ఆత్రేయ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆత్రేయ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

సోమవారం, ఏప్రిల్ 12, 2021

కొమ్మ మీద కోకిలమ్మ...

కోకిలమ్మ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కోకిలమ్మ (1983)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : సుశీల

కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది

కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది

ఈనాడు చిగురించు చిగురాకు వగరే
ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో
ఈ..నాడు చిగురించు చిగురాకు వగరే
ఏ గొంతులో రేపు ఏ రాగమౌనో
నాడు ఆ రాగమే గుండె జతలో
తానె శృతి చేసి లయకూర్చునో
నాడు ఆ రాగమే గుండె జతలో
తానె శృతి చేసి లయకూర్చునో
అని తల్లి అన్నది.. అది పిల్ల విన్నది
విని నవ్వుకున్నదీ.. కలలు కన్నది
అని తల్లి అన్నది.. అది పిల్ల విన్నది
విని నవ్వుకున్నదీ..ఈ.. కలలు కన్నది

కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది

ఈ లేత హృదయాన్ని కదిలించినావు
నాలోన రాగాలు పలికించినావు
ఈ లేత హృదయాన్ని కదిలించినావు
నాలోన రాగాలు పలికించినావు
నాకు తెలిసింది నీ నిండు మనసే
నేను పాడేది నీ పాటనే
నాకు తెలిసింది నీ నిండు మనసే
నేను పాడేది నీ పాటనే
అని ఎవరు అన్నది.. అది ఎవరు విన్నది
ఈ చిగురు చెవులకే.. గురుతు ఉన్నది
అని ఎవరు అన్నది.. అది ఎవరు విన్నది
ఈ చిగురు చెవులకే..ఏ.. గురుతు ఉన్నది

కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది
కుహు కుహూ అన్నది
అది కూన విన్నదీ... ఓహో అన్నది


శుక్రవారం, డిసెంబర్ 04, 2020

ఏమంటున్నది ఈ గాలీ...

మేమూ మనుషులమే చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే  వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : మేమూ మనుషులమే (1973)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల

ఏమంటున్నది ఈ గాలీ?
ఎగిరే పైటను అడగాలీ..
ఏమంటున్నది ఈ గాలీ?
ఎగిరే పైటను అడగాలీ..

ఎగిరే పైటను ఏం చెయ్యాలి?
ఇంకో కొంగును ముడివెయ్యాలి 
అహ..అహ..హ..
ఎగిరే పైటను ఏం చెయ్యాలి?
ఇంకో కొంగును ముడివెయ్యాలి

ఏమంటున్నది ఈ గాలీ?
ఎగిరే పైటను అడగాలీ

పైటకు తెలుసు చాటున 
పొంగే ప్రాయం రెపరెపలూ...
గాలికి తెలుసూ విరిసీ విరియని 
పూవుల ఘుమఘుమలూ..
ఊగే నడుమూ.. సాగే జడతో..
వేసెను పంతాలూ..ఊ..
నీలో వుడుకూ.. నాలో దుడుకూ.. 
చేసెను నేస్తాలూ.. చేసెను నేస్తాలూ..

ఏమంటున్నది ఈ గాలీ... 
ఎగిరే పైటను అడగాలీ...

మబ్బు మబ్బుతో ఏకమైనది.. 
సాయం సమయంలో...ఓ..
మనసు మనసుతో లీనమైనది.. 
మమతల మైకంలో...ఓ..
అల్లరి కళ్లూ.. వెన్నెల నవ్వూ.. 
పెట్టెను గిలిగింతా..
వెచ్చని వొడిలో.. ఇచ్చిన చోటున.. 
ఇమిడెను జగమంతా..
ఇమిడెను జగమంతా..

ఏమంటున్నది ఈ గాలీ... 
ఎగిరే పైటను అడగాలీ...
అహ..హ..అహా...లల..ల.లా.లా..
అహ..హ..అహా...లల..ల.లా.లా..


బుధవారం, అక్టోబర్ 28, 2020

జాబిల్లి కోసం ఆకాశమల్లే...

పరిచయం అక్కర్లేని అద్భుతమైన పాట ఇది. బాలు గారు స్వరాభిషేకంలో ఈ పాటను మళ్ళీ ఎంత చక్కగా పాడారో వినండి. ఆత్రేయ గారి గురించి ఆయన చెప్పే కబుర్లు కూడా వినవచ్చు. సుమ సరదా కబుర్లు తనకి బాలుగారికి ఉన్న అనుబంధం కూడా చూడ ముచ్చటగా బావుంటుంది ఈ వీడియోలో.  
 
ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : మంచిమనసులు (1986) 
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ

గానం : యస్.పి.బాలు 
 
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
 
నిను కానలేక మనసూరుకోకపాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై


నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
ఈ పూవ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లొ తేలీ ఉర్రూతలూగి
మేఘాలతోటి రాగాల లేఖ
నీకంపినాను రావా దేవి

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోకపాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై 

 
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైనది ఎన్నాళ్ళయినా
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైనది ఎన్నాళ్ళయినా
ఉండీ లేక ఉన్నది నువ్వే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాసల రూపం నువ్వే
దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే 

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక
పాడాను నేను పాటనై

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
వేచాను నీ రాకకై

 

సోమవారం, అక్టోబర్ 12, 2020

నేనొక ప్రేమ పిపాసిని...

ఇంద్రధనుస్సు సినిమా కోసం ఆత్రేయ గారు రాసిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. కె.వి.మహదేవన్ గారు స్వరపరచిన ఈ పాట ఆత్రేయ గారికి ఇష్టమైన పాట అట. తను "నాపాట పాడ"మని అడిగి బాలు గారితో పాడించుకుని ప్రతిసారీ అర్థనిమీలిత నేత్రాలతో వినేవారట. ఆత్రేయ గారి భావుకత్వం గురించి బాలు గారి మాటల్లో ఎంబెడెడ్ వీడియోలో పాట తరువాత వినండి. 

ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఇంద్ర ధనుస్సు (1978)
రచన : ఆత్రేయ
సంగీతం : కె.వి. మహదేవన్‌
గానం : బాలు

ఆహాఆఆ..అహాహహా...
ఆఆఆ..ఆఆఅ..ఆఆఅ...
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని

తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచీ బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా
తలుపు మూసినా తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచీ బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా

నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని

పూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను
ప్రేమభిక్షను పెట్టగలవని దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులొత్తగా ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను

నేనొక ప్రేమ పిపాసిని

పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా నివురైపోతాను

నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని
 




గురువారం, అక్టోబర్ 08, 2020

కలువకు చంద్రుడు...

చిల్లర దేవుళ్ళు సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట రికార్డింగ్ సమయంలో "జలుబు చేసింది నేను పాడలేను" అన్నారట బాలు గారు. "ఈ పాటకు నీ జలుబు గొంతే అద్భుతంగా సూట్ అవుతుంది" అంటూ మహదేవన్ గారు పాడించుకున్నారని బాలు చెపిన విశేషాలు పాట తర్వాత వినండి. 

ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో దొరకలేదు యూట్యూబ్ లో సరిగమ ఆడియో ఇక్కడ వినవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : చిల్లర దేవుళ్ళు (1975)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు

కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం

కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం

దూరమైన కొలదీ.. పెరుగును అనురాగం
దూరమైన కొలదీ.. పెరుగును అనురాగం
విరహంలోనే వున్నది అనుబంధం
కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం

నవ్వు నవ్వుకు తేడా వుంటుందీ
నవ్వే అదృష్టం ఎందరికుంటుంది
ఏ కన్నీరైనా వెచ్చగ వుంటుందీ
అది కలిమిలేములను మరిపిస్తుంది

కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం

వలపు కన్నా తలపే తీయనా
కలయక కన్నా కలలే తీయనా
చూపులకన్నా ఎదురు చూపులే తీయనా
నేటికన్న రేపే తీయనా

కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం

మనసు మనిషిని మనిషిగ చేస్తుందీ
వలపా మనసుకు అందానిస్తుంది
ఈ రెండూ లేక జీవితమేముంది
ఆ దేవుడికి.. మనిషికి.. తేడా ఏముంది

కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం
దూరమైన కొలదీ.. పెరుగును అనురాగం
విరహంలోనే వున్నది అనుబంధం
కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం
 


సోమవారం, అక్టోబర్ 05, 2020

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు...

బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చిన "అందమైన అనుభవం" సినిమాలోని ఈ పాట అప్పట్లో నలభై ఏళ్ళ క్రితం ఎంత హుషారుగా పాడారో ఇప్పుడు డెబ్బై ఏళ్ళ వయసులో కూడా అంతే హుషారుగా పాడారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : అందమైన అనుభవం (1979)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

గతమును పూడ్చేది వీళ్ళు చరితను మార్చేది వీళ్ళు
కథలై నిలిచేది వీళ్ళు కళలకు పందిళ్ళు వీళ్లు
వీళ్ళేనోయ్ నేటి మొనగాళ్ళు
చెలిమికెపుడూ జతగాళ్ళు చెడుపుకెపుడు పగవాళ్ళు
వీళ్ళ వయసు నూరేళ్ళు నూరేళ్ళకు కుర్రాళ్లు

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

తళతళ మెరిసేటి కళ్ళు నిగనిగలాడేటి వొళ్ళు
విసిరే చిరునవ్వు జల్లు ఎదలో నాటెను ముల్లు
తీయాలోయ్ దాన్ని చెలివేళ్ళు
నిదురరాని పొదరిల్లు బ్రహ్మచారి పడకిల్లు
మూసివున్న వాకిళ్ళు తెరచినపుడే తిరునాళ్ళు

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..

నీతులుచెప్పే ముసలాళ్ళు నిన్న మొన్నటి కుర్రాళ్లు
దులిపెయ్ ఆనాటి బూజులు మనవే ముందున్న రోజులు
తెంచేసెయ్ పాతసంకెళ్ళు
మనుషులె మన నేస్తాలు కమాన్ క్లాప్.. మనసులె మన కోవెల్లు
మనుషులె మన నేస్తాలు మనసులె మన కోవెల్లు..యెవ్రీబడీ
మనకు మనమె దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు ..
కమాన్ యెవ్రీబడీ జాయిన్ టుగెదర్..



ఆదివారం, అక్టోబర్ 04, 2020

పల్లవించవా నా గొంతులో...

బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చిన "కోకిలమ్మ" సినిమాలోని ఈ పాట బాలుగారి లలితమైన స్వరాన్ని పట్టి చూపించే పాట. బాలచందర్ గారి ఆస్థాన సంగీత దర్శకులు ఎమ్మెస్ విశ్వనాథన్ గారి మధురమైన బాణీ ఆత్రేయ గారి సాహిత్యం కలసి కథానాయకుడి ప్రేమని మన కనుల ముందుంచేస్తాయి.

ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : కోకిలమ్మ (1983)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు

పల్లవించవా నా గొంతులో 
పల్లవి కావా నా పాటలో
పల్లవించవా నా గొంతులో 
పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాధా 
నా బ్రతుకు నీది కాదా

నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే 
నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడొ మలిచావు ఈ రాతిని 
నేనీనాడు పలకాలి నీ గీతిని
నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే 
నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడొ మలిచావు ఈ రాతిని 
నేనీనాడు పలకాలి నీ గీతిని

ఇదే నాకు తపమనీ 
ఇదే నాకు వరమని
ఇదే నాకు తపమనీ 
ఇదే నాకు వరమని

చెప్పాలని ఉంది 
గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది 
గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో 
పల్లవి కావా నా పాటలో

నీ ప్రేమకు కలశాన్ని 
నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన
నీ ప్రేమకు కలశాన్ని 
నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన

ఇదే నిన్ను వినమని 
ఇదే నిజం అనమని
ఇదే నిన్ను వినమని 
ఇదే నిజం అనమని

చెప్పాలని ఉంది 
గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది 
గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో 
పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాధా 
నా బ్రతుకు నీది కాదా
పల్లవించవా నా గొంతులో 
పల్లవి కావా నా పాటలో 
 


బుధవారం, జులై 01, 2020

కళ్యాణ వైభవమీనాడే...

ఈ రోజు తొలి ఏకాదశి సందర్భంగా జగ్గయ్య గారి వ్యాఖ్యానంతో అలనాటి తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని చూపించే ఈ వీడియోలో ఆ వెంకన్న దర్శనం చేసుకుందాం. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.   


ఇక ఆ శ్రీమణ్ణారాయణుని తలచుకుంటూ శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీ వేంకటేశ్వర మహత్యం (1960)
సంగీతం : పెండ్యాల 
సాహిత్యం : ఆత్రేయ 
గానం : జిక్కి, పి.లీల 

కళ్యాణ వైభవమీనాడే 
చెలి కళ్యాణ వైభవమీనాడే 
మన పద్మావతీ శ్రీనివాసుల 
కళ్యాణ వైభవమీ నాడే

చూతమురారే సుదతులందరూ
చూతమురారే సుదతులందరూ
చేతమురారే సింగారాలు 
కళ్యాణ వైభవమీనాడే
 
పసుపు కుంకుమ అలదండీ 
పచ్చని తోరణాల్ కట్టండీ 
పసుపు కుంకుమ అలదండీ 
పచ్చని తోరణాల్ కట్టండీ 
రంగురంగులా రత్నాలు కలిపీ
ఆఆ...ఆఆఅ...ఆఆఅ....ఆ... 
రంగురంగులా రత్నాలు కలిపి
ముత్యాల ముగ్గులు వేయండి 

కళ్యాణ వైభవమీనాడే 
చెలి కళ్యాణ వైభవమీనాడే 
మన పద్మావతీ శ్రీనివాసుల 
కళ్యాణ వైభవమీ నాడే

అతివ కోరిన వరుడు 
అతిలోక సుందరుడోయమ్మా
అతగానికన్నింట జతయౌను 
మా యమ్మా ఆహూ.. ఆహూ..
అల్లారు ముద్దుగ 
పెరిగింది మాపిల్ల ఓయమ్మా
పువ్వుల్లో పుట్టాడు 
మా పిల్లవాడమ్మా ఆహూ.. ఆహూ.. 
 
చిలకలకొలికీ పద్మావతికీ 
కులుకే సింగారం
చెలి గుణమే బంగారం
మా చిలకలకొలికీ పద్మావతికీ 
కులుకే సింగారం 
చెలి గుణమే బంగారం

నవలామణికి నగవుల గనికి 
మనసే లావణ్యం లే వయసే వయ్యారం 
చక్కని చెక్కిలి చుక్కెందులకే.. ఎందుకే
చందమామలో నలుపున్నందుకే.. ఆహా
చిన్నదానికి ఆ సిగ్గెందులకే 
అవును ఎందుకే 
మనసులోన మరులున్నందులకే

చల్లనైన తల్లివి శంకరుని రాణివి
చల్లనైన తల్లివీ శంకరుని రాణివీ
దీవనలే ఇవ్వవమ్మా దేవేరి జయగౌరి 
చల్లనైన తల్లివీ శంకరుని రాణివీ
చల్లనైన తల్లివీ 

పసిడి కలల బాల తన పరిణయ శుభవేళా 
పసిడి కలల బాల తన పరిణయ శుభవేళా 
ప్రణమిల్లెను బ్రతుకెల్లను పచ్చనైన పంటగా
దీవనలే ఇవ్వవమ్మా దేవేరి జయగౌరీ
  

శనివారం, జూన్ 20, 2020

ఈ కోవెల నీకై...

అండమాన్ అమ్మాయి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 
 

చిత్రం : అండమాన్ అమ్మాయి (1979)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : సుశీల, బాలు

ఈ కోవెల నీకై వెలిసింది 
ఈ వాకిలి నీకై తెరిచింది
రా దేవి తరలి రా 
నా దేవి తరలి రా

ఈ కోవెల నీకై వెలిసింది 
ఈ వాకిలి నీకై తెరిచింది
రా స్వామీ తరలి రా 
నా స్వామి తరలి రా 
 
దేవత గుడిలో లేకున్నా 
దీపం పెడుతూ ఉన్నాను
దేవత గుడిలో లేకున్నా 
దీపం పెడుతూ ఉన్నాను
తిరునాళ్ళెపుడో రాక తప్పదని 
తేరును సిద్ధం చేసాను
 
దేవుడు వస్తాడని రోజూ 
పూవులు ఏరి తెస్తున్నాను
దేవుడు వస్తాడని రోజూ 
పూవులు ఏరి తెస్తున్నాను
రేపటి కోసం చీకటి మూసిన 
తూరుపులాగా ఉన్నాను
తూరుపులాగా ఉన్నాను
 
ఈ కోవెల నీకై వెలిసింది
ఈ వాకిలి నీకై తెరిచింది

మాసిన వెచ్చని కన్నీరూ 
వేసెను చెంపల ముగ్గులను 
మాయని తీయని మక్కువలు 
చూసెను ఎనిమిది దిక్కులను 

దిక్కులన్నీ ఏకమై 
నాకొక్క దిక్కై నిలిచినది 
మక్కువలన్నీ ముడుపులు కట్టి 
మొక్కులుగానే మిగిలినవి 
మొక్కులుగానే మిగిలినవి 

ఈ కోవెల నీకై వెలిసింది
ఈ వాకిలి నీకై తెరిచింది

నీరు వచ్చే ఏరు వచ్చే
ఏరు దాటే ఓడ వచ్చే
నీరు వచ్చే ఏరు వచ్చే
ఏరు దాటే ఓడ వచ్చే
ఓడ నడిపే తోడు దొరికే 
ఒడ్డు చేరే రోజు వచ్చే
 
ఓడ చేరే రేవు వచ్చే 
నీడ చూపే దేవుడొచ్చే
ఓడ చేరే రేవు వచ్చే 
నీడ చూపే దేవుడొచ్చే
రేవులోకి చేరేలోగా 
దేవుడేదో అడ్డువేసే
ఆ..దేవుడేదో అడ్డువేసే
 
ఈ కోవెల నీకై వెలిసింది 
ఈ వాకిలి నీకై తెరిచింది
రా దేవి తరలి రా 
నా స్వామీ తరలి రా
రా దేవి తరలి రా 
నా స్వామీ తరలి రా 
 

బుధవారం, జూన్ 10, 2020

ప్రతిరేయి రావాలా...

అనుబంధం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : అనుబంధం (1984) 
సంగీతం : చక్రవర్తి  
సాహిత్యం : ఆత్రేయ  
గానం : బాలు, సుశీల 

ఆహా..ఆ హా ఆ ఆ హా..మ్మ్
ఆహా హా అహ ఆహాహా..

ప్రతిరేయి రావాలా 
ఆ.. ఆ.. ఆ.. ఆ
తొలిరేయి కావాలా 
ఆ.. ఆ.. ఆ.. ఆ
సన్నజాజి పొదరింట  
సన్నసన్నని వెన్నెలంతా
మనమీద వాలాలా 
మల్లెలై పోవాలా
మనమీద వాలాలా 
మల్లెలై పోవాలా

ప్రతిరేయి రావాలా 
ఆ.. ఆ.. ఆ.. ఆ
తొలిరేయి కావాలా 
ఆ.. ఆ.. ఆ.. ఆ
అలిగేటీ పడకింట 
అల్లుకున్న వెన్నెలంతా
మనమీద వాలాలా 
మల్లెలై పోవాలా
మనమీద వాలాలా 
మల్లెలై పోవాలా

అలిగే అందాలు చూసి కవ్వించనా
తొలిగే బేధాలు చూసి నవ్వించనా
మనసు పడుచైన మీకు మతి చెప్పనా
మతి మీతోపాటు పోయి శృతి తప్పనా
మళ్ళీ తొలిరేయి మొగ్గు చూపించనా
మళ్ళీ తొలినాటి సిగ్గు మొలిపించనా
చిలిపి శ్రీవారికింత వలపాయెనా
చిలిపి శ్రీవారికింత వలపాయెనా
మళ్ళీ శ్రీమతి మీద మనసాయెరా.. హాహా

ప్రతిరేయి రావాలా 
ఆ.. ఆ.. ఆ.. ఆ
తొలిరేయి కావాలా 
ఆ.. ఆ.. ఆ.. ఆ
సన్నజాజి పొదరింట 
సన్న సన్నని వెన్నెలంతా
మనమీద వాలాలా 
మల్లెలై పోవాలా
మనమీద వాలాలా 
మల్లెలై పోవాలా

ఇన్నాళ్ళు లేని వయసు ఇపుడొచ్చెనా
ఇంట్లో ఇల్లాలు నేడు గురుతొచ్చెనా
మనసే కొన్నాళ్ళ పాటు నిదరోయినా
మనసై నీ ఒడిలోకి నేను చేరనా
మల్లే విరజాజిపూలు నేడు విచ్చెనా 
తల్లో ఈనాడు వలపు పూలుపూసెనా
నన్నే ఇన్నాళ్ళు నే మరిచిపోయినా
నన్నే ఇన్నాళ్ళు నే మరిచిపోయినా
మళ్ళీ  నీ కోసమే మేలుకున్నా... హా..హాహా

ప్రతిరేయి రావాలా 
ఆ.. ఆ.. ఆ.. ఆ
మ్మ్..ఊ.. తొలిరేయి కావాలా 
ఆ.. ఆ.. ఆ.. ఆ

అలిగేటీ పడకింట 
అల్లుకొన్న వెన్నెలంతా
మనమీద వాలాలా 
మల్లెలై పోవాలా
మనమీద వాలాలా 
మల్లెలై పోవాలా
  

మంగళవారం, జూన్ 09, 2020

చల్లగాలి చెప్పేది...

దేవత చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : దేవత (1982) 
సంగీతం : చక్రవర్తి  
సాహిత్యం : ఆత్రేయ  
గానం : బాలు, సుశీల 

చల్లగాలి చెప్పేది..ఏమని?
చల్లగా నూరేళ్ళు..ఉండమనీ..ఈ

చల్లగాలి చెప్పేది..ఏమని?
హహ చల్లగా నూరేళ్ళు..ఉండమనీ..ఈ

పిల్ల ఏరు పాడేది..ఏమనీ..ఈ..?
పిల్ల పాపలతో..మళ్ళీమళ్ళీ రమ్మని
మళ్ళీ మళ్ళీ..రమ్మని
చల్లగాలి చెప్పేది..ఏమని?

Ring-a-ring-a roses
A pocket full of posies
Husha! Busha!
We all fall down.

Ring-a-ring-a roses
A pocket full of posies
Husha! Busha!
We all fall down.
హా హా హా హా హా హా
నట్టింట నడయాడే..చిట్టిపువ్వు ఏదని..?
కడుపు పండి విరబూచే..పసికందునవ్వని
నట్టింట నడయాడే..చిట్టిపువ్వు ఏదని..?
కడుపు పండి విరబూచే..పసికందునవ్వని

ఇల్లంతా వెలిగించే..సిరి దివ్వే ఏదనీ..ఈ..?
ఇల్లు మెట్టి వచ్చినా..శ్రీదేవి..చూపనీ
కొలుచుకొనే దైవాన్ని..కోరుకొనే దేమనీ..?
ఏమనీ..ఈ..?
దిద్దుకునే..తిలకానికి..దీర్ఘాయువు..ఇమ్మని
దీర్ఘాయువు ఇమ్మనీ..ఈ

చల్లగాలి చెప్పేది..ఏమని?
చల్లగా నూరేళ్ళు..ఉండమనీ..ఈ
చల్లగాలి చెప్పేది..ఏమని?

Johny Johny!
Yes, Papa
Eating sugar?
No, papa
Telling lies?
No, Papa
Open your mouth!
Ha! Ha!! Ha!!!
హా హా హా హా హా

ఏడాదికి ఒకసారి..వచ్చేది ఆమనీ
దాన్ని ఎల్లవేళ..కాపురాన నిలిపేదే నీవనీ
ఏడాదికి ఒకసారి..వచ్చేది ఆమనీ
దాన్ని ఎల్లవేళ..కాపురాన నిలిపేదే నీవనీ

పగటిపూట ఎండలే..రాత్రివేళ వెన్నెలనీ..ఈ
పంచుకున్న హృదయాలకు..పగలు రేయి ఒకటనీ

మన జీవిత పయనంలో..చివరికోర్కే..ఏదనీ..??
ఒకరి కన్న ఒకరు ముందు..
కన్నుమూసి వెళ్ళాలనీ
మరుజన్మకు..కలవాలనీ..

చల్లగాలి చెప్పేది..ఏమని?
చల్లగా నూరేళ్ళు..ఉండమనీ..ఈ
పిల్ల ఏరు పాడేది..ఏమనీ..ఈ..?
పిల్ల పాపలతో..మళ్ళీమళ్ళీ రమ్మని
మళ్ళీ మళ్ళీ..రమ్మని

లాల లాల లాల లాల లాలలా
లాల లాల లాల లాల లాలలా
 

శుక్రవారం, మే 29, 2020

అందమైన లోకమనీ...

తొలికోడి కూసింది చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : తొలి కోడి కూసింది (1981)
సంగీతం : ఎమ్మెస్.విశ్వనాథన్      
సాహిత్యం : ఆత్రేయ
గానం : జానకి

ఓఓఓ..ఓహో..ఓఓఓ..ఓహో
ఓఓఓ..ఓహో..ఓఓఓ..ఓహో
అందమైన లోకమనీ
రంగు రంగులుంటాయని
అందరూ అంటుంటారు రామ రామా
అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మ
చెల్లెమ్మా... అందమైంది కానేకాదు చెల్లెమ్మా

అందమైన లోకమనీ
రంగు రంగులుంటాయని
అందరూ అంటుంటారు రామ రామా
అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మ
చెల్లెమ్మా... అందమైంది కానేకాదు చెల్లెమ్మా


ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా
ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా
ఆకలికి అందముందా రామ రామా
ఆశలకు అంతముందా చెప్పమ్మా చెల్లెమ్మా
ఆశలకు అంతముందా చెప్పమ్మా

అందమైన లోకమనీ
రంగు రంగులుంటాయని
అందరూ అంటుంటారు రామ రామా
అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా


గడ్డిమేసి ఆవు పాలిస్తుంది
పాలు తాగి మనిషీ విషమౌతాడు
గడ్డిమేసి ఆవు పాలిస్తుంది
పాలు తాగి మనిషీ విషమౌతాడు
అది గడ్డి గొప్పతనమా
ఇది పాల దోష గుణమా
అది గడ్డి గొప్పతనమా
ఇది పాల దోష గుణమా
మనిషి చాలా దొడ్డాడమ్మా చెల్లెమ్మా
చెల్లెమ్మా... తెలివి మీరి చెడ్డాడమ్మా చిన్నమ్మా

అందమైన లోకమనీ
రంగు రంగులుంటాయని
అందరూ అంటుంటారు రామ రామా
అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా


ముద్దుగులాబీకి ముళ్ళుంటాయి
మెగలిపువ్వులోన నాగుంటాది
ముద్దుగులాబీకి ముళ్ళుంటాయి
మెగలిపువ్వులోన నాగుంటాది
ఒక మెరుపు వెంట పిడుగూ
ఒక మంచిలోన చెడుగూ
లోకమంత ఇదే తీరు చెల్లెమ్మా
చెల్లెమ్మా... లోతుకెళ్తే కథే వేరు పిచ్చమ్మా

అందమైన లోకమనీ
రంగు రంగులుంటాయని
అందరూ అంటుంటారు రామ రామా
అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా


డబ్బు పుట్టి మనిషీ చచ్చాడమ్మా
పేదవాడు నాడే పుట్టాడమ్మా
డబ్బు పుట్టి మనిషీ చచ్చాడమ్మా
పేదవాడు నాడే పుట్టాడమ్మా
ఆ ఉన్నవాడు తినడూ
ఈ పేదను తిననివ్వడూ
కళ్లులేని భాగ్యశాలి నువ్వమ్మా
ఈ లోకం కుళ్లు నీవు చూడలేవు చెల్లెమ్మా

అందమైన లోకమనీ
రంగు రంగులుంటాయని
అందరూ అంటుంటారు రామ రామా
అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా
చెల్లెమ్మా... అందమైంది కానేకాదు చెల్లెమ్మా

 

మంగళవారం, మే 05, 2020

కళ్యాణ వైభోగమే...

సీతారామ కళ్యాణం చిత్రం నుండి ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సీతారామ కళ్యాణం (1986)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, సుశీల

విడిపోము మనము
ఈ ఎడబాటు క్షణము
ఆ పైన కళ్యాణము

కళ్యాణ వైభోగమే...
కళ్యాణ వైభోగమే
శ్రీసీతారాములకళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే
శ్రీసీతారాములకళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే

అనుకున్న కొన్నాళ్ళ వనవాసము
మునుముందు కావాలి మధుమాసము
అనుకున్న కొన్నాళ్ళ వనవాసము
మునుముందు కావాలి మధుమాసము
మన ప్రేమ తుదిలేని ఆకాశము
మన ప్రేమ తుదిలేని ఆకాశము
ప్రతిరోజు పూర్ణిమ శ్రావణము

కళ్యాణ వైభోగమే
శ్రీసీతారాములకళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే

మరులెల్ల మరుమల్లె విరిమాలగా
మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా
మరులెల్ల మరుమల్లె విరిమాలగా
మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా
హృదయాల నాదాలే వేదాలుగా
హృదయాల నాదాలే వేదాలుగా
మన అంతరంగాలే వేదికగా

కళ్యాణ వైభోగమే

వలచాము నిలిచాము ఒక దీక్షగా
మనసైన మనసొకటే సాక్షిగా
వలచాము నిలిచాము ఒక దీక్షగా
మనసైన మనసొకటే సాక్షిగా
గెలిచాము కలిసాము దివిమెచ్చగా
ఆ ఆ ఆ ఆ ఆ
గెలిచాము కలిసాము దివిమెచ్చగా
కలకాలముందాము నులివెచ్చగా

కళ్యాణ వైభోగమే
శ్రీసీతారాములకళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే  

 

బుధవారం, ఏప్రిల్ 29, 2020

సాపాటు ఎటూ లేదు...

ఆకలిరాజ్యం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆకలి రాజ్యం (1980)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు

హే హే హే హే హే హే హేహే ఏ ఏహే
రు రు రు రు రూరు రూ రూ రురు

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే బ్రదర్ 

 
మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా

మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా

డిగ్రీలు తెచ్చుకొని చిప్ప చేత పుచ్చుకొని
ఢిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే బ్రదర్ 

 
బంగారు పంట మనది
మిన్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుదామురా
ఇంట్లో ఈగల్ని తోలుదామురా

ఈ పుణ్య భూమిలో పుట్టడం మన తప్పా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా

ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా... ఆ.. ఆ..
ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా
గంగలో మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్ 

 
సంతాన మూలికలము
సంసార బానిసలము
సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడు
సంపాదనొకటి కరువురా

చదవెయ్య సీటు లేదు చదివొస్తే పనీ లేదు
అన్నమో రామచంద్రా అంటే పెట్టే దిక్కే లేదు
దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే బ్రదర్ 


శనివారం, ఏప్రిల్ 11, 2020

లేత కొబ్బరి నీళ్ళల్లే...

అల్లుడొచ్చాడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఎంబెడెడ్ వీడియోలో పాట ఏడు నిముషాల నుండీ మొదలవుతుంది.


చిత్రం : అల్లుడొచ్చాడు (1976)
సంగీతం : టి.చలపతిరావు
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు

లేత కొబ్బరి నీళ్ళల్లే
పూత మావిడి పిందల్లే 

 
లేత కొబ్బరి నీళ్ళల్లే
పూత మావిడి పిందల్లే
చెప్పకుండా వస్తుందీ
చిలిపి వయసూ
నిప్పు మీద నీరవుతుందీ
పాడు మనసు... మనసూ..

పొంగు వస్తుంది నీ బాల అంగాలకు
రంగు తెస్తుంది నీ పాల చెక్కిళ్ళకు
కోక కడతావు మొలకెత్తు అందాలకు
కొంగుచాటెసి గుట్టంత దాచేందుకు
దాగలేనివి ఆగలేనివి
దారులేవో వెతుకుతుంటవి

లేత కొబ్బరి నీళ్ళల్లే
పూత మావిడి పిందల్లే
చెప్పకుండా వస్తుందీ
చిలిపి వయసూ
నిప్పు మీద నీరవుతుందీ
పాడు మనసు... మనసూ..

 
కోటి అర్ధాలు చూసేవు నా మాటలో
కొర్కెలేవేవో రేగేను నీ గుండెలో
నేర్చుకుంటాయి నీ కళ్ళూ దొంగాటలూ
ఆడుకుంటాయి నాతోటీ దోబూచులు
చూచుకొమ్మని దోచుకొమ్మని
చూచుకొమ్మని దోచుకొమ్మని
దాచుకున్నవి పిలుస్తుంటవి

లేత కొబ్బరి నీళ్ళల్లే
పూత మావిడి పిందల్లే
చెప్పకుండా వస్తుందీ
చిలిపి వయసూ
నిప్పు మీద నీరవుతుందీ
పాడు మనసు... మనసూ


వయసు తెస్తుంది ఎన్నెన్నో పేచీలను
మనసు తానొల్లనంటుంది రాజీలనూ
పగలు సెగపెట్టి వెళుతుంది లోలోపలా
రాత్రి ఎగదోస్తూ ఉంటుంది తెల్లారులు
రేపు ఉందని తీపి ఉందని
ఆశలన్ని మేలుకుంటవి

లేత కొబ్బరి నీళ్ళల్లే
పూత మావిడి పిందల్లే
చెప్పకుండా వస్తుందీ
చిలిపి వయసూ
నిప్పు మీద నీరవుతుందీ
పాడు మనసు... మనసూ.. 

గురువారం, మార్చి 26, 2020

భారత మాతకు జేజేలు...

బడిపంతులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.

 
చిత్రం : బడి పంతులు (1972)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల, బృందం

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు 
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆఆఆఆఆఆ..ఆఆఆఆఅఆ
ఆఆఆఆఆఆ..ఆఆఆఆఅఆ
 
త్రివేణి సంగమ పవిత్రభూమి 
నాల్గు వేదములు పుట్టిన భూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి 
త్రివేణి సంగమ పవిత్రభూమి 
నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి 
పంచశీల బోధించిన భూమి
పంచశీల బోధించిన భూమి
 
భారత మాతకు జేజేలు 
బంగరు భూమికి జేజేలు
 
శాంతిదూతగా వెలసిన బాపూ
జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
శాంతిదూతగా వెలసిన బాపూ 
జాతి రత్నమై వెలిగిన వెహ్రూ 
విప్లవ వీరులు వీర మాతలు 
విప్లవ వీరులు వీర మాతలు 
ముద్దుబిడ్డలై మురిసే భూమి ..

భారత మాతకు జేజేలు 
బంగరు భూమికి జేజేలు
 
సహజీవనము సమభావనము 
సమతా వాదము వేదముగా
సమతా వాదము వేదముగా 
సహజీవనము సమభావనము 
సమతా వాదము వేదముగా
ప్రజా క్షేమము ప్రగతి మార్గము 
లక్ష్యములైన విలక్షణ భూమి
లక్ష్యములైన విలక్షణ భూమి
 
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

ఆఆఆఆఆఆ..ఆఆఆఆఅఆ
ఆఆఆఆఆఆ..ఆఆఆఆఅఆ


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.