సునంద లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సునంద లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

సోమవారం, నవంబర్ 11, 2019

సేవల నిధులను నీవిమ్మా...

అయ్యప్ప స్వామి జన్మ రహస్యం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సినిమాలోని పాటలు జ్యూక్ బాక్స్ లో ఇక్కడ వినవచ్చు.
 

చిత్రం : అయ్యప్పస్వామి జన్మ రహస్యం (1987)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : పి.బి.శ్రీనివాస్
గానం : సునంద 

సేవల నిధులను నీవిమ్మా
పాతక నాశక అయ్యప్ప
సేవల నిధులను నీవిమ్మా
పాతక నాశక అయ్యప్ప
ఈ నీ మాయకు లేదెల్ల
ఇక ఈ నీ దయయే నాకెల్లా
ఈ నీ మాయకు లేదెల్ల
ఇక ఈ నీ దయయే నాకెల్లా
సేవల నిధులను నీవిమ్మా
పాతక నాశక అయ్యప్ప

కనులకి దృష్టిని కలిగించీ
కాపాడిన దేవా నిను కనగా
కనులకి దృష్టిని కలిగించీ
కాపాడిన దేవా నిను కనగా
మాఎద నిండెను నీ అందం
మాఎద నిండెను నీ అందం
ఏ ఊహలకైనా ఆనందం

సేవల నిధులను నీవిమ్మా
పాతక నాశక అయ్యప్ప
ఈ నీ మాయకు లేదెల్ల
ఇక ఈ నీ దయయే నాకెల్లా
సేవల నిధులను నీవిమ్మా
పాతక నాశక అయ్యప్ప

మూగనోరైనా పాడేనే
అంధుడును స్వర్గమే చూసేనే
మూగనోరైనా పాడేనే
అంధుడును స్వర్గమే చూసేనే
ఎల్లలు గాలును నీ లీలే
ఎల్లలు గాలును నీ లీలే 
నన్నేలేవే నీ నయనాలే

సేవల నిధులను నీవిమ్మా
పాతక నాశక అయ్యప్ప
ఈ నీ మాయకు లేదెల్ల
ఇక ఈ నీ దయయే నాకెల్లా
సేవల నిధులను నీవిమ్మా
పాతక నాశక అయ్యప్ప

శరణం శరణం స్వామి శరణం
శరణం శరణం అయ్యప్ప శరణం
శరణం శరణం స్వామి శరణం
శరణం శరణం అయ్యప్ప శరణం
శరణం శరణం స్వామి శరణం
శరణం శరణం అయ్యప్ప శరణం 


బుధవారం, ఏప్రిల్ 03, 2019

ఈ సరిగమ సరదా...

మాస్టర్ తరుణ్ నటించిన తేజ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ జ్యూక్ బాక్స్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : తేజ (1992)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : చిత్ర, సునంద 

ఈ సరిగమ సరదా యాత్రలో
మీ మెదడుకు పదునే పెట్టనా
ఈ పరుగులు తీసే వయసులో
మన చదువుల మర్మం తెలుపనా
కొత్త టెక్నిక్కులెన్నో ఉన్న పిక్నిక్
పాటల్లోనా చదువుకో లోకమే
పాఠశాల కన్నా ఆటపాట మిన్న
విజ్ఞాన వీధిలో...

ఈ సరిగమ సరదా యాత్రలో
మీ మెదడుకు పదునే పెట్టనా

ఋతువుల రాణీ ఆమని
పరుగుల రాణీ అశ్వినీ
స్త్రీ కాని ఓ స్త్రీ ఉన్నదీ
క్రికెట్ లో ఎవరదీ ఎనిబడీ
మనదేశానికి పేరుతెచ్చిన ఆటల మేస్త్రీ
ఒకే ఓవర్లో సిక్స్ సిక్సర్లు కొట్టిన రవిశాస్త్రీ

ఈ సరిగమ సరదా యాత్రలో
మీ మెదడుకు పదునే పెట్టనా

పేరులోనా అది పసిదనిపించూ
ఏరియాలో అది భూమిని మించూ
ఖర్మగాలి అది పొంగి వచ్చెనా
కొంపలన్ని ముంచూ
ఏదా సాగరం చెప్పుకోండి వేగిరం
హిందూ మహాసముద్రం... నోనోనో..
అట్లాంటిక్కు ఇట్లాంటిక్కు
అన్నిటినీ దిగదొక్కు
ఆ సముద్రమే పసిఫిక్కూ.. 

ఈ సరిగమ సరదా యాత్రలో
మీ మెదడుకు పదునే పెట్టనా

దేహమన్నదే దేవాలయమని
అన్నది మన వేదం
కాదు కాదు విశ్వమన్నది
మా నవ విజ్ఞానం
ఎంత చిత్రమో చూశారా
ఎందువల్లనో చెబుతారా
ఊహూ మా వల్ల కాదు బాబూ
206 ఎముకల అస్తిపంజరం ఈ దేహం
అరవై వేల మైళ్ళ పొడవున్న రక్తనాళం
నరుడే నడిచే భూగోళం
నమ్మకపోతే గందర గోళం

ప్రతీ ప్రాణికీ చెట్టూ పిట్టకీ తప్పని విధి ఏదీ
కలిసి కట్టుగా మెలిసి జట్టుగా చేసే పని ఏదీ
నిదురపోయినా మెలకువొచ్చినా
ఎదగడం వయసు పెరగడం
 

శనివారం, సెప్టెంబర్ 15, 2018

ఐదురోజుల పెళ్లి...

వరుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడీయో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : వరుడు (2010)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : వేటూరి
గానం : రంజిత్, సునంద, మాళవిక, 
హేమచంద్ర, జమునా రాణి

ఐదురోజుల పెళ్లి అమ్మంటి పెళ్లీ
తొలిచూపులే లేని తెలుగింటి పెళ్లీ
వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లీ
వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లీ
ఆకాశ పందిళ్లు భూలోక సందళ్ళు
శ్రీరస్తు పెళ్లిళ్లు శుభమస్తు నూరేళ్లు


తుమ్మెదలాడె గుమ్మల జడలు
హంసలు ఊడే అమ్మల నడలు
నగలకు కందే మగువల మెడలు
పడుచు కళ్లకె గుండెల దడలు
పారాణమ్మ కోవెల ముందు
పసుపులాటతొ ధ్వజారోహణం
కళ్యణానికి అంకురార్పణం
పడతులు కట్టె పచ్చతోరణం


ఇందరింతుల చేయి సుందరుడీ హాయి
తలకు పోసె చేయి తలపులొక్క వేయి
నలుగు పెట్టిన కొద్దీ అలిగింది వయసు
వయసు అలిగిన కొద్దీ వెలిగింది మనసు

మగపెళ్లి వారట నేమాని వారట
పెళ్లికి తరలి వస్తున్నారట
కాఫీలు అడగరట ఉప్మాలు ఎరగరట
వీరికి సద్దన్నమే ఘనమౌ
వీరి గోప్పలు చెప్ప తరమా
బాండ్ మేళాం అడగరట
డోలు సన్నాయి ఎరగరట
వీరికి భోగ మేళాం ఘనమౌ
వీరి గోప్పలు చెప్ప తరమా
మగపెళ్లి వారట నేమాని వారట
పెళ్లి కి తరలి వస్తున్నారట


ఇమ్మని కట్నం కోరి మేం అడగేలేదు
ఇప్పటికైన ఎఫ్ ఎ బి ఎ చెప్పించండి
చెన్నపట్నం స్టాండ్ అద్దం కావాల్మాకు
దానికి తగిన పందిరి మంచం ఇప్పించండి
కానుపూరు కండ్ల జోడు కావాల్మాకు
దానికి తగిన రిస్టు వాచ్ ఇప్పించండి
ఇమ్మని కట్నం కోరి మేం అడగేలేదు
ఇప్పటికైన ఎఫ్ ఎ బి ఎ చెప్పించండి


నచ్చె నచ్చె అచ్చ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ
యె ఎక్కడ

అది లబొ దిబొ గబ్బొ జబ్బొ మారేజి లవ్వు మారేజి
అది హనీ మూన్ అవ్వoగానె డామేజీ
ఎవరికి వారె యమునా తీరె పాకేజి తోక పీకేజి
అది అటొ ఇటొ అయ్యిందంటె దారెదీ కృష్ణా బారేజ్

ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు
శ్రీరస్తు పెళ్లిళ్లు శుభమస్తు నూరేళ్లు

ఐదురోజుల పెళ్లి అమ్మంటి పెళ్లీ
తొలిచూపులే లేని తెలుగింటి పెళ్లీ
వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లీ
వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లీ

చేదు కాదోయి తమలాకు ముక్క
అందులొ వెయ్యి సిరిపోక సెక్క
సున్నమేసావొ నీ నోరు పొక్క
ఫక్కు మంటాది మా ఇంటి సుక్క
పచ్చ కర్పూర తాంబూలమిచ్చాక
ఎక్క వచ్చోయి పూమల్లె పక్క

పంచుకొవచ్చు మా పాల సుక్క
పండుకోవచ్చు సై అంటె సుక్క
తెల్లవారాక నీ బుగ్గ సుక్క
గుమ్మ తిలకాల గురుతైన లక్క
కడిగినా పోదు ఈ బంధమల్లూడొ
నిండు నూరేళ్ళదీ జంట అక్క

నిన్ను దీవించిన ఆడ బిడ్డ
ఊరు దివిసీమలో నందిగెడ్డ
ఆడ పంతుళ్ల అక్షింతలడ్డ
మంచి శకునాల మీ ఇంట సెడ్డ
మమ్ము కనిపెట్టు మా రాస బిడ్డ


తట్టలొ కూర్చుండ బెట్టిన వధువునా
గుమ్మడి పువ్వులొ కులికెనొకటీ..
అది మంచు ముత్యమా
మన వధువు రత్నమా 


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.