గురువారం, మే 28, 2020

నీ పక్కన పడ్డాది...

పలాస 1978 చిత్రంలోని ఒక హుషారైన జానపదాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పలాస 1978 (2019)
సంగీతం : రఘు కుంచే
సాహిత్యం : ఉత్తరాంధ్ర జానపదం
గానం : రఘు కుంచే

నీ పక్కన పడ్డాదిలేదు సూడొలె
పిల్లా నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదు సూడొలె
పిల్లా నాది నక్కిలీసు గొలుసు
హేయ్ పక్కన పడ్డాదిలేదు సూడొలె
పిల్లా నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదు సూడొలె
పిల్లా నాది నక్కిలీసు గొలుసు

నీ పక్కన పడ్డాదిలేదు సూడొలె
పిల్లా నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదు సూడొలె
పిల్లా నాది నక్కిలీసు గొలుసు


నీ బావ గారు వచ్చేటివేళ
నీకు బంతి పూలు తెచ్చేటివేళా
నీ బావ గారు వచ్చేటివేళ
నీకు బంతి పూలు తెచ్చేటివేళా

నీ మరిదిగారు వచ్చేటివేళ
నీకు మందారం తెచ్చేటివేళా
నీ మరిదిగారు వచ్చేటివేళ
నీకు మందారం తెచ్చేటివేళా

నీ మామగారు
పిల్లా మావగారు
అరెరె మామగారు వచ్చేటివేళా
నీకు మరుమల్లెలు తెచ్చేటివేళా
మీ మామగారు వచ్చేటివేళా
నీకు మరుమల్లెలు తెచ్చేటివేళా
నాదీ.. నాదీ..
నాది నక్కిలీసు గొలుసు...

నీ పక్కన పడ్డాదిలేదు సూడొలె
పిల్లా నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదు సూడొలె
పిల్లా నాది నక్కిలీసు గొలుసు


నీకు కడియాలు తెచ్చేటివేళా
నీకు కొనకమ్మలు తెచ్చేటివేళా
నీకు కడియాలు తెచ్చేటివేళా
నీకు కొనకమ్మలు తెచ్చేటివేళా

నీకు బొట్టుబిళ్ళ తెచ్చేటివేళా
అది పెట్టుకొని వచ్చేటివేళా
నీకు బొట్టుబిళ్ళ తెచ్చేటివేళా
అది పెట్టుకొని వచ్చేటివేళా
నీకు పట్టుచీర..
అబ్బబ్బో పట్టుచీర
పిల్లా పట్టుచీర తెచ్చేటివేళా
అది కట్టుకొని వచ్చేటివేళా
నీకు పట్టుచీర తెచ్చేటివేళా
అది కట్టుకుని వచ్చేటివేళా
నాది.. నాది..
నాది నక్కిలీసు గొలుసు...

నీ పక్కన పడ్డాదిలేదు సూడొలె
పిల్లా నాది నక్కిలీసు గొలుసు
హోయ్.. నీ పక్కన పడ్డాదిలేదు సూడొలె
పిల్లా నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదు సూడొలె
పిల్లా నాది నక్కిలీసు గొలుసు
నాది.. నాది.. నాది.. నాది
నాది నాది నాది నాది నాది
నాది నాది నాది నాది నాదే..ఏయ్.. 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.