తూర్పు సింధూరం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : తూర్పు సింధూరం (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు
తలవాకిట ముగ్గులు వేకువకే అందం
శ్రుతి కుదరని పాటకి లేదు కదా అందం
నడివీధులలో వేదం ఈ జానపదం సత్యం
తద్ధిం తరికిట తరికిట తధిగిణ తోం...
తలవాకిట ముగ్గులు వేకువకే అందం
శ్రుతి కుదరని పాటకి లేదు కదా అందం
అరె గలగల మోగిన పాదం
ఆ ముచ్చట మువ్వల నాదం
అది పెరుగును ఏనాడో
గోపాలుని ఆటల మైకం
రేపల్లెగ మారును లోకం
జగమంతా తూగాడూ
దేహం ఉంటే రోగం ఉందీ
సౌఖ్యమూ చింతా ఉందీ
పెదవిలోన నవ్వులు ఉంటే
దుఃఖమెలా నిలబడుతుంది
వీధులలో వేదం ఈ జానపదం సత్యం
తద్ధిం తరికిట తరికిట తధిగిణ తోం...
తలవాకిట ముగ్గులు వేకువకే అందం
శ్రుతి కుదరని పాటకి లేదు కదా అందం
తలవాకిట ముగ్గులు వేకువకే అందం హ హ
శ్రుతి కుదరని పాటకి లేదు కదా అందం
ప్రతి మనిషికి మనసుంటుంది
వేరొకరిది ఐపోతుంది
అందుకోసమే పెళ్ళాడు
తొలిముచ్చట ముద్దర పడితే
ఆ జంటకు నిద్దర చెడితే
ఆ కేళికి వెయ్యేళ్ళూ
రాతిరుంటె ఉదయం ఉందీ
కలత ఉంటే కులుకు ఉందీ
ఊసులాడు పండగ వేళ
ఆశలకే బలమిస్తుంది
వీధులలో వేదం ఈ జానపదం సత్యం
తద్ధిం తరికిట తరికిట తధిగిణ తోం...
తలవాకిట ముగ్గులు వేకువకే అందం
శ్రుతి కుదరని పాటకి లేదు కదా అందం హహ
నడి వీధులలో వేదం ఈ జానపదం సత్యం
తద్ధిం తరికిట తరికిట తధిగిణ తోం...
తలవాకిట ముగ్గులు వేకువకే అందం హహ
శ్రుతి కుదరని పాటకి లేదు కదా అందం
2 comments:
ఈ మూవీ లో మా ఫేవరెట్ రేవతి చాలా చాలా బావుంటుందండి..
రేవతి ఏ సినిమాలో ఐనా చాలా బాగ చేస్తుందండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.