నేనున్నాను చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : నేనున్నాను (2004)
సంగీతం : యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం : చంద్రబోస్
గానం : టిప్పు, సునీత
బంతి కావాలా? బాలు కావాలా?
మెంతికూర లాంటి పిల్ల చెంతకొచ్చి చేరుకుంటే
బంతెందుకు బాలెందుకు?
ఏదేదో అడగరాదూ ఇవ్వనన్నానా
ర్యాలీ రావులపాడు రేలంగి సంతలోన
ర్యాలీ రావులపాడు రేలంగి సంతలోన
నిప్పుకోడి తెచ్చినానె నిప్పుకోడి తెచ్చినానె
పెట్టియ్యవే పిల్లా పెట్టియ్యవే
పెట్టియ్యవే ఇగురు పెట్టియ్యవే
ఓరోరి బుల్లోడ వయ్యారి బుల్లోడ
వగలమారి బుల్లోడ వాల్తేరు బుల్లోడ
అంతగాను అడుగుతుంటే పెట్టీయ్యనా
అటక మీద పాత ట్రంకు పెట్టియ్యనా
ట్రంకు పెట్టీయనా...
ఉస్కులకడి గుమ్మ గుమా ఐసలకడి టంకు టమ
కర్నూలు టౌనులోన కంసాలి కొట్టులోన
కర్నూలు టౌనులోన కంసాలి కొట్టులోన
పట్టగొలుసు తెచ్చినానె పట్టగొలుసు తెచ్చినానె
కాలియ్యవే పిల్లా కాలియ్యవే
కాలియ్యవే నీ కుడి కాలియ్యవే
ఓరోరి బుల్లోడా ఒయ్యారి బుల్లోడా
వగలమారి బుల్లోడా వాల్తేరు బుల్లోడా
యింటి కెళ్ళినాక ఫోను కాలివ్వనా
యింటి కెళ్ళినాక ఫోను కాలివ్వనా
ఫోను కాలివ్వనా...
మంత్రిగారి కోటాలోన మన ఇద్దరి పేరుమీన
మంత్రిగారి కోటాలోన మన ఇద్దరి పేరుమీన
రైలు టిక్కెటు తెచ్చినానె రైలు టిక్కెటు తెచ్చినానె
చుట్తియ్యవే పిల్లా చుట్తియ్యవే
చుట్తియ్యవే బిస్తరు చుట్తియ్యవే
ఓరోరి బుల్లోడ వయ్యారి బుల్లోడ
వగలమారి బుల్లోడ వాల్తేరు బుల్లోడ
పట్టుపట్టి అడుగుతుంటే చుట్టివ్వనా
అంటు పెట్టు కుంటే గంట చుట్టివ్వనా
గంట చుట్టివ్వనా...
ఉస్కులకడి గుమ్మ గుమా ఐసలకడి టంకు టమ
అడిగింది అందుకోక అందేది అడగలేక
అడిగింది అందుకోక అందేది అడగలేక
నీరుగారి పోయినావు నీరుగారి పోయినావు
చారెయ్యనా పిలగా చారెయ్యనా
చారెయ్యనా ఉలవచారెయ్యనా
ఓసోసి బుల్లెమ్మ వయ్యారి బుల్లెమ్మా
నంగనాచి బుల్లెమ్మా నాంచారి బుల్లెమ్మా
చిలిపి చిందులాటలోన చారెయ్యవే
ఏక్, దో, తీన్, చారెయ్యవే చారు పాంచెయ్యవే
షామిరు పేటలోన షావుకారు షాపులోన
షామిరు పేటలోన షావుకారు షాపులోన
నోటు బుక్కు తెచ్చినానె నోటు బుక్కు తెచ్చినానె
రాసియ్యవే పిల్లా రాసియ్యవే
రాసియ్యవే అందం రాసియ్యవే
ఓరోరి బుల్లోడ వయ్యారి బుల్లోడ
వగలమారి బుల్లోడ వైజాగు బుల్లోడ
పొత్తుకోరి చేరుకుంటే రాసియ్యనా
నెత్తిమీద మంచినూనె రాసియ్యనా
నునె రాసియ్యనా
ఉస్కులకడి గుమ్మ గుమా ఐసలకడి టంకు టమ
మాటల పోటీలోన మీది మీది ఆటలోన
మాటల పోటీలోన మీది మీది ఆటలోన
పిల్లతోటి ఓడినావు పిల్లతోటి ఓడినావు
తీసెయ్యరో పిలగా తీసెయ్యరో
తీసెయ్యరో మీసం తీసెయ్యరో హెయ్
ఓసోసి బుల్లెమ్మ వయ్యారి బుల్లెమ్మ
రవ్వలాంటి బుల్లెమ్మ రాంగురూటు బుల్లెమ్మ
మీసకట్టు ముద్దులాటకడ్డం అంటూ
చెప్పలేక చెప్పినావే తీసెయ్ మంటూ
మీసం తీసెయ్ మంటూ...
2 comments:
ఫస్ట్ టైం విన్నప్పుడు ఆర్.పి గారి పాటనుకున్నానిది..అన్ని పాటలూ బావుంటాయీ మూవీలో..
అవునండీ అన్ని పాటలు బావుంటాయ్.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతిగారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.