శుక్రవారం, అక్టోబర్ 26, 2018

సరసాలు చాలు శ్రీవారు...

శివ చిత్రంలోని ఒక సరదా ఐన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శివ (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : మనో, జానకి

సరసాలు చాలు శ్రీవారు వేళకాదు
విరహాల గోల ఇంకానా వీలుకాదు
వంటింట్లో గారాలు ఒళ్లంతా కారాలే సారు

చురుకైన ఈడు వద్దన్నా ఊరుకోదు
విరజాజి పూలు వంటింట్లో వాడరాదు

సూర్యుడే చురచుర చూసినా
చీరనే వదలరు చీకటే చెదిరినా

కాకులే కేకలు వేసినా
కౌగిలే వదలను వాకిలే పిలిచినా
స్నానానికీ సాయమే రావాలనే తగువా
నీ చూపులే సోపుగా కావాలనే సరదా
పాపిడి తీసి పౌడరు పూసి
బయటికే పంపేయనా

పైటతో బాటే లోనికి రానా పాపలా పారాడనా
తీయగ తిడుతూనే లాలించనా

సరసాలు చాలు శ్రీవారు తానననానా
విరహాల గోల ఇంకానా ఊహుహుహు..
 
 కొత్తగా ముదిరిన వేడుక
మత్తుగా పెదవుల నీడకే చేరదా
ఎందుకో తికమక తొందరా
బొత్తిగా కుదురుగ ఉండనే ఉండదా

ఆరారగా చేరకా తీరేదెలా గొడవ
ఆరాటమే ఆరగా సాయంత్రమే పడదా
మోహమే తీరే మూర్తమే రాదా
మోజులే చెల్లించవా
జాబిలే రాడా జాజులే తేడా రాతిరి రాగానికా
ఆగదే అందాకా ఈడు గోల

చురుకైన ఈడు వద్దన్నా ఊరుకోదు
విరజాజి పూలు వంటింట్లో వాడరాదు
 

ఊరించే దూరాలు ఊ అంటే తీయంగా తీరు 


4 comments:

ఈ పాట రచయిత సిరివెన్నెల

థాంక్స్ అజ్ఞాత గారు పోస్టులో సరిచేశాను...

ఈ మూవీలో సాంగ్స్ అన్నీ బావుంటాయి..

ఎంతైనా మరి ఇళయరాజా గారు కదండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతిగారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.