సిగ్గు కొస్తా కొడవలినై
నమిలిపిస్తా కవ్వానై హేయ్ .
షావా అరె షావా అరె షావా షావా షావా షావా
నీ వెంట పడతా బొంగరమై
నీ చుట్టుముడతా పంజరమై
నీ సిగ్గు కొస్తా కొడవలినై
నమిలిపిస్తా కవ్వాన్నై
నిప్పుల ఉప్పెనలే ముంచుకు వస్తున్నా
నిలువను క్షణమైనా యేయి యేయి .
యేయి యేయి యేయి యేయి
 దిక్కుల్ని దాటే అడుగును నేనై 
గుండెల్లో దిగుతా జండానై . 
జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే 
బార్సే బార్సే బారు బారు బార్సే
చుక్కల్ని తాకే పరుగును నేనై 
చూపించనా బ్రహ్మాండాన్నే 
జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే
బార్సే బార్సే బారు బారు బార్సే
అలవాటు లేనే లేదు అయ్యే దాక ఆగేసేయ్

ఏయ్ పిల్లడూ ఏయ్ ఏయ్ పిల్లడూ
ఓయ్ పిల్లడూ ఓయ్ ఓయ్ పిల్లడూ
చలెక్కుతున్న వేళ చింతచెట్టు నీడలోకి
చురుక్కు మన్న వేళ పాడుబడ్డ మేడలొకి
వాగులోకి వంకలోకి సంతలోకి చాటులోకి
నారుమళ్ళతోటలోకి నాయుడోళ్ళ పేటలోకి
ఊల్లిచేను పక్కనున్న రెల్లుగడ్డిపాకలోకి పిల్లడో ఏం పిల్లడో
ఏం పిల్లడో ఎల్దం వస్తవా ఏం పిల్లడో ఎల్దాం వస్తవా

వస్తా బాణాన్నై రాస్తా బలపాన్నై
మోస్తా పల్లకినై ఉంటా పండగనై
నీ దరి కొస్తా బాణాన్నై నీ పేరు రాస్తా బలపాన్నై
నీ ఈడు మోస్తా పల్లకినై నీ తోడు ఉంటా పండగనై
పిడుగుల సుడిలోనా ప్రాణం తడబడినా
పయనం ఆగేనా యేయి యేయి ..
యేయి యేయి యేయి యేయి

జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే
బార్సే బార్సే బారు బారు బార్సే
జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే
బార్సే బార్సే బారు బారు బార్సే
జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే
బార్సే బార్సే బారు బారు బార్సే
జోర్సే జోర్సే జోరు జోరు జోర్సే
బార్సే బార్సే బారు బారు బార్సే


గురువారం, ఫిబ్రవరి 15, 2018

నువ్వు విజిలేస్తే...

సింహాద్రి సినిమాలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సింహాద్రి (2003)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : చంద్రబోస్
గానం : టిప్పు, చిత్

నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ
నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ
అది వినపడుతుంటే అలజడి రేగి జారుతుంది మిడ్డీ

నీ అధరామృతం పుల్లారెడ్డి
నీ అధరామృతం పుల్లారెడ్డి
అరకేజి అప్పుగ ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డి

నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ
నీ అధరామృతం పుల్లారెడ్డి

కన్నెబాడీ కాదమ్మో అది జీడిపప్పు జాడీ
నిన్నుచూసి పట్టా తప్పే పడుచు రైలు గాడీ
ఎన్ని కోట్ల విలువుంటుందో నువ్వు కాల్చు బీడీ
ఎప్పుడంకుల్ అవుతాడయ్యో నిన్ను కన్న డాడీ

వేస్తా బేడీ చేస్తా దాడి సొగసుల బావిని తోడి
రారా రౌడీ దాదా కేడీ రాత్రికి చూసెయ్ త్రీడీ
నీ గుర్రం కోసం పెంచా నేనే...
నీ గుర్రం కోసం పెంచా నేనే వెచ్చనైన గడ్డి


నీ అధరామృతం పుల్లారెడ్డి.. డీ..డీ..
నీ అధరామృతం పుల్లారెడ్డి
అరకేజీ అప్పుగా ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ
నువు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి.. డీ..డీ

కోక బ్యాంకు లాకర్లోనా దాచుకోకు వేడి
చెక్కులిస్తే చిక్కొస్తుందే ఇచ్చుకోవే డీడీ
నువ్వు తాకకుంటే పువ్వు పోవునంట వాడి
సుబ్బరంగా సుఖపడిపోరా దాన్ని నువ్వు వాడి

అరె పుంజుకు కోడి...
పంటకు పాడి నువ్వూ నేనొక జోడీ
చింతల్‌పూడి చిలకల్‌పూడి పోదామా జతకూడి
ఓరయ్యో నీది చెయ్యేకాదు...

హేయ్
ఓరయ్యో నీది చెయ్యేకాదు... విశాఖ ఉక్కు కడ్డీ...

నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ
అది వినపడుతుంటే అలజడి రేగి జారుతుంది మిడ్డీ

నీ అధరామృతం పుల్లారెడ్డి
అరకేజి అప్పుగ ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డి
వేస్కో... వేస్కో... విజిలేస్కో... 

 

బుధవారం, ఫిబ్రవరి 14, 2018

ఛల్ మార్...

మిత్రులందరకూ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ఈ రోజు అభినేత్రి చిత్రంలోని ఒక హుషారైన పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అభినేత్రి (2016)
సంగీతం : సాజిద్-వాజిద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : నకాష్ అజిజ్

హాట్ హాట్ ఊరిలో
హాట్ హాట్ రోడ్ లో
షార్ట్ స్కర్ట్ లో జన్నీఫర్
డిష్యుం డిష్యుం సౌండ్ లేదు
బ్లడ్ కూడ కాన రాదు
అందమెట్టి గుద్దినావే
ఘుమ్ ఘుమ్ ఘుమ్

హే సంపినాదే పైకి పంపినాదే
నీ ఓర చూపు సైనాయిడే
లవ్ యూ చెప్పి మళ్ళి నాలో ప్రాణం
నింపుకోవే బుజ్జికొండే
హే నడుమొంపే స్మైలీలా
నాకు ఓకే చెప్పేలా
బెండ్ ఇట్ లైక్ బెక్ హం బేబీ

చల్ మార్

లవ్ ఫీలే ఉంది కదా నో బాలే వెయ్యకలా
నీ హార్టుకొక కర్టేయిన్ వేసి మూసేయకే
ఛి పో చిరాకేలా లైట్ తీసుకో మధుబాలా
ఐ లవ్ యూ చెప్పడానికిన్ని మంతనాలా
పడిపోదాం పడి పైకి లేద్దాం
మళ్ళి మళ్ళి లవ్ లో పడిపోదాం
రాయే పిల్లా జోడి లవ్ బర్డ్స్ మనమై
మబ్బుల్ని టచ్ చేద్దాం

ఏయ్ నడుమొంపే స్మైలీ లా
నాకు ఓకే చెప్పేలా
బెండ్ ఇట్ లైక్ బెక్ హం బేబీ
ఛల్ మార్

చల్ మార్
రొమాంటిక్ కృష్ణున్నే లవ్ మేజిక్ చేస్తానే
నా రాసలీల రాధవు నువ్వేనే
నీ చూపే మాన్సూనే సహారాల ఉన్నానే
నా గుండె ఝల్లు వాన జల్లు నువ్వేనే
ఫుల్ మూన్ లో రంగు రెయిన్బో లా
జిల్ జిగేల్ మన్నావే
రోడ్ సైడు టీ కొట్టు బోయిలర్ లా
నన్ను హీట్ ఎక్కించావే

ఏయ్ నడుమొంపే స్మైలీ లా
నాకు ఓకే చెప్పేలా
బెండ్ ఇట్ లైక్ బెక్ హం బేబీ

చల్ మార్


మంగళవారం, ఫిబ్రవరి 13, 2018

శివ శివ శంభో...

మిత్రులందరకూ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు నాగుల చవితి చిత్రంలోని ఒక చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ.


చిత్రం : నాగులచవితి (1956)
సంగీతం : ఆర్.గోవర్థనం/ఆర్.సుదర్శనం
సాహిత్యం : పరశురాం
గానం : పి.బి.శ్రీనివాస్

వందే శంభు ఉమాపతిం
సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం
మృగధరం వందే పశూనామ్ పతిం
వందే సూర్య శశాంక వహ్ని నయనం
వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రంచక వరదం
వందే శివం శంకరం

శివ శివ శంభో భవ భయహర శంభో
శివ శివ శంభో భవ భయహర శంభో
శివ శివ శంభో భవ భయహర శంభో
శివ శివ శంభో భవ భయహర శంభో
శివ శివ శంభో భవ భయహర శంభో
శివ శివ శంభో భవ భయహర శంభో


శైలజా మనోహరా కృపాకరా
ఫాలనేత్ర భీకరా పాపహరా
శైలజా మనోహరా కృపాకరా
ఫాలనేత్ర భీకరా పాపహరా

శివ శివ శంభో భవ భయహర శంభో
శివ శివ శంభో భవ భయహర శంభో


జాహ్నవీ జఠాధరా పరాత్పరా
నిర్వికార సుందరా సౌఖ్యధరా
జాహ్నవీ జఠాధరా పరాత్పరా
నిర్వికార సుందరా సౌఖ్యధరా

శివ శివ శంభో భవ భయహర శంభో
శివ శివ శంభో భవ భయహర శంభో

ఓం.. ఓం.. ఓం.. ఓం... 

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.