దిల్ చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : దిల్ (2003)
సంగీతం : R.P.పట్నాయక్
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : R.P.పట్నాయక్, ఉష
తమలాపాకు నెమలి సోకు
తమలాపాకు నెమలి సోకు
అటువైపు ఇటువైపు సొగసే నీకు
ఇకచాలు అతిగా మరి పొగడమాకు
పలుకే చిలకా పలుకు
ఇదిగో పిల్లగో వద్దకు రాకు
తమలాపాకు నెమలి సోకు
నిన్న మొన్న రెండు జళ్ళ బుల్లి బొమ్మవు కాదా
నాతో పాటు నువ్వు కూడా అమ్మ కూచివేగా
పైట వేసి వెయ్యంగానే వయ్యారమెందుకే భామ
అహ కొంటె చూపులు ఎక్కువాయె మీసమొచ్చినందుకా
నడుము చిక్కెనే నడక మారెనే ఇంతలోపల ఏమి జరిగినే
మొదటిసారిగా ఆడపిల్లను చూసినట్టుగా మైకం మీకు
తమలాపాకు నెమలి సోకు
బాపు గీసే కుంచెకు నువ్వు ఇష్టమంటనే పిల్ల
నువ్వే చక్కని చుక్కావంటూ సూటిగా చెప్పచ్చుగా
చిన్ని నవ్వు నవ్వమంటే కోపమెందుకే మీకు
పాపం పోనీ అంటూ నవ్వితే ప్రేమిస్తామంటారుగా
ఓరి దేవుడో గుండెలోపలి అసలు సంగతి ఎలా తెలిసెరో
మాట ముసుగులో మనసు ఏమిటో
మాకు తెలియదా పోవోయ్ బోకు
తమలాపాకు నెమలి సోకు
అటువైపు ఇటువైపు సొగసే నీకు
ఇకచాలు అతిగా మరి పొగడమాకు
పలుకే చిలకా పలుకు
ఇదిగో పిల్లగో వద్దకు రాకు
తమలాపాకు నెమలి సోకు
2 comments:
నెమలికన్నంత అందమైన పాట..
అవునండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.