శనివారం, ఫిబ్రవరి 15, 2020

అది ఒక ఇదిలే...

ప్రేమించి చూడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం :  ప్రేమించి చూడు (1965)
సంగీతం : మాస్టర్ వేణు  
సాహిత్యం : ఆత్రేయ
గానం : పి.బి.శ్రీనివాస్, సుశీల  

అది ఒక ఇదిలే
అతనికే తగులే
సరి కొత్త సరసాలు
సరదాలు చవి చూపెలే
అహ! ఎనలేని సుఖమెల్ల
తన తోటిదనిపించెలే
లా లా...లా..లా..

అది ఒక ఇదిలే
అతనికే తగులే
సరి కొత్త సరసాలు
సరదాలు చవి చూపెలే
అహ! ఎనలేని సుఖమెల్ల
తన తోటిదనిపించెలే
లా లా...లా..లా..
అది ఒక ఇదిలే..

మెచ్చాను వచ్చాను ఏమేమో తెచ్చానూ
అహ నచ్చాను అన్నావా ఏమైన ఇస్తాను
అని పలికిందిరా చెలి కులికింది రా
ఎద రగిలిందిరా మతి చెదిరింది రా
చెదిరింది రా...ఆఆఆ...

అది ఒక ఇదిలే
ఆమెకె తగులే
సరి కొత్త సరసాలు
సరదాలు చవిచూపెలే
అహ! ఎనలేని సుఖమెల్ల
తనతోటిదనిపించెలే
అది ఒక ఇదిలే 

సిగ్గేల అన్నాడు నా బుగ్గ గిల్లాడు
సిగ్గేల అన్నాడు నా బుగ్గ గిల్లాడూ
అహ మొగ్గల్లె ఉన్నావు విరబూయమన్నాడు
మది పులకించెను మరులొలికించెనూ
నను మరిపించెను తగుననిపించెను
అనిపించెనూ...
అది ఒక ఇదిలే

నడకేది అన్నాను నడిచింది ఒకసారి
అహ నడుమేది అన్నాను నవ్వింది వయ్యారి
నా వద్దున్నదే తన ముద్దన్నదీ
చే కొమ్మన్నదీ నీ సొమ్మన్నదీ సొమ్మన్నదీ

ఎండల్లే వచ్చాడు మంచల్లే కరిగానూ
అహా వెన్నెల్లు కురిశాడు వేడెక్కిపోయానూ
ఇది బాధందునా ఇది హాయందునా
ఏది ఏమయిననూ నే తనదాననూ
తనదాననూ

అది ఒక ఇదిలే
అతనికె తగులే
సరి కొత్త సరసాలు
సరదాలు చవి చూపెలే
అహ! ఎనలేని సుఖమెల్ల
తనతోటిదనిపించెలే
లా లా...లా..లా.. 
 

4 comments:

This is a fine song in Tamil / Telugu beautifully adapted from the Spanish song "besame mucho" (1940).

https://m.youtube.com/watch?v=pwRiKDcrjz0

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.