గురువారం, ఫిబ్రవరి 15, 2018

నువ్వు విజిలేస్తే...

సింహాద్రి సినిమాలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సింహాద్రి (2003)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం : చంద్రబోస్
గానం : టిప్పు, చిత్

నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ
నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ
అది వినపడుతుంటే అలజడి రేగి జారుతుంది మిడ్డీ

నీ అధరామృతం పుల్లారెడ్డి
నీ అధరామృతం పుల్లారెడ్డి
అరకేజి అప్పుగ ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డి

నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ
నీ అధరామృతం పుల్లారెడ్డి

కన్నెబాడీ కాదమ్మో అది జీడిపప్పు జాడీ
నిన్నుచూసి పట్టా తప్పే పడుచు రైలు గాడీ
ఎన్ని కోట్ల విలువుంటుందో నువ్వు కాల్చు బీడీ
ఎప్పుడంకుల్ అవుతాడయ్యో నిన్ను కన్న డాడీ

వేస్తా బేడీ చేస్తా దాడి సొగసుల బావిని తోడి
రారా రౌడీ దాదా కేడీ రాత్రికి చూసెయ్ త్రీడీ
నీ గుర్రం కోసం పెంచా నేనే...
నీ గుర్రం కోసం పెంచా నేనే వెచ్చనైన గడ్డి


నీ అధరామృతం పుల్లారెడ్డి.. డీ..డీ..
నీ అధరామృతం పుల్లారెడ్డి
అరకేజీ అప్పుగా ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ
నువు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి.. డీ..డీ

కోక బ్యాంకు లాకర్లోనా దాచుకోకు వేడి
చెక్కులిస్తే చిక్కొస్తుందే ఇచ్చుకోవే డీడీ
నువ్వు తాకకుంటే పువ్వు పోవునంట వాడి
సుబ్బరంగా సుఖపడిపోరా దాన్ని నువ్వు వాడి

అరె పుంజుకు కోడి...
పంటకు పాడి నువ్వూ నేనొక జోడీ
చింతల్‌పూడి చిలకల్‌పూడి పోదామా జతకూడి
ఓరయ్యో నీది చెయ్యేకాదు...

హేయ్
ఓరయ్యో నీది చెయ్యేకాదు... విశాఖ ఉక్కు కడ్డీ...

నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ
అది వినపడుతుంటే అలజడి రేగి జారుతుంది మిడ్డీ

నీ అధరామృతం పుల్లారెడ్డి
అరకేజి అప్పుగ ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డి
వేస్కో... వేస్కో... విజిలేస్కో... 

 

2 comments:

విజిల్స్ వేయించే పాటే..

అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.