బుధవారం, ఏప్రిల్ 07, 2021

ఇలా ఇలా తేలాను...

జయలలిత గారి బయోపిక్ ’తలైవి’ సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : తలైవి (2021)
సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్  
సాహిత్యం : సిరాశ్రీ
గానం : సైంధవి  

ఇలా ఇలా తేలాను 
ఈ గిల్లేటి గాలుల్లో
ఘుమా ఘుమా పూలెన్నో 
జల్లేటి దారుల్లో

ఇలా ఇలా తేలాను 
ఈ గిల్లేటి గాలుల్లో
ఘుమా ఘుమా పూలెన్నో 
జల్లేటి దారుల్లో
నా మదే హాయిగా ఎందుకో
ఇంతిలా పాడి ఊగిందిలే ఊయల

ఇలా ఇలా తేలాను 
ఈ గిల్లేటి గాలుల్లో
ఘుమా ఘుమా పూలెన్నో 
జల్లేటి దారుల్లో

మేఘాలన్నీ చన్నీరంతా
నా మీద పన్నీరు జల్లేట్టుంది
పల్లకిలో ముస్తాబయ్యి 
జాబిల్లి ఊరేగినట్టే ఉంది
కన్నుల్లో ఉన్న కనుపాప కూడా
కలలేవో కంటూ ఉంది
నేలమ్మమనసే ఆ నింగికిచ్చి
ఓ ముద్దు కోరుతుంది

నా మదే హాయిగా ఎందుకో
ఇంతిలా పాడి ఊగిందిలే ఊయల
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.