కారుణ్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కారుణ్య లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, సెప్టెంబర్ 03, 2020

ఎందుకో పిచ్చి పిచ్చిగా...

చిరుత చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : చిరుత (2007)
సంగీతం : మణిశర్మ  
సాహిత్యం : భాస్కరభట్ల  
గానం : కారుణ్య  

ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే
గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చావే
మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే 
ఇంతలో కళ్ళ ముందుకే వచ్చావే

నొ నొ అనుకుంటూనే స్లోగా చెడిపోయానే
లవ్ లో పడిపోయానే మేరి ప్యారి మెహబూబా
నడిచే నెలవంకా చూస్తే నీవంకా నిదరే రాదింకా
 
నొ నొ అనుకుంటూనే స్లోగా చెడిపోయానే
లవ్ లో పడిపోయానే మేరి ప్యారి మెహబూబా
లైలా జర దిల్ దే లైలా... 
లైలా మేరె దిల్ మే కోయ్ లా 

ఇంత గొప్ప అదృష్టం వెంట పడి వస్తుందా
అందుకే ఇలా ఇలా గాల్లో తేలిపోనా
పక్కనే నువ్వుంటే పట్టలేని ఆనందం
నన్నిలా చుట్టేస్తుంటే చూస్తు కూర్చోవాలా
పులిలా ఉన్నోడ్ని పిల్లిలా ఐపోయా
నన్నిలా మార్చేసింది పిల్లా నువ్వేనే
కలలే కంటున్నా..కలల్లో ఉంటున్నా
ఎదురై వచ్చావంటే నమ్మేదెలాగే

చోడో చోడోనా లెట్ ఇట్ గో
కీప్ మూవింగ్ ఓ ఓ యారో 
it isn't my time 
పోరే పోరే పోరే పోరే 

నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే
నిన్నే ప్రేమించానే చూడకుండ ఉండలేనే
లైలా జర దిల్ దే లైలా... 
లైలా మేరె దిల్ మే కోయ్ లా 

దేఖో జానే జానా 
యూ మేక్ మీ గో షానానా 
టెల్ మీ బేబీ విల్ ఐ ఎవర్ బీ యువర్ దీవానా
దేఖో జానే జానా 
బి మై గర్ల్ ఇఫ్ యు వాన్నా 
టెల్ మీ బేబీ విల్ ఐ ఎవర్ బీ యువర్ దీవానా

అందనంత దూరంలో నిన్నలా చూస్తుంటే
అపుడె బాగుండేదే అట్టా ఇప్పుడు లేదే
ఊ అంటే కొపాలు కాదంటే శాపాలు
వోలమ్మో నీతో స్నేహం ఇంతవరకే చాలు
బూరి బుగ్గ అమ్మాయి ఎందుకింత బడాయి
తొక్కలో బిల్డప్ ఇస్తే వేగేదెలాగే హో..
ఎంతగా ఊహించా ఎంతగా ప్రేమించా
నువ్విలా చేస్తుంటే రాదా చిరాకే
 
చోడో చోడోనా లెట్ ఇట్ గో
కీప్ మూవింగ్ ఓ ఓ యారో 
it isn't my time 
పోరే పోరే పోరే పోరే 

నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే
నిన్నే ప్రేమించానే చూడకుండ ఉండలేనే
లైలా జర దిల్ దే లైలా... 
లైలా మేరె దిల్ మే కోయ్ లా 
లైలా జర దిల్ దే లైలా... 
లైలా మేరె దిల్ మే కోయ్ లా 
 

 

గురువారం, ఆగస్టు 13, 2020

అందమైన కలల కుటీరం...

బలాదూర్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : బలాదూర్ (2008)
సంగీతం : K.M.రాధాకృష్ణన్  
సాహిత్యం : చంద్రబోస్ 
గానం : కారుణ్య

అందమైన కలల కుటీరం
అమృతాలు కురిసే తీరం
మా ఇల్లు ప్రేమాలయం
దేవుళ్ళ జన్మాలయం
సంక్రాంతే ప్రతిదినం 
సుఖశాంతే ప్రతి క్షణం
మా ఇల్లు ప్రేమాలయం
దేవుళ్ళ జన్మాలయం

అందమైన కలల కుటీరం
అమృతాలు కురిసే తీరం
మా ఇల్లు ప్రేమాలయం
దేవుళ్ళ జన్మాలయం

కనులువేరు చూపులు ఒకటే
తలలువేరు తలపులు ఒకటే
పంచుకున్న ప్రాణం ఒకటే
ఎదలు వేరు స్పందన ఒకటే
పెదవిలోని ప్రార్థన ఒకటే
ఒకరికన్నా ఇష్టం ఒకరే
కంగారై ఎవరున్నా 
ప్రతికన్ను చెమ్మగిల్లేను
కన్నీరై ఎవరున్నా 
పదిచేతులొచ్చి తుడిచేను
సమభావం అన్నది 
సంసారం ఐనది
మా ఇల్లు మమతాలయం
కవి లేని కవితాలయం

అందమైన కలల కుటీరం
అమృతాలు కురిసే తీరం
మా ఇల్లు ప్రేమాలయం
దేవుళ్ళ జన్మాలయం

కునుకు లేని వాకిలి మాది
అలక లేని అరుగే మాది
మరక లేని మనసే మాది
తెరలు లేని తలుపే మాది
గొడవ లేని గడపే మాది
కరువు లేని కరుణే మాది
ఈ చోట కురిసేటి 
ప్రతి చినుకు జన్మ పావనమే
ఈ తోట విరిసేటి 
ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే
స్వర్గాలే జాలిగా స్థానాన్నే కోరగా
మా ఇల్లు మంత్రాలయం
అనుబంద గంధాలయం

అందమైన కలల కుటీరం
అమృతాలు కురిసే తీరం
మా ఇల్లు ప్రేమాలయం
దేవుళ్ళ జన్మాలయం
సంక్రాంతే ప్రతిదినం
సుఖశాంతే ప్రతి క్షణం
మా ఇల్లు ప్రేమాలయం
దేవుళ్ళ జన్మాలయం
 

సోమవారం, మార్చి 09, 2020

హరివిల్లే వరదల్లే ఇలపైకి...

మిత్రులందరకూ హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ మహానగరంలో చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మహానగరంలో (2008)
సంగీతం : కోటి
సాహిత్యం : చంద్రబోస్
గానం : కారుణ్య, సునీత  

హరివిల్లే వరదల్లే ఇలపైకే
దిగివచ్చే సింగారంగా రంగల్లే
విరిజల్లే వరమల్లే ఎదలోకే
ఎదురొచ్చే వైభోగంగా గంగల్లే

రంగులన్నీ చల్లుకుందామా ఈ పండుగరోజు
చెంగుమంటూ చిందులేద్దామా
నింగి దాటి పొంగిపోదామా ఈ సందడిరోజు
ముంగిలంతా ముగ్గులేద్దామా

కళ్ళల్లో స్వప్నాలే కదిలొచ్చే ఈ రోజు
గుండెల్లో స్వర్గాలే కబురిచ్చే ఈ రోజు
ఆడుకుందాం హోలీ హోలీ రంగోలీ
పాడుకుందాం కేళీ కేళీ ఖవ్వాలీ
ఆడుకుందాం హోలీ హోలీ రంగోలీ
పాడుకుందాం కేళీ కేళీ ఖవ్వాలీ

హరివిల్లే వరదల్లే ఇలపైకే
దిగివచ్చే సింగారంగా రంగల్లే
విరిజల్లే వరమల్లే ఎదలోకే
ఎదురొచ్చే వైభోగంగా గంగల్లే

నవ్వే తెలుపంట చూపే ఎరుపంటా
నీలో నాలో ఆశల రంగే ఆకుల పచ్చంటా
నీడే నలుపంటా ఈడే పసుపంటా
లోలో దాగే ఊహలపొంగే ఊదారంగంటా
లోకంలో వర్ణాలన్నీ కలిసున్నాయి మనలో
ఏకంగా కదలాలో
శోకాలే సంతోషాలే కొలువుంటాయి మదిలో
రంగ్‌దే రంగ్‌దే రంగ్‌దే...

రంగులన్నీ చల్లుకుందామా ఈ పండుగరోజు
చెంగుమంటూ చిందులేద్దామా
నింగి దాటి పొంగిపోదామా ఈ సందడిరోజు
ముంగిలంతా ముగ్గులేద్దామా

మోసం నిలవదుగా ద్రోహం మిగలదుగా
ఏనాడైనా అన్యాయానికి న్యాయం జరగదుగా
పంతం చెదరదుగా ఫలితం దొరికెనుగా
ఏ రోజైనా మంచికి చెడుపై విజయం తప్పదుగా
ఆలోచన బీజం వేసి చెమటే నీరుగ పోసి
ఆవేశం ఎరువేసి
పని చేస్తే పండేనంట ఆనందాలరాశీ
రంగ్‌దే రంగ్‌దే రంగ్‌దే...

రంగులన్నీ చల్లుకుందామా ఈ పండుగరోజు
చెంగుమంటూ చిందులేద్దామా
నింగి దాటి పొంగిపోదామా ఈ సందడిరోజు
ముంగిలంతా ముగ్గులేద్దామా

కళ్ళల్లో స్వప్నాలే కదిలొచ్చే ఈ రోజు
గుండెల్లో స్వర్గాలే కబురిచ్చే ఈ రోజు
ఆడుకుందాం హోలీ హోలీ రంగోలీ
పాడుకుందాం కేళీ కేళీ ఖవ్వాలీ
ఆడుకుందాం హోలీ హోలీ రంగోలీ
పాడుకుందాం కేళీ కేళీ ఖవ్వాలీ 
 

శనివారం, మే 18, 2019

అక్కడొకడుంటాడు...

అక్కడొకడుంటాడు చిత్రంలోని ఒక పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అక్కడొకడుంటాడు (2019)
సంగీతం : చంద్రలేఖ సార్క్స్     
సాహిత్యం : దేవేంద్ర కె.
గానం : కారుణ్య     

ఏ యోగీ యోగీ రే యోగీ
అక్కడొకడుంటాడు..
లెక్కగడుతుంటాడు
కదిలి చూడు
కాలయముడై వేటాడగా

అక్కడొకడుంటాడు..
లెక్కగడుతుంటాడు
నిలిచె నేడు
ధర్మధీరుడై పోరాడగా

ఏ యోగీ యోగీ రే యోగీ

శిధిల కలల రుధిర ఘోష తాను
ఎదలొ పగతొ ఎగిసెనే తుఫాను
శిధిల కలల రుధిర ఘోష తాను
ఎదలొ పగతొ ఎగిసెనే తుఫాను

తీరాన ఓ మౌనరాగం
గుండెల్లొ గాయాల గేయం పాడగా
సాగింది ఓ రుధిర యాగం
ఎగిసింది ఓ వీర ఖడ్గం జ్వాలగా
పిలిచే కదన రంగం
చేసే సింహ నాదం
ధర్మం ధ్యేయమైతె
కాలం లొంగి రాదా

అక్కడొకడుంటాడు..
లెక్కగడుతుంటాడు
కదిలి చూడు
కాలయముడై వేటాడగా

అక్కడొకడుంటాడు..
లెక్కగడుతుంటాడు
నిలిచె నేడు
ధర్మధీరుడై పోరాడగా

ఏ యోగీ యోగీ రే యోగీ

శిధిల కలల రుధిర ఘోష తాను
ఎదలొ పగతొ ఎగిసెనే తుఫాను
శిధిల కలల రుధిర ఘోష తాను
ఎదలొ పగతొ ఎగిసెనే తుఫాను


సోమవారం, నవంబర్ 13, 2017

సదాశివా సన్యాసీ...

ఈ ఏడాది చివరి కార్తీక సోమవారం సంధర్బంగా ఆ పరమశివునికి నమస్కరిస్తూ ఖలేజా చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఖలేజా (2010)
రచన : రామజోగయ్యశాస్ర్తి
సంగీతం : మణిశర్మ
గానం : రమేష్, కారుణ్య

ఓం నమో శివ రుద్రాయ
ఓం నమో శితి కంఠాయ
ఓం నమో హర నాగాభరణాయ
ప్రణవాయ
ఢమ ఢమ ఢమరుక నాదానందాయ


ఓం నమో నిఠలాక్షాయ

ఓం నమో భస్మాంగాయా
ఓం నమో హిమశైలావరణాయ
ప్రమథాయ
ధిమి ధిమి తాండవకేళీ లోలాయ


సదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ
నీ పాదముద్రలు మోసి
పొంగి పోయినాదె పల్లె కాశి

హే... సూపుల సుక్కాని దారిగ
సుక్కల తివాసీ మీదిగా
సూడసక్కని సామి దిగినాడురా
ఏసెయ్ రా ఊరూవాడా దండోరా

ఏ రంగుల హంగుల పొడలేదురా
ఈడు జంగమ శంకర శివుడేనురా
నిప్పు గొంతున నీలపు మచ్చ సాచ్చిగా
నీ తాపం శాపం తీర్చేవాడేరా
పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీలా

లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు
నీలోనే కొలువున్నోడు నిన్నుదాటి పోనెపోడు

ఓం నమఃశివ జై జై జై...
ఓం నమఃశివ జై జై జై...
ఓం నమఃశివ 

Grove to the trance 
And say Jai Jai Jai...
Sing along sing shiva 

shambo all the way
 

ఓం నమః శివ జై జై జై...
Heal the world is all we pray 

save our lives and take
Our pain away Jai Jai Jai ...
Sing along sing
shiva shambo all the way


సదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ
నీ పాదముద్రలు మోసి
పొంగి పోయినాది పల్లె కాశి

ఎక్కడ వీడుంటే నిండుగా
అక్కడ నేలంతా పండగ
సుట్టు పక్కల చీకటి పెళ్లగించగా
అడుగేశాడంటా కాచే దొరలాగా

మంచును మంటను ఒక్క తీరుగ
లెక్క సెయ్యనే సెయ్యని శంకరయ్యగా
ఉక్కు కంచెగ ఊపిరి నిలిపాడురా
మనకండా దండా వీడే నికరంగా
సామీ అంటే హామీ తనై
ఉంటాడురా చివరంటా

లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు
ఏయ్ నీలోనే కొలువున్నోడు నిన్నుదాటి పోనెపోడు

ఓం నమఃశివ జై జై జై...
ఓం నమఃశివ జై జై జై...
ఓం నమఃశివ Grove to the trance
And say Jai Jai Jai...
Sing along sing shiva
shambo all the way
ఓం నమః శివ జై జై జై...
Heal the world is all we pray
save our lives and take
Our pain away Jai Jai Jai ...
Sing along sing
shiva shambo all the way
  

ఆదివారం, మార్చి 27, 2016

అమ్మాయి కిటికీ పక్కన...

మర్యాదరామన్న చిత్రంలోని ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మర్యాదరామన్న (2010)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : అనంత్ శ్రీరామ్
గానం : కారుణ్య, చైత్ర

అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది
కిటికీలోంచెం కనబడుతుంది
గంటక్కి డెబ్బై మైళ్ళ వేగంతోటి
ఈ లోకం పరిగెడుతుందండి

అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది
కిటికీలోంచెం కనబడుతుంది
గంటక్కి డెబ్బై మైళ్ళ వేగంతోటి
ఈ లోకం పరిగెడుతుందండి

అక్కడ చూడు తాడి చెట్టుంది
ఆకులు ఊపి టాటా చెబుతుంది
జాబిలి ఎందుకు వెంటే వస్తుంది
నీ పైన మనసై ఉంటుంది
పైకి కిందికి ఊగే నేల ఏమంది
నువ్వు ఊ అంటేనే ఊయలవుతానంది
మీదెకి వచ్చే గాలేమనుకుంటుంది
నీ ఉసులు మోయాలంటుందీ

ఒహ్హోహ్హోహోహో.ఊహూహూహూ
 
అమ్మాయి గుమ్మం దగ్గర నుంచుంది
గుమ్మంలోంచెం కనబడుతుంది
గంటక్కి ఎనభై మైళ్ళ వేగంతోటి
ఏవేవో ఆలోచిస్తుంది

ఊహించని మజిలీ వచ్చింది
నాలో ఊహల్ని మలుపులు తిప్పింది
ఇప్పటి వరకు ఎరగని సంతోషాన్ని
ఇట్టేనా ముందర ఉంచింది
చల్లని చీకటి చుట్టు కమ్ముకు వస్తుందీ
వెచ్చని చలిమంటకి ఆ చీకటి కరిగిందీ
నిదురలోనె కవ్వించె కల కన్నా
నిజమెంతో అందంగా ఉందీ

ఒహ్హోహ్హోహోహో.ఊహూహూహూ

అమ్మాయి కిటికీ పక్కన పడుకుంది
కిటికీలోంచెం కనబడుతుంది
గంటకి తొంబై మైళ్ళ వేగంతోటి
కునుకొచ్చి వాలిపోయింది


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.