గురువారం, ఫిబ్రవరి 22, 2018

పాతికేళ్ళ చిన్నది...

బలుపు చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బలుపు (2013)
సంగీతం : ఎస్.ఎస్. థమన్
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : మిక సింగ్, రనైనా రెడ్డి

చిన్నదీ... ఎస్సన్నదీ...
హే చిన్నదే.. ఎస్సన్నదే..

హే పాతికేళ్ళ చిన్నది చేపకళ్ళ సుందరి
చూపుతోనె గుచ్చి గుచ్చి చంపుతున్నదే

హెయ్ ధూమ్ ధామ్ గున్నది దుమ్మురేపుతున్నది
బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే హే
చిన్నదే.. ఎస్సన్నదే..

హోయ్ అస్సలేమి ఎరగనట్టుగ
ఓ పిల్లడ అంతలాగ ఫొజు కొట్టకా
ఓ తస్సదీయ ఉన్నపాటుగ
రొమాన్సులొ రెచ్చిపోతె తప్పులేదుగా


గండుచీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు
మందు పాతరెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు
రా రా రా రా రే...

హే పాతికేళ్ళ చిన్నది చేపకళ్ళ సుందరి
చూపుతోనె గుచ్చి గుచ్చి చంపుతున్నదే

హెయ్ ధూమ్ ధామ్ గున్నది దుమ్మురేపుతున్నది
బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే హే
చిన్నదే.. ఎస్సన్నదే..

హెయ్ పాడుకళ్ళు నిన్ను నన్ను చూడకుండ
వచ్చి కొంగు చాటు దూరిపోర సుబ్బరంగా

హెయ్ గాలి కూడ మధ్యలోకి చేరకుండ
నిన్ను దిండు లాగ హత్తుకుంటానే
నిన్ను కన్న అమ్మ బాబు సల్లగుండ
నీకు అత్త మామ ఎంత ప్రేమ బుజ్జికొండ
మూడు ముళ్ళ ముచ్చటవ్వగానె
ఆరోజు నువ్వు ఏడు వంకీలిస్తానంటవా
బిందేలొన ఉంగరాలనీ తమాషాగా
వంగి వంగి తీస్తనంటవా


లేగధూడ గెంతినట్టు జామకాయ తెంపినట్టు
వానవిల్లు వంగినట్టు పిల్లవాగు పొంగినట్టు
రా రా రా రా రే...

పాతికేళ్ళ చిన్నది చేపకళ్ళ సుందరి
చూపుతోనె గుచ్చి గుచ్చి చంపుతున్నదే
చిన్నదీ.. ఎస్సన్నదీ

హే ధూమ్ ధామ్ గున్నది దుమ్మురేపుతున్నది
బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే...
చిన్నదే.. ఎస్సన్నదే..

హే గళ్ళ చీర కట్టినావె సామిరంగా
నువ్వు సన్న రైక చూడలేదు అమ్మ దొంగ
హే సన్నజాజులెట్టుకోవే రంగ రంగ
జాము రాతిరంత జాతరైతదే
హెయ్ ఎడుమల్లెలెత్తు ఉంది కచ్చితంగా
నువు అందమంత ఎత్తుకెళ్ళు అప్పనంగా
హెయ్ వెన్నపూస లాగ ఉంటవె
నడుములో నల్లపూస నంజుకుంటవే
ఆవురావురావురంటవె 
హయబ్బో ఆగమన్న ఆగనంటవే
హెయ్ పూలకొమ్మ ఊగినట్టు తేనె పట్టు రేగినట్టు
పంచదార ఒలికినట్టు పచ్చబొట్టు పొడిచినట్టు
రా రా రా రా రే...

హే పాతికేళ్ళ చిన్నది చేపకళ్ళ సుందరి
చూపుతోనె గుచ్చి గుచ్చి చంపుతున్నదే
చిన్నదే.. ఎస్సన్నదే..

ధూమ్ ధామ్ గున్నది ధుమ్మురెపుతున్నది
బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదె హే
చిన్నదే.. ఎస్సన్నదే.. 

 

2 comments:

లేగధూడ గెంతినట్టు జామకాయ తెంపినట్టు
వానవిల్లు వంగినట్టు పిల్లవాగు పొంగినట్టు..
పూలకొమ్మ ఊగినట్టు తేనె పట్టు రేగినట్టు
పంచదార ఒలికినట్టు పచ్చబొట్టు పొడిచినట్టు..

పక్కా మాస్ పాటలోనూ అక్కడక్కడా దాక్కున్న అందమైన మాటలు..

సరైన సంధర్బం పడితే భాస్కరభట్ల గారు కూడా చాలా బాగా రాస్తారండీ.. ఇలాంటి పాటలో కూడా అందుకే అంత అందమైన మాటలు చేర్చగలిగారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.