గురువారం, ఫిబ్రవరి 08, 2018

కన్నెపిట్టరో కన్నుకొట్టరో...

హలో బ్రదర్ చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : హలోబ్రదర్ (1994)
సంగీతం : రాజ్ కోటీ
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు
 
కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ..ఓ..ఓ
పాలపిట్టరో పైటపట్టరో ఓ..ఓ..ఓ
అరె అరె అరె కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ..ఓ..ఓ
పాలపిట్టరో పైటపట్టరో ఓ..ఓ..ఓ
గుట్టు గుట్టుగా జట్టు కట్టరో
జంట చేరితే గంట కొట్టరో
ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను
పెట్టేయ్ కట్టి ఉట్టే కొట్టి తీరతాను
ఓ..ఓ..ఓ ఓ..ఓ..ఓ


చూపు చూపుకొక చిటికెల మేళం
చూసి పెట్టనా చిట్టెమ్మా
ఊపు ఊపుకొక తకధిమి తాళం
వేసిపెట్టనా చెప్పమ్మా
అదిరిపడిన కుడీ ఎడమల నడుమున
ఉడుకు వయసు ముడిపెట్టుకోనా
అసలు సిసలు లవ్ కిటుకులు తెలిసిన
పడుచు పనులు మొదలెట్టుకోనా
అదురే సరుకూ ముదిరే వరకూ
అటొ ఇటొ ఎటొ ఎటొ పడి పడి
కలేయనా అదొ ఇదొ కలబడి
ఓ..ఓ..ఓ ఓ..ఓ..ఓ 

కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ..ఓ..ఓ
అరె పాలపిట్టరో పైటపట్టరో ఓ..ఓ..ఓ

గవ్వ తిరగబడి గలగలమంటే
గువ్వ గుండెలోన రిం జిం జిం
వేడి వేడి ఒడి చెడుగుడు అంటే
సోకులాడి పని రం పం పం
మిడిసి పడిన తడి తలుపుల మెరుపులు
మెరిసి మెరిసి పని పట్టమంటే
మతులు చెడిన చెలి జిగిబిగి బిగువులు
అరిచి అరిచి మొర పెట్టుకుంటే
పనిలో పనిగా ఒడిలో పడనా
చలో చలో చెకా చెకీ చం చం
కలేసుకో ప్రియా ప్రియా కమ్ కమ్
ఓ..ఓ..ఓ ఓ..ఓ..ఓ

కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ..ఓ..ఓ
అరె పాలపిట్టరో పైటపట్టరో ఓ..ఓ..ఓ
గుట్టు గుట్టుగా జట్టు కట్టరో
జంట చేరితే గంట కొట్టరో
ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను
పెట్టేయ్ కట్టి ఉట్టే కొట్టి తీరతాను హా 


2 comments:

వన్ ఆఫ్ మోస్ట్ గ్లామరస్ సాంగ్స్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.