శనివారం, అక్టోబర్ 27, 2018

ఎన్నెన్నో అందాలు...

చంటి చిత్రంలోని ఒక మధురమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : చంటి (1992)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
వేసే పూల బాణం పూసే గాలి గంధం
పొద్దే లేని ఆకాశం హద్దే లేని ఆనందం
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు

సిరిగల చిలకలు ఇల దిగి నడుచుట న్యాయమా ధర్మమా
తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా
చలి మర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా
అలికిన గుడిసెల చలువల మనసులు మేడలో దొరుకునా
అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను
బంగారు పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను
నిరుపేదిళ్ళు పొదరిల్లు
ఇలలో ఉన్న హరివిల్లు

ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
వేసే పూల బాణం పూసే గాలి గంధం
పొద్దే లేని ఆకాశం హద్దే లేని ఆనందం
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు

జలజల పదముల అలజడి నదులకు వంత నేపాడనా
మిలమిల మెరిసిన తళతళ తారలు నింగినే వీడునా
చెరువుల కడుపున విరిసిన తామర తేనెలే పూయునా
మిణుగురు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలై కాయునా
ఏ గాలి మేడల్లోనో దీపంలా నేవున్నా
మా పల్లె సింగారాలు నీలో నేనే కన్నా
గోదారమ్మ పరవళ్ళు తెలుగింటమ్మ తిరునాళ్ళు

ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
వేసే పూల బాణం పూసే గాలి గంధం
పొద్దే లేని ఆకాశం హద్దే లేని ఆనందం
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు

2 comments:

ఇందులో మీనా యాక్టింగ్ చాలా నచ్చుతుంది మాకు..

అవునండీ బావుంటుంది.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.