సోమవారం, ఫిబ్రవరి 03, 2020

ఆకాశ వీధిలో అందాల జాబిలీ...

మాంగల్య బలం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మాంగల్య బలం (1959)
సంగీతం : మాస్టర్ వేణు  
సాహిత్యం : శ్రీశ్రీ
గానం : ఘంటసాల, సుశీల  

ఆకాశ వీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను జేరి
ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే
ఆకాశ వీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను జేరి
ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే

ఆకాశ వీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను జేరి
ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే

జలతారు మేలిమబ్బు
పరదాలు నేసీ తెరచాటు చేసీ
పలుమారు దాగి దాగి
పంతాలు పోయీ పందాలు వేసీ
అందాల చందామామ
దొంగాటలాడెనే దోబూచులాడెనే

ఆకాశ వీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను జేరి
ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే

జడివాన హోరుగాలి
సుడిరేగి రానీ జడిపించబోని
కలకాలము నీవే నేనని
పలుబాసలాడీ చెలి చెంత చేరీ
అందాల చందామామ
అనురాగం చాటెనే నయగారం చేసెనే

ఆకాశ వీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను జేరి
ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే 

 

4 comments:

జాబిల్లి అంత అందమైన పాట..

అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్...

ఎంతో అందమైన పాట. ఈ పాట తమిళం లో కూడా ఘంటసాల సుశీ గారు పాడారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.