లక్ష్మీకాంత్ ప్యారేలాల్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
లక్ష్మీకాంత్ ప్యారేలాల్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

సోమవారం, సెప్టెంబర్ 23, 2019

ఇది తొలి రాత్రి...

మజ్ను చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మజ్ఞు (1989)
సంగీతం : లక్ష్మీకాంత్-ప్యారేలాల్
సాహిత్యం : దాసరి 
గానం : బాలు

ఇది తొలి రాత్రి కదలని రాత్రి
ఇది తొలి రాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు
చెప్పుకున్న కథల రాత్రీ
ప్రేయసీ రావే ఊర్వశి రావే
ప్రేయసీ రావే ఊర్వశి రావే

ఇది తొలి రాత్రి కదలని రాత్రి
ఇది తొలి రాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు
చెప్పుకున్న కథల రాత్రీ
ప్రేయసీ రావే ఊర్వశి రావే
ప్రేయసీ రావే ఊర్వశి రావే..

వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ
మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ
మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ
దీపమేమో విరగబడి నవ్వుతున్నదీ
నీ రాక కొరకు తలుపు
నీ పిలుపు కొరకు పానుపు
పిలిచి...పిలిచి.. వేచి..వేచి
ఎదురుచూస్తున్నవీ..ఈ...ఈ...ఈ...

ప్రేయసీ రావే ఊర్వశి రావే
ప్రేయసీ రావే ఊర్వశి రావే


వెన్నలంతా అడవి పాలు కానున్నదీ
మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ...ఆ..ఆ..ఆ..
ఆ..ఆ వెన్నలంతా అడవి పాలు కానున్నదీ
మల్లెమనసు నీరుకారి వాడుతున్నది
అనురాగం గాలీలో దీపమైనదీ
మమకారం మనసునే కాల్చుతున్నదీ

నీ చివరి పిలుపు కొరకు
ఈ చావు రాని బ్రతుకూ
చూసి చూసి వేచి వేచి
వేగిపోతున్నదీ..ఆ..ఆ..ఆ

ప్రేయసీ రావే ఊర్వశి రావే
ప్రేయసీ రావే ఊర్వశి రావే 


ఆదివారం, అక్టోబర్ 21, 2018

గిరిలో లాహిరి...

నేటి సిద్ధార్థ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నేటి సిధ్ధార్థ (1990)
సంగీతం : లక్ష్మీకాంత్-ప్యారేలాల్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

గిరిలో లాహిరి.. గిరికోన పందిరి
గుడిలో దేవత వన దుర్గ వాసిని

జతగా జాణనే మనువాడే సందడి..
ఒకసారే వచ్చేను పల్లకి..
ఒడి చేరే వయ్యారి జంటకి

గిరిలో లాహిరి... గిరికోన పందిరి
గుడిలో దేవత వన దుర్గ వాసిని

జతగా జాణనే మనువాడే సందడి..
ఒకసారే వచ్చేను పల్లకి...
ఒడి చేరే వయ్యారి జంటకి

పడుచుల పాటలే పనసల తేనెలై..
నడుమున ఊగినా గమకపు వీణలై

మగసిరి నవ్వులే గుడిసెపు దివ్వెలై
చిత్తడి చిందుకే సిరిసిరి మువ్వలై

ఈ కోనల్లో ఇంద్రధనస్సులు..
ఈ కోనల్లో ఇంద్రధనస్సులు..
కడకొంగులు దాటిన ఈ కన్నె సొగసులు
చాలిస్తే మేలు కదా సందె వరసలు

గిరిలో లాహిరి.. గిరికోన పందిరి
గుడిలో దేవత వన దుర్గ వాసిని

జతగా జాణనే మనువాడే సందడి..
ఒకసారే వచ్చేను పల్లకి...
ఒడి చేరే వయ్యారి జంటకి

కలిసిన కన్నులే కౌగిట వెన్నెలై..
వగలను పొంగినా పరువపు జున్నులై

మరువపు మల్లెలే మాపటి ఆశలై..
వదిలిన మత్తులో అలిగిన ఊసులై

మా గుండెల్లో సూర్యచంద్రులు...
మా గుండెల్లో సూర్యచంద్రులు...
మా కంటికి రెప్పలు ఈ మంచి మనసులు
మీరేగా వాల్మీకి శబరి గురుతులు

హేయ్.. గిరిలో లాహిరి.. గిరికోన పందిరి
ఓఓ గుడిలో దేవత వన దుర్గ వాసిని

జతగా జాణనే మనువాడే సందడి..
ఒకసారే వచ్చేను పల్లకి...
ఒడి చేరే వయ్యారి జంటకి

గిరిలో లాహిరిలో.. గిరికోన పందిరి
గుడిలో దేవత వన దుర్గ వాసిని

జతగా జాణనే మనువాడే సందడి..
ఒకసారే వచ్చేను పల్లకి...
ఒడి చేరే వయ్యారి జంటకి


మంగళవారం, జులై 24, 2018

కదిలిపోయే మేఘమా...

కొండవీటి సింహం (ఖుదాగవా) చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కొండవీటి సింహం (1994)
సంగీతం : లక్ష్మీకాంత్ ప్యారేలాల్
సాహిత్యం : గురుచరణ్
గానం : చిత్ర, బాలు

ఓఓఓఓఓఓ....ఓఓఓఓఓఓ..
కదిలిపోయే మేఘమా
పరుల మాట కోసమూ
నీ వారి మాట దాటకు

కదిలిపోయే మేఘమా
పరుల మాట కోసమూ
నీ వారి మాట దాటకు


నవాబు జీవితం
గులాము కానిదీ
కలత ఎందుకు తోడుగా
తిరిగి వస్తా నీడగా

కదిలిపోయే మేఘమా
పరుల మాట కోసమూ
నీ వారి మాట దాటకు

కలిసి రాద కాలమూ
ఎదురు తెన్నులు చూడగా
నా దైవం నీవై చేరగా

కలిసి రాద కాలమూ
ఎదురు తెన్నులు చూడగా
నా దైవం నీవై చేరగా


ఎడారీ ఆశకూ కలేగా తీరము
నా ప్రాణమే ఏమై పోయినా
నీ ఒడిని ప్రేమై చేరనా

కదిలిపోయే మేఘమా
పరుల మాట కోసమూ
నీ వారి మాట దాటకు

కదిలిపోయే మేఘమా
పరుల మాట కోసమూ
నీ వారి మాట దాటకు

కదిలిపోతె మేఘమూ
వెన్నెలే వేడౌతది
నా గుండె బరువే అవుతది


వియోగం నీదిగా
విషాదం నాదిగా
బాధ కూడా తీయగా
మలచుకోవే ఓ సఖీ

నా మది పిలుపందుకో
చెరి సగం పంచేసుకో
విరహమే కలిగించకూ

నా మది పిలుపందుకో
చెరి సగం పంచేసుకో
విరహమే కలిగించకూ

 
ఇలా ఎడబాటులో
గీతలేని బొమ్మగా
నీదు రెప్పల చాటుగా
పొదిగి నన్నూ దాచుకో

కదిలిపోయే మేఘమా
పరుల మాట కోసమూ
నీ వారి మాట దాటకు

కదిలిపోయే మేఘమా
పరుల మాట కోసమూ
నీ వారి మాట దాటకు


నవాబు జీవితం
గులాము కానిదీ
కలత ఎందుకు తోడుగా
తిరిగి వస్తా నీడగా 

సోమవారం, మే 30, 2016

ప్రేమ కథ మొదలెడితే...

లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత దర్శకత్వం వహించిన నేటి సిద్ధార్ధ చిత్రంలోని ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : నేటి సిద్దార్థ (1990)
సంగీతం : లక్ష్మీకాంత్ ప్యారేలాల్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, కవితాకృష్ణమూర్తి

ప్రేమకథ మొదలెడితే పెదవులలో కచటతప 
కన్నె ఎదా కలబడితే కౌగిలిలో గజడదబ
వారెవ్వా హై చుగుక్కుం.. ప్యార్ కీ జై చుగుక్కుం
వారెవ్వా హై చుగుక్కుం..చుగుక్కుం..చుగుక్కుం
ప్యార్ కీ జై చుగుక్కుం

ప్రేమకథ మొదలెడితే మతులు చెడే మరుజనక 
కన్నె ఎదా కలబడితే కౌగిలిలో కసినడక 
వారెవ్వా హై చుగుక్కుం.. ప్యార్ కీ జై చుగుక్కుం
వారెవ్వా హై చుగుక్కుం..చుగుక్కుం..చుగుక్కుం
ప్యార్ కీ జై చుగుక్కుం

ఈ తుషారాలలో వయసులో హుషారందుకో.. 
ఈ విహారాలలో వలపులో నిషాపంచుకో.. 
అరెరెరె..హలో అంటె ఛలో అంటుంది 
ఒకే ఈడుగల చిలకల రెప రెప

వారెవ్వా హై చుగుక్కుం.. ప్యార్ కీ జై చుగుక్కుం
వారెవ్వా హై చుగుక్కుం..చుగుక్కుం..చుగుక్కుం
ప్యార్ కీ జై చుగుక్కుం

మిడిసిపడే మెరుపులతో ఒరుసుకునే తొలిపరువం
ఉలికిపడే సొగసులలో మెలికపడే చలి విరహం 
నీ కళ్ల గానం నా కన్నె మౌనం 
సాయంత్ర గీతం సై అందిలే 

అరె వారెవ్వా హై చుగుక్కుం.. ప్యార్ కీ జై చుగుక్కుం
వారెవ్వా హై చుగుక్కుం..చుగుక్కుం..చుగుక్కుం
ప్యార్ కీ జై చుగుక్కుం
 
ప్రేమకథ మొదలెడితే మతులు చెడే మరుజనక
కన్నె ఎదా కలబడితే కౌగిలిలో గజడదబ
వారెవ్వా హై చుగుక్కుం.. ప్యార్ కీ జై చుగుక్కుం
హహ వారెవ్వా హై చుగుక్కుం..చుగుక్కుం..చుగుక్కుం
ప్యార్ కీ జై చుగుక్కుం

వారెవ్వా హై చుగుక్కుం.. ప్యార్ కీ జై చుగుక్కుం 
వారెవ్వా హై చుగుక్కుం.. ప్యార్ కీ జై చుగుక్కుం 
వారెవ్వా హై చుగుక్కుం.. ప్యార్ కీ జై చుగుక్కుం 

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.