మంగళవారం, మే 05, 2020

కళ్యాణ వైభోగమే...

సీతారామ కళ్యాణం చిత్రం నుండి ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సీతారామ కళ్యాణం (1986)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, సుశీల

విడిపోము మనము
ఈ ఎడబాటు క్షణము
ఆ పైన కళ్యాణము

కళ్యాణ వైభోగమే...
కళ్యాణ వైభోగమే
శ్రీసీతారాములకళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే
శ్రీసీతారాములకళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే

అనుకున్న కొన్నాళ్ళ వనవాసము
మునుముందు కావాలి మధుమాసము
అనుకున్న కొన్నాళ్ళ వనవాసము
మునుముందు కావాలి మధుమాసము
మన ప్రేమ తుదిలేని ఆకాశము
మన ప్రేమ తుదిలేని ఆకాశము
ప్రతిరోజు పూర్ణిమ శ్రావణము

కళ్యాణ వైభోగమే
శ్రీసీతారాములకళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే

మరులెల్ల మరుమల్లె విరిమాలగా
మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా
మరులెల్ల మరుమల్లె విరిమాలగా
మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా
హృదయాల నాదాలే వేదాలుగా
హృదయాల నాదాలే వేదాలుగా
మన అంతరంగాలే వేదికగా

కళ్యాణ వైభోగమే

వలచాము నిలిచాము ఒక దీక్షగా
మనసైన మనసొకటే సాక్షిగా
వలచాము నిలిచాము ఒక దీక్షగా
మనసైన మనసొకటే సాక్షిగా
గెలిచాము కలిసాము దివిమెచ్చగా
ఆ ఆ ఆ ఆ ఆ
గెలిచాము కలిసాము దివిమెచ్చగా
కలకాలముందాము నులివెచ్చగా

కళ్యాణ వైభోగమే
శ్రీసీతారాములకళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే  

 

2 comments:

మంచిపాట. రాత్రి వేళ దీపాల తోరణాలతో చూపించిన చిత్రీకరణ చాలా బాగుంది.

అవునండీ.. బావుంటుంది.. కొరియోగ్రఫీ ఎవరో తెలియదు కానీ జంధ్యాల గారి దర్శకత్వం. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.