ఈ రోజు దుర్గాదేవి అలంకరణలో దర్శనమీయనున్న అమ్మవారికి నమస్కరించుకుంటూ దేవీ విజయం చిత్రంలోని ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : దేవీ విజయం (1988)
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథం
సాహిత్యం :
గానం : బాలు
ఈ మహిని విద్యయు కలిమియు శక్తియు
ముగురమ్మలందించు వరము కాదో
భువిలోన బ్రతుకుట మన్ననలు చెందుట
ఆ తల్లులే చల్లు కరుణ కాదో
సరస్వతీ లక్ష్మీ పార్వతీ
సరస్వతీ లక్ష్మీ పార్వతీ
ఈ మువ్వురి వశమే మానవ స్థితి గతి
ఈ మువ్వురి వశమే మానవ స్థితి గతి
సరస్వతీ లక్ష్మీ పార్వతీ
వాకిట నిలుచున్న వాగ్దేవిలో
కంట తడి చూసి కన్నీరు తుడిచి వేసి
వాకిట నిలుచున్న వాగ్దేవిలోగల
కలతల కరిగించే బమ్మెర పోతన
మనసాతనిని కరుణించి
దయ చూపెనులే తల్లి గీర్వాణీ
నన్నయ తిక్కన కలములందు ఒక
కమ్మని కవితై అవతరించే
నమ్రతతో చరణాలు కొలిచి
నెరనమ్మిన వారిని ఆదరించే
విద్యకధిదేవతై వెలసెనే
కవికోటినెల్ల దయ జూసెనే
సరస్వతీ లక్ష్మీ పార్వతీ
దైవాలకే నీవు మూలానివే
శ్రీ హరికే భాగ్యలక్ష్మి శ్రీదేవివే
దైవాలకే నీవు మూలానివే
శ్రీ హరికే భాగ్యలక్ష్మి శ్రీదేవివే
నవనిధులే కలిసి వచ్చు నీ చూపులో
శత శుభములు కలిగేను నీ అండలో
జగములను ఏలునది నీవేనులే
మా బ్రతుకులకే మూలమీవేలే
పాల సముద్రానా పుట్టితివే
మా పాల దేవ దేవీ నీవేలే
సరస్వతీ లక్ష్మీ పార్వతీ
ముక్కంటి సతివి దివ్యభామిని
దిక్కులనేలే లోకనాయకి
జ్ఞాన రూపిణీ మధుర పురి మీనలోచనీ
నాదములకు వేదములకు
యాగములకు యోగములకు
నీవు మూలము లోకములు నీ అధీనము
కొలిచే జనులకు వరమీవే
నిను పిలిచే వారికి పెన్నిధివే
శక్తికి ప్రతిరూపం ఎవరమ్మా
మా సకలం నీవేగా దుర్గమ్మా
సరస్వతీ లక్ష్మీ పార్వతీ
ఈ మువ్వురి వశమే మానవ స్థితి గతి
ఈ మువ్వురి వశమే మానవ స్థితి గతి
సరస్వతీ లక్ష్మీ పార్వతీ
4 comments:
విజయ దశమి శుభాకాంక్షలు సార్..
థాంక్స్ రాజ్యలక్ష్మి గారు.. మీక్కూడా విజయదశమి శుభాకాంక్షలు..
అమ్మవారి పిక్ చాలా బావుందండి..
థాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.