సోమవారం, ఫిబ్రవరి 26, 2018

ఇంతన్నాడంతన్నాడే గంగరాజు...

తప్పుచేసి పప్పుకూడు చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : తప్పుచేసి పప్పుకూడు (2002)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : కులశేఖర్
గానం : మోహన్ బాబు, నిత్యసంతోషిణి
 
ఓలమ్మో... ఓలప్పో...
ఇంతన్నాడంతన్నాడే గంగరాజు
ముంతమామిడి పండన్నాడే గంగరాజు
హస్కన్నడు బుస్కన్నాడే గంగరాజు
నన్నొగ్గేసెల్పోనాడే గంగరాజు
ఓలమ్మో... ఓలప్పో
ఇంతన్నాడంతన్నాడే గంగరాజు
ముంతమామిడి పండన్నాడే గంగరాజు
హస్కన్నడు బుస్కన్నాడే గంగరాజు
నన్నొగ్గేసెల్పోనాడే గంగరాజు
ఓలమ్మో ఒంటరిగా వదిలేసి ఎల్పోనాడేటి
మరి నీకేటి దిక్కూ..
ఇంకేదిక్కూ.. తూరుపు దిక్కు..

తప్పుచేసి పప్పుకూడురో
తళాంగుచుక్క ఉప్పుచేప ఊరగాయరో
తప్పుచేసి పప్పుకూడురో
తళాంగుచుక్క ఉప్పుచేప ఊరగాయరో

నీకమ్మానాన్నా అప్పా సెల్లీ ఎవరూ లేరా ఓపిల్లా
నాకమ్మానాన్నా అప్పా సెల్లీ ఎవలూ లేరూ పిల్లాడా
ఎందుకేటి..
నీకెండా వానా తోడుంటాను నాతో వచ్చేయ్ ఓపిల్లా
నాకండాదండా ఉంటానంటే నమ్మేదెట్టా కుర్రోడా
భూమ్మీద ఒట్టూ, స్కై మీద ఒట్టూ
పానీ మీదొట్టూ, హవామీదోట్టూ
నాగుబాము లాంటి జడమీద ఒట్టూ
నైసుగున్న నీ మెడమీద ఒట్టూ
ఆఊరు ఈఊరు ఆడోళ్ళు మగోళ్ళు అందరిమీదొట్టూ
హయ్ బాబోయ్.. ఒట్టేసి చెప్తున్నాగదేటి పిల్లా..

నీలాగే ఒట్టేశాడోయ్ గంగరాజు
నట్టేట్లో ముంచేశాడోయ్ గంగరాజు
అందంలో రంభన్నాడోయ్ గంగరాజు
ఐనాకా ఒగ్గేశాడోయ్ గంగరాజు

నీలాగే ఒట్టేశాడోయ్ గంగరాజు
నట్టేట్లో ముంచేశాడోయ్ గంగరాజు
అందంలో రంభన్నాడోయ్ గంగరాజు
ఐనాకా ఒగ్గేశాడోయ్ గంగరాజు
ఐపోనాదేటి..
ఏటైనాదీ దెబ్బలాట... తగువాడేస్కున్నాం
ఆడొగ్గేసినాకా నా బతుకు పార్వతీపురం బస్టాండైనాది
ఏటైనాదీ... పార్వతీపురం బస్టాండు..

ఆడొగ్గేశాక ఎక్కడ తేలావ్ అయ్యోపాపం ఓ పిల్లా
ఆడొగ్గేశాకా లింగరాజు తగిలాడయ్యో పిల్లోడా
ఆ లింగోలిటుకో ఏమిచ్చాడో చెప్పవే తింగరి బుచ్చమ్మా
నా పెట్టేబేడా ఎత్తుకుపోవాలనుకున్నాడోయ్ బుల్లోడా
నాకాడకొస్తే కాపలా కాస్తా నీ పెట్టెకింకా తాళాలు వేస్తా
కోటగుమ్మం మీద జెండా జూపిస్తా 
కోడిపుంజు చేత దండమెట్టిస్తా
కాయేటి పండేటి పువ్వేటి పత్రేటి అన్నీ నీకే ఇస్తా...
ఓలమ్మో ఇన్నోటే.. మరిడౌటేందుకు మా కోటకొచ్చేయ్
తింగిరి బింగిరి జింగిరీ..
ఇట్టాగే రమ్మన్నాడోయ్ లింగరాజు
ఎల్లాక పొమ్మానోడోయ్ లింగరాజు
మేడన్నాడు మిద్దెన్నాడోయ్ లింగరాజు
మేడమీద నుయ్యన్నాడోయ్ లింగరాజు
మేడమీద నుయ్యనగానే రయ్యని లంకెలిపోనావేటీ
ఎల్లాక తెలిసిందది నుయ్యి కాదు పెద్ద గొయ్యని
ఈ మొగోళ్ళూ మా చెడ్డ మాయగాళ్ళూ

ఇంతంటారంటారే మాయగాళ్ళు
ముంతమామిడి పండంటారే మాయగాళ్ళు
అందంలో రంభంటారే కోడెగాళ్ళు
ఐనాకా ఒగ్గేస్తారే మోసగాళ్ళు 


2 comments:

మంచి ఫోక్ ట్యూన్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.