నేటి సిద్ధార్థ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : నేటి సిధ్ధార్థ (1990)
సంగీతం : లక్ష్మీకాంత్-ప్యారేలాల్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి
గిరిలో లాహిరి.. గిరికోన పందిరి
గుడిలో దేవత వన దుర్గ వాసిని
జతగా జాణనే మనువాడే సందడి..
ఒకసారే వచ్చేను పల్లకి..
ఒడి చేరే వయ్యారి జంటకి
గిరిలో లాహిరి... గిరికోన పందిరి
గుడిలో దేవత వన దుర్గ వాసిని
జతగా జాణనే మనువాడే సందడి..
ఒకసారే వచ్చేను పల్లకి...
ఒడి చేరే వయ్యారి జంటకి
పడుచుల పాటలే పనసల తేనెలై..
నడుమున ఊగినా గమకపు వీణలై
మగసిరి నవ్వులే గుడిసెపు దివ్వెలై
చిత్తడి చిందుకే సిరిసిరి మువ్వలై
ఈ కోనల్లో ఇంద్రధనస్సులు..
ఈ కోనల్లో ఇంద్రధనస్సులు..
కడకొంగులు దాటిన ఈ కన్నె సొగసులు
చాలిస్తే మేలు కదా సందె వరసలు
గిరిలో లాహిరి.. గిరికోన పందిరి
గుడిలో దేవత వన దుర్గ వాసిని
జతగా జాణనే మనువాడే సందడి..
ఒకసారే వచ్చేను పల్లకి...
ఒడి చేరే వయ్యారి జంటకి
కలిసిన కన్నులే కౌగిట వెన్నెలై..
వగలను పొంగినా పరువపు జున్నులై
మరువపు మల్లెలే మాపటి ఆశలై..
వదిలిన మత్తులో అలిగిన ఊసులై
మా గుండెల్లో సూర్యచంద్రులు...
మా గుండెల్లో సూర్యచంద్రులు...
మా కంటికి రెప్పలు ఈ మంచి మనసులు
మీరేగా వాల్మీకి శబరి గురుతులు
హేయ్.. గిరిలో లాహిరి.. గిరికోన పందిరి
ఓఓ గుడిలో దేవత వన దుర్గ వాసిని
జతగా జాణనే మనువాడే సందడి..
ఒకసారే వచ్చేను పల్లకి...
ఒడి చేరే వయ్యారి జంటకి
గిరిలో లాహిరిలో.. గిరికోన పందిరి
గుడిలో దేవత వన దుర్గ వాసిని
జతగా జాణనే మనువాడే సందడి..
ఒకసారే వచ్చేను పల్లకి...
ఒడి చేరే వయ్యారి జంటకి
2 comments:
చల్ల గాలిలా హాయిగా ఉంటుందీపాట..
అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.